Murali Buddha………. ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య … ఓ జ్ఞాపకం శంకర పిచ్చయ్య తెలుసా ? అని నేటి ఐటీ కుర్రాళ్లను అడిగితే , ఎవరూ ? సుందర్ పిచాయ్ కు ఏమవుతారు అని అడుగుతారు . ఏమీ కారు . ఆగండాగండి నేను కూడా మీ కన్నా ముందే శంకర పిచ్చయ్య గురించి గూగుల్ ఏమన్నా చెబుతుందేమో అని చూస్తే ఆది శంకరాచార్య గురించి మోయలేనంత సమాచారం చూపించింది . ఆ ప్రయత్నాలను పక్కన […]
అఖిల్ మళ్లీ బోల్తా… ఏజెంట్ ఢమాల్… బాడీ బిల్డింగు ఒక్కటే సరిపోదోయ్…
వారసుడు…. రాజకీయాల్లో, నటనారంగంలో ప్రజలకు ఈ బెడద ఎక్కువ… చాలా ఎక్కువ… ప్రత్యేకించి సినిమా రంగంలో తమ వారసుల్ని ప్రేక్షకుల నెత్తిన రుద్ది, ప్రేక్షకుల పట్ల కృతజ్ఞత కూడా లేకుండా ‘‘కక్ష’’ తీర్చుకుంటారు చాలామంది… ఇక ఆ వారసులు వెండి తెర మీద తైతక్కలాడుతూ ప్రేక్షకుల ఉసురు పోసుకుంటుంటారు… నాగార్జున, అఖిల్ కథ కూడా ఇదే… ప్రత్యేకించి ఏజెంట్ అనే తాజా సినిమా చూశాక బలంగా మళ్లీ అనిపించేదీ అదే… నాగార్జునకు జీవితంలో చెప్పుకోలేని బాధ ఏదైనా […]
టైమ్‌కు చేతిలో డబ్బు ఐపోయింది… లేకపోతే ఆస్కార్ కొట్టేది ఈ తెలుగు ఆడబిడ్డ…
మన తెలుగింటమ్మాయి తీసిన ఓ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దాకా వెళ్లిందని ఎంత మందికి తెలుసో గాని నాకైతే తెలియదు. (నా అజ్ఞానాన్ని మన్నించాలి) ఏదో విభాగంలో ఏదోక పాట నామినేటైతేనే భూమ్యాకాశాలను తల్లకిందులు చేసిన మీడియా.. నిండా మూడు పదుల వయస్సు లేని మన అమ్మాయి గురించి మాటమాత్రం రాసినట్టు, చెప్పినట్టు గుర్తులేదు. అందుకనే నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఆమె పేరు అపూర్వ గురు చరణ్. పదహారణాల తెలుగుబిడ్డ. సామాజిక స్పృహ మెండు. సినిమాపై తెలివిడీ […]
సో, కన్నడ మూవీది వాపే కానీ బలుపు కాదన్నమాట… మరి తెలుగు మాటేమిటి..?
దక్షిణాది సినిమా వెలిగిపోతోంది శీర్షికతో కొన్ని కథనాలు కనిపించాయి… మనకు స్థూలంగా అనిపించేదీ, కనిపించే దృశ్యమూ అదే… కానీ నిజమేనా..? ఇక దక్షిణాది సినిమాకు తిరుగు లేదా..? హిందీ సినిమాను ఇంకా తొక్కేసి, ఆధిపత్యం సాధిస్తుందా..? ఈ ప్రశ్నకు సమాధానం… కాదు..! కారణం సింపుల్… హిందీ సినిమా ఇప్పుడు కరెక్షన్ స్టేజులో ఉంది… బాలీవుడ్ అంత తేలికగా వదలదు… సౌత్ సినిమాలో ఉన్నదేమిటి..? హిందీ సినిమాలో లేదేమిటి అనే చర్చ ఇప్పటికే స్టార్టయింది… సల్మాన్ సినిమా ఫ్లాపయినా, […]
యాణ్నుంచి వస్తారుర భయ్ మీరంతా… పగటి చిల్లర వేషాల కంపిటీషన్సా ఇవి..?!
మొత్తానికి మళ్లీ ఈటీవీయే ఈవిషయంలో చాలా నయం… ఈ చానెల్లో పాడుతా తీయగా గానీ, స్వరాభిషేకం గానీ నాణ్యత ప్రమాణాలు పడిపోయినా సరే, హుందాగా నడిపిస్తున్నారు… కాస్త సంస్కారం కనిపిస్తోంది… సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలలో జీతెలుగు జీసరిగమప షో ఎవరూ దిగజారనంత నీచస్థాయికి వేగంగా వెళ్లిపోతుండగా… హేయ్, నేనేం తక్కువ, నేనూ వస్తున్నాను ఉండు అంటూ ఆహా ఇండియన్ ఐడల్ షో కూడా పోటీకి సై అంటోంది… వీళ్లకు సిగ్గూశరం లేదా అనడక్కండి ప్లీజు… అవి […]
నీ పళ్లు వజ్రాలు గానూ… వజ్రదంతి యాడ్ కాదు, అపూర్వ దంతజ్ఞానఘట్టం…
Dental Jewelers: “దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!” ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అన్నీ గుర్తుంచుకోదగ్గ పద్యాలే. అందులో మంచి పద్యమిది. వయసుడిగి, కాటికి కాళ్లు చాచినప్పుడు కాకుండా…పళ్లూడిపోవడానికి ముందే, శరీరం పట్టుదప్పకముందే, ఒంట్లోకి నానా రోగాలు ప్రవేశించకముందే, మన శరీరం మనకే వింతగా అనిపించడానికంటే ముందే, తల ముగ్గుబుట్ట కావడానికంటే ముందే…కాళహస్తీశ్వరుడి కాళ్లు పట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది కానీ…ఇవన్నీ అయ్యాక […]
మోకాలి బుర్రకు ఓ సర్జరీ… మిత్రుల దురాత్మీయ పరామర్శపర్వం…
Gopi Reddy Yedula ……. ‘దురాత్మీయ పరామర్శలు’ మనిషికి ఏదైనా ఆపరేషన్ కావడం మంచిది కాదు. అందునా మోకాలుకు అసలే కాకూడదు. నా మోకాలు అరిగింది అని ఎక్సరే చూసిన డాక్టర్లు చెప్పారు. దాన్ని రీప్లేస్ చేయాలి అనికూడా నొక్కి చెప్పారు. ఎందుకు అరిగింది అంటే మటుకు ఎవరూ సరైన కారణం చెప్పలేదు. డాక్టర్లు సరైన కారణం చెప్పలేదు అంటే మా ఆవిడ ఊరుకోదు. నా మెదడు మోకాలులో ఉంది అని మా ఆవిడకు ఏనాడో తెలుసు. […]
ఈ చిన్నపిల్ల మరణంపై జగన్ బటన్ సర్కారు సమాధానం చెప్పుకోగలదా..?
ఇలా జగన్ బటన్ నొక్కుతాడు… అలా వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి చేరిపోతాయి… అనేక పథకాలతో లక్షల కోట్లను పంచిపెట్టిన జగన్ సర్కారుకు ఓ చేదు మరక ఈ కేసు… బటన్ సర్కారుకు ఈ అమానవీయ దృక్పథం ఏమిటనే ప్రశ్న మనల్ని విస్మయంలో పడేస్తుంది… ఈ కేసులో హైకోర్టు తీర్పును అభినందించాలని అనిపిస్తుంది… వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు జిల్లా, కుప్పం మునిసిపాలిటీ, గుల్లెపల్లిలోని అంగన్వాడీ కేంద్రం… ఫిబ్రవరి 22న ఓ బాలిక మరణించింది… అంతకుముందు ఇదే కేంద్రంలో […]
కాంగ్రెస్ అంటే సోనియా మాత్రమే కాదు… చాలామంది ఉన్నారందులో…
Murali Buddha………… శ్రీకృష్ణ కమిటీ నివేదికతో TDLP లో సంబరాలు, నా జోస్యమే నిజమైంది… ఓ జ్ఞాపకం తెలంగాణ అంశంపై వేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చింది . అసెంబ్లీలోని TDLP కార్యాలయంలో ఉన్నాం … కమిటీ నివేదికలో తొలి సిఫారసు టీవీ స్క్రీన్ పై కనిపించగానే TDLP లో ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి . తొలి సిఫారసు రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా అలానే ఉంచాలి అని … Tdlp లో సిబ్బంది, నాయకులు ఒకరినొకరు అభినందించుకున్నారు […]
ఆ ఇద్దరు మహిళానేతలు డిష్యూం డిష్యూం… కొప్పుల కొట్లాట…
Murali Buddha…….. నన్నపనేని రాజకుమారి భయపడిన వేళ …. ఓ జ్ఞాపకం …… 83 తెలుగుదేశం బ్యాచ్ మహిళా నాయకులు రాజకీయాల్లో ఓ సంచలనం … ఈ బ్యాచ్ టీడీపీ ద్వారా వచ్చినా అన్ని పార్టీల్లో ఓ వెలుగు వెలిగారు . ఆంధ్రలోనే కాదు …. తెలంగాణలోనూ .. మూలాలు ఆంధ్ర ఐనా కాట్రగడ్డ ప్రసూన , గడ్డం రుద్రమ దేవి వంటి వారు తెలంగాణాలో ఆ కాలంలో వెలిగి పోయారు .. భయం అనేది నా […]
జై మోడీ జై జై మోడీ… రిపబ్లిక్ టీవీ, చంద్రబాబు పోటీ కీర్తనలు…
నాయకులను కీర్తించడం వర్తమాన జర్నలిజంలో కొత్తేమీ కాదు… నిజానికి అది పాత్రికేయంలో ఓ భాగమైపోయింది… జర్నలిస్టులు అంటేనే వందిమాగధులు… కానీ రిపబ్లిక్ టీవీ చేష్టలు విచిత్రంగా ఉన్నయ్… దీనికి మోడీ కీర్తన కొత్తేమీ కాదు, అసలు దాని పనే అది… అది బీజేపీ చానెలే కాబట్టి తప్పులేదు అనుకుందాం కాసేపు… కానీ ఏకకాలంలో మోడీతోపాటు బాబును కీర్తిస్తూ… బీజేపీ- టీడీపీ కలిసిపోవాలని లేదా ఎన్డీఏలో టీడీపీ చేరిపోవాలని ఈ టీవీ వెంపర్లాడిన తీరు ఆశ్చర్యంగా ఉంది… టైమ్ […]
మన జీవితాల నిండా జంతువిన్యాసాలు… నిజమైన సర్కస్ ఎవరు చూస్తారు…
Circus – Life: జెమిని సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ నిండు నూరేళ్లూ బతికి…పోయాడు. జెమిని సర్కస్ చరిత్ర రాస్తే రామాయణమంత రాయవచ్చు. చెబితే మహాభారతమంత చెప్పవచ్చు. గుర్రం గుర్రం పని; గాడిద గాడిద పని చేసే కాలంలో కాబట్టి శంకరన్ సర్కస్ ఫీట్లు చెల్లుబాటయ్యాయి. ఇప్పుడు ప్రతి అడ్డ గాడిద తనను తాను సింహమనే అనుకోవడంతో…గుర్రాల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిని…కళ్లకు గంతలు కట్టుకుని…గుంతల్లో పడి…లేచి పరుగెత్తలేకుండా ఉన్నాయి. ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుందని మనం అతిగా ప్రచారం చేయడం […]
అవసరానికి మరఠ్వాడా మీడియా… ‘అవసరం లేని’ హైదరాబాద్ మీడియా…
మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్ఎస్ 10 కోట్ల ప్రచార వ్యయం ప్రధాన పత్రికల్లో కవరేజీ ఖర్చే రూ.5 కోట్లు హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు మండల స్థాయి పాత్రికేయులకు మర్యాదలు చేయడానికే రూ.5 లక్షల కేటాయింపు మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టిన రోజు ఢిల్లీ, పంజాబ్ పత్రికల్లోనూ భారీగా యాడ్స్ మరఠ్వాడాలో హాట్‌టాపిక్‌గా గులాబీసభలు ……… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ… పైన ఉన్న డెక్స్ చదివితేనే అర్థమైపోయిందిగా స్టోరీ సారాంశం ఏమిటో… మరఠ్వాడా ఏరియాలో సభల […]
మరి మా బతుకుల గోస ఎవరు వినాలె కేటీయార్ సార్..?
మా గోస వినుర్రి సర్.. గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారూ.. • తెలంగాణ విద్యుత్ శాఖలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న మా బతుకు గోసను జర వినుర్రి సర్. • ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో.. మాలాంటి కింది స్థాయి కార్మికులు పడుతున్న కష్టాలను పెద్ద మనసుతో అర్థం చేసుకోర్రి సర్. • తెలంగాణ రాంగనే ముఖ్యమంత్రి సారు మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెబితే నమ్మినం సర్. కానీ రూల్స్ అడ్డుపడుతున్నయని మమ్మల్ని […]
లెక్కల తాబేలు… అంకెల మాంత్రికుడు… ఓ జ్ఞాపకం…
Murali Buddha……….. లెక్కల తాబేలు – అంకెల మాంత్రికుడు…… ఓ జ్ఞాపకం నాలుక పైనే అంకెలు , రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల్లో గొనె ప్రకాష్ వంటి వారు ఇంకొకరు లేరు . పతంజలి గారు లెక్కల తాబేలు అని ఓ అద్భుతమైన కథ రాశారు . కథ సంక్షిప్తంగా . తాబేళ్ల రాజ్యం లో ఓ తాబేలు సరదాగా లెక్కలు నేర్చుకుంది. 27వ ఎక్కం ముందు నుంచి వెనక నుంచి ముందుకు ఎలా అంటే అలా చెప్పగలదు […]
మతంపై అనాసక్తత… అమెరికా సమాజంలో పెరుగుతున్న నిర్మతస్థులు…
మతం అనేది తమకు చాలా ముఖ్యమని 2023 సంవత్సరంలో కేవలం 39 శాతం మందే అభిప్రాయపడ్డారని ఒక సర్వేలో వెల్లడైంది. అదే 1998లో అయితే ఈ శాతం 62గా వుందని బుధవారం న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ సర్వే పేర్కొంది. ఇది ప్రజాశక్తిలో వచ్చిన ఓ వార్తలోని ఒక భాగం… చాలా గణనీయమైన మార్పు… చాలా ప్రాముఖ్యం, విశేషం ఉన్న పరిణామమే… మతం పట్ల విశ్వాసం, మతానుసరణ పట్ల అనాసక్తత వేగంగా పెరుగుతున్న తీరును ఇది స్పష్టం […]
వైఎస్ఆర్ ఓ పిలుపునిచ్చాడు… చంద్రబాబు అక్షరాలా పాటించాడు… ఇలా…
Murali Buddha………… కరెంట్ బిల్లు కట్టవద్దన్న ysr .. కట్టని బాబు… అట్టుడికిన అసెంబ్లీ .. ఓ జ్ఞాపకం ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ బిల్లులు కట్టవద్దు అని ysr పిలుపును ఇస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాటిస్తే ఎలా ఉంటుంది .. ఇది నిజంగా జరిగింది, అసెంబ్లీ అట్టుడికింది … అలా జరగడానికి తనకు తెలియకుండానే సహకరించిన వ్యక్తికి ఆ విషయం ఇప్పటికీ తెలియదు . 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యుత్ అంశం రాష్ట్రాన్ని అట్టుడికించేట్టు చేసింది .. […]
బలగం అంటే ‘పిట్టముట్టుడు’ మాత్రమే కాదురా ఈటీవీ డ్రామా డైరెక్టరూ…
బలగం సినిమా అనగానే ‘పిట్ట ముట్టుడు’ అంశం మాత్రమే గుర్తుకురావడం ఓ అబ్సర్డ్… ఓ కాకి, ఓ ప్లేటులో నీసు ఫుడ్, ఓ మందు గ్లాసు… బలగం అంటే ఇదేనా..? ఈటీవీలో ఓ క్రియేటివ్ డైరెక్టర్ అంతకుమించి ఎదగలేకపోయాడు ఫాఫం… శ్రీదేవి డ్రామాకంపెనీ అని ఓ ప్రోగ్రామ్ చేస్తారు కదా ప్రతి ఆదివారం మధ్యాహ్నం… వచ్చే ఆదివారం బాపతు ప్రోమో రిలీజ్ చేశారు… స్థూలంగా పైపైన చూస్తుంటే బలగం మూవీకి మంచి స్పూఫ్ చేశారురా, దాన్ని బేస్ […]
‘‘స్టాలిన్ కొడుకు, అల్లుడు కలిసి ఒకే ఏడాదిలో 30 వేల కోట్లు కుమ్మేశారు…’’
‘‘నేనే భారీ ప్రాజెక్టుల డిజైన్లు గీస్తా, కాంటూరు లెవల్స్ లెక్క తీస్తా, నేనే బిల్డింగుల ప్లాన్లు గీస్తా, నేనే బడ్జెట్ రాసిస్తా, నేనే కృష్ణాజలాల కోసం కోర్టులో వాదిస్తా…’’ వంటి మాటలేమీ మాట్లాడలేదు తమిళనాడు సీఎం స్టాలిన్…. ‘‘కంప్యూటర్ కనిపెట్టింది నేనే, సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే…’’ వంటి డొల్ల మాటలూ మాట్లాడలేదు… ఆర్థిక శాఖకు త్యాగరాజన్‌ను మంత్రిగా చేశాడు… జైశంకర్‌ను మోడీ విదేశాంగ మంత్రిని చేసినట్టు… బీఈ, ఎంటెక్, ఎంబీఏ చదివిన మాజీ ఇండియన్ సర్వీస్ […]
PS-2… కొనడానికే బయ్యర్లు గజగజ… ఎక్కడ కొడుతున్నది తేడా అంటే..?
మణిరత్నం గొప్ప దర్శకుడే కావచ్చుగాక… తన అభిరుచి, చిత్రీకరణ శైలితో తమిళమే గాకుండా ఇతర భాషల్లోనూ మంచి పేరు సంపాదించి ఉండవచ్చుగాక… కానీ అది గతం… పొన్నియిన్ సెల్వన్‌తో తను పక్కా తమిళ దర్శకుడు మాత్రమే అనిపించుకున్నాడు… ఈ సినిమా విషయంలో కొన్ని ఫెయిల్యూర్లు ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయాంశాలయ్యాయి… అనేక సంపుటాల భారీ చరిత్ర గ్రంథాన్ని ఒక సినిమా వ్యవధికి కుదించుకోలేకపోవడం స్క్రీన్ ప్లే కోణంలో ఫెయిల్… వర్తమాన కాలపు ప్రేక్షకుడు ఎంత సేపు చూస్తాడు..? ఆ […]
- « Previous Page
- 1
- …
- 207
- 208
- 209
- 210
- 211
- …
- 447
- Next Page »