Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హత్రాస్ మీద గాయిగత్తర ప్రతిపక్షాలు… జూనియర్ డాక్టర్ మీద ఏదీ ఒక్క గొంతు..!!

August 21, 2024 by M S R

bengal

కొన్ని చెప్పుకోవాలి… తప్పదు… నాడు హత్రాస్ అత్యాచారం మీద ప్రతిపక్షాలు గాయిగత్తర చేశాయి… మూక పర్యటనలతో ఇష్యూను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసి రచ్చ రచ్చ చేశాయి… ఓ పీఎఫ్ఐ కార్యకర్త తన అనుచరులతో వెళ్లి గొడవ చేయబోతే పోలీసులు అరెస్టు చేశారు, దాని మీద ఎడిటర్స్ గిల్డ్ మూర్ఖంగా స్పందించి తన పరువు కోల్పోయింది.., దాదాపు ప్రతీ ప్రతిపక్షం అక్కడకు వెళ్లి గొడవలు చేసింది… సీన్ కట్ చేస్తే,.. పశ్చిమ బెంగాల్‌లో ఓ జూనియర్ డాక్టర్ దారుణ […]

వేణుస్వామికి వుమెన్ కమిషన్ సమన్లపై హైకోర్టు స్టే… వాట్ నెక్స్ట్ జర్నోస్..?

August 21, 2024 by M S R

venuswamy

వేణుస్వామి కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్టు ఏమిటంటే..? వుమెన్ కమిషన్ వేణుస్వామికి జారీ చేసిన సమన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం కాదు… అదెలాగూ ఊహిస్తున్నదే… ఎందుకంటే..? వుమెన్ కమిషన్ ఎదుట సోకాల్డ్ ఫిలిమ్ జర్నలిస్టుల సంఘం, డిజిటల్ జర్నలిస్టుల సంఘం ఫిర్యాదు చేశాయి కదా… అసలు వాళ్లకు వేణుస్వామి చెప్పిన జ్యోస్యానికి అసలు లింక్ లేదు… వాళ్లకు లోకస్ స్టాండి లేదు… అనుకున్నట్టుగానే హైకోర్టు స్టే ఇచ్చింది… తన తీర్పు కాపీలో ఏం చెప్పిందో అది చదివితే గానీ […]

ఏ గంధర్వలోకం నుంచి ఆవిర్భవించాడో… నారదుడో, తుంబురుడో… ఏ అవతారమో..?!

August 21, 2024 by M S R

avirbhav

పసివాడు కాదు పాదుషా! బాలగంధర్వుడు … ఎస్, చూడగానే, ఎవరైనా వాడిని పాలబుగ్గల పసిమొగ్గే అనుకుంటారు! కానీ, రిథమిగ్గా రాగం అందుకుంటే., వాడు గండరగండడే, స్వచ్ఛమైన గానగంధర్వుడే! సకల విద్యాప్రదాయిని సరస్వతీ కటాక్షంతో కళకళలాడుతోన్న ఈ బంగారుకొండ, పాటలఖనికి ఏడేళ్లు! పేరు ఆవిర్భావ్, సన్ ఆఫ్ సజైమన్, సంధ్య! స్వస్థలం కేరళ రాష్ట్రం ఇడుక్కీ! అక్క అనిర్విణ్యనే ఈ యంగ్ సింగర్ కు ఓనమాలు నేర్పిన ఆదిగురువు! ఈ చిచ్చరపిడుగు సంగీతంలో వేసే ప్రతి అడుగూ అక్క […]

పక్కలోకొచ్చి పడుకుంటేనే పని, పైసలు… ఒక్క మాలీవుడ్‌కే పరిమితమా..?!

August 21, 2024 by M S R

movie

అయ్యో, కేరళ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఘోరంగా మహిళల లైంగిక దోపిడీ జరుగుతోందట, జస్టిస్ హేమ కమిషన్ మొత్తం బట్టబయలు చేసిందట, ఇంత ఘోరమా… అనే వార్తలు, విశ్లేషణలు, వివరణలూ, ఆ కమిటీ ముఖ్యాంశాలను నిన్నటి నుంచే ప్రచురిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు… ఒక్కమాట..? ఏ భాష సినిమా ఇండస్ట్రీ దీనికి భిన్నంగా ఉంది..? హీరోయిన్ భావన‌పై ఓ హీరో గ్యాంగ్ చేసిన లైంగిక దాడి సంఘటన తరువాత ప్రభుత్వం ఈ కమిటీని వేసింది… ఇందులో సీనియర్ నటి […]

బంట్రోతు కొడుకు కలెక్టర్… ఒకే ఆఫీసులో ఇద్దరికీ కొలువు… అదీ కథ…

August 21, 2024 by M S R

ntr

బంట్రోతు కొడుకు కలెక్టర్ అవుతాడు.., తండ్రి పనిచేసే కలెక్టరాఫీసుకే కలెక్టరుగా వస్తాడు.., నగరంలోని దేశద్రోహులను చట్టానికి పట్టిస్తాడు… ఈ సినిమా 1976 లో వచ్చిన ఈ బంగారు మనిషి సినిమా … రాజయినా , పోలీసు ఆఫీసరయినా , సాహసం చేసే డింభకుడు అయినా , కలెక్టర్ అయినా NTR కు మారు వేషాలు ఉండాల్సిందే . ఈ సినిమాలో కూడా ఉంది . ఈ సినిమాలో ముఖ్యంగా మెచ్చుకోవలసింది గుమ్మడి నటన . తాను పనిచేసే […]

స్పోర్ట్స్ యాప్స్ విజృంభణ… టీవీ స్పోర్ట్స్ ఛానల్స్‌కు మరింత గడ్డు కాలం..!

August 20, 2024 by M S R

sports

  చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. ఇల్లెందులో ఉన్నప్పుడు ప్రతీ ఆదివారం చర్చి కంటే ముందు ఒక ఆంటి వాళ్ల ఇంటికి వెళ్లి టామ్ అండ్ జెర్రీ చూసేవాడిని. ఇక రామవరంలో చర్చి కాంపౌండ్‌లోనే ఒక తాతయ్య ఉండేవారు. పేరు గుర్తుకు రావడం లేదు కానీ.. ఆయన్ని మేము టీవీ తాతయ్య అని పిలిచేవాళ్లం. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే వచ్చేది. తాతయ్య వార్తల చూసేవారు. ఇక క్రికెట్ వస్తే రోజంతా టీవీ ఆన్‌లో ఉండేది. నేను […]

నటి హేమ తాజా వీడియోలోనూ అదే ప్రస్తావన… మీడియా సెటిల్మెంట్లు..!!

August 20, 2024 by M S R

ఇప్పుడు డిస్కషన్ అంతా మీడియా మాఫియా గురించే కదా… ప్రముఖుల్ని టార్గెట్ చేసి వేధించడం, తరువాత సెటిల్మెంట్లు చేసుకోవాలని చెప్పడం… వేణుస్వామి పేల్చిన బాంబు కూడా అదే కదా… నిజానికి తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో హైదరాబాద్ ఫిలిమ్ జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులు ఏకంగా సంఘాల పేర్లతో వుమెన్ కమిషన్‌ను అప్రోచ్ అయ్యారంటే ఏదో భారీ తేడా కొడుతున్నట్టు లెక్క… సరే, మళ్లీ పోలీసులకు వద్దకు వెళ్లారు, కంప్లయింట్లు ఇచ్చారు… ఇదిలా కొన్నాళ్లు సాగుతుంది… తాజాగా […]

ఒక టైమ్ వస్తుంది… ఆ టైమే కాటేస్తుంది… ప్రసిద్ధ ఆర్థిక సంస్థ ఓనర్ చావూ అదే…

August 20, 2024 by M S R

morgan stanley

ఎంత పెద్ద సక్సెస్ స్టోరీ అయితేనేం…? ఎంత సాధనసంపత్తి ఉంటేనేం..? ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు ఉంటేనేం..? ఓ టైమ్ వస్తుంది… ఆ టైమ్ తనది కానప్పుడు… అన్ని తెలివితేటలు, చాణక్యుడి వంటి బుర్ర, అపారమైన సంపద అన్నీ అలా క్షణాల్లో కొట్టుకుపోతాయి… చివరకు ఓ భౌతిక దేహం ఒడ్డుకు కొట్టుకొస్తుంది… అంగీకరిస్తారా..? డెస్టినీ అనేదే అల్టిమేట్… నా చేతుల్లోనే నా జీవితం, నా సంపద, నా వైభోగం అనుకున్న చాలామంది కొట్టుకుపోయారు… ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక […]

జగన్‌ను బీజేపీలోకి మోడీ రానిస్తాడా..? ఐనా చంద్రబాబు అంగీకరిస్తాడా అసలు..?!

August 20, 2024 by M S R

modi

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కొన్నాళ్లుగా నలుగుతున్న చర్చ… కలవడం గ్యారంటీ అంటాడు రేవంతుడు… ఠాట్, మాకేం ఖర్మ, నువ్వే బీజేపీలో కలుస్తావు, మేం చూడకపోం అంటాడు కేటీయార్… బీఆర్ఎస్‌ను మేమెందుకు రానిస్తాం అంటాడు బండి సంజయుడు… అవునవును, చర్చలైతే నిజమే సుమీ అంటాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు… అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో… బీజేపీ ఏం అడిగిందో, బీఆర్ఎస్ ఎంతకు సిద్ధపడిందో… నాకు తెలిసి తెలంగాణ బీజేపీ ముఖ్యనాయకులకు కూడా సమాచారం ఉండి ఉండదు… రాష్ట్ర నాయకుల […]

ఆకాశంలో నివాసం అంటుంటే… అనారోగ్యమని బెదిరిస్తారా..? హమ్మా..!!

August 20, 2024 by M S R

high rise

  రెండేళ్ల క్రితం ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వంద కోట్ల రూపాయల పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని…మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు స్వరాలు కట్టుకోలేదు. ఆస్థాన రియలెస్టేట్ రారాజ నిలయ సంగీత విద్వాంసులు కృత్రిమంగా అలాంటి వేలం వెర్రి స్వరాలు కట్టి వేలం పాటలు పాడుకున్నారని…తరువాత శంకరపల్లి వేలం పాటల్లో పాడిన వంకరాభరణ తిరోగమన అవరోహణ రాగాల వల్ల తేలిపోయింది. మహా భారతంలో చెప్పిన […]

డౌట్ లేదు… రాజీవ్ విగ్రహం బదులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కరెక్టు..!

August 20, 2024 by M S R

Telangana talli

మొన్న ఎక్కడో మాట్లాడుతూ కేటీయార్ ‘బస్సుల్లో రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకొమ్మనండి, మాకేం అభ్యంతరాల్లేవు’ అని ఏదో అన్నాడు… అంతకుముందు అక్కలు అని రేవంత్ సంబోధించినా సరే, అదేదో మొత్తం తెలంగాణ ఆడపడుచులందరినీ అవమానించారు అంటూ ట్విస్ట్ చేసి, ఏదో గాయిగత్తర లేపాలని చూశారు… కానీ తను చేసిన సంస్కారరహితమైన డాన్సుల  మాటేమిటి..? అదేమంటే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రచ్చ… దానికీ కేసీయార్ కాలంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్క చెప్పి సీతక్క కౌంటర్ […]

ఈ పాత సినిమా విశేషాలు రాస్తూ పోతే… అదీ ఓ ‘అంతులేని కథ’…

August 20, 2024 by M S R

jayaprada

అంతులేని కథ… నిజానికి ఈ సినిమా మీద విశేషాలెన్ని చెప్పుకున్నా, అది అంతులేని కథే… ఒడవదు, తెగదు… బాలచందర్ మార్క్ & మేజిక్ సినిమా . జయప్రద సినిమా . 1975 లో అరంగేట్రం చేసి భూమి కోసం , నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాల్లో తళుక్కుమన్నా , హీరోయిన్ లెవెలుకు తీసుకుని వెళ్లిన సినిమా 1976 లో వచ్చిన ఈ అంతులేని కధ సినిమా . ఇంట్లో బయటా అందరికీ రాక్షసి లాగా కనిపిస్తూ , పనికిమాలిన […]

కరిగిపోయాను కర్పూర వీణలా..! ఓ పాత ప్రేమకథకు కొత్త రూపు ఇలా…!!

August 20, 2024 by M S R

life long wait

ఓ ప్రేమ జంటకు కొత్తగా పెళ్ళైంది… ఆ జంట తమ హానీమూన్‌కు ప్లాన్ చేసుకుంది… కాస్త భిన్నంగా, ఎప్పుడూ గుర్తుండేలా… అది మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం… థ్రిల్లింగ్ కమ్ రొమాంటిక్… అనుకున్నట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ట్రెక్కింగుకు వెళ్తుంది ఆ జంట… పూర్తిగా పైకి వెళ్ళాక అనుకోని ప్రమాదం… హఠాత్తుగా ఓ మంచు లోయలో పడిపోతాడు ఆ భర్త… షాక్ తింటుంది భార్య… కన్నీరుమున్నీరు అవుతుంది… హానీమూన్ కాస్తా తనకు అంతిమ యాత్రగా […]

ఆలీని నమ్మితే మొత్తం సినిమాకే ‘బొక’పడింది… దర్శకుడు పూరీయే బాధ్యుడు…

August 20, 2024 by M S R

ali

డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఆలీ చేసిన అత్యంత వెగటు ‘బొక’ ఎపిసోడ్ పీకేశారు అని ఒక వార్త… పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… మిస్టర్ బచ్చన్‌లో తెలుగువాడికి ఎక్కని హిందీ పాటలకు కూడా కత్తెర పెట్టారని మరో వార్త… ఇదీ ఊహించిందే… ప్రేక్షకుడి ఫీడ్ బ్యాక్, స్పందనలను బట్టి నిడివి కత్తిరింపులు, సీన్ల తొలగింపులు, జోడింపులు అసాధారణమేమీ కాదు… కానీ… దర్శకుడు పూరి తప్పేమీ లేదు, అంతా ఆలీదే తప్పు… ఆ ఎపిసోడ్ రచన, దర్శకత్వం, నటన […]

మీడియాపై వేణుస్వామి దంపతులు పేల్చిన RDX బాంబ్… ఇక తన్నుకొండి..!

August 19, 2024 by M S R

venuswamy

వేణుస్వామి కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తి… అలా చేసింది సోకాల్డ్ యెల్లో మీడియా… బహుశా లోకేష్ రెడ్‌బుక్‌లో ఉందేమో పేరు… అందుకేనేమో టీవీ5 టార్గెట్ చేసి డిబేట్ల మీద డిబేట్లు చేస్తూ టార్గెట్ చేస్తూ వెంటాడుతోంది అనుకున్నాను… జగన్ గెలుస్తాడనే వేణుస్వామి జోస్యాల వెనుక కూడా ఏదో కుట్ర ఉందనీ… ఐప్యాక్ దగ్గర నుంచి జగన్ చానెళ్లు, వేణుస్వామి వంటి జ్యోతిష్కులు ఓ కూటమిగా పనిచేశారని యెల్లో సిండికేట్ ప్రచారం చేసింది… వోెకే, ఆ కసి ఉందనుకుందాం… ఇదోరకం […]

ఆదివారాలు కూడా వదలరట… ఆ సీరియల్స్ ఆరోజూ వెంటాడుతాయట…

August 19, 2024 by M S R

zee telugu

సాధారణంగా టీవీ సీరియల్స్ మీద ఉన్న అభిప్రాయం ఏమిటి..? చెత్త..! ఇదే కదా… కాకపోతే ఇళ్లల్లో ఉండే మహిళా ప్రేక్షకులకు వేరే వినోదం లేదు… థియేటర్ సిండికేట్ల దోపిడీ కారణంగా థియేటర్లకూ పోయే పరిస్థితి లేదు… అదొక నిలువు దోపిడీ… అందరికీ తెలిసిందే… పైగా థియేటర్ వెళ్లాలంటే డబ్బు మాత్రమే కాదు, చాలా అంశాలు అనుకూలించాలి, ఆ చర్చలోకి వెళ్లడం లేదు… ఆ థియేటర్ దుర్మార్గుల అరాచకాలు చివరకు వాళ్లనే ముంచేస్తాయి, అది వదిలేద్దాం… కూర్చున్న కొమ్మను […]

మళ్లీ ఆహా అన్‌స్టాపబుల్… ఈసారి నాగార్జునతో స్టార్ట్… 23 నుంచి షూటింగ్…

August 19, 2024 by M S R

nag

తెలుగు టీవీ, ఓటీటీలకు సంబంధించి టాక్ షోలలో సూపర్ హిట్ బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో… అప్పుడెప్పుడో ఆహా ఓటీటీలో 2021 నవంబరులో స్టార్టయింది కదా… పెద్దగా టీవీ ఇంటర్వ్యూలకు, టాక్ షోలకు రాని పెద్ద పెద్ద స్టార్లను కూడా తన పరిచయాలతో తీసుకొచ్చి, కూర్చుండబెట్టి, తనదైన స్టయిల్ ప్రశ్నలతో, సరదా సంభాషణలతో, ఆటలతో షోను రక్తికట్టించాడు బాలయ్య… అసలు బాలయ్య ఆ షోను హోస్ట్ చేయడమే విశేషం… టీవీ, ఓటీటీ షోలను చిరంజీవి, నాని, […]

నమ్మలేనంత ప్రేమ… భార్య కోసం సముద్రగర్భంలో 13 ఏళ్లుగా అన్వేషణ …

August 19, 2024 by M S R

wife

2004లో సునామీ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తే, 2011లో ఆ ప్రతాపం జపాన్ మీద పడింది. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిశాయి. భారీ అలలు తీరాన్ని తాకి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జపాన్‌లో నమోదైన ప్రకృతి విపత్తుల్లో ఇది అత్యంత పెద్దది. ప్రపంచంలోని భయంకరమైన భూకంపాల్లో ఇది నాలుగోది. అలలు 133 అడుగుల ఎత్తున ఎగిసిపడి జనాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ కారణంగా సుమారు 20 వేల మంది మరణించగా, 6,242 మంది […]

రేవంత్‌రెడ్డి ఈ పనే చేస్తే… బడుగు రైతు బతుకులు మరింత సంక్షోభంలోకి…

August 19, 2024 by M S R

రైతులు

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే… ప్రత్యేకించి రైతులకు సంబంధించి… జాగ్రత్తగా, ఆచితూచి, దీర్ఘకాలిక ప్రభావాలను కూడా ఆలోచించి, వర్తమాన స్థితిగతులను మదింపు వేసి ఆ తరవాతే అడుగులు వేయాలి… ప్రత్యేకించి బ్యూరోక్రాట్ల సంకుచిత, అపరిపక్వ ఆలోచనల పరిధిలోకి రాజకీయ నిర్ణయాలు లాగబడకూడదు… ఉదయమే ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు తీసుకునే ప్రైవేటు రుణాలకు తనే వడ్డీ ఫిక్స్ చేయబోతోందని… బ్యాంకులిచ్చే వడ్డీని మించి రెండు శాతం దాటకూడకుండా చూడనుందని… మనీ లెండర్స్ […]

అన్నే షిమోటీ..! నిఖార్సు ఇండియన్ ఆర్ట్… 1976 లోనే ఓ ‘పడమటి సంధ్యారాగం’…

August 19, 2024 by M S R

america

‘పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెనుగు పాట’ … అమెరికా అమ్మాయి సినిమా అంటే ఎవరికయినా మొదట గుర్తుకొచ్చేది ఈ పాటే … ఈ పాట వింటే గుర్తుకొచ్చేది అమెరికా అమ్మాయి సినిమాయే … ఇంత చక్కటి , గొప్ప పాటను వ్రాసిన భావ కవి , ఆంధ్రా షెల్లీ , రవీంద్రనాథ్ టాగోర్ మిత్రుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి హేట్సాఫ్ . ఈ పాట విన్నప్పుడు నాకు మరో […]

  • « Previous Page
  • 1
  • …
  • 199
  • 200
  • 201
  • 202
  • 203
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఇదేమీ పాత్రికేయ ఘన పురస్కారం కాదు… జస్ట్, డబ్బు కక్కుర్తి యాడ్..!!
  • పరువు, పగ వికృతకోణం… కలుక్కుమనిపించే క్లైమాక్స్… ప్రేమ గెలవలేదు…
  • పవన్ కల్యాణ్, ఇదుగో ఓ సరికొత్త సనాతన ధర్మసారథి వస్తున్నాడు..!
  • బీఆర్ నాయుడు… కనీసం ఈ అపహాస్యపు శివజ్యోతినైనా శిక్షించగలడా..?
  • ఏమయ్యా నరేషూ… మరీ తెలంగాణ యాసను అంత ఖూనీ చేయాలా..?!
  • జాడా పత్తా లేని లక్ష మంది ఉద్యోగులు…! KCR అరాచక పాలన…!!
  • రాంగ్ కేస్టింగ్..! హీరోహీరోయిన్ల ఇమేజ్ వేరు, పాత్రలు వేరు… షో ఢమాల్..!!
  • దుశ్శల..! మహాభారతంలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన ఓ కీలకపాత్ర..!!
  • రష్యా- ఉక్రెయిన్ యుద్ధ విరమణ త్వరలో..! ఏం జరుగుతున్నదంటే..?!
  • మానసవీణా మధుగీతం… నిజంగా ఆపాత మధురం… ఈ స్వర మాధుర్యం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions