నిజానికి చాలారోజులైంది ఈ ప్రోగ్రాం స్టార్టయి… ఎహె, నలుగురు సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏవో పిచ్చి గెంతులు వేయిస్తారు, అంతేకదా అనుకున్నాను అందరిలాగే… కానీ స్టార్‌మాటీవీలో వచ్చే బీబీ జోడీ ప్రోగ్రాం డిఫరెంటుగా ఉంది… ఆకట్టుకుంటోంది… బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రాం చేయడం మాటీవీకి అలవాటే… వాళ్లకు కూడా అదనపు ఆదాయం కాబట్టి మాటీవీ చెప్పిన ప్రోగ్రామ్స్‌లో చేస్తుంటారు… మాటీవీకి నాన్-ఫిక్షన్ కేటగిరీలో రియాలిటీ షోల అవసరం ఉంది… లేకపోతే రేటింగుల్లో ఇంకా పడిపోయే ప్రమాదం […]
పద్మవ్యూహాన్ని ఛేదించిన ఖైదీల కథే.. ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్!
చుట్టంతా నీరు.. మధ్యలో ఓ దీవి. ప్రపంచం మొత్తం నుంచి ఏకాకై పడేసినట్టుండే ఆ దీవిలో ఎత్తైన గోడల మధ్య తప్పించుకోవడం అసంభవమయ్యే ఓ పెద్ద జైలు. అంతుకుమించి నిత్యం నిఘా నీడలో కనిపించే భారీభద్రత. ఆ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు.. కేవలం చెంచాలు ఉపయోగించి పారిపోతే..? ఆ వాస్తవ సంఘటనే ఎస్కేప్ ఫ్రమ్ అల్కాట్రాజ్ మూవీ నేపథ్యం. వివిధ నేరాల్లో శిక్షనుభవిస్తూ.. ఎంతటి భారీ భద్రత ఉన్న జైళ్లనుంచైనా పారిపోగల్గే కరుడుగట్టిన నేరస్థులకు… ఆ […]
సింగర్ మంగ్లిపై దాడి… కన్నడిగుల్లో ఉన్మాద స్థాయికి భాషాభిమానం…
మంగ్లికి వివాదాలు, తలనొప్పులు తప్పడం లేదు… ఇప్పుడైతే ఏకంగా తన కారు మీద దాడి చేశారు ఆగంతకులు… బళ్లారి ఉత్సవాల్లో పాల్టొనడానికి వెళ్లిన మంగ్లిపై (సత్యవతి రాథోడ్) దాడి… మున్సిపల్ కాలేజీ గ్రౌండ్స్‌లో తను పాల్గొన్న ప్రోగ్రాం ముగిసి, తిరిగి వెళ్లిపోతుంటే ఈ దాడి జరిగింది… కారు అద్దాలు ధ్వంసమయ్యాయి… అంతకుముందు కొందరు మేకప్ టెంటులో జొరబడ్డారు… తరువాత రాళ్లు రువ్వారు… సమయానికి పోలీసులు రంగప్రవేశం చేసి, వాళ్లను చెల్లాచెదురు చేశారు… మంగ్లి ఇప్పుడు దాదాపు అన్ని […]
ఈనాడు చెప్పలేదు… ఆమే ట్వీట్ ద్వారా ఆ సంఘటన వివరించింది…
నిజంగా కలవరం కలిగించే సంఘటనే… ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసే స్మిత సబర్వాల్ ఇంటికి రాత్రిపూట ఓ డిప్యూటీ తహసిల్దార్ వెళ్లిన తీరు ఆందోళనకరమే… రెండురోజుల క్రితం జరిగిన సంఘటనను ఈనాడు దాన్ని కవర్ చేయడం బాగానే ఉంది… కానీ ఆమె ఎవరో పేరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు… ఎందుకో భయపడింది… ఆ వార్త రాసిన తీరు కూడా ఆమె ఎవరో ఊహించేట్టుగా కూడా లేదు… వార్త ఏమిటంటే… స్మిత సబర్వాల్ భర్త ఐపీఎస్ అధికారి… ఆమె […]
బిరుదు కూడా కబ్జా ఏమిటి రామజోగయ్య శాస్త్రీ… ఇదేం చోద్యం..?!
రామజోగయ్య సరస్వతీపుత్ర అయితే… పుట్టపర్తి ఏమవుతాడు? “ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది; ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది; ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది; ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ మాది; తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ పదునాల్గు భాషలందు, బ్రతుకునకు బడిపంతులు, భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది” ఇది సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తన గురించి తనే చెప్పుకున్న […]
భలే చాన్సులే..! ఆ రెండూ వర్కవుటైతే సాయిపల్లవికి ఫుల్ ఫాయిదా..!
తెగింపు తరువాత అజిత్ చేయబోయే సినిమా… భారీ బడ్జెట్… తగ్గేదేలా… లైకా ప్రొడక్షన్స్ వాళ్ల సినిమా… 250 కోట్ల బడ్జెట్… సహజంగానే అందులో తనకు జోడీగా ఎవరు నటిస్తారు..? జానర్ ఏమిటి..? వంటి ప్రశ్నలు రేకెత్తుతాయి కదా… అసలు అజిత్ సినిమాకు అంత మార్కెట్ ఉందానేది మరో ప్రశ్న… తునివు (తెగింపు) సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 160 కోట్లు… మహా అయితే మరో 40 కోట్లు వచ్చి, 200 కోట్లు కష్టమ్మీద వస్తాయేమో… శాటిలైట్ టీవీ […]
‘బేశరం ప్రశ్న’ వేసిన జర్నలిస్టు… కంగనా నుంచి ఊహించని రిప్లయ్…
కంగనా రనౌత్… బాలీవుడ్లో ఓ ఇంట్రస్టింగ్, ఫైటింగ్ కేరక్టర్… ఆమె వార్తలకు రీచ్ ఎక్కువ… సహజంగానే ఆమె ప్రెస్మీట్లకు ఎక్కువ మంది రిపోర్టర్లు హాజరవుతుంటారు,… కవరేజీ కూడా ఎక్కువే… అయితే కంగనా ప్రెస్‌మీట్‌ను తమకు అనుకూల ప్రచారం కోసం వాడుకుందామని అనుకున్న దీపిక పడుకోన్ పీఆర్ టీం కంగనా బ్లంట్ రెస్సాన్స్తో భంగపడిపోయింది… బేశరం పాటతో దీపిక ఇజ్జత్ పోగొట్టుకుంది… జవాబులు చెప్పాల్సి వస్తుందనే భయంతో తను ప్రెస్‌కు కూడా దూరదూరంగా ఉంటోంది… కానీ ఆమె పీఆర్ […]
పైసలా, పెంకాసులా… వరల్డ్ ఫోర్త్ రిచ్చెస్ట్ యాక్టర్ ఆస్తి ఇన్నివేల కోట్లా..?
అమితాబ్ కుటుంబంలో ముగ్గురు సంపాదిస్తున్నారు… సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు… నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ దరిదాపుల్లోకి కూడా రారు… హాలీవుడ్ నటులకు ఇచ్చే రెమ్యునరేషన్లు, ఎండార్స్మెంట్ డబ్బులు అడ్డగోలు… ఐనా సరే, నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ వాళ్లను కూడా దాటేసిపోయాడు… ప్రస్తుతం షారూక్ పొజిషన్ ఏమిటో తెలుసా..? ప్రపంచంలోకెల్లా నాలుగో అత్యంత ధనిక నటుడు… పఠాన్ సినిమాను బ్యాన్ చేస్తారా..? చేసుకొండి… కొడుకు ఆర్యన్ ఖాన్ మరింతగా డ్రగ్ కేసుల్లో ఇరుక్కుంటాడా..? […]
ఓ పిచ్చి రాజు వర్సెస్ ప్రకృతి… కాంతార-2 కథేమిటో ముందే చెప్పేశారు…
అయ్యో అయ్యో, కథ ముందే తెలిస్తే ఇంకేమైనా ఉందా..? థ్రిల్ ఉండదు కదా, సస్పెన్స్ ఉండదు కదా… అని నిర్మాతలు, దర్శకులు, హీరోలు భలే కంగారుపడిపోతుంటారు….. కానీ దమ్మున్న దర్శకుడైతే ముందే కథ చెబుతాడు, లేదా సినిమాలోనే ముగింపుతోనే కథ ప్రారంభిస్తాడు… తను కథ చెప్పబోయే తీరు మీద కాన్ఫిడెన్స్ అన్నమాట… కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ఆ నమ్మకం ఉంది… అందుకే తీయబోయే కాంతార-2 కథ ముందే చెప్పేశాడు… అందరూ అనుకున్నట్టు ఇది కాంతార […]
అయ్యో కృష్ణ వంశీ… నీ మార్క్ పాటను ఆశపడితే… ఎంత పని చేశావయ్యా…
మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ పాట… దానికి ఇ‘లయ రాజా’ సంగీతం… పాటల చిత్రీకరణలో కింగ్ కృష్ణ వంశీ… పాపులర్ రంజని గాయత్రి సిస్టర్స్ గాత్రం… అసలు ఇంకేం కావాలి..? చెవుల తుప్పు వదిలిపోవాలి కదా… చాన్నాళ్లుగా తన నుంచి ఓ మంచి క్రియేటివ్ కంటెంట్ కోసం రసజ్ఞులైన ప్రేక్షకులు, శ్రోతలు ఆసక్తిగా, దప్పికతో ఎదురుచూస్తున్నవేళ……. కృష్ణవంశీ తుస్సుమనిపించాడు…! రంగమార్తాండ సినిమా వీడియో పాట రిలీజ్ చేశారహో […]
ఎనుకట గట్లుండె మరి ! ముట్టుకుంటె ముడుచుకపొయ్యే ఆరుద్ర పురుగు లెక్క!!
లగ్గపు లాడూలు **** (మాఘమాసం కోసం.. మధురమైన జ్ఞాపకం) 1980-85 కాలపు సంగతి ! అవి నేను primary to upper primary చదివే రోజులు…. ఆ కాలంల- మా కరీంనగర్ చుట్టుపక్కల గ్రామసీమలల్ల పెండ్లిపేరంటాలకు, ప్రభోజనాలకు ఊరందరికీ శుభలేఖలు పంచెటొల్లు. చెయిగలిసిన వారందరి ఇంటింటికీ,, పొద్దుగాలనే శుభకార్యం జరుపుతున్నవారి ఇంటిచాకలి వచ్చి ‘పిలుపు’అందించి పోయెవాడు. పిలుపందుకున్నవారు(సహజంగా మగవారు) ఉదయం పలారం, మధ్యాహ్నం భోజనానికి విధిగా పొయ్యేటొల్లు… ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూసి ఎదిరిచూసి తండ్రులవెంట జోజోటంగా పిల్లలమూ […]
తింగరి పిల్ల కాదు… రష్మిక మంధన మంచి స్ట్రాటజిస్టే… పెద్ద బుర్రే…
రిషబ్ శెట్టితో కైలాట్కం, కన్నడ ఇండస్ట్రీతో గోకుడు గట్రా వార్తలు చదివీ చదివీ రష్మిక మంథన ఉత్త తింగరిది అనుకుంటాం గానీ… తను మంచి స్ట్రాటజీతోనే ముందుకు పోతోంది… ఆ వారసుడు సినిమాలో ఓ ఎక్సట్రా ఆర్టిస్టు పాత్రతో సమానంగా నీ పాత్ర ఉంది, జస్ట్ రెండు పాటల కోసం నిన్ను పెట్టుకున్నట్టున్నారు, అందులో ఓ హిట్ సాంగ్ రంజితమే… అంతకుమించి ఆ సినిమాతో నీకొచ్చిన ఫేమ్ ఏముంది..? డబ్బు వచ్చి ఉండవచ్చుగాక, కానీ ఇజ్జత్ పోలేదా […]
బేశరం రంగ్ పాట కాస్త నయం… కల్యాణరామ్ అమిగోస్ పాట ఎకఎక, పకపకా…
నెత్తుటిలో ఆ నందమూరి ఆనవాళ్లున్నా సరే… అసలు కల్యాణరాం కెరీర్ ఒక అడుగు ముందుకు, పదడుగులు వెనక్కి అన్నట్టు ఉంటుంది… లక్కీగా మొన్న బింబిసార క్లిక్కయి మళ్లీ తెర మీద నాలుగు రోజుల ఆయుష్షు దొరికింది… దాన్ని అలాగే కొనసాగించాలంటే, ఆ టెంపో సాగాలంటే మరింత మంచి కథ అవసరం… మైత్రీ మూవీస్ వాళ్లు దొరికారు, డబ్బుకు ఢోకా లేదు… కాకపోతే టేస్టే మళ్లీ గాడితప్పినట్టుంది… ఓ సాంగ్ రిలీజ్ చేశారు… ఎక ఎక అంటూ మొదలవుతుంది… […]
ఈ ప్రశాంత్ కిషోర్‌కు తాత… ఓ కూటనీతిజ్ఞుడు… ఇది మరో చాణక్యం…!!
పొలిటికల్ స్ట్రాటజిస్టుుల, సలహాదారులు ఇప్పుడే కాదు… మహాభారత కాలం నుంచీ ఉన్నారు..! ఈ ప్రశాంత్ కిశోర్‌లు, రాబిన్ శర్మలు, అనేకానేక మంది సలహాదారులు ఏ కేటగిరీలోకి వస్తారో తెలియదు, ఖజానా నుంచి, పార్టీల బొక్కసాల నుంచి ప్రజల సొమ్మును ఎందుకు తినేస్తారో తెలియదు కానీ… ఓసారి మనం అలా భారతకాలానికి వెళ్లొద్దాం… మనకు చాణక్యనీతి తెలుసు… తను సాధించిన పగ, పన్నిన వ్యూహాలు, ఆ బుర్ర చురుకుదనం, ఆయన రాసిన ఆర్థికశాస్త్రాలు, పాలన నీతుల మీద బోలెడు […]
కశ్మీర్లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్మెంట్..!!
పార్ధసారధి పోట్లూరి …. 74 సంవత్సరాల చెదలు పట్టిన చెట్టుని ఆసాంతం నరికేసిన మోడీ & జై శంకర్ ! యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్ (United Nations Military Observer Group in India and Pakistan) అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పరిశీలక బృందం… ఈ బృందం ముఖ్య ఉద్దేశ్యం భారత పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదకలు ఇవ్వడం! 948 లో నెహ్రూ కాశ్మీర్ […]
ఎంతసేపూ ఆడ దేహాలు, మొహాలే… నెట్ సుధీర్‌లకు మగ మొహాలు పట్టవెందుకో..!!
పింక్ శారీలో జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యను చూస్తే తట్టుకోలేం భయ్యా… నాభి అందాలతో అనసూయ అదుర్స్ స్వామీ… శ్రీముఖి క్లీవేజీతో మతిపోతోంది బాసూ… విష్ణుప్రియ ఎదపొంగులతో ఇక వేడి సెగలే… కొత్త లుక్కులో రష్మి పిచ్చెక్కిస్తోంది చూశారా… జాకెట్ మరిచి దడపుట్టిస్తున్న శ్రీలీల……. ఇలాంటి థంబ్ నెయిల్స్ కోకొల్లలు… యూట్యూబ్ చానెళ్లే కాదు, తెలుగులో మేం తోపులం అని చెప్పుకునే సైట్లు సైతం ఇదే బాట… ఇక సినిమా హీరోయిన్ల విషయంలోనైతే చెప్పనక్కర్లేని హెడింగులు, వర్ణనలు… […]
ఆకాశంలో పథక ప్రచారం… ఆచరణలో డొల్లతనం… ఆంధ్రజ్యోతి కాగ్ పాత్ర…
కొన్ని రాజకీయ వార్తలకు సంబంధించి… ఉద్దేశపూర్వకమైన యాంటీ జగన్ స్టోరీలకు సంబంధించి… ఆంధ్రజ్యోతి పాత్రికేయం పరమ చికాకు యవ్వారం..! కానీ అవి వదిలేస్తే చాలాసార్లు తనను మెచ్చుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఏపీ పాత్రికేయం ఓ భ్రష్టుపట్టిన తంతు… కానీ తెలంగాణ విషయానికొస్తే రాయాల్సింది బోలెడు… కానీ… ప్రతి పత్రిక నమస్తే తెలంగాణను మించి కేసీయార్‌ను, తన పథకాల్ని కీర్తిస్తూ, ఆ సేవలోనే పునీతమై తరిస్తోంది… చివరకు నిష్పాక్షికంగా ఉండాల్సిన, ఉండతగిన సాక్షి కూడా […]
నరుకుడు… థియేటరంతా నెత్తుటి వాసన… దెబ్బకు దడుపుజ్వరం పట్టేసింది…
సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడ్డం మాత్రం ఇష్టముండదు. మల్టిప్లెక్స్ లు వచ్చాక…థియేటర్ కు వెళుతుంటే…మనమేదో నేరం చేసి విచారణ ఎదుర్కొంటున్న దోషుల్లా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది నాకు. బయట 20 రూపాయల వాటర్ బాటిల్ మల్టిప్లెక్స్ లో 80 రూపాయలు ఎందుకవుతుందో? బయట 10 రూపాయల పాప్ కార్న్ మల్టిప్లెక్స్ లో 120 ఎందుకవుతుందో కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఆ లోకోత్తర సినిమాలకు తొలివారం రెండు, మూడింతలు రేట్లు పెరగడం మీద కూడా నాకు పట్టింపు […]
అతని పేరే మాయారామ్…! చిదంబరంతో కలిసి ‘సెక్యూరిటీ థ్రెడ్’ చించేశాడు..!!
పార్ధసారధి పోట్లూరి …….. చిదంబరం మరియు అతని అనుచర అధికారులు భారతీయ నోట్ల విషయం లో చేసిన స్కామ్ ! UPA ప్రభుత్వం తాను అధికారంలో ఉన్నంత కాలం ప్రతి లావాదేవీలో తనకి ఎంత లాభం ఉంటుంది అనే దాని మీదనే బాగా శ్రద్ద పెట్టింది ! విషయం : భారత దేశపు కరెన్సీ నోట్ల తయారీలో వాడే ‘సెక్యూరిటీ త్రెడ్ ‘ విషయంలో UPA ప్రభుత్వం ఎలాంటి మోసానికి పాల్పడ్డదో తెలియచేసే అంశం ఇది. భారత […]
తప్పుడు ప్రకటనలకు కొత్త ముకుతాడు… సెలబ్రిటీలూ బాధ్యత వహించాల్సిందే…
మొన్న మనం ఓ సంగతి ముచ్చటించుకున్నాం… కూల్ డ్రింక్‌లో అడ్డగోలుగా కెఫీన్ ఉంటుంది… అది నిజానికి పిల్లలకు, గర్భిణులకు మంచిది కాదు… మోతాదు పెరిగితే, ఎవరికీ మంచిది కాదు… కానీ పెద్ద పెద్ద స్టార్స్ కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా పెద్ద ప్రకటన ఇచ్చి, దిగువన ఎక్కడో కనీకనిపించని రీతిలో చిన్న డిస్‌క్లెయిమర్ ఇస్తారు… ఎక్కువ కెఫీన్ మంచిది కాదు అని..! ఇలాంటివి వినియోగదారులను తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు బోలెడు… ఏటా వేల కోట్ల దందా… ఉదాహరణకు పాన్ […]
- « Previous Page
- 1
- …
- 251
- 252
- 253
- 254
- 255
- …
- 458
- Next Page »