మనోజ్ ముంతాషిర్… హిందీ సినిమాల్లో పాటలు, డైలాగులు రాస్తుంటాడు… ప్రతిష్టాత్మకమైన ఆదిపురుష్ సినిమాలో చెత్త డైలాగులు రాసింది ఇతనే… ప్రత్యేకించి హనుమంతుడికి తలతిక్క డైలాగులు రాశాడు… అదేమంటే, సమర్థించుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు… దేశమంతా తిట్టిపోస్తుంటే ఉల్టా వ్యాఖ్యలకు దిగాడు… నిజానికి ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ కావడానికి ఈయన డైలాగులు కూడా ప్రధాన కారణమే… జనం ఛీకొట్టారు… అసలు ప్రభాస్ ఇలాంటి చెత్త టీమ్‌ను ఎందుకు నమ్మినట్టు..? ‘అసలు హనుమంతుడు దేవుడే కాదు, కేవలం భక్తుడు, మనమే […]
మరో మహిళా డెైరెక్టర్… పెద్ద బ్యానర్ దొరికితే ఇంకా రాణించే అవకాశం…
ఈమె గురించిన సమాచారం నెట్లో పెద్దగా దొరకదు… ఎవరు..? ఓ సాథియా సినిమా దర్శకురాలు దివ్య భావన… ఈమె ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ దగ్గర కొన్నాళ్లు పనిచేసింది… అదొక్కటే విశేషం కనిపిస్తుంది ఈమె గురించి..! నిజానికి ఇండస్ట్రీలో మహిళలు 24 క్రాఫ్ట్స్‌లో కనిపించేదే అత్యంత అరుదు… అంతా మగమయమే… ఒకవేళ ధైర్యంగా మహిళలు ఈ ఫీల్డులోకి వస్తే వివక్ష, అవమానాలు గట్రా కామన్… అసలు ఆడదాన్ని మనిషిగానే చూడని దుష్ట ఇండస్ట్రీ ఇది… అలాంటిది ఓడకు కెప్టెన్ […]
వేదిక మీదే హీరోయిన్‌పై పిచ్చి కూతలు… ధైర్యంగా ఎండగట్టిన జర్నలిస్టు…
రోబో శంకర్ అనే ఓ కమెడియన్ ఉన్నాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో… పార్టనర్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు… నిర్మాతలు చెన్నైలో రీసెంటుగా ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు… సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆది, హన్సిక కూడా ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు… బాగా తాగి వచ్చాడేమో శంకర్… తనను ఏవో నాలుగు ముక్కలు మాట్లాడాలని నిర్వాహకులు కోరితే, వేదిక మీద హన్సిక మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేశాడు… తాగి ఫంక్షన్లకు వెళ్లడం, ఆడవాళ్లను కనీసం మనుషుల్లా […]
ఛిఛీ… సర్కారు ఏం చేస్తున్నట్టు..? ఆదాయ ప్రదాతల్ని అవమానించడమే ఇది…
Discrimination: ఇది చూడడానికి చిన్న వార్తే కావచ్చు. కానీ… విషయం చాలా తీవ్రమయినది. పురోగామి సమాజంలో తిరోగామి చర్యలను ముక్త కంఠంతో ఖండించడానికి ఉద్యుక్తులం కావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించే వార్త. రాకెట్లు వేసుకుని అంతరిక్షంలో పర్యాటకులుగా తిరిగి వస్తున్న ఆధునిక నవనవోన్మేష కాలంలో… ఒకానొక మందుబాబు మందు షాపుకు వెళ్లి… డబ్బులిచ్చి 90 ఎమ్మెల్ పోయమంటే పోయనంటాడా? పైగా కులం పేరుతో మందును నిరాకరిస్తాడా? వేర్ వుయ్ ఆర్ గోయింగ్? వాట్ వుయ్ ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ […]
కన్నీళ్లతో, ఉద్వేగంతో కృష్ణ వరం కోరుకున్నాడు … ఓ రేణుక కథ…
( పురాణ ప్రసిద్ధురాలైన రేణుక జమదగ్ని మహర్షి భార్య. ఆమె తన పాతివ్రత్య ప్రభావంతో ,నది నుండి ప్రతిరోజూ నీటినే కుండ ఆకారంలోకి మార్చి ఆశ్రమానికి తీసుకొచ్చేది . ఒక రోజు నది వద్ద అత్యంత సుందరుడైన కార్తవీర్యార్జున మహారాజును చూసి ఒక క్షణం … ఒకే ఒక క్షణం రేణుక మనస్సు మోహావేశంతో చెదిరింది. ఆరోజు నీరు కుండ ఆకారంలోకి గట్టిపడలేదు. రేణుక మామూలు మట్టికుండలో నీళ్లు పట్టుకుపోవడంతో జమదగ్ని తన దివ్యదృష్టితో జరిగిన సంగతిని […]
పప్పు ముచ్చట… ఇప్పటితీరుగ చల్లటి తనాబ్బిపెట్టెలు ఆనాడేడియి…
ఒక ఇరువయేండ్ల కిందటి వరకూ ఒగాది మొదలు రాకీట్లపున్నమ దాకా కూరగాయలు కరువు. వొరుగులతోనే వంటలు. పప్పంటే మా దగ్గర తొంభైపాళ్లు పెసరుపప్పే. ఏదోవోసారి పప్పుచారుకు మాత్రమె కందిపప్పు. చెరిగి..కోడి.. నాపలు-బుడ్డుపెసళ్లు ఏరేసి మంచి గట్టిపెసళ్లు ఎండవోసి పొతంగ విసిరి మల్లోసారి చెరిగి పరంగిరం లేకుంట తీసేసి మూడునాలుగు కుంచాలంత పొట్టుపప్పు ఈతచాపల రాశివోసి గానుగపల్లినూనెకు పసుపుగలిపి,ఆ చమరు పప్పుకు పట్టించి అద్దగంటసేపు మంచిగ పప్పంత కలెగలిపి ఎత్తి, అర్రల గడంచెమీద ఓరకు వెడుదురు. పదిహేను రోజులైనంక […]
బిగ్ బి… ఏమిటీ పని..? ఇదెక్కడి తెలుగు..? జనం నవ్వుకోరా చెప్పండి..?
అమితాబ్… దేశం గర్వించతగిన నటుడు… కోట్ల మంది తనను అభిమానిస్తారు… వెరీ ఇంపార్టెంట్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా… తన మాట, తన అడుగు, తన భాష, తన ఆలోచనలకు ప్రాధాన్యం ఉంటుంది… లక్షల మంది అనుసరిస్తారు… ఇలాంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, జనం నవ్వుకునే విధంగా ఉండకూడదు… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… తను ప్రభాస్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం ప్రాజెక్టు కె లో నటిస్తున్నాడు… కమల్ హాసన్ కూడా దీనిలో భాగస్వామి (నటనపరంగా) అవుతున్నాడు… ఇప్పటివరకూ […]
మమతా మోహన్‌దాస్… ఈ దొరసాని వైవిధ్యమైన పాత్రలో ఇరగదీసింది…
కథ రాముడి చుట్టూ తిరిగితే అది రామాయణం… అలా గాకుండా కథను రావణుడి చుట్టూ తిప్పుతూ, తననే బలంగా ఎలివేట్ చేస్తే..? నాయకుడి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోతే..? అది రుద్రంగి సినిమా…! రావణుడు, దుర్యోధనుడు వంటి ప్రతినాయక పాత్రల్ని కూడా నాయక పాత్రలకు దీటుగా చూపించడం పాతదే… ఎన్టీయార్ ఏనాడో చేశాడు ఆ పని… ప్రేక్షకులు ఆమోదించి చప్పట్లు కొట్టారు కూడా… అయితే ఆ పాత్రల చిత్రణలో తమ నెగెటివ్ చర్యలకు, పోకడలకు జస్టిఫికేషన్ ఇచ్చే […]
కేంద్రంలో ముందస్తు ఎన్నికలు..? బీజేపీ హడావుడి చెబుతున్నది అదేనా..?!
Siva Racharla……. ముందస్తు ఎన్నికలు వస్తాయా?. ఏదైనా ఒక నిర్ణయానికి ప్రాతిపదిక ఉండాలి. ముందస్తు ఎన్నికలలాంటి అతిపెద్ద నిర్ణయం తీసుకోవటానికి అతి పెద్ద కారణం ఉండాలి. అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి పెద్ద కారణాలు ఏమైనా ఉన్నాయా? గత కొంతకాలంగా కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధానకారణం కర్ణాటకలో బీజేపీ ఓటమి. కర్ణాటకలో ముఖ్యమంత్రి బొమ్మై ,రాష్ట్ర బీజేపీ నేతల కన్నా మోడీ, అమిత్ షాలే […]
గన్ను పట్టుకుని వణికించాడు … పెన్ను పట్టుకుని ఎడిటర్ కాటుకు బలయ్యాడు…
ఎడిటర్ , నేనూ ప్లై ఓవర్ కింద నిలబడి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం … ప్రేమలు , బంధాలు అన్నీ మాట్లాడుకున్నాం … ఒకరి భుజం మీద ఒకరం చేయి వేసుకోని కబుర్లు చెప్పుకున్నాం అంటూ కేఎన్ చారి మురిపెంగా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు . ఓపెన్ గా ఏమైనా మాట్లాడుకునే స్నేహం ఉండడం వల్ల మధ్యలోనే ఆపేసి … ‘‘చూడు చారి, ఇప్పుడు సంతోషంగా చెబుతున్నావు కానీ దెబ్బ తింటావు … నా మాట విను […]
రంగ‘బలి’… సత్య మెప్పించాడు… తనే ఓరకంగా హీరో… నాగశౌర్యకు మళ్లీ నిరాశే…
బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు… తెలుగు సినిమాకు బ్రహ్మి ఓ సెంటిమెంట్‌గా వెలిగిపోయాడు కొన్నాళ్లు… విపరీతమైన డిమాండ్… రాజబాబు తరువాత ఎందరో కమెడియన్లు వచ్చిపోయినా బ్రహ్మి ఓ స్టార్డం ఎంజాయ్ చేశాడు… మధ్యమధ్య సునీల్ కామెడీ ఆకట్టుకునేది… మొనాటనీతో బ్రహ్మానందం కామెడీతో విసిగిపోయిన ప్రేక్షకుల మీదకు నిర్మాతలు, దర్శకుడు వెన్నెల కిషోర్‌ను రుద్దారు… బ్రహ్మీ తెరమరుగయ్యాడు… తను మెరిట్ ఉన్న నటుడే అయినా ఓ మూస పాత్రలు, మూస నటన… చూసీ చూసీ జనానికి […]
Time Travel… మూస కథలకు భిన్నంగా 7.11 పీఎం మూవీ… నాట్ బ్యాడ్, పర్లేదు…
అప్పట్లో విఠలాచార్య తీసిన సినిమాలు ఓసారి గుర్తుకుతెచ్చుకుందాం… ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ అప్పట్లో లేదు, వీఎఫ్ఎక్స్ లేదు… ఐనా సరే, సినిమాల్లో ట్రిక్కుల దృశ్యాలు అనగా మన కళ్లను మాయచేసే ఎన్నో చిత్రీకరించాడు… అనేక సినిమాలు హిట్… ఈ సీన్లకన్నా కథ చెప్పే తీరుతో ఆకట్టుకునేవాడు… అంతెందుకు..? ఆదిత్య 369లో గ్రాఫిక్స్ ఏమున్నాయని..? సినిమా సూపర్ హిట్… కారణం :: కథ చెప్పే విధానమే… రోబో సినిమా గ్రాఫిక్స్ ప్రధానమే కానీ మహేశ్ నాని, సూర్య 24 […]
తెలంగాణ పండుగల స్పెషల్ పాటలకూ… సినిమా మాస్ ట్యూన్ల కాపీ వాసన..!!
బతుకమ్మ లేదా బోనాలు… మరేదో పండుగ… ప్రత్యేకంగా పాటలు రాయించి, షూట్ చేయించి, యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం కొన్నాళ్లుగా చూస్తున్నదే… ఎక్కువ శాతం అవి తెలంగాణ పాటలే… ఎవరో ఏదో రాస్తారు, పండుగ తీరూతెన్నూ వదిలేసి, వీళ్లకు ఇష్టమొచ్చినట్టు తెలుగు సినిమా టైప్ కల్చర్‌ను తెలంగాణా పండుగ కల్చర్‌గా చూపించడమే వీటిపైన ఉన్న ప్రధానమైన ఫిర్యాదు… అలాగని మొత్తం పాటలు అలా ఉంటాయని కాదు… కొందరి పాటలు… సరే, ఏదో ఒకటి… తెలంగాణ పాటలకు పట్టం కడుతున్నారులే […]
IPC కాదు… BPC… బుల్డోజర్ పీనల్ కోడ్… వాడికి శిక్ష, మామాజీ పాపపరిహారం…
ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం? రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే… మరింత సమ ‘మత’ న్యాయం? ………………………………………. మధ్యప్రదేశ్ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా అనుచరుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి శివరాజ్ […]
దేశంలోనే నెంబర్ వన్ పత్రిక… మద్రాస్ హైకోర్టులో ముక్కచీవాట్లు…
దైనిక్ భాస్కర్… సర్క్యులేషన్లో దేశంలోనే నెంబర్ వన్ డెయిలీ పేపర్… సో, ప్రతి అక్షరాన్ని ఆచితూచి పబ్లిష్ చేయాలి కదా… కానీ అదీ యూట్యూబ్ గొట్టాల్లాగే వ్యవహరిస్తోంది… అందుకని అది ప్రచురించిన ఓ నిర్లక్ష్యపు వార్తపై మద్రాస్ హైకోర్టు ముక్కచీవాట్లు, అనగా కుక్కతిట్లు పెట్టింది… ఏదిపడితే అది రాసేస్తాం, మమ్మల్ని అనడానికి ఎవరికెంత ధైర్యం అనే పిచ్చి భరోసాలో గనుక బతుకుతున్నట్టయితే తెలుగు పత్రికలకూ ఇలాంటి వాతలు తప్పవేమో… విషయంలోకి వస్తే… దైనిక్ భాస్కర్ ఈమధ్య ఓ […]
రంజితమే రంజితమే… నీ పదవి కాస్త సిత్తరమే సిత్తరమే…
ఆమె… పేరు రంజిత… కాదు, అది ఒకప్పటి పేరు… సినిమాల్లో నటిస్తున్నప్పటి పేరు… వర్తమానంలో ఆమె పేరు నిత్యానందమయి స్వామి… ఆడలేటీ కాబట్టి స్త్రీలింగంలో స్వామిని స్వామిణి అంటారేమో తెలియదు గానీ… ఆమె పేరులో స్వామి అనే పదమున్నది… ఆమె కైలాస అనే స్వయంప్రకటిత, స్వయంసిద్ధ, స్వయంచాలక, స్వయంభూ దేశానికి ప్రధానమంత్రి… ఈరోజు ఆమె వార్త ఒకటి కనిపించింది… అదేం చెబుతున్నదంటే… ‘‘దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద… తాను సృష్టించుకున్న ‘కైలాస దేశ’ దీవికి […]
స్టార్ మాటీవీ దేశంలోనే నంబర్ వన్… మరింత దిగజారిపోయిన ఈటీవీ…
మనం అప్పుడప్పుడూ టీవీ చానెళ్ల రేటింగుల గురించి మాట్లాడుకుంటున్నాం… ఇప్పుడిక ఎన్టీవీ స్థిరంగా ఫస్ట్ ప్లేసులో కూర్చుండిపోయింది… ఇప్పట్లో టీవీ9 దాన్నికొట్టేసే పరిస్థితి, సూచనలు కనిపించడం లేదు… ఆ రెండే… మిగతావన్నీ సోసో… మరి వినోదచానెళ్లు..? మనకు ఉన్నవే నాలుగు ప్రధానమైన వినోద చానెళ్లు… అందులో జెమిని టీవీని పక్కన పెట్టాల్సిందే… ఒకప్పుడు టాప్… ఇప్పుడది ఆరో ప్లేసు… ఎప్పుడో ఓసారి ఏదైనా హిట్ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినప్పుడు తప్ప ఆ చానెల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు… […]
అక్షర కాష్మోరాలు… క్షుద్ర అనువాదాల్లో వాణిజ్య ప్రకటనలే టాప్…
Telugu-Tegulu: తెలుగులో హాస్య రచనలు బాగా తగ్గిపోయాయని బాధ పడాల్సిన పనిలేదు. జంధ్యాల తరువాత ఆ స్థాయిలో ప్రతి పదానికి నవ్వుల పూత పూసే కలాలు లేవని దిగులు పడాల్సిన పనే లేదు. రోజూ పత్రికల్లో వచ్చే తెలుగు ప్రకటనలు చదివితే…ప్రతి పదంలో నవ్వులే నవ్వులు. ప్రతి లైనుకు పొట్ట చెక్కలయ్యే నవ్వులే నవ్వులు. నవ్వలేక నవ్వలేక మన కళ్లల్లో నీళ్లు తిరిగేలా ప్రకటనలు తయారు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకు, అనువాదకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనల్ను కడుపుబ్బా నవ్వించడానికి ఒక ప్లాటినం […]
దివాలా దిశ… చివరకు ఆర్మీ డ్రిల్స్‌కు కూడా కత్తెర్లు… ఫాఫం పాకిస్థాన్…
పార్ధసారధి పోట్లూరి ….. బస్! ఖేల్ ఖతం! దుకాణ్ బంద్! ఈ సంవత్సరం చివరి వరకు పాకిస్థాన్ సైన్యం రోజువారీ సైనిక డ్రిల్స్ తో పాటు పెట్రోల్, డీజిల్ తో నడిచే ఎలాంటి సైనిక యుద్ధ టాంకులు కూడా డ్రిల్స్ లో పాల్గొనడానికి వీల్లేదు! ఒక T-80 యుద్ధ టాంక్ ఒక కిలోమీటర్ దూరం వెళ్ళడానికి రెండు లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ఇక రోజు వారీ డ్రిల్ కోసం F-16 ఫైటర్ జెట్ కి అయితే […]
పవన్ కల్యాణ్ కాపు కాదట… ఈ వివాద రాజకీయాల్లోకి ఆ తల్లినీ లాగుతున్నారు…
అయిదేళ్ల క్రితం… అంటే 2018లో … పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశాడు… ‘‘నాది ఇకపై రెల్లి కులం, ఆ కులాన్ని అడాప్ట్ చేసుకుంటున్నా, రాజకీయాల్లో చెత్తను ఊడ్చేయడానికే వచ్చాను, కాబట్టి ఆ పారిశుధ్య వృత్తిలో ఉండే వాళ్ల కులమే నా కులం…’’ అనేది ఆ ప్రకటన సారాంశం… ఆ ప్రకటన చాలామందికి నచ్చింది… సహజంగానే యాంటీ జనసేన గ్రూపులకు నచ్చలేదు… అది వేరే సంగతి… వైసీపీలో ముత్యాల చక్రవర్తి అని ఓ మోస్తరు లీడర్ ఉంటాడు… […]
- « Previous Page
- 1
- …
- 190
- 191
- 192
- 193
- 194
- …
- 448
- Next Page »