ఇదే వందే భారత్ రైలు… ఒకవేళ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే… అది కేంద్రంతో సఖ్యంగా ఉండి ఉంటే… ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతిల్లో పాజిటివ్ వార్తలు మోతమోగిపోయేవి… ప్చ్, ఆ సీన్ లేదు కదా… వందే భారత్ రేట్లు ఆకాశంలో ఉంటాయి… విమానం రేట్లతో సమానంగా ఉంటాయి… అదీ ఒక్కరోజు ముచ్చటే అయిపోతుంది… ఈ వార్తలాగే… దరిద్రంగా… ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించవచ్చుగాక… కానీ నిజమే కదా… వందే భారత్ ఇక నడవదా..? ఒకేరోజు […]
ఆరాధించిన తమిళ ఇండస్ట్రీలోనే ఖుష్బూకు అవమానం..! కారణం ఓ మిస్టరీ..!!
ఒకప్పుడు ఖుష్బూకు గుడి కట్టి ఆరాధించారు తమిళజనం… అలాంటి ఖుష్బూను పులుసులో ఈగలా తీసిపారేశాడు దిల్ రాజు… ఇందులో ఆమె పాత్ర ఎంతో గానీ, ఖచ్చితంగా ఇది ఖుష్బూకు అవమానమే… కారణం ఏమిటి..? దీనిపై తెలుగులో ఎవరూ ఏమీ రాయడం లేదు గానీ, తమిళంలో మీడియా భలే చర్చలు సాగిస్తోంది… ఊహాగానాలు చేస్తోంది… నిజానికి ఖుష్బూ వంటి సీనియర్ నటికి జరగకూడని అవమానమే ఇది… సినిమా తెలుగులో, కన్నడంలో వీర ఫ్లాప్… రకరకాల పాత సినిమాలన్నీ మిక్సీలో […]
అప్పటి నీ విజేత సినిమాను ఓసారి మళ్లీ చూడు డియర్ గాడ్ ఫాదర్..!
చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చూడబడ్డాను… పాజిటివ్ హీరోయిజం ఎలివేట్ కావాలంటే స్టెప్పులు, తుపాకుల మోతలు, ఐటమ్ సాంగ్స్ అవసరం లేదనే నిజాన్ని ఇన్నేళ్ల టాలీవుడ్ గాడ్‌ఫాదర్ చిరంజీవి విస్మరించిన తీరు విస్మయపరిచింది… మితిమీరిన హీరోయిజం ఒక సెక్షన్‌కు మాత్రమే ఆకర్షణ… అదీ వయస్సు మళ్లుతున్న చిరంజీవికి ఇప్పుడు అవి అస్సలు నప్పవు… పైగా సల్మాన్ ఖాన్ పాత్ర, ఓవరాక్షన్ చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు అవసరమా..? ప్లెయిన్‌గా, స్ట్రెయిట్‌గా… ఏ ఇమేజీ బిల్డప్పులు లేకుండా మలయాళీ ఒరిజినల్ […]
అనితరసాధ్యుడే… అనామకంగా మిగిలిపోయిన మహాభారత పాత్ర ఇది…!!
ఓ మిత్రుడు హఠాత్తుగా ఓ ప్రశ్న వేశాడు… మహాభారతంలో పాత్రలన్నీ తెలుసా అని…! పెద్ద పెద్ద ప్రవచనకారులు, పురాణాలకు బాష్యాలు చెప్పే భాగవతులకు కూడా మొత్తం పాత్రలు తెలుసో లేదో సందేహమే అని జవాబిచ్చాను… నిజంగానే అదొక సముద్రం… మనకు తెలిసింది ఓ దోసిలంత…! పైగా ఒరిజినల్ కావ్యం ఇన్ని వేల ఏళ్లలో, అనేక కళారూపాల్లోకి ఒదిగి, వ్యాప్తి చెంది, పలు దేశాలకు పయనించి, రకరకాల ప్రక్షిప్తాలు, క్రియేటివ్ యాడిషన్స్తో రకరకాలుగా మారిపోయింది… ప్రత్యేకించి తూర్పుదేశాల్లో మన […]
హా-రుద్ర..! సొంత భార్య రామలక్ష్మికే సమజ్ కాని ‘‘త్వమేవాహమ్’’…!!
పాఠకులకు ‘కవిత్వం’ అర్థంకాకుంటే….. ఆ తప్పు కవిదా ? పాఠకులదా ? *ఆరుద్ర గారూ.! అర్థం కాకపోతే …….. “అన్ ఎడ్యుకేటెడ్ ఆంధ్రా” నా ? హవ్వ.! ఆరుద్రగారు సాంప్రదాయరీతులకు భిన్నంగా టెక్నిక్ తో ” త్వమేవాహమ్ ” కావ్యాన్ని రాశారు. తన కళాకేళీ ప్రచురణల తరపున. ‘ ఆవంత్స… సోమసుందర్’ (పిఠాపురం) గారు అచ్చేయించారు. అది పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడలేదు. బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా కూడా…. కవి హృదయం అర్ధం కాలేదు.!! అప్పుడు పాఠకులేం […]
ఆ భీమశిల ఓ అద్భుతం..! కేదారనాథ్‌లో ఆ విలయం వేళ ఏం జరిగిందంటే..?!
కొన్ని యాదృచ్ఛికాలు అని తేలికగా కొట్టిపారేయలేం… అవి అద్భుతాలు… అంతే… చూడాలి, వినాలి, చదవాలి… అబ్బురపడాలి… అంతకుమించి వివరణలు, విశ్లేషణలు, కారణాలు దండుగ… ఏదీ, ఎవరూ తేల్చలేరు… ఇదీ అంతే… కేదారనాథ్… సగటు హిందువు ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే చార్ ధామ్ యాత్రలో ఈ ఆలయం కూడా ఒకటి… పాండవులు కట్టారా..? ఆదిశంకరాచార్యుడు కట్టించాడా..? అంత పాతదా..? జియాలజిస్టులు చెప్పినట్టు ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం మందిరమా..? 400 ఏళ్లు మంచులోనే కప్పబడి ఉందా..? ఆ చర్చలోకి […]
10 లక్షల మిర్చి బజ్జీలు… ఆరేడు లక్షల బొబ్బట్లు… లక్షల యాత్రికులు…
కొప్పల్… కర్నాటక నడిబొడ్డున ఉంటుంది… అక్కడ సంక్రాంతి వచ్చిందంటే చాలు… ఓ జాతర కోలాహలం మిన్నంటుతుంది… పదిహేను రోజులపాటు జరిగే ఈ జాతర యూనిక్… గవి సిద్ధేశ్వర మఠ్ జాతర అంటారు దీన్ని… ఈ జాతర పుట్టుక, స్థలపురాణం జోలికి పోవడం లేదు ఇక్కడ… అక్కడి స్థానికుల ఆనందంగా దీన్ని మరో పూరి ఉత్సవంగా చెప్పుకుంటారు… దాన్ని మించిన రథోత్సవం అనీ చెబుతారు… కానీ దేని విశిష్టత దానిదే… 3 రోజుల్లో కోటి మంది భక్తులు ఒక్కచోట […]
బ్రహ్మముడి తెలుగు టీవీ సీరియల్‌కు షారూక్ ఖాన్ ప్రమోషన్… ఇంట్రస్టింగు…
ఒక తెలుగు టీవీ సీరియల్‌కు బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడైన షారూక్ ఖాన్‌తో ప్రమోషన్..! మీరు చదివింది నిజమే… ఈ శనివారంతో ఎట్టకేలకు కార్తీకదీపం సీరియల్‌కు పూర్తిగా తెరపడబోతోంది… ఆ దర్శకుడెవరో గానీ తెలుగు ప్రేక్షకులను ఎట్టకేలకు కరుణించి విముక్తిని ప్రసాదించాడు… ఏ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు రానట్టుగా రేటింగ్స్ రాబట్టి, స్టార్ మాటీవీ ఓవరాల్ రేటింగ్‌ను దాదాపు డిసైడ్ చేసిన ఆ సీరియల్ ఏదో ఒక క్లైమాక్స్‌తో ముగిసిపోతోంది కదా… సరే, వాట్ నెక్స్ట్..? అదే […]
ఫేస్బుక్ రచయితలు… సినిమా సమీక్షకకులు పలురకములు ఇలలో సుమతీ…
Sai Vamshi ……….. Facebookలో సినిమా రివ్యూలు – రకరకాల మనుషులు (Disclaimer: (ఇది నా అబ్జర్వేషన్‌తో సరదాగా రాసింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు. కాబట్టి ఏకీభవించినా, విభేదించినా చివరిదాకా హాయిగా చదవొచ్చు). 1) రాయని భాస్కరులు: వీళ్లు సినిమాలు చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తమ పనుల్లో బిజీ అయిపోతారు. సినిమా చూశాక రివ్యూ రాయాలన్న ఆశ, ఆలోచన లేని సగటు జీవులు. 2) నా ఇష్టం: వీళ్లు ఎవరికీ లొంగరు. ఏ భావజాలానికీ […]
అప్పట్లో తెలుగు సినిమాలకు గొప్ప డైలాగ్ రైటర్లు కూడా ఉండేవాళ్లు..!
Sankar G ………. తెలుగుసినిమా ఇండస్ట్రీలో రచయిత అనేవాడు అంతరించినట్టేనా… సీనియర్ సముద్రాల, గోపీచంద్, తాపీ ధర్మారావు, పింగళి నాగేంద్ర, డీవీ నరసరాజు, మల్లాది రామకృష్ణ, అనిశెట్టి, ఆరుద్ర, ఆత్రేయ, ముళ్ళపూడి రమణ, శ్రీశ్రీ, దాశరధి, సినారె, సత్యానంద్, జంధ్యాల, పరుచూరి బ్రదర్స్, ఎంవీస్ హరినాధ్ రావు, గణేష్ పాత్రో, ఆదివిష్ణు… చెప్పాలంటే ఇంకా చాలామంది రచయితలు వీరి మాటల కోసం, పాటల కోసం వేచివుండే రోజులవి. దానవీర శూర, కర్ణ, ముత్యాలముగ్గు, ప్రతిఘటన లాంటి చిత్రాల […]
ప్రకృతి మాత్రం ఎంతని భరించగలదు… కుంగదీయదా..? కూలదోయదా..?
Nature gets Anger: ఉత్తరాఖండ్ జోషీ మఠ్ కుంగుబాటు మీద హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమాయకత్వం నటిస్తోంది. భూ భౌతిక శాస్త్రవేత్తలు, భూ కంపాలను అధ్యయనం చేసే నిపుణులు, నీటిపారుదల నిపుణులు, అటవీ పర్యావరణ శాస్త్రవేత్తలు మూడు, నాలుగు దశాబ్దాలుగా చేసిన హెచ్చరికలన్నీ ఇప్పుడు జోషీ మఠ్ ఇళ్ల పగుళ్లలో, నెర్రెలు […]
ధనవంతరి వారసులం… కాసుపత్రుల కాంతులం… ఆ బిల్లుల్లోనే అసలు యముడు…
((Sivaram Prasad Bikkina….)) మేము ఎదుర్కొన్నామండీ ఈ సమస్య. మీరు కావాలంటే ఈ సమాచారం షేర్ చేయొచ్చు కూడా.! మా సమీప బంధువుల అమ్మాయికి డెలివరీ ముందు రెగ్యులర్ గా చూసే గైనకాలజిస్ట్ కాజువల్ గా చేయించిన రాపిడ్ టెస్ట్ తో కొవిడ్ పాజిటివ్. డెలివరీ చేయను పొమ్మంది. జిల్లా అంతా ఎంక్వయిరీ చేస్తే… ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి తప్ప ఎక్కడా కొవిడ్ పాజిటివ్ లేడీకి డెలివరీ చేయొద్దని ప్రభుత్వం నిబంధనలు పెట్టినట్టు తేల్చారు. ప్రభుత్వాసుపత్రి ప్రసవం […]
రష్మిక నోటి తీట… వారసుడికి దెబ్బ… కర్నాటకలో వందల షోలు ఎత్తేశారు…
రష్మిక మంథన తన నోటిదురుసు, అహం వల్ల కన్నడ ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి దూరం అయిపోతోంది… ప్రత్యేకించి కాంతార దర్శకుడు రిషబ్ శెట్లితో ఆమె పిచ్చి గొడవ, ఇద్దరూ గోక్కోవడం అల్టిమేట్‌గా ఆమెకే నష్టదాయం అవుతోంది గానీ రిషబ్శెట్టికి కాదు… ఆ సోయి కూడా ఏమీ లేదు రష్మికలో… ఒక దశలో కన్నడ ఎగ్జిబిటర్లు కూడా ఆమె మీద కోపంతో ఆమె తాజా సినిమా వారసుడిని ప్రదర్శించకూడదని అనుకున్నారు… కానీ కిరాక్ పార్టీ సమయం నుంచీ ఆమెకు పలు […]
కాంపిటీషన్ ఏమీ లేదు… పరస్పరం కాంప్లిమెంట్స్… డీఎస్పీ అండ్ థమన్…
వాళ్ల నడుమ పోటీ… వీళ్ల నడుమ పోటీ అని మనకు మనమే అనుకుని, రాసుకుని ఆవేశపడిపోతుంటాం గానీ… సినిమాల్లో భిన్నరంగాల్లో పనిచేసే ప్రొఫెషనల్స్ కూల్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతారు… వాళ్ల నడుమ బంధాలు బాగానే ఉంటాయి… అఫ్కోర్స్, లోలోపల ప్రొఫెషనల్ పోటీ ఉంటుంది… అది ఉంటేనే పరుగుకు ఉత్ప్రేరకం… కానీ ఓ లక్ష్మణరేఖ దాటరు… ఉదాహరణకు… శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తదితరులు… వాళ్ల వ్యక్తిగత సంబంధాలు ఫ్రెండ్లీగా ఉంటాయి… వాటిని అలాగే ప్రదర్శించగలరు […]
ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
Bharadwaja Rangavajhala………. ఎస్వీఆర్ మంచి నటుడే కాదు టెక్నీషియన్ కూడా. ఆయన నిర్మాణంలో, దర్శకత్వంలో వచ్చిన చిత్రాలే అందుకు ఉదాహరణ. ఎవిఎమ్ చెట్టియార్ తో ఎస్వీఆర్ కు మంచి రిలేషన్స్ ఉండేవి. ఎవిఎమ్ వారి తమిళ చిత్రాల్లోనూ ఎస్వీఆర్ విస్తృతంగా నటించేవారు. అలాగే విజయా వాహినీ సంస్ధలో కూడా ఎస్వీఆర్ కు స్పెషల్ ఛెయిర్ ఉండేది. విచిత్రంగా ఎస్వీఆర్ నిర్మాతగా మారడానికి చెట్టియార్ ప్రేరణ అయితే… దర్శకుడుగా మారడానికి బి.ఎన్.రెడ్డి కారణం… ఎవిఎమ్ బ్యానర్ లోనే తమిళ్ […]
ఆ కౌరవ యువరాణి..! అందరికీ గారాలపట్టి..! ఐతేనేం… ఓ విధివంచిత..!!
మహాభారతంలోనే చాలామందికి తెలియని కథ… చదవాల్సిన కథ… చెబితే భారతమంత… అందుకే సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఆమె పేరు లక్ష్మణ… కురు సార్వభౌముడు దుర్యోధునుడి భార్య భానుమతి… వారణాసి రాజు బిడ్డ… ప్రతి రాజుకూ బోలెడుమంది భార్యలు… కానీ దుర్యోధనుడికి కేవలం భానుమతి ఒక్కతే… ఏకసతీవ్రతుడు… వాళ్లకు ఇద్దరు కవల పిల్లలు… మగ, ఆడ… లక్ష్మణకుమారుడు, లక్ష్మణ… లక్ష్మణకుమారుడి కథను మనం మాయాబజార్ సినిమాలో చూస్తాం… బలరాముడి కూతురు శశిరేఖతో లక్ష్మణకుమారుడికి పెళ్లి చేయాలని అనుకోవడం, కృష్ణుడు దాన్ని […]
‘‘మోడీ తాశిలి చేయి… అలా జెండా ఊపాడు… ఇలా గంగలో చిక్కుకుంది…’’
గంగా విలాస్ క్రూయిజ్… పలు నదీప్రవాహాల్లో 51 రోజులపాటు తిరుగుతూ, మార్గమధ్యంలో వచ్చే టూరిస్ట్ సైట్లను సందర్శించడం ఒక ప్యాకేజీ… తక్కువేమీ కాదు, ఒక్కొక్కరికీ దాదాపు పది లక్షల వరకూ ఖర్చు ఉంటుంది… ఇండియాలోనే గాకుండా బంగ్లాదేశ్ కూడా కవరవుతుంది… దీన్ని గత వారం ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించాడు… అది అకస్మాత్తుగా బీహార్ సమీపంలో గంగలో డోరీగంజ్ ఏరియాలో చిక్కుపడిపోయిందనేది వార్త… బీహార్‌లోని ఛప్రా వద్ద గంగలో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఈ క్రూయిజ్ […]
హీరోతనం మించి సూర్యలో ఏదో ఉంది… సౌత్ నెంబర్ వన్ హీరోను చేసింది…
తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ స్టార్ ఎవరు..? పోనీ, టాప్ హీరో ఎవరు..? వాల్తేరు వీరయ్య చిరంజీవా..? వీరసింహారెడ్డి బాలకృష్ణా..? కాదా…? ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ గడప దాకా వెళ్లిన రాంచరణా..? జూనియర్ ఎన్టీయారా..? ధమాకా రవితేజ, బిగ్‌బాస్ నాగార్జున, దసరా నాని… ఎవరూ కాదు… అసలు ప్రభాస్ కూడా కాదు… పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ నెంబర్ వన్ హీరో… నిజం… ఐఐహెచ్‌బి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్) అనే సంస్థ ఓ […]
‘‘చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి… కరిగిపోక తప్పదమ్మ అరుణకాంతికి…’’
A New Raagam: అవార్డు వచ్చిన నాటు నాటు పాట కీరవాణి గురించి చర్చోపచర్చలు జరుగుతుంటే… అవార్డు రాకముందు కీరవాణి గురించి చాలా చర్చ జరగాలి కదా అని అనిపించింది. కె వి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్- కోటీల దారుల్లో వెళ్లకుండా కీరవాణి సంగీత క్షణ క్షణాలను తన వైపు ఎలా తిప్పుకున్నారో కొంత చర్చ జరగాలి. చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి…కరిగిపోక తప్పదమ్మ అరుణ కాంతికి అంటూ సిరివెన్నెల కలం వెలుగు పూలు చల్లితే […]
డీఎస్సీ Vs థమన్… గోపీచంద్ Vs బాబీ… ఎవరు గెలిచారు..? కిరీటం ఎవరికి..?!
ఇంతకీ దేవిశ్రీప్రసాద్ గెలిచాడా..? థమన్ గెలిచాడా..? ఒక విశ్లేషణ….. దర్శకుడు బాబీ గెలిచాడా..? మలినేని గోపీచంద్ గెలిచాడా..? మరొక విశ్లేషణ…. బాలయ్య గెలిచాడా..? చిరంజీవి గెలిచాడా..? ఏ సినిమా వసూళ్ల పరిస్థితేమిటి..? అనే విశ్లేషణలు కొంతమేరకు వోకే… ఎందుకంటే, మనం ఉన్న రియాలిటీలో గెలుపోటములకు హీరోల్నే బాధ్యుల్ని చేస్తున్నాం… గెలుపోటములను బట్టే సదరు హీరో తదుపరి మార్కెట్ నిర్దేశించబడుతుంది కాబట్టి…! కానీ సంగీత దర్శకుల్లో ఎవరు గెలిచారు..? ఏ దర్శకుడు గెలిచాడు..? అనే చర్చలు శుద్ధ దండుగమారి […]
- « Previous Page
- 1
- …
- 204
- 205
- 206
- 207
- 208
- …
- 410
- Next Page »