కాసేపు ఈనాడును పక్కన పెడదాం… కేసీయార్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక (పాఠకులు క్షమించాలి, దాన్ని పత్రిక అని సంబోధించినందుకు…), జగన్ కోసం సాక్షి, చంద్రబాబు కోసం ఆంధ్రజ్యోతి అవిశ్రాంతంగా పోతరాజుల్లాగా కొరడాలతో చెళ్లుచెళ్లుమని బజారులో నిలబడి, ఆయా పార్టీల రంగులు రుద్దుకుని, మరీ కొట్టుకుంటాయి కదా… 26 పార్టీలతో ఓ బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఒకటి తయారైంది… మీటింగులు పెడుతోంది… INDIA అని పేరు కూడా పెట్టుకున్నారు… కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి రచిస్తున్నారు… […]
మరణంలోని అక్షరాల్ని పేరుగా పెట్టుకున్నవాడు… తనకు మరణమా..?
Prasen Bellamkonda…… మరణంలోని అక్షరాలను పేరులోనే పెట్టుకుని దర్జాగా బతికిన మనిషి ఆయనకు మరణమా…. నమ్మకం కుదరక పోవచ్చు కానీ నేను కొన్ని వందల సార్లు చదివిన పుస్తకం శ్రీ రమణ పేరడీలు. నిజం… కొన్ని వందల సార్లు. 80 వ దశకం మొదట్లో అప్పుడప్పుడే తెలుగులో సీరియస్ రచయితలు, కవులనందరినీ చదివిన హాంగోవర్లో ఉండడం వల్ల వాళ్లందరినీ శ్రీ రమణ అనుకరించిన పద్ధతి నాకు అతి పెద్ద ఆశ్చర్యం. ఒక వింత. ఒక మేజిక్. ముఖ్యంగా […]
అక్షయ్ కుమార్ సినిమాపై ఆదిపురుష్ దెబ్బ… భయపడుతున్న సెన్సార్…
మొత్తానికి ఆదిపురుష్ భారీ వ్యయం, భారీ ఫ్లాప్ దేశంలోని సినిమా నిర్మాతలందరికీ ఓ పాఠం నేర్పింది… తలాతోకా లేని పిచ్చి డైలాగులతో, సీన్లతో, వేషధారణలతో ఓ చెత్తా గ్రాఫిక్ సినిమాను ప్రజెంట్ చేస్తే ఈ దేశ ప్రేక్షకులు ఎలా రియాక్టవుతారో స్పష్టంగా చెప్పింది… కొందరు జాతీయవాదులు అనవసర ప్రేమతో సినిమాను చూడండీ, చూడండీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సరే ప్రేక్షకులు పట్టించుకోలేదు… చివరకు అలా అభిమాన ప్రచారాన్ని చేసిన ప్రేక్షకులు సైతం ఛీకొట్టేశారు అంతిమంగా… […]
ఆస్తి యావత్తూ ధారబోసి… 90 ఏళ్ల వయస్సులో ఓ వృద్దురాలి ఒంటరి న్యాయపోరాటం…
(వీవీ రమణమూర్తి… ఎండీ, లీడర్ పత్రిక) నిరుపేదల కళ్ళల్లో వెలుగును చూడాలని తమ యావదాస్తినీ భర్తతో పాటు ధారపోసి రోడ్డున పడ్డ వృద్ధురాలి కథ ఇది. 90 ఏళ్ళ వయసులోనూ ఒంటరి పోరాటం చేస్తూ న్యాయం కోసం కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్న త్యాగమూర్తి కన్నీటి గాథ ఇది. కొంత మంది కుట్రలకు, కుతంత్రాలకు, బలయి పోయిన ఓ మానవతావాది యదార్ధ వ్యధ ఇది. విశాఖ నగరంలోనే కాదు తెలుగు ప్రజలందరికీ చిరకాలంగా కంటికి రెప్ప లాంటి […]
అమ్మకానికి హాట్స్టార్… కాదంటే ఏదైనా బలమైన గ్రూపుతో పొత్తు…
హాట్ స్టార్ – వాల్ట్ డిస్నీ తెలుసు కదా… ఓటీటీ, పలు భాషల్లో సినిమాల రిలీజ్, వెబ్ సీరీస్, వీడియో ఆన్ డిమాండ్… చాలా పాతుకుపోయింది వినోదరంగంలో… ఇప్పుడిది మాంచి బలమైన మూలాలున్న జాయింట్ వెంచర్ భాగస్వామి కోసం అన్వేషిస్తోంది… అసలు వీలయితే అమ్మేయాలని అనుకుంటోంది మంచి పార్టీ దొరికితే… విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ నివేదిక ప్రకారం… ఈ ప్రయత్నాలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నయ్… ఇంకా ఏ […]
వెండి తెరపై వెలగబోయే సితార… తల్లి వేయించే అడుగులు అటువైపేనా..?!
మిత్రుడు Rajasekhar Reddy… రాసిన ఓ పోస్టు చదువుతుంటే… అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల సినిమాల్లోకి రాకుండా, హీరోయిన్గా చేయకుండా అభిమానులు అడ్డుపడిన తీరు గుర్తొచ్చింది… ఫ్యాన్స్ అభిప్రాయానికి తలొగ్గిన కృష్ణ బిడ్డను సినిమాల్లోకి రానివ్వలేదు… కానీ ఓ హీరోయిన్ నమ్రతను తన కొడుకు మహేశ్ పెళ్లి చేసుకోకుండా మాత్రం కృష్ణ అడ్డుకోలేదు… ఇష్టమో, అయిష్టమో గానీ మహేశ్ నిర్ణయానికి సమ్మతించాడు… ఫ్యాన్స్ కూడా పెద్దగా వ్యతిరేకించలేదు… ఇప్పుడు మహేశ్ కూతురు సితారను భావి హీరోయిన్గా […]
హడలగొట్టే భయంకరంగారావు… హాయిగొలిపే టింగురంగారావు…
నట చిరస్వీ…. రంగారావు ఎస్వీ…. జులై 18 ఎస్వీఆర్ 49 వ వర్ధంతి… నట యశస్వి ఎస్వీ రంగారావు నటనలో నిజంగా యశశ్వినే. ఆయన పరమపదించి నలబై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది. 1974 లో ఇదే రోజున కన్నుమూశారు. ఇప్పటికీ ఆయన పాత్రలు చిరస్థాయిగా నిలుస్తున్నాయి. ఆయన నటనకు ఈ తరం సైతం ముగ్దులవుతున్నారు. అనేక పాత్రలను అవలీలగా పోషించిన రంగారావును స్మరించుకుంటూ డాక్టర్ పురాణపండ వైజయంతి రచన ఇది… స్వర్గలోకం సందడిసందడిగా ఉంది. చిత్రమేమిటంటే స్వర్గంలో […]
YSR సర్వశక్తులూ ఒడ్డాడు… టీడీపీ అంతే కష్టపడింది… తరువాత ఏమైంది..?
Murali Buddha….. మిద్దె రాములు ఒగ్గు కథ – కరీంనగర్ ఉప ఎన్నికలో కెసిఆర్ విజయం … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————————– కెసిఆర్ రాజీనామాతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక . టీడీపీ తరపున ఎన్నిక బాధ్యత దేవేందర్ గౌడ్ కు అప్పగించారు . తెలంగాణ ఉద్యమ సమయం. అన్ని పార్టీల ప్రచారంలో తెలంగాణ పాటలు చేరిన కాలం . ప్రచారం కోసం టీడీపీ కొన్ని సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసింది . ఆ బృందాలు […]
అర శతాబ్దంపాటు అదే చోట, అదే పార్టీ నుంచి… వరుసగా 12 సార్లు ఎన్నిక…
Siva Racharla….. Mass Contact… ప్రజలతో సన్నిహితంగా ఉంటే అనేక సమస్యలను సులభముగా పరిష్కరించవచ్చు అంటారు ఆయన. ప్రజాస్వామ్యానికి కావలసింది సైన్యం, ఆయుధాలు కాదు ప్రజల విశ్వాసం అని నమ్మిన, ఆచరించిన నాయకుడు ఊమెన్ చాందీ . వర్తమాన రాజకీయాల్లో విశ్లేషణకు సరిపడా సరుకు ఉండటం లేదు. సిద్ధాంతం వదిలేసినా తలలు తీసుకుంటాం అన్న మూడు నెలలకే మరో పార్టీలో చేరి పాత పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. జీవితం మొత్తం ఒకే పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో […]
ఇలాంటి ఫేక్ మెసేజులు, కొత్తతరహా మోసాలతో జాగ్రత్త సుమా…
Sai Vamshi ………. ఇలాంటి ‘మోసాలు’ ఉంటాయి.. జాగ్రత్త … PLEASE READ IT.. … నిన్న సాయంత్రం వాట్సాప్కి ఓ మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైం పని కావాలా అంటూ! జర్నలిజంలోకి రాక ముందు నా బయోడేటా నౌకరీ, లింక్డ్ లాంటి వెబ్సైట్లలో పెట్టాను. ఇప్పటికీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఇదీ అలాగే వచ్చింది అనుకున్నా! Truecallerలో అదేదో ఇంగ్లీషు పేరు ంంది ‘మీరు సరే అంటే మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేస్తాను’ అని మెసేజ్ […]
ఈ పేద ‘సరస్వతి’ పెద్ద చదువుల కథనంలో ‘రియల్ హీరో’ ఆమె భర్త…
ఇది ఈనాడులో వచ్చిన న్యూస్ స్టోరీ అని ఫేస్బుక్లో తెగ వైరల్ అయిపోయింది ఈరోజు… నిజంగానే ఓ స్పూర్తిదాయక కథనం… నిజానికి జనానికి ఇవే ప్రస్తుతావసరం… ఓ పేదరాలు సమస్యల్ని, జీవన దుస్థితిగతుల్ని అధిగమించి ఓ చదువుల సరస్వతిగా అవతరించిన వైనం ఇప్పుడు అకారణ ఫ్రస్ట్రేషన్లో పడి కొట్టుకుపోతున్న యువతరానికి అవసరం… ముందుగా ఈ కథనం చదవండి… (ఈనాడు సౌజన్యంతో…) అది అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. ఆ ఊరి […]
Narsapalle Song… ఒకే పాట 2 గొంతుల్లో, 2 సినిమాల్లో… ఒకటి చిరంజీవిది…
నర్సపల్లే… ఈ ఫోక్ సాంగ్ ఎంత పాపులరో తెలుసు కదా… యూట్యూబ్లో కోట్ల వ్యూస్… పాట పాడిన కనకవ్వ అకస్మాత్తుగా స్టార్ అయిపోయింది… పలు టీవీ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంది… మంగ్లితో కూడా కలిసి పాడింది… ఇప్పుడు తెలంగాణ పాట మీద కదా ఇండస్ట్రీ కన్ను… సరే, దాన్ని అలాగే తీసుకుని వాడుకుంటే పర్లేదు… కానీ తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ పాటను అలా ఎందుకు స్వచ్ఛంగా ఎందుకు ఉంచుతుంది..? చిరంజీవి భోళాశంకర్ సినిమా వస్తోంది కదా… అందులో […]
ఈ కూటముల్లోని 35 పార్టీలకు అసలు పార్లమెంటు ప్రాతినిధ్యమే లేదు…
దుర్మార్గ బీజేపీని గద్దె దింపాలనే సంకల్పం, ప్రయత్నం విపక్షాల కోణంలో అవసరమే, రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే… అయితే ప్రస్తుతం ఓ నంబర్లాట నడుస్తోంది అధికార, విపక్షాల నడుమ… 26 పార్టీలు కలిసి మోడీపై యుద్ధభేరీ మోగిస్తాయని కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న దండు… ఎహె, మేం 38 పార్టీలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నాడు బీజేపీ నడ్డా… అసలు కూటమి అని పిలిచే దగ్గరే వస్తోంది చిక్కు… ఉదాహరణకు, విపక్ష కూటమినే తీసుకుందాం… పేరుకు 26 పార్టీలు… వీటిలో టీఎంసీ, […]
తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ ఈ అగ్రి-పవర్ పాలిటిక్సే…
మేం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం అని 2004 ఎన్నికల ఫలితాల తరువాత ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ప్రకటించగానే అంతా అవాక్కయ్యారు . విలేకరుల కన్నా ముందు టీడీపీ ముఖ్యనాయకులంతా బాబు నోటి నుంచి ఈ మాట విని ఆ మాట అంటున్నది బాబేనా ? అని ఆశ్చర్య పోయారు . ఎందుకంటే అంతకన్నా ముందు వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచవద్దు అని ఉద్యమిస్తే కాల్పులు జరిపి ముగ్గురి మరణానికి కారణం అయ్యారు […]
పాపం పసివాడు సినిమా గుర్తుందా..? ఐతే ఇది చదవండి ఓసారి…
Bharadwaja Rangavajhala…… విరామచంద్ … టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టారరుల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన దేవుడు చేసిన మనుషులు . ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచీ వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. మన పాపులర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ఆయనకు సమీప బంధువు. వి.రామచంద్రరావు సుదీర్ష సహాయ దర్శకత్వ అనుభవం తర్వాత […]
మొత్తానికి భలే మాయలేడి… ఒకరా ఇద్దరా… ఏకంగా ఇరవై ఏడు మంది…
ఫేక్ పేర్లతో… దొంగ మాటలతో బోలెడు పెళ్లిళ్లు చేసుకున్న మోసగాడు… కట్నం తీసుకుని, పరారైపోయి, మళ్లీ ఇంకోచోట ప్రత్యక్షం… ఇలాంటి వార్తలు చాలా చదివాం… అసలు ఏమీ తెలుసుకోకుండా, వరుడి కుటుంబం వివరాలు కనుక్కోకుండా ఎలా పిల్లనిస్తారు అనే ఆశ్చర్యం కలిగేది… కానీ ఇది పూర్తి భిన్నమైన కథ… జమ్ముకాశ్మీర్లోని ఓ యువతి ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకుంది… అందరినీ మోసగించింది… ఇప్పుడు 28వ పెళ్లి కోసం ఎవరిని బకరా […]
ఫోఫోవమ్మా… నీకు జీతం పెంచేదేముంది..? ఆర్టిఫిషియల్ రీడర్ను పెట్టేస్తాం…
Artificial Anchor: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన యాంకరమ్మను ఏమనాలి? కె. మేధ గ్రాఫిక్ మేధ యానిమేషన్ మేధ యంత్ర మేధ భ్రమ డిజిటల్ బొమ్మ…ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఓపిక లేకపోతే ఆ కృత్రిమ మేధనే అడిగితే లెక్కలేనన్ని కృత్రిమ నామాలను సృష్టించి ఇవ్వగలదు. ఒరియా భాషలో వార్తలు చదివే ఒక కృత్రిమ యాంకరమ్మ “లీసా”ను ఒరియాలో ఆవిష్కరించగానే…తెలుగులో బిగ్ టీ వీ వారు అలానే కృత్రిమ మేధతో వార్తలు తనంతట తానే చదివే […]
సోషల్ బురద తొక్కనేల..? ఆనక పాఠకులకు క్షమాపణలు చెప్పనేల..?
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది… వర్తమాన జర్నలిజం గురించి ఏం రాసినా అంతే… ఎవరో పెద్దగా సాధనసంపత్తి లేని, అనుభవశూన్యులైన, శిక్షణ లేని జర్నలిస్టులు ఏదో రాస్తే, యూట్యూబ్లో ఏదో చూపిస్తే… వాళ్ల స్థాయి అదేనని జాలి చూపించవచ్చు… కానీ డెక్కన్ క్రానికల్ వంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పత్రిక కూడా తప్పు చేస్తే..? దాన్నేమనాలా..? జాలిపడటం కాదు, కోపగించాలి… ఈ కథనం అదే… సోషల్ మీడియా కథ వేరు… ఎవడో ఏదో రాస్తాడు, ఏదో […]
నాసిరకం సర్వీసుకు ఇండిగో… నాణ్యమైన ‘పద్ధతికి’ టాటా… ఇవే బలమైన ఎయిర్ గ్రూప్స్…
Costly Tour: ఆ మధ్య ఎయిరిండియాను టాటా వారు కొన్న తరువాత దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇండిగో కూడా పోటీలో వెనుకపడకూడదని నాలుగు లక్షల కోట్ల విలువ చేసే కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. 1903లో రైట్ సోదరులు విమానాన్ని కలగని…తయారు చేయించి… తొలిసారి గాలిలో ఎగిరినప్పటినుండి ఇప్పటివరకు ప్రపంచ విమానయాన చరిత్రలో ఇవే అత్యంత భారీ ఆర్డర్లు అని అంతర్జాతీయ వ్యాపార మీడియా పొంగిపోయి కథలు కథలుగా రాస్తోంది. ఈ […]
ఓహ్… ప్రభాస్ ప్రాజెక్ట్-కే సినిమాలో కే అంటే ఆ మహాభారత పాత్రా..?!
‘‘ఒక సైంటిఫిక్ ప్రపంచం… మానవాళికి ఓ పెద్ద విపత్తు సంభవిస్తుంది… మహాభారతం నుంచి కర్ణుడిని ఎత్తుకొస్తారు… భూమండలాన్ని రక్షిస్తారు… అదే ప్రాజెక్ట్ కే… అంటే కర్ణ…’’ ఇదీ ఆ సినిమా కథ అట… ఒకవైపు అమితాబ్ బచ్చన్, మరోవైపు కమల్ హాసన్… హీరో ప్రభాస్, హీరోయిన్ దీపిక పడుకోన్… దిశా పటాని… సూర్య కూడా అంటున్నారు గానీ డౌట్ ఫుల్… దేశం యావత్తూ అభిమానించే ఈ అతిరథ తారాగణం కొలువు తీరే సినిమా అంటే ఏమేరకు ఎక్స్పెక్టేషన్స్ […]
- « Previous Page
- 1
- …
- 187
- 188
- 189
- 190
- 191
- …
- 448
- Next Page »