ముందుగా యలమంచిలి శివాజీ ఆంధ్రజ్యోతిలో రాసిన ఓ వ్యాసంలోని కొన్ని భాగాలను చెప్పుకుందాం… కృష్ణ జైఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు, తెలంగాణ వ్యతిరేకి, అప్పట్లో జైఆంధ్ర ఉద్యమకారులు మద్రాసు వెళ్లి, పెద్ద పెద్ద సినిమా నటుల్ని, దర్శకుల్ని కలిస్తే… ఎవరూ ముందుకు రాలేదు, కృష్ణ ఒక్కడే సమర్థించాడు… ఇవన్నీ వోకే… ఇప్పుడు కొత్తగా చెప్పుకోనక్కర్లేదు… తనపై ఇప్పుడు ముద్రలు కూడా అవసరం లేదు… అప్పట్లో తనకు నచ్చింది చేశాడు… ఒక ఏడాది సంపాదన ఉద్యమానికి ఇద్దామని కృష్ణ […]
జోష్ లేదు… టీఆర్ఎస్ ప్రధాన కేడర్‌లో ఎందుకో అనూహ్యంగా స్తబ్దత…
తాడో పేడో… బీజేపీ అంతగా కాన్సంట్రేట్ చేస్తోంది తెలంగాణ మీద… కేసీయార్ మీద… ఇంకా చేయబోతోంది… తప్పనిసరై కేసీయార్ కూడా బలంగా ప్రతిఘటిస్తున్నాడు… అయితే తనదైన శైలిలో, ముందస్తు దాడి వ్యూహంతో…! మొన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు పథకాలు, ఆ వీడియోల విడుదల అందులో భాగమే… కాకపోతే స్కెచ్ ఎక్కడో తన తాజా అదృష్టంలాగే గాడితప్పి తుస్సుమంది… వీసమెత్తు ఇంపాక్ట్ లేదు… పైగా చివరకు హైకోర్టుకు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది… బీజేపీని బజారుకు లాగి, ఇరుకునపెట్టడానికి ఇంకేదో ఆలోచిస్తూనే […]
రిషబ్ మేనియా… చిన్న గుట్ట చాలనుకుంటే ఏకంగా ఎవరెస్టే ఎక్కించేస్తున్నారు…
అనూహ్యం… అసలు నమ్మబుద్ధి కానంత అసాధారణం… 15 కోట్లతో తీయబడిన ఒక చిన్న కన్నడ సినిమా ఏమిటి..? అయిదు భాషల్లో దేశవ్యాప్తంగా 400 కోట్ల వసూళ్లు ఏమిటి..? నిజానికి అది కాదు, కాంతార సినిమా సృష్టిస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు… తోపు అనుకుంటున్న కేజీఎఫ్ సినిమా కూడా కాంతార ధాటికి పక్కకు తొలగిపోయింది ప్రస్తుతం… ఆ రికార్డుల గురించిన వివరాల్లోకి వెళ్తే ఇప్పట్లో బయటపడబోం… మరేమిటి..? ఒకవైపు ఓటీటీలో విడుదల తేదీ దగ్గరకొస్తోంది… మరోవైపు కన్నడనాట రిషబ్ […]
ఫాఫం నాగార్జున… చివరకు ఆ ఆదిరెడ్డికీ లోకువ చేసిన బిగ్‌బాస్ టీం…
ఫాఫం నాగార్జున… మళ్లీ అదే అనాలనిపిస్తోంది… నిన్నటి షో చూశాక మరింత బలంగా ఇలాగే జాలేసింది… అసలు ఈ సీజనే పరమ చెత్త… ఈ దరిద్రం ఎప్పుడు అయిపోతుందా అని ఆ టీమే ఎదురుచూస్తున్నట్టుగా ఉంది… సరే, ఈ సీజన్ దివాలా తీసింది సరే… ఎలాగోలా పూర్తి చేసి, చేతులు దులుపుకుంటే సరిపోతుంది కదా… లేదు, మధ్యలో నాగార్జున పరువు తీస్తున్నారు… తనకేమో ఇదంతా సమజైతలేదు… బిగ్‌బాస్ టీం నాగార్జునను పూర్తిగా మిస్ లీడ్ చేస్తోంది… తనేమో […]
వేకువజామున వెన్నెల మరకలుగా… ఆహా… మేఘమా- దేహమా పాట నేటికీ క్లాసిక్…
మంచుపల్లకీ సినిమాకు నలభయ్యేళ్లు అని సోషల్ పోస్టు ఒకటి చూసేసరికి ఆనందమేసింది… అప్పట్లో క్లాస్ సినిమా… ప్రత్యేకించి మేఘమా దేహమా పాటకు కురిసిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు… ఆ సినిమాను డైరెక్ట్ చేసే సమయానికి వంశీ వయస్సు పాతికేళ్లు కూడా నిండలేదు… తనే ఆరున్నరేళ్ల క్రితం ఫేస్బుక్లో ఈ సినిమా సంగతులు వివరంగానే రాసుకొచ్చాడు… అందులో కొన్ని ఇంట్రస్టింగు పాయింట్స్…. Pasalapudi Vamsy.. మాటల్లోనే… కమలహాసన్ కి అన్నయ్య, సుహాసినికి తండ్రి అయిన చారుహాసన్ గారు […]
మహారాష్ట్రలోనే కాదు… కేరళలోనూ కాంగ్రెస్ కూటమి ఇచ్చుకపోతోంది…
పార్ధసారధి పోట్లూరి ……. కేరళ కాంగ్రెస్ పార్టీలో అభద్రతా భావం ! రాహుల్ ఎక్కువ రోజులు పర్యటించింది కేరళలో, కానీ అదే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం సంతోషంగా లేరు రాహుల్ పర్యటన వలన… పోయిన బుధవారం రోజున కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ కన్ననూర్ లో చేసిన ప్రకటన అక్కడ రాజకీయ అభద్రతా భావాన్ని సూచిస్తున్నది. కన్ననూర్ లోని ఒక సభలో కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ మాట్లాడుతూ దశాబ్దాల క్రితం తాను […]
హీరో అర్జున్ ఫీలింగ్స్‌ను బాగా హర్ట్ చేసిన బాలయ్య… ఎలాగో తెలుసా..?!
ఒక ఊళ్లో పట్వారీ, మరో ఊళ్లో మస్కూరి… అంటే అర్థం తెలుసా..? ఒక ఊళ్లో పెత్తనం చెలాయించే విలేజ్ సెక్రెటరీ… మరో ఊళ్లో ఎవరూ పట్టించుకోని విలేజ్ సర్వెంట్… స్థానబలం, అధికారబలం ఎట్సెట్రా… అర్జున్ సర్జా సుదీర్ఘమైన కెరీర్ ఉన్న హీరో… ఇప్పటి కొందరు హీరోలు పుట్టకముందే తను హిట్ల మీద హిట్లు ఇచ్చిన చరిత్ర తనది… ఎవడి జోలికి పోడు… ఎవరైనా స్టార్ హీరో అడిగితే చిన్న పాత్రయినా సరే పోషిస్తాడు, ఎహె, నేనేంటి అనే […]
సావర్కర్ ఓ సాకు మాత్రమే… ఉద్ధవ్ ఠాక్రేకు మళ్లీ ఆ హిందుత్వే దిక్కు…
రోగికి కోరిందీ అదే… వైద్యుడు ఇచ్చిన మందూ అదే… ! ఈ దిక్కుమాలిన మహావికాస్ అఘాడి కూటమిని ఎప్పుడు వదిలేద్దామా అని శివసేన చీఫ్ ఠాక్రే ఎదురు చూస్తున్నాడు… రాహుల్ పక్కనున్న జైరాంరమేష్ వంటి మేధావులు ఠాక్రేను ఎప్పుడూ నిరాశపరచరు… రాహుల్‌కు ఏమీ తెలియదు… సొంత పరిజ్ఞానం లేదు… జైరాంరమేష్ వంటి నేతలు తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు… గత ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు శివసేన-బీజేపీ కూటమికి అనుకూలంగా వోట్లేశారు… కానీ రాహుల్‌కు జైరాంరమేష్ ఎలాగో శివసేనకు సంజయ్ […]
దహనం చేయబడిన వ్యక్తికి సమాధి ఎలా కడతారు మాస్టారూ..?!
అజ్ఞానంతో… నిజంగానే అజ్ఞానంతో వేస్తున్న ప్రశ్న… అయ్యా, ఆదిశేషగిరిరావు గారూ… మరణించిన మీ సోదరుడికి ప్రజాస్మశానంలో (మహాప్రస్థానం) దహనక్రియలు నిర్వహించారు కదా… మరి సమాధి ఎక్కడ కడతారు..? ఇంకెక్కడో కడితే దాన్ని సమాధి అనాలా..? స్మారకం అనాలా..? అసలు కృష్ణ అంత్యక్రియలకు సంబంధించి వింత నిర్ణయాలతో ఇప్పటికే బోలెడన్ని విమర్శలు మూటకట్టుకున్నారు… మళ్లీ కొత్తగా ఇదేమిటి..? మరీ అత్యున్నత యోగసాధన పరిభాషలో సమాధి స్థితి అంతే వేరు… అటువైపు వెళ్లడం లేదు… మామూలుగా హిందువుల్లో అంత్యక్రియలు రెండు […]
ఉండవల్లి కరణం గారి పగ… మార్గదర్శిని కడదాకా వదిలేట్టు లేదు…
కరణం గారి పగ, కాటికి చేరినా పోదు… అని ఓ సామెత… ఉండవల్లి అరుణ్‌కుమార్ బ్రాహ్మల్లో ఏ విభాగమో తెలియదు గానీ… వీరముదురు కరణం… పట్టువదలని విక్రమార్కుడు టైపులో పగవీడని అరుణార్కుడు… రామోజీరావును అప్పుడెప్పుడో వైఎస్ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం టార్గెట్ చేశాడు ఉండవల్లి… సరైన పాయింట్లు పట్టుకుని, వెంటపడతాడు కాబట్టి ఉండవల్లే కరెక్టని ఆయనకు అప్పగించాడు వైఎస్… వైఎస్ మరణించాక, జగన్‌తో ఉండవల్లికి పెద్దగా సత్సంబంధాలు లేక, కేసీయార్‌కు రామోజీని సాధించడం ఇష్టం లేక, […]
హేపీ మెన్స్ డే బావా… ఇక్కడ పులుసు మరుగుతోంది, తరవాత కాల్ చేస్తా…
Gottimukkala Kamalakar…… సరికొత్త సీసాలో పాత సింగిల్ మాల్టు: నేను: బావా..! ఇవాళేదో ఇంటర్నేషనల్ మెన్స్ డే అటగా..? సాయంత్రం కలుద్దామా..? వాడు: చూస్తాలేరా..! ఇప్పుడే చెప్పలేను. నేను: ఏం చేస్తున్నావ్..? వాడు: పనిమనిషి స్కూటీ సర్వీసింగ్ కి ఇచ్చిందట. రాలేనని మా ఆవిడకి వాట్సాప్ లో మెసేజెట్టింది..! నేను: నీకెందుకు చెయ్యలేదు…? వాడు: నా దగ్గర తన జియో సిమ్ నంబరుందిరా..! అది మా ప్రైవేట్ చాట్ కే. అపార్టమెంట్ వాట్సాప్ గ్రూపులో ఎయిర్ టెల్ […]
షాకింగ్… స్మిత సభర్వాల్ అంత పనిచేసిందా..? ఔనా… నిజమేనా..?
‘‘ఫలానా హోటల్ మూసేస్తారట కదా… అరెరె… అందులో బటన్ ఇడ్లీ బాగుండేది… మసాలా చాయ్ అదిరిపోయేది… శుభ్రంగా ఉండేవి పరిసరాలు… ధరలు కూడా రీజనబుల్… ప్చ్, ఆ హోటల్‌కు బైబై చెప్పాల్సిందేనా..?’’ అని ఎవరైనా ట్వీట్ చేస్తే ఏమిటి అర్థం..? ఛిఛీ, ఇదేం హోటల్ర భయ్, గుడ్‌బై అని చెప్పినట్టు కాదు కదా… అసలే కాదు… పైగా సదరు హోటల్‌తో అనుబంధాన్ని చెప్పుకున్నట్టు…! ఉదయమే కొన్ని వార్తలు చదవగానే ఇదే స్ఫరించింది… ముందుగా ఆ వార్తల సారాంశం […]
స్టార్ హీరోల బిల్డప్పుల్నే ఈడ్చి కొడుతున్నారు… ఏ లోకంలో ఉన్నవ్ సుధీర్..?
గెహనా సిప్పీ… మొదట్లో మోడల్… ముంబై పిల్ల… వయస్సు జస్ట్, 22… చోర్ బజార్ అనే సినిమా కోసం మనవాళ్లే పట్టుకొచ్చారు… నిజం చెప్పాలంటే అందంగా ఉంది… కష్టపడాలే గానీ మంచి కెరీర్ కూడా ఉంది… గాలోడు సినిమా చూస్తే ఆమె ఒక్కతే కాస్త నటించింది అనేట్టుగా ఉంది… సినిమా షకలక శంకర్ సినిమా, సప్తగిరి సినిమా అన్నట్టుగా ఉంది… నిజానికి గెహనాకు సినిమాల్లో చాన్సులు లేకపోయినా పర్లేదు… జబర్దస్త్ జడ్జిగా లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ […]
అన్‌స్టాపబుల్-2… రాధికతో ఇదెక్కడి వింత కాంబినేషన్ బాలయ్యా…
చదివేస్తే ఉన్న మతిపోయింది అన్నట్టుంది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… ఫస్ట్ సీజన్ బ్రహ్మాండంగా క్లిక్కయింది… ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు… బాలయ్య ఓ కొత్త బాలయ్యగా ఫుల్ ఎంటర్టెయిన్ చేశాడు… తీరా సెకండ్ సీజన్ వచ్చేసరికి శృతి తప్పింది… చంద్రబాబును తీసుకువచ్చాడు… అంతే… ఎవరిని తీసుకురావాలో ఆ టీంకు అర్థం కావడం లేదు… బాలయ్య షో అంటే ఓ రేంజ్ ఉంటుంది, ఎవరిని పడితే వాళ్లను తీసుకురాలేరు… ఏదో కిందామీదా పడి సిద్ధూ, శేషు, శర్వా, విష్వక్లతో […]
జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
ఒక తెలుగు సినిమా పాట… ఓ పాత అగ్ర హీరో… బెల్ బాటమ్ పాంటు, బ్లేజర్, షూస్, టోపీ ధరించి ఎగురుతున్నాడు… వాటిని స్టెప్పులు అంటారు… పక్కనే జయప్రదో, శ్రీదేవో ఫాఫం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎగురుతోంది… సగం సగం బట్టలు… మంచుకొండల్లో హీరోకు కార్గిల్ దుస్తులు… హీరోయిన్ వంపుసొంపులు కనిపించాలి కాబట్టి అరకొర దుస్తులు… అంతేనా..? ఒకే పాటలో నాలుగైదుసార్లు హీరో గారి కాస్ట్యూమ్స్ ఛేంజ్… అదేమంటే ఫ్యాన్స్ రకరకాల డ్రెస్సుల్ని ఇష్టపడతారుట… హీరోయిన్ […]
స్మారక చిహ్నం కట్టేవాళ్లే అయితే పద్మాలయాలోనే అంత్యక్రియలు జరిగేవి..!
పద్మాలయా స్టూడియోస్ వద్ద కృష్ణకు ఓ మెమోరియల్ నిర్మించాలని కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్టుగా ఓ లీక్ వార్త మొత్తం మీడియాలో దర్శనమిచ్చింది… ఏం కవర్ చేసే ప్రయత్నం జరుగుతోంది..? మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాలపై వస్తున్న వ్యతిరేకతను డైల్యూట్ చేసే ప్రయత్నమా..? అదే అనిపిస్తోంది… కృష్ణ వెళ్లిపోయాడు… అంత్యక్రియలకు సంబంధించి కొంత గందరగోళం… ప్రత్యేకించి అభిమానుల సందర్శనకు పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో పెడతాం అన్నారు… చివరి క్షణంలో రద్దు చేశారు… సాధారణంగా ఊరేగింపుకు ఓపెన్ టాప్ వాడుతుంటారు, అదీ […]
తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
సూపర్ స్టార్ కృష్ణ మరుపురాని పాటలు అని వెతుకుతూ ఉంటే… ఓ పాట కనిపించింది, వినిపించింది… ఫాఫం అనిపించింది… రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఓ సినిమా వచ్చింది 1976లో… నమ్మలేని విషయం ఏమిటంటే… దానికి దర్శకుడు బాపు… కాకపోతే పాటలు బాగుంటాయి… చిత్రీకరణలో కాదు, ట్యూన్లు, కంటెంటు… అందులోనూ రాకోయీ అనుకోని అతిథి పాట ఓ మరుపురాని పాటే… ఇది వింటుంటే మనసు పదే పదే మేఘసందేశం సినిమా వైపు వెళ్తుంది… అందులో ఓ […]
నిజంగా మంగ్లి చేసింది అంత తప్పా…? మళ్లీ భారీగా సోషల్ ట్రోలింగ్…!
బాగా గుర్తు… ఇప్పుడంటే బాగా తగ్గిపోయింది గానీ… సమీపంలో పాపులర్ దర్గా గనుక ఉంటే, ఆ పరిసరాల్లో తల్లిదండ్రులు ఆ దర్గాకు వెళ్లిరావడం, తమ పిల్లలకు ఆ దర్గా పేరు స్ఫురించేలా పేర్లు పెట్టుకోవడం సహజంగానే ఉండేది… సైదులు అనే పేరు బోలెడుమందికి ఉంది… అది హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఆ జాన్ పహాడ్ దర్గా మీద అక్కడి ప్రజల విశ్వాసం… భక్తి… ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే… తేలు మంత్రానికీ, పాము మంత్రానికీ మసీదు కావాలి… పిల్లల దడుపు […]
సర్కారువారి పాట..! మహేశ్ బాబు హఠాత్తుగా అందరినీ విస్మయంలో పడేశాడు..!!
ఒక్కసారిగా టీవీ, సినిమా ట్రేడ్ నిపుణులకు పిచ్చెక్కిపోయింది… మహేశ్ బాబు సినిమాయే దానికి కారణం… ఆమధ్య సర్కారువారి పాట సినిమా తీశాడు కదా… సరే, కమర్షియల్‌గా హిట్… 60 కోట్ల దాకా ఖర్చు పెడితే 200 కోట్ల దాకా వసూళ్లు రికార్డయ్యాయి… థియేటర్లలో హిట్… కానీ టీవీల్లో..? ఇప్పుడు టీవీల్లో ఎవడూ సినిమాలు చూడటం లేదు కదా… వీలున్నప్పుడు తాపీగా ఓటీటీల్లో చూస్తున్నారు, అదే బెటర్ కదా… అందుకని టీవీ ముందు కదలకుండా కూర్చుని, ఆ చెత్త […]
మల్టీ ప్లెక్స్ అంటేనే మల్టిపుల్ దోపిడీ అని అర్థం… గుండు గీకేయడమే…
Bharadwaja Rangavajhala……… నేనూ బెజవాడ సినిమా…. సాధారణంగా సినిమాకు పోవాలంటే .. మరి చాలా సరుకులు సరంజామా ఉండాలి. సత్యన్నారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచీ గేటు వైపు వెళ్తుండగా ఎడమ వైపుకి ఓ బేకరీ ఉండేది … కిసాన్ జామ్స్ వాడివే ఆ రోజుల్లో కిసాన్ బిస్కెట్లు ఉండేవి. ఏమి టేస్ట్ లెండి అవి. తర్వాత తొంభై మూడులో ఆ కంపెనీ బ్రూక్ బాండ్ ఇండియా టేకోవర్ చేసేసిన తర్వాత బిస్కెట్ల తయారీ ఆపేశారు దరిద్రులు. ఇప్పుడది […]
- « Previous Page
- 1
- …
- 272
- 273
- 274
- 275
- 276
- …
- 458
- Next Page »