Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కినేని ధర్మదాత… ఎవ్వడి కోసం ఎవడున్నాడు… పొండిరా పొండి…

March 26, 2024 by M S R

Subramanyam Dogiparthi….. ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి , నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి , ఉన్న వాడిదే రాజ్యమురా లేనివాడి పని పూజ్యమురా , మనుషులలోన మమతలు లేవు మంచితనానికి రోజులు కావు , పొండిరా పొండి . వీర హిట్టయిన పాట . పట్టుదలతో పోగొట్టుకున్న రాజమహల్ని తిరిగి పొందటానికి ఓ ధర్మదాత పడే ఆరాటం , ముసలి పౌరుషం . తమ దార్లు తాము చూసుకున్న పిల్లలను ఉద్దేశించి పాడే ఈ పాటలో ANR నటన బ్రహ్మాండం . సినిమా పేరు కూడా ధర్మదాత…


రెండు రోజులు భోజనం చేయలేదట ANR ఈ పాటకు మొహంలో దైన్యం కోసం . సినిమా కాబట్టి దారితప్పిన కొడుకులు దారికొచ్చారు . నిజ జీవితంలో ఈరోజుల్లో సంతానానికి వాళ్ళ తిక్కలు , బలుపులు , idiosyncrasies , eccentricities , pervertions వారివే . తల్లిదండ్రుల ఆశయాల గురించి , పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే పిల్లల సంఖ్య తగ్గిపోతుంది . తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ళని తాకట్టు పెట్టే సంతానం పెరిగిపోతున్న రోజులు .

తమిళంలో హిట్టయిన ఎంగ ఊరు రాజా అనే సినిమాకు రీమేక్ . నాగేశ్వరరావు పాత్రను శివాజీ గణేశన్ వేసారు . ధర్మదాత 11 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . హైదరాబాద్ శాంతి థియేటర్లో శత దినోత్సవం జరిగింది . అక్కినేని సంజీవి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ANR ద్విపాత్రాభినయం , జానకి , కాంచన , నాగభూషణం , పద్మనాభం , గీతాంజలి , ఝాన్సీ , రేలంగి , అనిత ప్రభృతులు నటించారు .

Ads

టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్ . జో లాలీ జో లాలి లాలీ నా చిట్టితల్లి , చిన్నారీ బుల్లెమ్మ సిగ్గెందుకులేవమ్మా , హల్లో ఇంజనియర్ , ఓం పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి , ఎవరూ నీవారు కారు నీ తోడు రారు , ఓ నాన్నా నే మనసే వెన్న పాటలు చాలా బాగుంటాయి . పునర్జన్మ సినిమాలోని ఎవరివో నీవెవరివో పాటతో మొదలు పెట్టి ఇతర పాటలను మిక్సింగ్ చేసి పద్మనాభం , గీతాంజలిల మీద తీసిన పాట సరదాగా ఉంటుంది .

ప్రధానంగా చెప్పుకోవలసింది నాగేశ్వరరావు నటనే . ముసలి పౌరుషం , పట్టుదల , ఆత్మాభిమానం , పోగొట్టుకున్న రాచరికం , పోగొట్టుకోని దాతృత్వం వంటి విభిన్న షేడ్లలో బాగా నటించారు . కుర్ర నాగేశ్వరరావుగా చలాకీగా విభిన్నత్వం చక్కగా చూపారు . మా నరసరావుపేటలోనే చాలాసార్లు చూసా . టివిలో కూడా వచ్చినప్పుడల్లా చూస్తుంటా . ముసలి ANR పాత్ర మీద నాకు చాలా సానుభూతి . నన్ను నేను చూసుకుంటూ ఉంటా . సినిమాలో ANR సక్సెస్ అయ్యాడు . నేను పొరపాటున కూడా సక్సెస్ కాను . తేడా అంతే .

యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . Feel Good , emotional , entertaining and musically hit movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugumovies #telugucinema #telugureels 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions