Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమితాబ్- రేఖ..! ఆహా…. ఆ జంట మరోసారి వెండితెరపై…!

January 5, 2021 by M S R

rekha-amitabh

అమితాబ్ బచ్చన్… రేఖ…! అసలు ఆ జంట పేరు వింటే, వాళ్లు నటించిన పాత హిందీ సినిమాలు తలుచుకుంటే సినిమా ప్రియులకు ఓ సంబరం… ఒకనాటి ప్రేమికులు… బహుశా నలభై ఏళ్లు దాటిపోయి ఉంటుంది… వాళ్ల బ్రేకప్ జరిగిపోయి..! ఎవరి బతుకులు వాళ్లవే… ఆ ప్రేమాయణంపై బోలెడు కథలు., వార్తలు, కథనాలు, యూట్యూబ్ వీడియోలు… ఎవరు ఏమైనా రాసుకోనీ… ఇన్నేళ్లలో పాత సంగతుల్ని వాళ్లిద్దరిలో ఎవరూ కెలికే ప్రసక్తే లేదు… ఏ ఇంటర్వ్యూల్లోనూ మాట్లాడేది లేదు… గౌరవప్రదమైన […]

ఒక గొప్ప ఫోటో..! దీనివెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!

January 5, 2021 by M S R

ఒక ఫోటో చూద్దాం… గొప్ప ఫోటో… గొప్ప అంటే టెక్నికల్‌గా కాదు… దాని సందర్భం, దాని వెనుక కథ… ఒక నాయకుడు జనంలోకి ఎప్పుడు వెళ్లాలి… జనంలో ఎలా ఉండాలి… జనమే రాజకీయంగా బతకాలి అని చెప్పే ఫోటో… ఇప్పటి పార్ట్ టైమ్, ట్విట్టర్ పొలిటిషయన్లకు అర్థం కాని ఫోటో అది… షూటింగుల మధ్య విరామాల్లో, వ్యాపారాల నడుమ దొరికే గ్యాపులో రాజకీయాలు చేయడం కాదు… రాజకీయం అనేది ఓ సాధన… ఓ కమిట్మెంటు… మంచి ఉదాహరణ […]

చైనా జిన్‌పింగ్ దుర్నీతి… తన వాళ్లనూ వదలదు… వాళ్లు ఇక కనిపించరు…

January 5, 2021 by M S R

alibaba

(Jagannadh Goud…………)   పల్లెటూరి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, రెండు నెలులగా కనిపించకుండా పోయిన ఓ లెజెండ్ ప్రస్థానం..!…. చైనా నుంచి ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి బిలియనీర్ “జాక్ మా”… చరిత్రలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలోని లోపాలని మొట్టమొదట చైనాలో ఎండగట్టిన వ్యక్తి కూడా ఆలీబాబా గ్రూప్ “జాక్ మా” గారే…. చైనాలోని ఒక పల్లెటూళ్ళో చదువుకునే ఒక పిలగాడు రోజూ సైకిల్ తొక్కుకుంటూ దగ్గరలోని టౌన్ కి వెళ్ళి విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకి […]

వీళ్లు సీనియర్ సింగర్సేనా..? ఆ బాలు లేకపోతే పాట మాధుర్యమే మటాష్..?!

January 5, 2021 by M S R

swarabhishekam

ఇక్కడ సంగీతం అనే పదాన్ని వాడటం లేదు…! సినిమా పాటల మీద ఇంట్రస్టు ఉన్నవారికి ఈటీవీలో వచ్చే స్వరాభిషేకం వీనులవిందు… ఏళ్లుగా అది పాటలప్రియుల్ని అలరిస్తూనే ఉంది… రాష్ట్రంలోని పలు ప్రాంతాలకే కాదు, పలు దేశాలకు కూడా వెళ్లొచ్చింది… ఈటీవీలో అభిరుచి ఉన్న ప్రోగ్రాముల్లో ఇదీ ఒకటి… కాకపోతే దీనికి లిమిటెడ్ వ్యూయర్‌షిప్ ఉంటుంది… రేటింగ్స్ గురించి ఆలోచించకుండా రామోజీరావు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆ బాధ్యతలు అప్పగించాడు… ఇక్కడ సీన్ కట్ చేయండి ఒకసారి… మొన్న స్వరాభిషేకం […]

మరణించని అమరజవాన్..! చదివి తీరాల్సిన ఓ వీరుడి పోరాటగాథ..!!

January 5, 2021 by M S R

jaswant_Garh_War_Memorial

యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం అసువులు బాశాడు ఆ జవాను… కానీ ఈరోజుకూ తను సర్వీసులో ఉన్నట్టుగానే భావిస్తూ ప్రమోషన్లు ఇస్తుంది ప్రభుత్వం…! మహావీరచక్ర పురస్కారం ఇచ్చింది… తను బలిదానం చేసిన చోట ఓ గుడి వెలిసింది… ఆ ప్రాంతం నుంచి వెళ్లే జవాన్లు అక్కడ ఆగి మనసారా మొక్కుకుని వెళ్తారు… తన పేరిట ఓ చలనచిత్రం కూడా వచ్చింది… ఇంట్రస్టింగు కదా… అవును, జశ్వంత్‌సింగ్ రావత్… భారతీయ సైన్యం ఎప్పుడూ మరిచిపోలేని పేరు… ఈమధ్య సోషల్ […]

వేక్సిన్ వార్‌కు విరుగుడు… మోడీకి మొదటి టీకా… ప్రజలందరికీ అంతులేని భరోసా…

January 5, 2021 by M S R

కోవాగ్జిన్ టీకాకు ముందస్తు అనుమతుల యవ్వారం రాజకీయంగా రచ్చరచ్చ చేస్తోంది… ఈ నేపథ్యంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నిన్న ఎక్కడో చేసిన ఓ వ్యాఖ్య ఇంట్రస్టింగు అనిపించింది… ‘‘అమెరికాలో ప్రెసిడెంట్-ఎలక్ట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్-ఎలక్ట్ కమలా హారిస్, ఇజ్రాయిల్ నెతన్యాహూ, రష్యా పుతిన్… అందరూ మొదటి టీకాకు మేం రెడీ అంటున్నారు… ఈ దేశ ప్రధాని మోడీ చప్పట్లు కొట్టమంటే కొట్టాం, దీపాలు పెట్టమంటే పెట్టాం, అది జనంలో ఓ భరోసాను నింపడానికే కదా… ఇప్పుడూ […]

చట్టం ఒప్పుకోదు… అష్టాచెమ్మా, పులిజూదం, వామనగుంటలు ఆడుకొండి…

January 5, 2021 by M S R

nani kodali

మంత్రి కొడాలి నాని పలు సందర్భాల్లో వాడే భాష, సంయమనం కోల్పోయి చేసే వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉంటయ్, ఉండాలి… కానీ తను చాలాసార్లు ఎక్స్‌టెంపర్‌‌గా నిజాలే చెబుతాడు… కడుపులో ఉన్న భావాన్ని కక్కేస్తాడు… ఎమోషన్ కంట్రోల్ అనేది ఉండదు… అది తన తత్వం… నిజానికి పేకాట కేసులకు సంబంధించి తను నిన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ ఉన్నట్టు అనిపించడం లేదు… తన వ్యాఖ్యలను పీకీ గీకీ ఏదో పెంట చేయాలని ప్రయత్నించడమే తప్ప విపక్షాలకు అందులో గిట్టుబాటు […]

దేహమా..! రేపు రా..! శ్మశానాలు ఖాళీ లేవు..!

January 5, 2021 by M S R

corona deaths

సూర్యుడి కొడుకు యమధర్మరాజు. కూతురు యమునా నది. ఇద్దరూ నల్లగా ఉంటారు. నలుపు రంగుకు యమధర్మ రాజు ప్రాణమిస్తాడు. ఆయన వాహనం దున్నపోతు నలుపు. ఆయన డ్రెస్ పంచె, ఉత్తరీయం నలుపు, ఆయన చేతిలో యమపాశం నలుపు. భారతంలో ధర్మరాజు పేరు అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు తీసే యముడు ధర్మరాజు కావడం ధర్మబద్దమేనా? అని కొందరి ధర్మ సందేహం. జాతకాలు, సిజేరియన్ కత్తులు, ఆసుపత్రిలో లేబర్ వార్డ్ బెడ్డుల అందుబాటు గొడవల వల్ల పుట్టడం ముందుకో, వెనుకకో […]

రేవంత్ కేంద్రంగా… తెలంగాణ పెద్ద తలల ‘రాజీ’కీయం… అనూహ్యం…

January 5, 2021 by M S R

రాజకీయ నాయకులు…. ఎప్పుడు కలిసిపోతారో, ఎందుకు కలిసిపోతారో, ఏ పాయింట్ వద్ద రాజీ కుదురుతుందో.., లేదా… ఏ ఇష్యూ మీద తన్నుకుంటారో అర్థం కాదు… అన్నీ తెరవెనుక మార్మిక యవ్వారాలు… అంతిమంగా జనం అమాయకులు…! నిజానికి బోలెడు ఉదాహరణలు మనకు నిత్యరాజకీయాల్లో కనిపిస్తూనే ఉంటయ్… కొన్ని సంకేతాలు స్పష్టాస్పష్టంగా మీడియా ధోరణిలో కనిపిస్తుంటయ్… మొన్న టెన్‌టీవీలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి సుదీర్ఘ డిబేట్ చూసిన చాలామందికి ఓపట్టాన జీర్ణం కాలేదు… ఆమధ్య మీకు గుర్తుందా..? సీఎం ఆఫీసు […]

‘రత్న’ టాటా..! 83 ఏళ్ల వయస్సులో పూణెకు ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ…

January 4, 2021 by M S R

(Jagannadh Goud…………) రతన్ టాటా గారు ఉండేది బొంబాయిలో.., వయస్సు 83 సంవత్సరాలు… 150 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ, పూణేలో ఉన్న ఒక ఉద్యోగిని కలవటానికి వెళ్ళారు… ఆ యువకుడు 2 సంవత్సరాల క్రితం టాటా సంస్థలో పనిచేశాడు… అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనను పరామర్శించడానికి వెళ్లాడు,.. ఫ్రెండ్స్ సర్కిల్ అనే అ అపార్ట్‌మెంట్స్ మధ్యతరగతి ఉండే మామూలు అపార్ట్‌మెంట్స్…  కోవిడ్ కాలం కాబట్టి అపార్ట్ మెంట్ సెల్లార్‌లోనే మాట్లాడి వెనక్కి వచ్చారు… రతన్ టాటా గారి […]

తన ఎజెండా అగ్గిపుల్ల గీయడమే..! తను ఊహించినట్టే ఎదురుదాడి, తిట్లు..!!

January 4, 2021 by M S R

ఏమన్నాడు బండి సంజయ్..? ‘‘ఏపీలో ఒక మతం రాజ్యమేలుతుంది… బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలి… దుబ్బాక, గ్రేటర్ ఫలితాలే తిరుపతిలో పునరావృతం అవుతాయి… వైసీపీ రెండే కొండలు అంటుంది… ఏడుకొండల వాడా గోవిందా అనేది బీజేపీ సిద్ధాంతం… తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది… వైసీపీ ప్రభుత్వం మూటామూల్లె సర్దుకునేలా తరిమికొడతాం… ఏపీ దేవాదాయ శాఖ పూర్తి ప్రక్షాళన అవసరం… హిందువుల కానుకల్ని కూడా ఈ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది… […]

కేసీయార్ సార్.., మన సిటీ టిఫిన్ సెంటర్ల కష్టం గుర్తించినట్టా..? లేదా..?

January 4, 2021 by M S R

telugu daily

డిజిటల్ ఎడిషన్స్, వాట్సప్ ఎడిషన్స్, ఈ-పేపర్స్ అంటూ మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ…. ప్రింటింగ్ మానేసి, డిజిటల్ బాట పట్టాయి… అఫ్ కోర్స్, అవి చేస్తూనే తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ప్రకటనల్ని అడ్డగోలు రేట్లకు యాడ్స్ పబ్లిష్ చేయడం…. మెదళ్లు మోకాళ్లలో ఉండే సమాచార శాఖ అధికారుల పుణ్యమాని కోట్లకుకోట్లు కొల్లగొట్టడం, ఆ కమీషన్ల బాగోతం అనేది వేరే సంగతి… (అత్యంత భారీ గొప్ప నిజాయితీ, శీలం ఉన్న ఎర్ర పత్రికలు సహా… వాటికి అంతకుమించిన శరణ్యం లేదు […]

ప్రదీపా, నీకు బాగా ఎక్కువైంది బిడ్డా…! వేదిక మీద ఆమెకు ఆ ర్యాగింగు ఏమిట్రోయ్..?!

January 4, 2021 by M S R

yuti1

ఆలియా భట్… జగమెరిగిన టాప్ స్టార్… దీపిక, ప్రియాంకలకు దీటుగా పాపులారిటీ సంపాదించిన నటి… ఏజ్ తక్కువ… కానీ రేంజ్ చాలా ఎక్కువ… నటనలో ఎంత ఇరగదీసినా, తన జనరల్ నాలెడ్జి మీద మాత్రం మస్తు జోకులు… భలే సెటైర్లు నడుస్తూ ఉంటయ్… పెద్దగా చదువుకోకపోవడం, తండ్రి కూడా ప్యూర్ సినిమాల కోసమే అన్నట్టుగా పెంచడం… ఆమెకు చాలా దైనందిన వ్యవహారాలపై పెద్దగా సోయి లేదు… నిజానికి ఆమెకు అవి అవసరం లేదు… దాన్ని ఓ తప్పుగానో, […]

సుడిగాలి సుధీర్… పక్కకు పెట్టేయడం కాదు.., చెబుతున్న సాకులే ఇన్సల్టింగు..!!

January 4, 2021 by M S R

Sudigali-Sudheer-3

తెలుగు బుల్లితెర సూపర్ స్టార్ ఎవరు..? చెప్పడానికి వేరే ఆప్షనే లేదు…! సుడిగాలి సుధీర్..!! కాస్త సమీపంలో ప్రదీప్ కనిపిస్తాడు కానీ… ప్రదీప్ బేసిక్‌గా యాంకర్… కామెడీ టైమింగు, సున్నితంగా డీల్ చేయడం గట్రా బాగుంటుంది, కానీ అంతకుమించి పోలేడు… కానీ సుధీర్… రియల్ పర్‌ఫార్మర్..! యాంకరింగు, డాన్సులు, కామెడీ, మ్యాజిక్, సింగింగ్, స్టంట్స్… వాట్ నాట్… ఏదంటే అది చేయగలడు… తెలుగు టీవీకి రజినీకాంత్ తను…! మరి అలాంటి వాడిని ఈటీవీ ఎందుకు దూరం పెట్టింది…? […]

స్వామీ! వ్యాక్సిన్ వస్తే కరోనా పోతుందా? శిష్యా! కరోనా పొతే, వ్యాక్సిన్ వస్తుందా?

January 4, 2021 by M S R

వ్యాక్సిన్లు ఎన్ని రకములు? అవి ఏవి? వాటి గుణదోషములను వర్ణింపుము? అన్న పది మార్కుల ప్రశ్నకు ఇది సమాధానం కాదు. వ్యాక్సిన్ల తొందరపాటు, అయోమయం, అస్పష్టత, గందరగోళం మీద మరింత గందరగోళం, భయపెట్టే సమాధానం. కాబట్టి వ్యాక్సిన్ల మీద- ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ మీద ఇప్పటికే స్పష్టత, ధీమా ఉన్నవారు ఇక్కడితో చదవడం ఆపేయవచ్చు. చదివి మరింతగా భయపడతామేమో అనుకునేవారు కూడా ఇక్కడితో చదవడం ఆపేయడం మంచిది. వ్యాక్సిన్లు ప్రధానంగా నాలుగు రకాలు. ఆ సాంకేతిక వివరాలకు […]

7 కోట్ల ప్రశ్న..! కేబీసీ ఇలాంటి కంటెస్టెంట్‌ను చూసి ఉండలేదేమో…!!

January 4, 2021 by M S R

kbc neha

కౌన్ బనేగా కరోడ్‌పతి… ఇప్పటికే పదోపదకొండో సీజన్లు అయిపోయాయ్… ఏళ్లు గడుస్తున్నయ్… ఇప్పుడు పన్నెండో సీజన్ నడుస్తోంది… బోలెడుమంది వచ్చారు, పోయారు… కానీ ఆ హాట్ సీట్ మీద కూర్చోగానే చాలామందికి టెన్షన్, అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు సరదాగా మాట్లాడుతూ, ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నా సరే, చాలామంది ఆ ఒత్తిడిని జయించలేరు… సరే, అదొక ఆట… కానీ ఎదురుగా అంత పెద్ద సెలబ్రిటీని కూర్చోబెట్టుకుని, కుదురుగా, నిమ్మలంగా మాట్లాడటం కష్టమే… కానీ ఈమె అదరగొట్టేసింది… ఒత్తిడీ […]

పగలైతే దొరవేరా..! ఔను మరి… తెలుగుపాటపై దేవులపల్లి దొరతనం..!!

January 4, 2021 by M S R

vanisri

అసలు సినిమా సాహిత్యం అంటే పల్లీబఠానీ, చాట్ మసాలా… ఏవో నాలుగు పిచ్చి పదాలను ఏదో దిక్కుమాలిన ట్యూన్‌లో ఇరికించి… ఢమఢమ సంగీత పరికరాలను మోగిస్తే చాలు… దానికి తెర మీద హీరోహీరోయిన్లు నాలుగు గెంతులు గెంతి, పిల్లి మొగ్గలు వేసిపోతారు… అంతా అని కాదు… 90 శాతం ఇంతే… అందులో ప్రమాణాలు, విలువలు, ప్రయోగాలు, తొక్కాతోలు చూస్తే… కనిపించేది డొల్ల… అయితే కొందరిలో ఓ దురభిప్రాయం ఉంది… వీలైనంత సంక్లిష్ట, గంభీర, అర్థం కాని పదాలతో […]

కేసీయార్ ఇక ‘‘మై హోం’’ అనలేడా..? త్వరలో అది ‘‘ఆరెంజ్ హోం’’ అవుతోందా..?!

January 3, 2021 by M S R

myhome

ఓ వార్తను సీపీఎం వారి నవతెలంగాణ పత్రిక మరీ కనీకనిపించనట్టుగా… వేద్దామావద్దా అన్నట్టుగా… సర్లె, వేసిచూద్దాంలే అని సాహసించినట్టుగా పబ్లిష్ చేసింది… అదేమిటయ్యా అంటే..? ప్రముఖ వ్యాపారి మైహోం జూపల్లి రామేశ్వరరావు బీజేపీలో చేరబోతున్నాడు… ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేస్తున్నారు అనేది ప్రధాన సారాంశం… నిజానికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… తెలుగు రాష్ట్రాల్లో ధనిక సెక్షన్ మాత్రమే బీజేపీకి కావాలి… రాకపోతే సీబీఐ, ఈడీ, ఐటీ అని బెదిరించగలదు కూడా… బీజేపీకి కార్పొరేట్లే కావాలి… […]

దమ్ మారో దమ్… లెటజ్ గం‘జాయ్’… మోడీ సర్కారు కొత్త ఆలోచన…

January 3, 2021 by M S R

ganja

నిజం… నమస్తే తెలంగాణ ఎప్పుడోసారి చుక్క తెగి రాలిపడ్డట్టుగా… ఓ మంచి కథనాన్ని ప్రజెంట్ చేస్తుంది… మోడీ ప్రభుత్వం గంజాయిని నిషిద్ధ, నార్కొటిక్స్ జాబితా నుంచి తొలగించే ఆలోచనలో ఉందనే ఓ స్టోరీ ఇంట్రస్టింగుగా ఉంది… నిజానికి గంజాయి, వీడ్, మారిజువానా పేరు ఏదైతేనేం..? తరతరాలుగా మన జాతి మత్తుపదార్థం అది… ఈరోజుకూ ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో శుభ కార్యాల్లో భంగ్ వాడకం సహజం… హోళీ వంటి సందర్భాల్లోనైతే స్వీట్లు, తాంబూలాలు, లస్సీలు… ఏదోరకంగా భంగ్ కలుపుకుని […]

ఏ పతంజలి కన్నో పడలేదింకా… ఎర్రచీమలు బతికిపోయినయ్ ప్రస్తుతానికి..!!

January 3, 2021 by M S R

_red-ant-chutney

ప్రస్తుతానికి ఎర్రచీమలు బతికిపోయాయి… మూడు నెలల వరకు ఢోకా లేదు… ఈలోపు ఏ పతంజలి రాందేవ్‌బాబా కన్నో పడితే మాత్రం… పాపం, ఒడిశాలో ఒక్క ఎర్ర చీమ కూడా మిగులుతుందో లేదో తెలియదు… ఎందుకంటారా..? ఒడిశాలో గిరిజనులు దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బంది, ఫ్లూ జ్వరం వస్తే… ఆ చుట్టుపక్కల ఉండే ఎర్రచీమల్ని పట్టుకొచ్చి, పచ్చిమిరపకాయలు వేసి తమదై శైలిలో పచ్చడి చేస్తారు… మెల్లిమెల్లిగా అనారోగ్యం లక్షణాలు తగ్గిపోతయ్… అదీ అసలు విషయం… ఎహె, ఊరుకొండి మాస్టారూ… […]

  • « Previous Page
  • 1
  • …
  • 138
  • 139
  • 140
  • 141
  • 142
  • …
  • 158
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions