‘పాతాళభైరవి’లోని ఒక దృశ్యంలో మాంత్రికుడు ఉజ్జయిని నగరం వచ్చి, ప్రజల్ని ఆకర్షించి వాళ్లకి కావలసిన వస్తువుల్ని తన దగ్గర ఉన్న, ‘మంత్రాల డబ్బా’ నుంచి తీసి ఇస్తూ ఉంటాడు. తోటరాముడికి విశేషమైన ధనం కావాలి గనక, అ డబ్బాను లాక్కుని పారిపోతాడు. ఒక అడవిలాంటి ప్రదేశానికి పరుగెత్తి, నోటి కొచ్చిన మంత్రం చెబుతూ డబ్బా వెతుకుతాడు. అదే సమయానికి దూరం నుంచి బొబ్బల్లాంటి నవ్వులతో మాంత్రికుడు వస్తాడు. ఈ అడవి, చెట్లు అవుట్డోర్. మాంత్రికుడు రాముడి దగ్గర […]
సర్కారీ కొలువు లేకపోతే లైఫ్ లేదా..? చావొద్దు ప్లీజ్… బతకాలి, బతికి సాధించాలి..!!
Srinivas Sarla…….. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు పెరిగినయ్.. వేరే పనుల మీద ధ్యాస లేకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వ కొలువుల పైనే దృష్టి పెట్టడానికి కారణం… తెలంగాణ ఉద్యమ సమయం నుండే మన రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనే ప్రచారం ఎక్కువగా జనాల్లోకి వెళ్లడం… మీడియా సృష్టో లేక నాయకుల సృష్టో తెలీదు కానీ ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం అనే ప్రచారం కూడా ఎక్కువే జనాల్లోకి వెళ్ళింది… […]
మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ డ్రంప్ VS మీడియా మొఘల్ రూపర్ట్ ముర్డోక్
ఒకరిది రాజకీయం, మరొకరిది మీడియా సామ్రాజ్యం. ఉప్పు నిప్పు కలిస్తే ఏమవుతుందో తెలుసుగా.. ప్రజా తీర్పును పరిహాసం చేశారు. పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. చిత్రంగా ఇప్పుడా ఇద్దరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వాళ్లే డోనాల్డ్ ట్రంప్. రూఫర్ట్ ముర్డోక్. ఒకరు అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇంకొకరు మీడియా మొఘల్. ’మితిమీరిన అహంభావంలో కురుకుపోయిన ఖైదీ ట్రంప్’ అని ముర్డోక్ మీడియా అభివర్ణిస్తే ’పరువు నష్టం కేసుకే పారిపోతారా? అసత్యానికే వంతపాడతారా?’ అని ట్రంప్ ముఠా ఎదురుదాడికి దిగింది. ఈ […]
పొన్నియిన్ సెల్వన్-2… కొనేవాడు లేడు… తెలుగులోనూ పూర్ రెస్పాన్స్…
పొన్నియిన్ సెల్వన్ సినిమాపై మొత్తం ప్రపంచవ్యాప్త తమిళజనం ప్రేమ కురిపించింది… ఓన్ చేసుకుంది… సినిమా బాలేదంటే తగాదాలు పెట్టుకుంది… కారణం, అది తమిళంలో ప్రసిద్ధిపొందిన ఓ నవలకు సినిమారూపం… మొత్తం నవలను రెండు భాగాల సినిమా నిడివికి కుదించడమే పెద్ద టాస్క్… ఆ పనిని మణిరత్నం విజయవంతంగా చేయగలిగాడు… అంతేకాదు, హిందీ మార్కెట్ కోసం ఐశ్వర్యా రాయ్‌ను తీసుకున్నాడు… (అఫ్ కోర్స్, ఐశ్వర్య పట్ల మణిరత్నానికి అభిమానం ఎక్కువ…) కార్తి, విక్రమ్, త్రిష, ఇంకో తమిళ ఐశ్వర్య […]
ఓ చిన్న పిల్ల కాళ్లకు పట్టీలు తొడిగి… ఓ బామ్మకు భక్ష్యాలు చేసి తినిపించి…
అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్‌కు వచ్చేసరికి బాలయ్య దాన్ని బాగా చెడగొట్టాడు… ఆ కారణాల విశ్లేషణ ఇక్కడొద్దు గానీ, ఆ షోకన్నా తను గెస్టుగా పాల్గొన్న ఇండియన్ ఐడల్ స్పెషల్ ఎపిసోడ్ మాత్రం అదరగొట్టాడు… బాలయ్య ప్రజెంట్స్ టాప్ 12 పేరిట, గాలా విత్ బాలా పేరిట ఈ ఎపిసోడ్స్‌లో రెండు రోజులపాటు బాలయ్య సమక్షంలో కంటెస్టెంట్లు 12 మంది 12 పాటలు పాడతారు… బాలయ్యను గెస్టుగా పిలిచాం కదాని ఇండియన్ ఐడల్ టీం మరీ బాలయ్య […]
ఇరట్టా అంటే డబుల్… దీని దెబ్బకు జోజు జార్జ్ రెమ్యునరేషన్ కూడా డబుల్…
మలయాళం సినిమాల్లో నటించే జోజు జార్జ్ వైష్ణవ్ తేజ హీరోగా చేయబోయే ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అక్షరాలా కోటిన్నర అడిగాడట… మలయాళీ నటులకు అంత డిమాండ్ ఉందా..? అంత భారీ పారితోషికాలు అడిగేంత సీన్ ఉందా..? ఉంది… ఇరట్టా సినిమా చూశాక జోజు జార్జ్ కోటిన్నర అడగడంలో తప్పేమీ లేదనిపిస్తుంది… ఇరగేశాడు సినిమాలో… ఒక క్రైం థ్రిల్లర్ సినిమా తీస్తే… చివరివరకూ ఆ సస్పెన్స్ థ్రెడ్ ప్రేక్షకుడికి అంతుపట్టకూడదు… రకరకాల వ్యక్తుల మీదకు సందేహాలు […]
కన్నడ సినిమా జయకేతనాలు ఎగరేస్తుంటే… కబ్జా ఆ పరువుకు పంక్చర్ చేసింది…
ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులకు కేవలం ఉపేంద్ర మాత్రమే తెలుసు… మిగతావాళ్లు పెద్దగా తెలియదు… అంతకుముందు ఏ, ఓం, ఉపేంద్ర వంటి సినిమాలు డిఫరెంటుగా ఉండి పర్లేదనిపించాయి… తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి సినిమాల్లో కూడా నటించాడు… ఉపేంద్ర మనకు పరిచయం ఉన్న నటుడే… కానీ తొలిసారిగా తనను చూస్తే జాలేసింది… నవ్వు పుట్టింది… ఇప్పుడు కన్నడ సినిమా పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మోగుతోంది… కాంతార సినిమా ఏకంగా ఐరాసలో ప్రదర్శితమైంది… […]
ఫలానా అమ్మాయికి ప్రామిసింగ్ మెరిట్… కానీ రియల్ సవాల్ విసిరే పాత్రలేవీ..?!
నిజానికి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో పెద్ద చూడటానికి ఏమీలేదు… రివ్యూ రాసుకునేంత సీన్ కూడా ఏమీలేదు… కాస్తోకూస్తో మాట్లాడుకోదలిస్తే అందులో మాళవిక నాయర్ ఉంది… అంతే… ఊహలు గుసగులాడె, జో అచ్యుతానంద తీసిన అవసరాల శ్రీనివాసేనా అన్నట్టు ఉంది… సున్నితమైన కామెడీ, కాస్త ఎమోషన్, అశ్లీల రహితంగా కథనం ఉండే అవసరాల మరీ ఇంత పేలవమైన సినిమాను మనమీదకు వదిలాడు ఏమిటి…? హీరో నాగశౌర్య ఉన్నాడా అంటే ఉన్నాడు… ఉన్నంతలో పర్లేదు, కానీ బాగా […]
ప్చ్… మన బంగారు తెలంగాణలో సక్రమ కొలువు పరీక్షలకూ దిక్కులేదాయె…
హాఫ్ పేజీ వార్త… ఓ కార్టూన్… ఏయే రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయో పాత ఉదాహరణలు… యువతతో చెలగాటం అనే శీర్షిక….. నమస్తే తెలంగాణ కరపత్రంలో ప్రత్యేక కథనం చదివితే… ప్రశ్నపత్రాల లీక్‌కు మించిన షాక్ తగుల్తుంది… ఇంకేముంది..? చాలా ఇష్యూస్లాగే దీన్ని కూడా దబాయింపు ధోరణితో తొక్కేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందనే సందేహాన్ని కలిగించింది పొద్దున్నే… ఒకవైపు ప్రవీణ్ అనే గాడిద టీఎస్పీఎస్సీలో చేరి, అత్యంత సులభంగా ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకుని, ఎంచక్కా అనేకమంది అమ్మాయిలను ట్రాప్ […]
గజాన్ ఆరోహయామి… కానీ మత్తేభాలంటే మాటలా… ఈ యంత్రగజం చాలదా…
Robo Raman: “రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాల కాన్వాయ్ తో శోభిల్లుతున్న అమ్మకు నమస్కారం అంటున్నాం. “గజాన్ ఆరోహయామి ” అని షోడశోపచార పూజావిధానంలో ఇంటికొచ్చిన దేవుడిని ఏనుగు మీద ఎక్కించి పూజిస్తున్నాం. పార్వతి సున్నిపిండిని నలిచి సుతుడిగా మలిస్తే శివుడు ఏదో కారణానికి మెడ విరిచేశాడు. దాంతో పార్వతి అలిగితే అర్జంటుగా ఏనుగు ముఖాన్ని అతికించి ఆ పిల్లాడికి తిరిగీ ప్రాణం పోశాడు శివుడు. ఆ గజాననుడే లేకపోతే […]
రంగమార్తాండ… ప్రచారానికి ఓ కృష్ణవంశీ కొత్త వ్యూహం ఫలిస్తుందా…
సినిమాకు హైప్ కావాలి… లేకపోతే అడ్వాన్స్ బుకింగులు ఉండవు… తొలిరోజు భారీ టికెట్ల అమ్మకాలు ఉండవు… ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్‌కు డిమాండ్ రాదు… అందుకని ప్రచారం కావాలి… ప్రిరిలీజు ఫంక్షన్లు బోలెడు ఖర్చు యవ్వారం… ఆడియో రిలీజులు హోటల్లో పెట్టుకున్నా సరే, జర్నలిస్టులు, కవరేజీ ప్రలోభాలు, హోటల్ ఖర్చులు తక్కువేమీ కాదు… అందుకే పోస్టర్ రిలీజు, గ్లింప్స్, ట్రెయిలర్, టీజర్… తరువాత ఒక్కొక్క పాట రిలీజులు… ఇలా ప్రచారాన్ని లైవ్‌లో ఉంచుతున్నారు ఇప్పుడు… సోషల్ మీడియా […]
ఆ కొనుగోళ్ల నాటు ఆస్కార్కన్నా… కాంతారకు ఐరాస ప్రత్యేక ప్రదర్శన గౌరవం…
మీకు నాటునాటు పాట నచ్చలేదా..? దానికి ఆస్కార్ రావడం నచ్చలేదా..? ఈ ప్రశ్న ఎదురైంది… సింపుల్, ఆ పాటలో సాహిత్య విలువల్లేవు, సంగీత విలువల్లేవు… ప్యూర్ కమర్షియల్ వాసనగొట్టే ఆ పాట నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు… దిక్కుమాలిన మన సినిమాల్లో పాటలు ఎలాగూ అలాగే ఏడుస్తయ్… కానీ ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడమే నచ్చలేదు… అదేమిటి..? ఓ నెత్తిమాశిన పాటను ఆస్కార్ దాకా తీసుకెళ్లి… అన్ని కోట్లు ఖర్చుపెట్టి… ఎందరినో ‘‘సంతృప్తిపరిచి’’… లాబీయింగ్ చేసి… […]
స్వామివారికి మన తలనీలాల సమర్పణ… అందులో ఆడ ఏమిటి..? మగ ఏమిటి..?
ఇంతకుముందు ఏ దేవస్థానం దగ్గరకు వెళ్లినా సరే… ప్రత్యేకించి పల్లెజనం వెళ్లే గుళ్ల దగ్గర… మగాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా గుండ్లు చేయించుకునేవారు… దానికి పెద్ద మథనం కూడా ఉండేది కాదు… అసలు శిరోముండనం అంటేనే, తల వెంట్రుకలు తీయించుకోవడం అంటేనే స్వామివారికి భవభోగాల్ని సమర్పించేసి, సర్వం సమర్పించుకుంటున్నామనే అర్పణ భావన… దానికి మగ, ఆడ తేడా ఏమిటి..? కాకపోతే ఆడవారైతే గుండుతో వికారంగా కనిపిస్తామనే సందేహం, ఒకసారి గొరిగితే మళ్లీ ఒత్తుగా, పొడుగ్గా పెరగటానికి టైమ్ […]
ఈ ఫోటోకు పులిట్జర్ ప్రయిజ్ వచ్చింది… ఈ సంఘటన ఏమిటో తెలుసా..?!
మృత్యువు ముద్దు (Kiss of Death) అని ఏదో ఇంగ్లిష్ పోస్టులో కనిపించింది… కానీ మనం మృత్యుపరిష్వంగం లేదా మృత్యుస్పర్శ అందాం… ఇంకా ఆయుష్షు ఉంటే సుడిగుండంలో పడినా నిక్షేపంగా బయటపడతాడని కదా పెద్దలు చెప్పేది… నాకు ఈ కథ విన్నాక అదే వినిపించింది… నొసటి మీద ఆయుష్షు రాసి పెట్టి ఉంటే, యముడి పాశం కూడా పొగలు రేగుతూ వచ్చినా సరే, చివరకు వాపస్ వెళ్లిపోతుంది… నిజం… భూమ్మీద నూకలు బాకీ ఉండాలి… 1968… రోకో […]
రెండు మూడు దేశాలు విడిపోతే… అదీ ఓ ఖండం అనిపించుకుంటుందా..?!
వార్త ఏమిటంటే..? భూగర్భంలోని ఒక టెక్టానిక్ ప్లేట్ రెండుగా విడిపోతోంది… దానిపై ఉన్న ఆఫ్రికా ఖండం కూడా రెండుగా చీలిపోతుంది… ఈ రెండు చీలికల నడుమ ఓ కొత్త సముద్రం ఏర్పడుతుంది… కానీ ఇవన్నీ జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు….. ఇదీ వార్త… ఎవరో ఏదో రాస్తారు… ఇంకేం..? అందరూ దాన్నే పట్టుకుని పీకుతూ ఉంటారు… జరుగుతున్నది ఇదే… ఏ ఇంగ్లిష్ వాడు రాస్తే ఈనాడు అనువాదం చేసుకుందో, సొంత భాషలో రాసుకుందో, లేక తనే […]
పెద్ద బ్యాంకులు దివాలా తీస్తున్నయ్… బహుపరాక్, బహుపరాక్…
పార్ధసారధి పోట్లూరి ………. బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు! అయితే కియోసాకి అనే బాంకింగ్, స్టాక్ మార్కెట్ నిపుణుడి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా? కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో […]
మహిళా స్పెషల్ లగ్జరీ అపార్ట్మెంట్లు… మగ పురుగులు కూడా ఉండొచ్చు…
Luxury Peaks: కథలన్నీ ఎన్ని మలుపులు తిరిగినా…చివరికి కంచికే చేరాలి. అలా వ్యాసాలన్నీ ఎన్ని విషయాలను తడిమినా…చివరికి ఆవునే చేరాలి. ఆవు వ్యాసం సకల వ్యాసాలకు స్ఫూర్తి. ఒకప్పుడు ఆవు వ్యాసానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఆ ఆవు మిగతా అన్ని సృజనాత్మక రచనల్లోకి కూడా వచ్చి కూర్చుంది. అడుగడుగునా అన్ని రాతల్లో ఆవులే ఉంటాయి. ఎంత ఎగతాళిగా అనిపించినా… ఆవు వ్యాసం ఒక కాదనలేని నిజం. నిజమెప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది ఉదాహరణ కావాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఒక […]
వర్మ ఒక్కడే బతికితే సరిపోతుందా..? వర్శిటీ వీసీ ఏం పాపం చేశాడు మరి…!!
అసలు వర్మ తప్పేముంది..? అది ఎప్పుడో కుళ్లిపోయి దుర్గంధం వ్యాప్తిచేస్తున్న బుర్ర… మొత్తం తెలుగు సమాజానికి ఆ స్పష్టత ఉంది… కానీ తనకు పెద్ద పీట వేసి, పిలిచి, దండలేసి, కీలక ప్రసంగానికి ఆహ్వానించిన సదరు నాగార్జున యూనివర్శిటీ పెద్దలను అనాలి… ఐనా వాళ్లనూ అనాల్సిన పని లేదేమో… తమ బుర్రలు వర్మకన్నా దిగువ స్థాయిలోనేననీ, వాటికీ క్షయ వ్యాధి సోకినట్టేననీ వాళ్లే నిరూపించుకున్నారు… నిజానికి వర్మను ఎవరూ ఛీత్కరించి ఉమ్మేయనక్కర్లేదు… నాగార్జున యూనివర్శిటీ పెద్దలు ఏ […]
ఇమ్రాన్‌కు నూకలు చెల్లినట్టే అనిపిస్తోంది… అమెరికా, పాక్ ఆర్మీ రుసరుసలు…
పార్ధసారధి పోట్లూరి ……… పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గోడ దూకి పారిపోయిన ఇమ్రాన్ ఖాన్ ! పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి అతని నివాసానికి పోలీసులు వెళ్లారు కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ఇంటి గోడ దూకి ,పక్కనే ఉన్న వేరే వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడు … కోర్టు ఆర్డర్ పత్రాలు తీసుకొని ఇస్లామాబాద్ పోలీసులు ఒక పోలీస్ సూపరిండెంట్ నేతృత్వంలో జమాన్ పార్క్ లో గల ఇమ్రాన్ […]
తను ఎందుకిలా అయిపోయాడు..? సన్యాసాశ్రమానికి ఇది ఆధునిక రూపాంతరమా..?!
‘‘ఈమధ్యే… కాదు, నిజానికి మొన్ననే… నా భార్యతో మాట్లాడుతున్నాను… తన సోదరుడి గురించి… తను సన్యాసిగా మారిపోయాడు… ఆఫీసుకు వెళ్లడం మానేశాడు… భౌతిక ప్రపంచంతో అసలు సంబంధమే లేనట్టు మాట్లాడుతున్నాడు… తన పాత సంబంధ బాంధవ్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు… అసలు తను తనేనా..? తరచి పరిశీలిస్తే నాకు బాగా ఆశ్చర్యమేస్తోంది… బొంబాయిలోని ప్రతి ప్రముఖ బార్ సందర్శించేవాడిని తనతో కలిసి… యుక్త వయస్సులోనే కాదు, ఈ బార్ల సందర్శన అనే పుణ్యకార్యం మొన్నమొన్నటివరకూ నడిచింది… అఫ్ కోర్స్, […]
- « Previous Page
- 1
- …
- 219
- 220
- 221
- 222
- 223
- …
- 448
- Next Page »