Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్‌ సుద్దులు… అందెశ్రీ పాటపై రేవంత్‌ రెడ్డికేదీ జవాబు? 

December 17, 2023 by M S R

gorati

తెలంగాణ వాగ్గేయకారులుగా పిలుచుకుంటున్న గోరటి వెంకన్న (Gorati Venkanna), దేశపతి శ్రీనివాస్‌ (Desapthi srinivas)ల గొంతుల ఈ రోజు వింటే మతిపోయే విధంగానే ఉంది. నిజానికి వాగ్గేయకారులనేది పెద్ద మాట. ఉద్యమకాలంలో కొన్ని Over tones ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోని ఓవర్‌ టోన్‌ వాగ్గేయకారులనేది. అయితే, దానికి సాధారణమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. పాటలు రాసి, వాటిని ఆలపించేవాళ్లను వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. ఈ పరిమితి తెలంగాణ ఉద్యమకాలంలోని పాట కవులకు ఉంటుంది. వారిద్దరు కూడా తెలంగాణ […]

ఓ పొద్దు తిరుగుడు పువ్వు… వెనుదిరిగి చూసే ఓ చిరునవ్వు…

December 17, 2023 by M S R

rag seller

విను తెలంగాణా – … వెనుదిరిగి చూసే నవ్వు…. పెన్షన్లు ఉపశమనమే. కానీ అదొక్కటే వృద్ధులను కలిసినప్పుడు మాట్లాడే విషయం కాదని బోధపడింది. పెద్ద వాళ్ళు అంటే పని విరమణా – జీవిత విరమణా కానే కాదనిపించింది. సాయంత్రం వెలుతురు. ఆ ఊరు పేరు జ్ఞాపకం లేదు, పాలమూరులో కృష్ణా నది పుష్కరాలు జరిగే బీచుపల్లి సమీప గ్రామం. తిరిగి ఆ గ్రామ శివార్లు దాటి తారు రోడ్డు మీదుగా వెనక్కి, పట్టణానికి వెళుతుండగా ఆమె పల్లెటూరులోకి […]

కలల్ని కూడా ఎడిట్ చేస్తాం.., కంట్రోల్ చేస్తాం.., కలర్‌ఫుల్ చేస్తాం…

December 17, 2023 by M S R

dreams

కలల కిరీటం- హలో! కలలు కనే యంత్రం “కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే..” -సముద్రాల సీనియర్ “కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది… కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది… కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు… ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు?” -ఆత్రేయ “పగటి కలలు కంటున్న మావయ్యా!
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా!
మావయ్యా! ఓ మావయ్యా!” -కొసరాజు “అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే కలలు చెదిరినా పాటే […]

వెలమ దొర గడీపై పాలమూరు రెడ్డి జెండా… ఇదేనా బయోపిక్ టైటిల్…

December 17, 2023 by M S R

revanthi2

ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… రేవంత్ కథను సినిమా తీస్తే సూపర్ హిట్ అట… అదే హెడ్డింగ్… జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథరెడ్డి ఏదో అభినందన బాపతు మీటింగులో చెప్పాడట అలా… ‘రేవంత్ ఈ సంస్థలో చదవాలని మూడుసార్లు ఎంట్రన్స్ రాశాడు, ఓసారి 8వ ర్యాంకు వచ్చినా సీటు రాలేదు, రాకపోవడమే మంచిగైంది’ అని ఏదేదో చెబుతూ పోయాడాయన… ఒక కళాకారుడు సీఎం కావడం అద్భుతమని మరొకాయన అన్నాడట… రేవంత్‌లో కళాకారుడు ఎవరబ్బా అనుకుంటుంటే […]

పక్కబట్టల గుసగుసల ముచ్చట… పట్టెమంచాలు, పత్తిపరుపులు…

December 17, 2023 by M S R

bedsheets

పక్కబట్టల గుసగుసలు~~~~~~~~~~~~~~~~ మల్లెపువ్వుల లెక్క తెల్లటి తెలుపుతోటి సన్నగ నున్నగ నేసిన నూలుబట్ట తానుకొని మిషినుమీద కుట్టిచ్చిన మెత్తగౌసెన్లు పరుపుగౌసెన్లు కుచ్చులు బొందెలు తొడిగనేర్చిన ఒకానొక కళాత్మకత తొడుగుటానికి పోటీవడె పిల్లల ఆరాటం… ! ఒకప్పటి ఇంఢ్లన్ని బయిరంగమేనాయె చలికాపేది దుప్పటొక్కటే ఎలుపుకెలుపు దొడ్డుకుదొడ్డు గుండుపోగుతోటి నేసిన మోతకోలు బరువుండే ముదురురంగు తెలుపుదుప్పట్లు ఎన్నివుంటే అది అంతపెద్ద సంసారమన్నట్టు… ! ఇంట్లున్న అందరికి — పట్టెమంచాలు ఉంటయా ? పత్తిపరుపులు దొరుకుతయా ?? పక్కబట్టలంటే చానవరకు చేతవోసిన […]

టచింగ్ రిప్లయ్… సీఎం రేవంత్ ఆఫర్‌కు మనసు కదిలించే ప్రతిస్పందన…

December 17, 2023 by M S R

నళిని

Domakonda Nalini….. గౌరవనీయులైన cm గారు! మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్‌లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా ‘సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. […]

విన్నర్ ఎవరో, రన్నరప్ ఎవరో జానేదేవ్… అసలైన నైతిక విజేత ప్రియాంక జైన్…

December 16, 2023 by M S R

priyanka

సరే… బిగ్‌బాస్ షో ఎండింగ్‌కు వచ్చింది… ఆదివారం ఫినాలే… మహేశ్ బాబు చీఫ్ గెస్ట్… డాన్సులు, హంగామా ఉంటుంది… సాయంత్రం 7 గంటలకే స్టార్ట్… అన్నీ వోకే… ముందుగా అర్జున్‌ను ఎలిమినేట్ చేస్తారట… వోకే… తరువాత రవితేజ వచ్చి ప్రియాంకను ఎలిమినేట్ చేసి వేదిక మీదకు తీసుకొస్తాడట… వోకే… యావర్ ఏదో 15 లక్షలకు టెంప్టయ్యాడని, తీసుకుని మధ్యలోనే నిష్క్రమించాడనీ కొన్ని వార్తలు… సరే, ఏదో ఒకటి… తనెలాగూ టాప్ త్రీ ఎలాగూ కాదు… అది తెలిసి […]

ఆ విధంగా మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఓ ఇబ్బంది తప్పిపోయింది…

December 16, 2023 by M S R

diana

Nancharaiah Merugumala…….   తెలంగాణ అసెంబ్లీలో తొలి, చివరి ఆంగ్లో ఇండియన్‌ ఎల్విస్‌ స్టీవెన్సన్‌! 2019 రాజ్యాంగ సవరణతో ‘ఆంగ్లో ‘ను నామినేట్‌ చేయించాల్సిన పని సీఎం రేవంత్ రెడ్డికి తప్పింది! …………………………… లోక్‌ సభలో ఇద్దరు, రాష్ట్రాల శాసనసభల్లో ఒక్కొక్కరు చొప్పున ఆంగ్లో ఇండియన్లను వరుసగా నామినేట్‌ చేసే నిబంధనను నాలుగేళ్ల క్రితం నరేంద్ర మోదీ బీజేపీ సర్కారు తొలగించింది. దీంతో పార్లమెంటు ఎన్నికలవ్వగానే కేంద్రంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గం సిఫారసు మేరకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో […]

అందమైన ‘విశ్వ ఐశ్వర్యం’ అభిషేక్ చేజారిపోయినట్టే… సూచనలు అవే…

December 16, 2023 by M S R

ఐశ్వర్య

పెళ్లయి ఎన్నేళ్లయితేనేం..? దీర్ఘకాలిక సాంగత్యం, సంసారం అలాగే నిలకడగా సాగాలనేమీ లేదు… ఈరోజుల్లో, మరీ ప్రత్యేకించి సెలబ్రిటీ కాపురాల్లో విడిపోవడాలు పెద్ద విశేషాలు కూడా ఏమీ కాదు… ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ సంసారం పెటాకుల బాటలో ఉందని ఎవరో ఓ ఇంగ్లిష్ పత్రిక వెబ్‌సైట్ స్టార్ట్ చేసింది… మిగతా అందరూ దాన్నే అందుకున్నారు… నిజమో, కాదో తరువాత… కానీ రాసిన తీరు మాత్రం గమ్మతుంది… ఐశ్వర్య అమితాబ్ ఇంట్లో సుఖంగా లేదు… అత్త జయాబచ్చన్‌తో అస్సలు పడటం […]

రేవంత్ పాలన సామర్థ్యానికి అత్యంత గొట్టు పరీక్ష కాళేశ్వరమే…

December 16, 2023 by M S R

medigadda

నిజమే… కాళేశ్వరం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఎదుట అతి పెద్ద సవాల్… ఆహా ఓహో, ఇది ప్రపంచపు పదో వింత, అబ్బురం, నదికి కొత్త నడకలు అని కేసీయార్ గ్యాంగ్ ఊదరగొట్టింది కదా… తీరా చూస్తే డిజైనింగ్ లోపాలు, నిర్మాణ లోపాలు, కమీషన్ల కథలు… రెండుమూడేళ్లకే ఓ ప్రధాన బరాజ్ కుంగిపోయింది… మిగతావీ బాగాలేవు… నిజానికి ఇంజనీరింగ్ నిపుణులు అన్నీ ఆలోచించి ఎల్లంపల్లికి రూపకల్పన చేస్తే… తనేదో పెద్ద ఇంజినీర్ అయినట్టు, తోెచినట్టు బరాజులు కాగితాలపై […]

వావ్ గుడ్ ఫోటో… ధనుష్, వరలక్ష్మి ఫోటోలతో రాధిక ఏదో చెబుతోంది…

December 16, 2023 by M S R

వరలక్ష్మి

ఒక ఫోటో రకరకాల గాసిప్స్‌కు దారి తీసింది… ఏమో, గాసిప్స్ కూడా కాకపోవచ్చు… ఆ ఫోటో రాబోయే పరిణామాలకు సూచిక కూడా కావచ్చు… విషయం ఏమిటంటే..? నటి రాధిక శరత్ కుమార్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది… అందులో రాధిక, శరత్ కుమార్, ధనుష్, శరత్ కుమార్ బిడ్డ వరలక్ష్మి, మరో మహిళ కనిపిస్తున్నారు… అసలే సవతి బిడ్డ వరలక్ష్మికీ, రాధికకు పెద్దగా టరమ్స్ బాగా లేవంటుంటారు… వరలక్ష్మి ఇండిపెండెంట్ లివింగ్… తను సినిమాలు, […]

సరె, సర్లే, మోడీ భయ్… గట్ల పోయి వన్ బై టూ చాయ్ తాగొద్దాం పా…

December 16, 2023 by M S R

modi

ఏ వచనం? ఏమిటా ఏకవచనం పిలుపు? ఏకవచనం పిలుపు అమర్యాద. బహువచనం పిలుపు గొప్ప గౌరవం. పెద్దవారిని నువ్వు అనకూడదు. మీరు అనాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఏకవచనం పిలుపుల మీద పెద్ద పట్టింపే ఉండదు. రాయలసీమ, తెలంగాణల్లో నిత్యవ్యవహారంలో ఏకవచనం సర్వసాధారణం. కోస్తాలో బహువచనానికే బహు డిమాండు. మీడియా రుద్దిన ప్రామాణిక భాష ప్రభావంతో ఇప్పుడు రాయలసీమ, తెలంగాణల్లో కూడా చాలావరకు “నువ్వు” “మీరు”గా మారింది. వ్యాకరణం ప్రకారం ‘డు’ ఏకవచనం. ఒకడే అయితే క్రియాపదం చివర ‘డు’; […]

యాంకర్ సుమ కొడుకు Vs సింగర్ సునీత కొడుకు… ఇద్దరూ ఇద్దరే…

December 16, 2023 by M S R

heroes

మాంచి కొలువు మీదున్నప్పుడు… పవర్ మీదున్నప్పుడు… కలెక్టర్‌గా దర్పం ఒలకబోసే పెద్దమనిషి కాస్తా వృద్యాప్యం పైనబడ్డాక… శక్తులన్నీ ఉడిగిపోయాక మస్కూరిలాగా అయిపోతాడు అని అంటుంటారు… ది గ్రేట్ బొడ్డు దర్శకుడు రాఘవేంద్రరావు పోస్టు ఒకటి చూశాకే అదే అనిపించింది… ఆయన ‘సర్కారు నౌకరి’ అని ఓ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు… దానికి సంబంధించిన ఓ పోస్టు పెట్టాడు ఫేస్‌బుక్‌లో… వోకే, తన టీం పెట్టినట్టుంది… 9 గంటల్లో దానికి వచ్చిన లైకులు ఎన్నో తెలుసా..? వంద..! నిజంగా […]

ఓహ్… ప్రదీప్ అదృశ్యం, నందు ప్రత్యక్షం వెనుక అదా అసలు సంగతి…

December 16, 2023 by M S R

pradeep

ఈటీవీ నాన్-ఫిక్షన్ కేటగిరీలో దాని ప్రధాన బలాల్లో ఢీ షో కూడా ఒకటి… ఈ డాన్సింగ్ షోకు పోటీగా వేరే చానెళ్లు ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాయి, భారీ ఖర్చు పెట్టాయి కానీ సక్సెస్ కాలేదు… ఐతే ఫిక్షన్ కేటగిరీలో అత్యంత వీక్‌గా ఉండే ఈటీవీ ఈ నాన్ -ఫిక్షన్ (రియాలిటీ షోలు ఎట్సెట్రా) కేటగిరీని కూడా ఈమధ్య బాగా దెబ్బతీసుకుంది… దాంతో చానెళ్ల పోటీలో బాగా వెనుకబడిపోయి, స్టార్ మాతో పోలిస్తే చాలా చాలా దూరంలో కుంటుతోంది… అది […]

అది బిగ్‌బాసా..? జబర్దస్త్ షోనా..? అమర్‌దీప్ బూతులు, శివాజీ డప్పులు…

December 15, 2023 by M S R

biggboss

మీ దుంపలు తెగ… అసలే బిగ్‌బాస్ షో మీద సీపీఐ నారాయణ వంటి వృద్ధ నేతలు వ్యభిచారకొంప అని తిడుతూ ఉంటారు… మరోవైపు శివాజీ అనే మరో వృద్ధ వెగటు నటుడు మా పల్నాడు స్పెషల్ అంటూ బూతులు యథేచ్ఛగా వదులుతూ ఉంటాడు… ఇవి సరిపోవన్నట్టుగా అమర్‌దీప్ కూడా రెచ్చిపోయి బిగ్‌బాస్ షోను కాస్తా జబర్దస్త్ 2.0 గా మార్చేశాడు… ఫాఫం, ప్రియాంక, హౌజులో చివరకు మిగిలిన ఆడ లేడీ పోటీదారు కదా… అమర్‌దీప్ భాషకు, ద్వంద్వార్థాల […]

జీవితపు ప్రతి క్షణాన్నీ డబ్బుతో కొలవకూడదురా… ఆనందాన్ని ఎలా కొలుస్తాం…

December 15, 2023 by M S R

బాపు

Nerella Sreenath… ప్రతి క్షణం జీవితాన్ని డబ్బుతో కొలవకూడదురా, కళాదృష్టితో కూడా కొలవాలిరా”  * బాపూ గారి request –  B V Pattabhi Ram గారి చొరవ… సంవత్సరం గుర్తు లేదు గానీ ”త్యాగయ్య” సినిమాని వారు శంకరాభరణం సోమయాజులు గారితో తీస్తున్న సందర్భం . ఆ సినిమా తీస్తున్న రోజుల్లో Magician పట్టాభిరాం గారి ద్వారా నాన్న గారి అపాయింట్‌మెంట్ తీసుకొని, నాగార్జునా సిమెంట్ రాజు గారి గెస్ట్ హౌస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు  నాన్న గారితో గడిపే […]

ఎన్నికలైపోయాయి కదా… తెలంగాణతో పవన్‌తో బీజేపీ దోస్తీ కటీఫ్…

December 15, 2023 by M S R

bjp janasena

మన అవసరం ఉందని అనుకుని మనతో బిజెపి (BJP) తెలంగాణలో పొత్తు పెట్టుకుందని, బిజెపి నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి పొత్తు పెట్టుకున్నారని జనసేన (Jana Sena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శ్రేణులతో చెప్పారు. ఇప్పుడు బిజెపి పవన్‌ కల్యాణ్‌ అవసరం లేదని భావిస్తున్నట్టుంది. పవన్‌ కల్యాణ్‌ను వదిలేసింది. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు (Telangana BJP), కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి (Kishan […]

గుంటూరు కారం ఘాటు లేదని తిట్టేస్తారా..? ఈసారి కడప కారంతో కొడతాడు జాగ్రత్త…!!

December 15, 2023 by M S R

ramajogaiah

“నా కాఫీ కప్పులో షుగరు క్యూబు నువ్వే నువ్వే నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే నా చెంపలకంటిన చేమంతి సిగ్గు నువ్వే నువ్వే నా ఊపిరి గాలిని పర్ఫ్యూమల్లె చుట్టేస్తావే ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి ఓ మై బేబీ నా చున్నీ నీకు టై కట్టాలి …” కాలంతో పాటు భావకవిత్వం, గేయకవిత్వం మారాలి. మారింది. అయినా ఈ పాటలో […]

నీ పిండం పిల్లులు ఎత్తుకుపోను… ఇదేం హారర్ సినిమారా నాయనా…

December 15, 2023 by M S R

పిండం

తలుపులు వాటంతటవే కొట్టుకోవడం… దూరంగా నక్కల ఊళలు, గబ్బిలాల రెక్కల చప్పుడు, కెవ్వుమని ఓ ఆడగొంతు అరుపు… కుర్చీలు ఊగడం, బాత్‌రూంలో అద్దం పటేల్మని పగిలిపోవడం… ఏదో ఓ ఫోటో నుంచి నెత్తురు కారడం… ఊరికి దూరంగా ఉన్న ఇల్లు, ఎవరూ ఉండని దెయ్యాల కొంప, అందులోకి కొందరు దిగడం, ఆత్మలు యాక్టివేట్ కావడం, చిల్లర వేషాలతో ప్రేక్షకుల్ని చిరాకెత్తించడం… ఢమఢమ అంటూ నేపథ్యసంగీతం… మంత్రగాళ్లు, యంత్రగాళ్లు, నిమ్మకాయలు, ముగ్గులు… హారర్ అంటే ఇదేనా..? అవును, తెలుగు […]

కేసీఆర్‌కు చేదు అనుభవం: వైఎస్‌ జగన్‌ సీరియస్‌ కసరత్తు

December 15, 2023 by M S R

ysrcp

Pratapreddy Kasula ……..  కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (Andhra Pradesh assembly Elections 2023)కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) అధినేత వైఎస్‌ జగన్‌ (YS Jagan) అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) అనుభవాన్ని దృష్టిలో పెట్టుకని ఆయన అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించినట్లు అర్థమవుతున్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana assembly election […]

  • « Previous Page
  • 1
  • …
  • 205
  • 206
  • 207
  • 208
  • 209
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions