Pronunciation:దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం. “శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే” అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు […]
వ్యవసాయం అన్నదాత ప్రాణాలకే రిస్క్..!మరణాలకు ఇవండీ కారణాలు..!
రైతుల మరణాల గురించి వార్త లేని రోజు లేదు… మా హయాంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్ అని కేసీయార్ వేదికలెక్కి ఎంత చెప్పుకున్నా… అవి ఆగడం లేదు… నిజానికి ఆగవు… ప్రతి దశలోనూ రైతు దోపిడీకి గురవుతున్నాడు… అన్ని రిస్కులూ తనవే… నమ్మిన ఎవుసం తన ఖర్చుల నుంచి, అవసరాల నుంచి గట్టెక్కించడం లేదు… దీనికితోడు ప్రభుత్వ విధానాల్లో లోపాలు సరేసరి… ఉదాహరణకు వ్యవసాయంలో అందరికన్నా ఎక్కువ రిస్క్ తీసుకునేది, ప్రాణాలను పణంగా పెట్టేది కౌలు రైతు… […]
విశ్వనాథ్ పట్ల కమల్ హాసన్ అగౌరవం… సారు గారికి గురువు గారు గుర్తే లేరు…
ఊళ్లో ఓ పెద్ద మనిషి గారి పెంపుడు కుక్క ఆయుష్షు తీరి చనిపోతే ఊరివాళ్లంతా బారులు తీరతారు… మందలుమందలుగా వెళ్లి ఆ పెద్ద మనిషిని పరామర్శిస్తారు… అబ్బ, మీ కుక్క భలే ఉండేదండీ, పిక్కల్ని తప్ప మరొకటి పీకి ఎరుగదు అని కూడా మెచ్చుకుంటారు… పంచాయతీ ఖర్చులతో డీజే బ్యాండ్, ఊరేగింపుతో వెళ్లి, బాణాసంచా కాల్చి మరీ అంత్యక్రియలు నిర్వర్తించి గౌరవాన్ని చాటుకుంటారు… కానీ ఆ పెద్ద మనిషే చచ్చిపోతే..? కుక్కలు కూడా పట్టించుకోవు..!! ఇది అందరికీ […]
ఆరు బయట బహిరంగ గణేశుడు… అటవీమాత ఒడిలో కొలువైన దోస దేవుడు…
సాధారణంగా గుడి అంటే..? దేవుడు ఎవరైతేనేం..? సాధారణంగా గర్భగుడి, మంటపం, ప్రహారీ, ధ్వజస్థంభం, గంటలతోపాటు హుండీలు ఉంటాయి… పెద్ద గుళ్లయితే భక్తులను దోచుకోవడానికి స్పెషల్ టికెట్లు, కాస్త ప్రహారీ పక్కనే రకరకాల ఆర్జిత సేవల టికెట్లు అమ్మే ‘దుకాణాలు’ కనిపిస్తాయి… క్యూలైన్ల నిర్మాణాలు కూడా..! హనుమంతుడి గుళ్లూ అంతే… కాకపోతే హనుమంతుడు పేదవాళ్ల దేవుడు కదా, ఎక్కడైనా సరే వాటిని కట్టేస్తారు… ఎర్రగా చందనం పులిమిన విగ్రహం, రాముడికి దండం పెడుతున్నట్టుగా మూర్తి, ఓ చిన్న స్లాబుతో […]
ఈ డబ్బా సినిమాలో ఏముందని డబ్బు పెట్టుబడి పెట్టావమ్మా తల్లీ..!!
‘‘నిర్మాతగా మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా… పాప్ కార్న్‌తో మొదలుపెట్టా… సినిమా భలే వచ్చింది, హీరో సాయి రోనక్‌తో నా రెండో సినిమా… థ్రిల్లింగ్ సినిమా అంటే సీన్ ఫార్వర్డ్ చేయకుండా చూసేలా ఉండాలి… మా సినిమా అలాగే ఉంటుంది… అందుకే ఓటీటీకి కూడా ఇంకా ఇవ్వలేదు… ఇకపైనా చిత్రాలు నిర్మిస్తాను… సినిమాను నాగచైతన్య, అఖిల్, నాగార్జున మెచ్చుకున్నారు…’’ అని చెబుతూ పోయింది నటి అవికా గోర్… ఫాఫం… ఏదో చెబుతోంది గానీ అసలు ఎందుకు ఈ […]
మూడు పాత్రలు… మూడు రెట్ల వాయింపు… బింబిసారతో వచ్చిన ఇమేజ్ ఫట్…
1992లో బాలకృష్ణ, దివ్యభారతి ధర్మక్షేత్రం సినిమాలో ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అని ఒకరినొకరు గట్టిగా అల్లుకుపోయిన పాట… ట్యూన్ బాగుండి, పైకి క్లాస్‌గా వినిపించినా సరే… ఊర మాస్ పాట అది… వేటూరి అంత త్వరగా దొరకడు గానీ పచ్చిదనం పులుముకున్న పాట… పెదవి కొరికే పెదవి కొరకే వంటి భేషైన పదప్రయోగాలు ఒకటీరెండు బాగున్నా… వేడి చెమ్మ, తొడిమ తెరిచే తొనల రుచికే వంటి చాలా కథలు పడ్డాడు… ఈ సినిమా పాటతో కథనం మొదలుపెట్టేందుకు కారణముంది… […]
బింబిసారతోనే పునర్జన్మ… అదే ఊపులో మరిన్ని సినిమాలు చకచకా…
కళ్యాణరామ్… ఎన్టీయార్ నట వారసుల్లో తన తరువాత మొదటితరంలో బాలకృష్ణ మాత్రమే, ఇంకెవరూ లేరు… అప్పుడెప్పుడో మొదలు పెట్టిన ప్రస్థానంలో ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నాడు… ఆమధ్య చాన్నాళ్లు గ్రాఫ్ ఘోరంగా పడిపోయినవేళ అఖండతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు… రెండో తరంలో జూనియర్ సూపర్ హిట్టయ్యాడు… నిజంగా సరైన పాత్రలు పడాలే గానీ తనను కొట్టేవాడు లేడు టాలీవుడ్లో… ఆ ఎనర్జీ, ఆ మెరిట్, ఆ ఈజ్, ఆ డిక్షన్, ఆ డాన్స్ అన్నీ ఉన్నాయి […]
సాక్షి vs ఈనాడు… కోర్టుకెక్కిన మీడియా వార్… జగన్ జీవోపై రుసరుస…
ఓసారి రామోజీరావును జగన్ కలిశాడు… అంతే… ఆ మధ్యలో కొన్నాళ్లు సైలెన్స్… అంతే, ఇక మళ్లీ మొదలైంది… సాక్షి వర్సెస్ ఈనాడు పంచాయితీ ఈసారి ఏకంగా కోర్టు తలుపులు తట్టింది… సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి జగన్ ప్రత్యేకంగా ఒక జీవో ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది… సాక్షి, ఈనాడుల ద్వంద్వ యుద్ధంలో ఇది మరో అధ్యాయం… వివరాల్లోకి వెళ్దాం… వలంటీర్లు, గ్రామ-వార్డు సెక్రెటేరియట్ స్టాఫ్ దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా […]
వెండితెరపై రంగస్థల పతాక… అన్ని పాత్రలూ చేసిన సంపూర్ణ నటుడు…
Bharadwaja Rangavajhala……….. రంగస్థల నట ప్రతిష్టను తెరమీద నిలబెట్టి వెలిగించి కనుమరుగైన నిజమైన నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. దేశానికి స్వతంత్రం రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే 1945 అగస్ట్ పదిహేనో తేదీన ఆయన జన్మించారు. 1960 లో అంటే తన పదిహేనోయేట స్టేజ్ మీద కాలుపెట్టారు. కన్యాశుల్కం నాటకంలో ఆడి పేరు తెచ్చుకున్నారు . ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు. స్టేజ్ ఆర్టిస్టుగా పరిషత్ నాటకపోటీల్లో రాళ్లపల్లి ఓ సంచలనం. ఆయన సంభాషణల విరుపు ప్రత్యేకంగా […]
శాములూ… నీ కాళ్లు మొక్కినా తప్పులేదు… మొగుడంటే నువ్వే భాయ్…
ఖాకీల కారుణ్యం !! *** భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం *** పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకునేది.. కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసుంటుందని నిరూపితమైన ఘటన ఇది. . నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత కూడా వారికి కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ […]
నేను లేక భారతమే లేదు… కట్టుబాట్లు ఛేదించి బతికా… ఐతేనేం ఎప్పుడూ సుఖం లేదు…
అసలు భారతం ఎంత పెద్ద గ్రంథం అయితేనేం… భారతం లేకుండా దేశం లేదు, నేను లేక భారతం లేదు… నేనే ప్రథమ పాత్ర… ప్చ్, కానీ నన్నెవరూ పట్టించుకోరు… ఆ కాలమాన సంప్రదాయాల్ని, కట్టుబాట్లను ఛేదించాను, తిరగబడ్డాను, అలాగే బతికాను… అయితేనేం, ప్రతిచోటా నాకు నిరాశే మిగిలింది… నేను అనుకున్నట్టు జరిగి ఉంటే భారత కథ వేరే ఉండేది… అసలు ఆ కథే ఉండేది కాదేమో… తప్పేమీ అనిపించలేదు… మా కులంలో సమ్మతమే అంటారు… ఓరోజు నా […]
స్టార్ టీవీ బీబీజోడీ ఈటీవీ షోను కొట్టేసింది… జంటలు తెగ రెచ్చిపోతున్నయ్…
ఈటీవీ డాన్స్ షో నానాటికీ పలుచన అయిపోతూ… పిచ్చి సర్కస్ ఫీట్లు, ఆది ర్యాగింగ్ డైలాగుల షో అయిపోయాక… ఆహా టీవీ ఓ డాన్స్ షోను హిట్ చేసుకుంది… ఆ షోలో నాణ్యత కనిపించింది… ఏదో కామెడీ షోగా, పంచుల ప్రోగ్రాంగా మార్చకుండా డాన్స్ మీద కాన్సంట్రేట్ చేశారు ఆ షోలో… ఇప్పుడు మాటీవీ ప్రొఫెషనల్ డాన్సర్స్‌ను గాకుండా బిగ్‌బాస్ వివిధ సీజన్ల కంటెస్టెంట్లతో జోడీలు కూర్చి, వాళ్లతో డాన్స్ షో చేసింది… ఇప్పుడు అది హిట్… […]
ఓ కామెడీ ముద్రతో ఇంతటి బరువైన పాత్ర… కోవై సరళ చేసింది, మెప్పించింది…
కోవై సరళ… తెలుగు ప్రేక్షకులకు ఎవరూ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు… సూపర్ టైమింగుతో కామెడీని పండించే ఈమె హఠాత్తుగా ఓ సీరియస్ పాత్రలో… ఎమోషన్స్‌ను పండించి అందరి ప్రశంసలూ అందుకుంటున్న తీరు విశేషం… తెలుగు, తమిళ సినిమాల్లో దాదాపు ప్రతి సీనియర్ కమెడియన్తోనూ కలిసి నటించిందామె… కోవై సరళ అనగానే ఆమె పోషించిన కామెడీ పాత్రలే మనకు మనోచిత్రంలో కదలాడతాయి… అలాంటిది సెంబి సినిమాలో పోషించిన బరువైన పాత్ర పూర్తిగా ఆమెలోని అసలైన […]
కమాన్ నక్సల్ కామ్రేడ్స్… ఏవీ ల్యాండ్ మైన్స్, ఏవీ క్లెమోర్ మైన్స్, ఏదీ ఆర్డీఎక్స్..?!
కూల్చేయండి, కాల్చేయండి, మటాష్ చేసేయండి, మట్టిలో కలపండి… కమాన్, నక్సలైట్లూ గేరప్… మంతుపాతర్లు పట్టుకురండి, ప్రగతిభవన్ పేల్చేయాలి……. ఇలా ఉంది రేవంత్ మాటల తీరు… పరిణతి చెందిన నాయకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ జవాబుదారీతనం ఉండాలి, వెనకాముందు ఆలోచన ఉండాలి, మంచీచెడూ బేరీజు వేయబడాలి… అది రాజనీతిజ్ఞత… అంతేతప్ప జనం చప్పట్లు కొడుతున్నారు కదాని ఏదిపడితే అది మాట్లాడితే అంతిమంగా తనకు నష్టం, తన పార్టీకి నష్టం… ప్రత్యర్థులకు చేజేతులా పావులు అప్పగించడమే… రేవంత్ […]
అప్పర్ భద్ర ప్రాజెక్టుపై జగన్ ఫైట్ స్పిరిట్ కేసీయార్లో ఎందుకు లేదు..?!
గతంలో ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి దిక్కు అన్నట్టుగా మాట్లాడేవాడు కేసీయార్… ఇప్పుడు తనదీ జాతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీల విశిష్టత మరిచిపోతాడు, మాట కూడా మాట్లాడడు… అవసరమైతే ‘‘బాబ్లీ అసలు ఇష్యూయే కాదు, శ్రీరాంసాగర్ నీళ్లు ఎత్తిపోసుకొండి, పెద్ద మనస్సుతో చెబుతున్నా’’ అంటాడు… అదేదో తనే తెలంగాణ మీద సర్వాధికారాలు ఉన్నట్టు… బాబ్లీ ఎగువన కట్టే ప్రాజెక్టులపై నిలదీయాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి ‘‘మీ ఇష్టమొచ్చినన్ని నీళ్లు వాడుకొండి’’ అని ఓపెన్ ఆఫర్ ఇస్తే, దాని […]
వామ్మో… సుమపై జూనియర్ అంత సీరియసయ్యాడా..? ఇక ఆమె మొహమే చూడడా..?
చివరకు ఈటీవీ భారత్ కూడా సగటు యూట్యూబ్ చానెల్ అయిపోనట్టు అనిపించింది ఆ వార్త చూశాక… అమిగోస్ అని కల్యాణరామ్ సినిమా ఒకటి వస్తోంది తెలుసు కదా… దానికి ప్రిరిలీజ్ ఈవెంట్… అంతకుముందు జూనియర్ వచ్చి బింబిసార ప్రిరిలీజ్లో నాలుగు మంచి మాటలు మాట్లాడాడు కాబట్టి అది సూపర్ హిట్ అయిందనేది ఓ సెంటిమెంట్… సో, నిర్మాతలు మైత్రి మూవీస్ ఈ ప్రిరిలీజ్కూ రమ్మన్నారు… కల్యాణరామ్ సినిమాా కాబట్టి కాదనలేడు… మరోవైపు తారకరత్న చావుబతుకుల్లోనే ఉన్నాడు… ఇంకోవైపు […]
పాన్ ఇండియా రైటర్… మూలకథల్ని నిలువునా నరికి RRR సినిమా చూపిస్తాడు…
పాన్ ఇండియా నవలిస్టు… ఈ పదమే కొత్తగా ఉంది కదా… నిజమే, నిఖార్సయిన, సిసలైన నవలిస్టు… ఇప్పటికి 60 లక్షల పుస్తకాలు… మీరు చదివింది నిజమే, అనేక భారతీయ భాషల్లో సహా ఆరు మిలియన్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి తనవి… కిండ్లే, ఆడియో బుక్స్ అదనం… దాదాపు 200 కోట్ల టర్నోవర్ అని అంచనా… ఒకప్పుడు చేతన్ భగత్, తనెప్పుడో ఫేడవుట్… ఇప్పుడు అమిష్ త్రిపాఠి… శివపురాణాన్ని మూడు బుక్స్‌గా రాసిన తను రామాయణాన్ని నాలుగు పార్టులుగా రచించాడు… […]
జోలా జో-లమ్మ జోలా, జేజేలా జోలా, జేజేలా జోలా… హమ్ చేయండి ఓసారి…
Bharadwaja Rangavajhala…….. విశ్వనాథ్ చిత్రాల్లో లాలి పాటలు … హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలతో పోలిస్తే జోలపాటలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ఆయన గుర్తించారో లేదోగానీ … నిజం. అసంకల్పితంగా జరిగిపోయి ఉండవచ్చుకూడా. ఆయన సినిమాలకు ఆయనే కథ సమకూర్చుకోవడం వల్ల కావచ్చు … ఆయన మీద చిన్నతనంలో విన్న లాలి పాటల ప్రేరణ ఉండడం వల్లనూ కావచ్చు … మనసు సేద తీరే […]
జర్నలిస్టుల ఇళ్లస్థలాలను జటిలం చేస్తున్నది కేసీయార్ సర్కారే..!
ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్య సుప్రీం కోర్టులో సానుకూలంగా పరిష్కారం కావడానికి కేసీయార్ ఇచ్చిన అఫిడవిట్లే ఆధారం… అనుకున్నట్టే సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు కూడా వచ్చింది… జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మంత్రి కెటిఆర్ జస్టిస్ రమణకు కృతజ్ఞతలు చెబుతూ… జర్నలిస్ట్ లకు తాము ఇచ్చిన హామీని అమలు చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది అని ట్వీట్ చేశాడు… ఇక్కడివరకూ కేసీయార్ ధోరణి, కేటీయార్ స్వాగతించిన తీరు […]
ఉత్తదే అంకెల కనికట్టు… అప్పుల ఊబి, అసాధారణ అంచనాల మాయామర్మం…
అనుకున్నట్టుగానే… ఉద్దేశపూర్వకమో తెలియకో కానీ ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలంగాణ బడ్జెట్‌ను శాస్త్రీయంగా విశ్లేషించలేదు… అసలు ఆదాయంపై అశాస్త్రీయ, అడ్డగోలు అంచనాల్ని విప్పిచెప్పలేదు… ఏ శాఖకు ఎంతో రాసేసి పేజీలు దులుపుకున్నారు… పొలిటికల్ పార్టీల నేతలు అసలు బడ్జెట్ చదవరు, చదివినా అర్థం కాదు, అర్థమైనా ఎలా జనానికి చెప్పాలో తెలియదు… సేమ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలాగే… ఎంతసేపూ అంకెల గారడీ అని విపక్షాలు, ప్రగతిశీల బడ్జెట్ అంటూ అధికారపక్షం పడికట్టు పదాల్ని ప్రయోగించడమే… […]
- « Previous Page
- 1
- …
- 235
- 236
- 237
- 238
- 239
- …
- 449
- Next Page »