Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రధానంగా చెప్పుకోవాల్సింది మోహన్‌బాబు క్రూరత్వం గురించే..!!

December 9, 2024 by M S R

.
రామాయణంలో రావణుడ్ని శ్రీరాముడు సంహరిస్తే ఈ శ్రీరామబంటు సినిమాలో ఆ ఊరి రావణుడ్ని శ్రీరామబంటు ఆంజనేయుడు వానర రూపంలో వచ్చి సంహరిస్తాడు . సినిమా బాగుంటుంది .

వంద రోజులు ఆడింది . నిర్మాత , ప్రదర్శకులకు డబ్బులు వచ్చాయి . వీటన్నింటినీ మించి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా తీసిన నిఖార్సయిన భక్తి ప్రబోధ సినిమా . వై వి నిర్మాత . ఐ యన్ మూర్తి దర్శకుడు . ఈ సినిమాకు ముందు శభాష్ సూరి , సుఖదుఃఖాలు , జగత్ కిలాడీలు సినిమాలకు దర్శకత్వం వహించారు .

చిరంజీవి , హరిప్రసాద్ , మోహన్ బాబు , రమణమూర్తి , ప్రభాకరరెడ్డి , రాజబాబు , కె వి చలం , ముక్కామల , గీత , అనిత , జయమాలిని ప్రధాన పాత్రల్లో నటించారు . రామదాసు రహీం పాత్రలు మనసుకు హత్తుకునేలా చాలా బాగుంటాయి .

Ads

నలభై యాభై సంవత్సరాల కింద మత సామరస్యం , వివిధ మతాల వారు ఒకరికి ఒకరు తోడుగా ఉండటం వంటి కధాంశాలతో ఆదర్శవంతమైన సినిమాలను తీసారు . కొన్ని హిందూ ముస్లింలవి , మరి కొన్ని హిందూ క్రిస్టియన్లవి . అలాగే కులాంతర , మతాంతర వివాహాలను ప్రోత్సహించారు .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పూజారి రమణమూర్తి భక్తిపూర్వకమైన పాట బాగుంటుంది . రామ బంటుని నేనేరా శ్రీరామబంటుని నేనేరా , సీతమ్మ సిగ్గుపడింది , పరువాల పిట్ట పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

తిరునాళ్ళలో జయమాలిని డాన్స్ పాట జయమాలిని పాట లాగానే ఉంటుంది . ఈ పాట బదులు ఏదయినా శాస్త్రీయ నృత్యం పెట్టి ఉంటే బాగుండేది . సినిమా అంటే మసాలా కదా ! మసాలా కలిపారు . మనవాళ్లు ఎంత భక్తి సినిమా తీసినా సరే ఓ రక్తి పాట తగిలిస్తుంటారు… అలవాటే కదా…

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మోహన్ బాబు రావణుని అవతారం . క్రూరంగానే నటించాడు . ఊరు మనదే తోసేయ్ అని దున్నపోతు చేత జనాన్ని చంపించటం బాగా చూపారు . తర్వాత ఆంజనేయుడి అవతారం . ఆర్జా జనార్ధనరావు , వానరం గురించి చెప్పుకోవాలి .

వానర రూపంలో ఉన్న ఆంజనేయస్వామి విలన్ని , విలన్ జనాన్ని చంపటం బాగా చూపారు . ముత్యాలముగ్గు సినిమా గుర్తుకొస్తుంది . చిరంజీవికి , రాజబాబుకి నటించేందుకు పెద్ద అవకాశం లేదు ఈ సినిమాలో . పాత్రోచితంగా హీరోగా మోహన్ బాబుని చితగ్గట్టేస్తాడు . సంపూర్ణ సంహారం శ్రీరామబంటు పూర్తి చేస్తాడు .

సినిమా యూట్యూబులో ఉంది . సోషల్ ఫేంటసీ . శ్రీరామ భక్తులు , ఆంజనేయ స్వామి భక్తులు , మత సామరస్య భక్తులు తప్పక చూడవచ్చు . సినిమా శుభ్రంగా , సంసారపక్షంగా ఉంటుంది . చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనా మిలిటరీలో సంక్షోభం… మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష…
  • పాకిస్థాన్‌ను గంగవెర్రులెత్తించే వార్త… భారత్‌కు మరిన్ని ఎస్-400 …
  • డౌన్ టు ఎర్త్… బ్రహ్మచారి… పుదుచ్చేరి అంటే ఎన్.రంగస్వామే…
  • సతీ లీలావతి..! తెలుగు టీవీ సీరియళ్లు ఇష్టపడేవారి కోసం..!!
  • బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు… ఓ అమ్మాయిపై ఘాతుకం… కానీ..?
  • అతిశయం, ఆభిజాత్యం… వాణిశ్రీకి సరిగ్గా నప్పే ప్రౌఢ పాత్ర…
  • నంబర్లాట- నవ్వులాట..! అనామక పార్టీలూ ‘ఆడుకుంటున్నయ్’…!!
  • ఇదేం సినిమా రవిబాబూ..? థియేటరంతా నెత్తుటి కమురు వాసన…!
  • పరివార్‌వాద్… వారస రాజకీయాలు… ఏ పార్టీ మినహాయింపు కాదు…
  • సువేందు..! మరో సంఘేతర బీజేపీ సీఎం..! నాన్- భద్రలోక్ కూడా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions