. . ( విన్నకోట రవికుమార్ ) …. సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే అదేదో రాశి నుంచి సూర్యుడు… అది కాదు గురూ… సంక్రాంతి అంటే లాంగ్ హాలిడే… సంక్రాంతి అంటే ఊళ్ళకి వెళ్లి రావడం, సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు… అబ్బే…సంక్రాంతి అంటే పంటలు చేతికొచ్చే…ఊహూ…సంక్రాంతి అంటే ఇవేమీ కాదు బ్రో. సంక్రాంతి అంటే కోడి పందేలు. సంక్రాంతి అంటే గుండాట. సంక్రాంతి అంటే భారీ సెట్టింగులతో జరిగే కోడి పందేలు, జూదం. తెలుగు […]
జాగ్రత్త… తొందరపడి తప్పుటడుగు వేస్తే… పోక్సోకు బలవుతారు…
. * HOW A SOCIAL MEDIA APP CAN CHANGE A LIFE DISCLAIMER: ఇది మీడియా కథనాల ఆధారంగా, మరికొంత తెలుసుకున్న సమాచారంతో రాసింది. యథార్థం ఇదే అన్న నిర్ధారణ ఇందులో లేదు. కేవలం ఒక అవగాహన, హెచ్చరిక కోసమే రాస్తున్న కథనం ఇది. గమనించగలరు. *** ఆ అమ్మాయికి 17 ఏళ్లు. ఆదిలాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమెది అదే పట్టణం కావడంతో రోజూ కాలేజీకి వెళ్తూ, వస్తూ ఉంది. ఇప్పుడు అందరి చేతుల్లో […]
ఆదానీని టార్గెట్ చేసిన ఆ ‘లక్కీ భాస్కర్’… ఎందుకు దుకాణం మూశాడు..?!
. ఒకడి గురించి చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవడం అవసరం… తన పేరు నాథన్ ఆండర్సన్… తన దుకాణం పేరు హిండెన్ బర్గ్ రీసెర్చ్… మొదట్లో ఎందుకూ పనికిరాని కేరక్టర్… కొన్నాళ్లు అంబులెన్స్ డ్రైవర్… తరువాత ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు… లైఫులో చాలా ఎదురుదెబ్బలు… మన మొన్నటి లక్కీభాస్కర్ సినిమాలోలాగే అడ్డదారులు తొక్కాడు… తను ఎంచుకున్న మార్గం… ఓ కుట్ర… ఓ మోసం… కొన్ని పెద్ద కంపెనీలను ఎంపిక చేసుకోవడం… ఆ కంపెనీలపై అనేక ఆరోపణలతో రకరకాల […]
ఆడలేక మద్దెల ఓడు అన్నాడట ఓ దర్శక తిక్క శంకరుడు..!!
. ఫాఫం, అందుకే తిక్క శంకరయ్య అనాలనిపిస్తోంది… అదేనండీ, దర్శకుడు శంకర్ గురించి… గతంలో సెన్సేషనల్ సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన ఆ శంకర్ గురించే… మొన్న ఇండియన్-2, నిన్న గేమ్ ఛేంజర్ గురించి తీసిన ఆ శంకర్ గురించే… తనకు ఫెయిల్యూర్స్ లేవని కాదు… కానీ గతంలో పర్ఫెక్ట్ ప్లానింగుతో, జనానికి నచ్చే సినిమాల్ని తీశాడు… కానీ వరుస రెండు ఫెయిల్యూర్స్‌తో ఏమంటున్నాడు..? అబ్బే, నేనే సంతృప్తిగా లేను, 5 గంటల ఫుటేజీ వచ్చింది… దాన్ని సగానికి […]
శ్రీమాన్ సీఎం చంద్రబాబు గారూ… ఓ దిక్కుమాలిన ఆలోచన…
. బహుశా… ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా ఈరకం ప్రకటన జారీ చేయలేదు అనుకుంటా… అదీ చంద్రబాబు చేశాడు… ఇద్దరు పిల్లలకన్నా తక్కువ ఉన్నవాళ్లకు స్థానిక ఎన్నికల్లో అనర్హులుగా చేస్తాడట… అత్యంత దరిద్రమైన నిర్ణయం… గతంలో ఇదే పెద్దమనిషి జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి, ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అనర్హుడు అన్నాడు… సరే, అప్పట్లో ఒకరే బెటర్ అన్నాడు, ఓ దశలో నన్ను చూడండి, నాకొక్కడే లోకేష్ అన్నాడు… అక్కడికి తను ఇంటెన్షనల్‌గా, ప్రపంచ […]
రేవంత్‌రెడ్డికి చంద్రబాబు విసిరిన చాలెంజ్… దాని పేరు బనకచర్ల..!!
. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి కొత్త చాలెంజ్ విసురుతున్నాడు… దాని పేరు గోదావరి టు బనకచర్ల లింక్… జీబీ లింక్… అనగా గోదావరి నుంచి పెన్నా బేసిన్‌కు జలాల తరలింపు… ఎస్, ఏపీ ప్రయోజనాల రీత్యా అది మంచి ప్రాజెక్టే కావచ్చుగాక… అది చేపట్టాలంటే అది మరో కాలేశ్వరం ప్రాజెక్టు… సరే, అత్యంత భారీ ప్రాజెక్టులు ఎందుకు చేపడతారు అంటే దాని వెనుక పాలకుల చాలా ఆర్థిక మర్మాలు ఉంటాయి… […]
ఒక ఐఐటీయన్ సన్యాసిగా ఎలా మారాడు..? ఈ చార్ట్ ఏమిటి..?!
. ( రమణ కొంటికర్ల )… ….. ఒక ఐఐటీయన్ ఒక సన్యాసిగా ఎందుకు మారాడు..? తండ్రితో తన జ్ఞాపకాల మ్యాప్ ఏం చెబుతోంది..? దృశ్యాన్ని చూసే కోణాలేవైనా.. ఎవరి ఆలోచనలేమైనా.. స్వదేశీ, విదేశీ భక్తుల రాకతో ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ఓ డిబేట్! ఆ చర్చలో మాంక్ గా అవతరించిన ఐఐటీయన్, ట్రావెల్ ఫోటోగ్రాఫర్.. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ మరో బిగ్ డిబేట్! ఐఐటీ పూర్తి చేసిన అభయ్ సన్యాసిగా ఎందుకు రూపాంతరం చెందాడో […]
బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ… అనిల్ దారితప్పాడు..!!
. Paresh Turlapati ….. బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ అండ్ ఫైనల్లీ హాస్యాన్ని అన్నీ సమపాళ్లలో రంగరిస్తేనే పండుతుంది. అందులోనూ క్రైమ్ స్టోరీలో కామెడీని జొప్పించాలంటే చాలా టాలెంట్ ఉండాలి. లేకపోతే కాఫీలో ఐస్ క్రీం కలుపుకుని తాగినట్టు ఉంటుంది… గతంలో అనిల్ రావిపూడి తీసిన F2 చూశా, అందులో ప్రతి పాత్రా ఒక్కో మేనరిజమ్స్ తో నడుస్తుంది, కథ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నడుస్తుంది, అన్నిటికన్నా ముఖ్యం హాస్యాన్ని సమపాళ్లలో రంగరించాడు… అంచేత చాలామందికి […]
45 ఏళ్లనాటి ఈ సినిమాలో ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ సీన్…!!
. Subramanyam Dogiparthi …… సినిమా వాళ్ళందరూ తాగుబోతులు , తిరుగుబోతులు కాదు అనే సందేశాన్ని జనానికి చెప్పాలనుకుని తీసిన సినిమా ఇది… సందేశాన్ని ఇవ్వాలని కాదు ; చెప్పాలని … ఏది ఏమయినా దాసరి ఒక సినిమా మేన్యుఫేక్చరర్ . ఒక రోజులో కధను ఫైనలైజ్ చేయగలడు . డైలాగుల్ని ఎలాగూ ఆయన సెట్ల మీద వ్రాసేదే . ఇంక ఆయనకు టైం కావలసింది ప్రొడక్షన్ ప్లానింగుకు , ప్రొడక్షనుకు , పాటలు వ్రాయటానికి , […]
ధర్మపురి అర్వింద్ చిల్లర వ్యాఖ్యలు… తుమ్మల హూందా ప్రతిస్పందన…
. బహుశా సినిమా సెలబ్రిటీల తిక్క వ్యాఖ్యలతో స్పూర్తి పొందాడో… లేక తన గుణమే అది కావచ్చుగాక… మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు ‘చిల్లర’ అనిపించుకోబడతాయి… బీజేపీ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యల్ని ఊహించలేదు… విషయం ఏమిటంటే..? కేంద్రం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది కదా… దాని వెనుక అది ఆశించే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెడితే… మేం పదే పదే లేఖలు రాస్తే కేంద్రం అంగీకరించింది, సంతోషం అని తుమ్మల […]
ఆ జయసుధ పాత్రకన్నా వై.విజయ పాత్రే బాగా నచ్చింది…
. ఆడవాళ్లు మీకు జోహార్లు . కె బాలచందర్ కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించిన విషాదాంత సినిమా . ఆయన సుఖాంతం చేస్తే విశేషం కానీ విషాదాంతం చేస్తే ఆశ్చర్యం ఏమీ లేదు . It appears that he is an embodiment of negativism and roughness in handling cinema plots . ఏ విశ్వనాధ్ లాగానో , రాఘవేంద్రరావు లాగానో , దాసరి లాగానో , క్రాంతికుమార్ […]
బంగారుగని అక్రమ తవ్వకాల్లో… బంగారంలాంటి ప్రాణాలు బలి…
. ఐరనీ అంటారా..? పారడాక్స్ అంటారా..? డెస్టినీ అంటారా..? ఏ పేరైనా పెట్టుకొండి… ఒక వార్త… ఖరీదైన బంగారం తవ్వితీసే కార్మికులు ఆకలిచావులకు గురికావడాన్ని మించిన పారడాక్స్ ఏముంటుంది ప్రపంచంలో…! ఇంతకు మించిన విధివింత ఏముంటుంది..? అసలు ఖర్మ అనే పదానికి ఇంతకు మించిన ఉదాహరణో, నిర్వచనమో ఏముంటుంది..? వార్త చదవండి… జనవరి 15 …. మూసివేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు… దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు… ఆహారం, నీరు […]
చిరంజీవికి మోడీ అమిత ప్రాధాన్యం… ఏమిటో పొలిటికల్ స్ట్రాటజీ…!!
. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సంక్రాంతి ఉత్సవం నిర్వహించాడు ఢిల్లీలోని తన నివాసంలో… గ్రామీణ కళాకారులను పిలిచాడు… మోడీ, ఇతర మంత్రులు, తెలంగాణ -ఏపీ నాయకులు, గవర్నర్లు, పార్టీ ఎంపీలు తదితరులు హాజరయ్యారు… గుడ్, గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇలాంటి తెలుగు ఆతిథ్యాలను ఇచ్చేవాడు… తులసి పూజ చేశాడు మోడీ… గంగిరెద్దుకు ఫుడ్ తినిపించాడు… మంగళదీపం వెలిగించాడు… అక్కడ ఎవరో ఏదో చెబితే అదే తెలంగాణ సాంస్కృతిక […]
ఎవడో కూస్తున్నాడు… కుంభమేళా వద్దట… అంటురోగాలొస్తాయట…
. అయ్యయ్యో… బుద్దిలేని హిందూ వ్యతిరేకతతో మొత్తం సమాజానికి దూరమై చతికిలపడ్డాం… ఇకనైనా అన్ని గుళ్లకూ వెళ్లాలి, మాకూ హిందువులు దూరం కాదు, అన్యమతస్తుల పార్టీ కాదు అని చాటుకోవాలి… బాబ్బాబు, మేమూ మీవాళ్లమే… …. అని సోకాల్డ్ సీపీఎం అనబడే మన శతృదేశం చైనా వాడి కట్టు బానిస పార్టీ ఆమధ్య లెంపలేసుకుంది కదా… ఇకపై హిందూ ఉత్సవాలకు హాజరవుదాం అని తీర్మానం చేసుకుంది కదా… కానీ ఆ తోక ఎప్పుడూ వంకరే… తాజాగా ప్రజాశక్తి […]
అక్షరాగ్ని కణాలు… నిజమే, కానీ ఆ జర్నలిజానికి ఏ పేరుంది..!!
. పింగళి దశరథరామ్.. కత్తి వేటుకు బలైన జర్నలిస్టు “పనికి రాని – పని చేయని చమ్కీకోటు సిద్దాంతాలతో ఎన్కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పని లేదు. ఎన్కౌంటర్ ఏ పార్టీకి సాగిలపడదు. ఎవడికీ బానిస కాదు. ఎవడికీ పెళ్లాంలా వెట్టి చాకిరీ చెయ్యదు. ఠాగూర్ గీతాంజలిలో ఆశించిన వ్యవస్థను నిర్మించటానికి ఎన్కౌంటర్ బలిపీఠం ఎక్కుతుంది. మన రాజకీయ రంగంలో అడ్డు అదుపు లేకుండా స్వైరవిహారం చేస్తున్న హిట్లర్లని, అమీన్లని, నిక్సన్లని, స్టాలిన్లని, మావోలని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి […]
ఈ కేసులు, ఈ అరెస్టులతో రేవంత్ రెడ్డి సాధించే ప్రయోజనం ఏమిటి..?!
. ఒకటి కాదు, రెండు కాదు… చాలా అరెస్టులు… బీఆర్ఎస్ యాక్టివ్ నేతల్ని వెనక్కి నెట్టడానికి, దూకుడుగా ముందుకు రాకుండా ఉండటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అరెస్టులు చేసింది… ఇలా అరెస్టు, అలా బెయిల్… అంటే అంత వీక్ కేసులు… ఏవేవో సెక్షన్లు… పసలేని కేసులు… ఏవో సెక్షన్లు పెట్టేసి కేవలం వేధించడం కోసం పెట్టే కేసులు చివరకు ఏమవుతాయి..? జనంలోకి కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ నెగెటివ్‌గా వెళ్తాయి… వాటితో ఎవరికీ ఏమీ […]
అందరూ కలిస్తే అదే పండుగ… అదే అసలైన మకర సంక్రాంతి…
. Veerendranath Yandamoori …… ఈ రోజు సంక్రాంతి. అప్పటిదాకా రంకెలు వేసిన చలి, తనే మూడంకె వేసి డొంకదారి పట్టే రోజు. భూదేవి కొత్త పెళ్ళికూతురైతే బంతిపూలు పసుపు. మిరపపంట కుంకుమ. సర్వాంగ భూషితయైన కొత్త పెళ్లి కూతురిలా ‘ఆమని’, తోటి పెళ్ళి కూతురు ‘కోయిల’ని తోడు తీసుకుని కుడిపాదం ముందు పెట్టటానికి తయారవుతోంది. తొలి మొగ్గ తొడిగిన మల్లెరెమ్మ గ్రీష్మానికి స్వాగతం పలుకుతోంది. కాలాన్ని కట్టేసి నిదురోయిన సెలయేటిని పల్లె పడుచులు కడవలతో తట్టి లేపుతున్నారు. […]
కష్టేఫలి..! రక్తికట్టని విశ్వనాథ్ కథనం… హిందీవాళ్లకు బాగానే ఎక్కింది..!
. ( Subramanyam Dogiparthi ) ….. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన , మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి . భగవద్గీతలోని ఈ శ్లోకం తెలియని వారు ఉండరు బహుశా . ఈ శ్లోకంతోనే ఈ శుభోదయం సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత ఉషశ్రీ సూక్తి కొనసాగుతుంది . బహుశా ఈ తరానికి ఉషశ్రీ గొంతు తెలియదు . మా తరం వాళ్ళ చెవుల తుప్పును , బుర్రల్లోని తుప్పును వదిలించిన […]
ఈసారి తెల్లకల్లు, మటన్‌తోపాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా..!
. అసలే నెగెటివ్ టాక్‌తో… నెగెటివ్ సోషల్ క్యాంపెయిన్లతో కుంటుతున్న గేమ్ చేంజర్ సినిమాపై మరో పిడుగు పడినట్టే… ఎలాగంటే..? 1) డాకూ మహారాజ్… బాలయ్య మార్క్ ‘అతి’ని ప్రేమించే ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు… గేమ్ చేంజర్‌కు ఇది మొదటి దెబ్బ… 2) సంక్రాంతికి వస్తున్నాం… ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులను, పండుగవేళ గిరాకీని సొమ్ము చేసుకోబోతోంది… ఇది రెండో దెబ్బ… అక్కడక్కడా కొన్ని లోపాలు పంటి కింద రాళ్లుగా ఉన్నా సరే, స్థూలంగా […]
తీరు మారని జబర్దస్త్… మళ్లీ ఆ పాత వెగటు వాసనల్లోకి ప్రయాణం…
. ఈటీవీ జబర్దస్త్ టేస్ట్ మొదటి నుంచీ తెలిసిందే కదా… ద్వంద్వార్థాలు, బూతులు, అక్రమ సంబంధాలే దాని అభిరుచి… ఓహో కామెడీ అంటే మరీ ఈ బజారు స్థాయిలో ఉండాలా అంటూ బోలెడు విమర్శలు… ఐతేనేం, జనం చూశారు… క్రమేపీ జనానికే వెగటు పుట్టింది… ఎహె పోరా, అని చూడటం మానేశారు… పేరున్న కమెడియన్లు వదిలేసి వెళ్లిపోయారు… దాంతో కాస్త ఆమధ్య ఆరోగ్యకరమైన కామెడీ వైపు మళ్లినట్టు అనిపించింబది… కానీ మన భ్రమ… పాత బాటలోకి వచ్చేసింది… […]