Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీతక్క పీఏ ఎవరికైనా మాటసాయం చేశాడా..? తనే దందా నడిపిస్తున్నాడా..?

February 19, 2024 by M S R

pa to minister

Balaraju Kayethi …. ఒక వ్యక్తి ఎదిగితే ఓర్వలేని గుణాలు.. రాజకీయ నాయకుల మీద కోపాలు.. రాజకీయ దురుద్ధేశ్యాలు.. పీఏల మీద రుద్దడం.. రాద్దాంతాలు చేయడం.. మూడు నాలుగు రోజులుగా మంత్రి సీతక్క పీఏ సుజిత్‌‌ రెడ్డి మీద చాలా ఛానెళ్లు, వార్తా పత్రికలు కథనాలు రాస్తున్నాయి.. తప్పులేదు.. ఎవరి డ్యూటి వారు చేయాల్సిందే.. ఇసుక అక్రమ రవాణా.. గురించి ఒక్కసారి చర్చిద్దాం.. ఇసుక దందా జరగనిది ఏ ప్రభుత్వంలో.. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతో అంతో […]

ఈ రక్తపైత్యం ఎవరిదైనా సరే ఖండిద్దాం… ఇక చాలు, ఇప్పటికే చాలా ఓవర్…

February 19, 2024 by M S R

venkanna

Subramanyam Dogiparthi… ఎక్కడికి పోతుంది వీరాభిమానం !? వెర్రి తలలు వేస్తున్న పిచ్చి అభిమానం . నాయకులు , పార్టీల అధినేతలు ప్రజల సేవకులు . Servant Leaders . అలాంటిది వ్యక్తి పూజలో అన్ని పార్టీలు మునిగి తేలుతున్నాయి . పాలాభిషేకాలు … పాలాభిషేకాలు చేయని పార్టీ దేశంలో ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం matured democracy కి చాలా ప్రమాదం . నాయకుడు మరణిస్తే , ఆ నాయకుడి కుటుంబ సభ్యులు ఎవరూ చనిపోరు . […]

మళ్లీ బుల్లితెరపై కార్తీకదీపం… ఇంకెన్ని విన్యాసాలో, మరెన్ని వికారాలో…

February 19, 2024 by M S R

కార్తీకదీపం

అనుకుంటున్నదే… కార్తీకదీపం సీరియల్‌ను చివరలో నానా బీభత్సం చేసి, కథను నానా మలుపులూ తిప్పి, ప్రధాన పాత్రధారుల్ని చంపేసి, కొత్త జనరేషన్ కథ కొనసాగింపు పేరిట ప్రేక్షకుల్ని, కార్తీకదీపం సీరియల్ ప్రేమికుల్ని నానా హింస పెట్టాడు ఆ దర్శకుడెవరో గానీ… తరువాత ఇక తమకే చిరాకెత్తి, ప్రేక్షకుల తిరస్కారం ఎక్కువైపోయి, రేటింగుల్లో దిగజారిపోయి, ఇక కుదరదు అనుకునే స్థితిలో అర్థంతరంగానే కార్తీకదీపం సీరియల్ కథకు ముగింపు పలికాడు అప్పట్లో సదరు దర్శకరత్నం… ఒక సీరియల్ ఎలా ఉండి, […]

రంగుల్లో తీయలేదు కాబట్టే ఆ సినిమా అంత బాగా వచ్చిందేమో..!

February 19, 2024 by M S R

lokanathan

Bharadwaja Rangavajhala…. బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. అంతులేని కథ సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది. తెలుగులో అతని మొదటి చిత్రం అదే. అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. నలుపు తెలుపు చిత్రాల ఛాయాగ్రహణంలో అత్యుత్తమంగా చేసిన వారికి బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ, రంగుల్లో అద్భుతమైన కెమేరా […]

కుమారీ ఆంటీ గాలి తీసేసిన సీరియల్ నటి… బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి…

February 18, 2024 by M S R

food aunty

అబ్బో, అబ్బో… ఎంత పాపులారిటీ… టీవీ షోలు, ఇంటర్వ్యూలు, యూబ్యూబ్ వీడియోలు… మస్తు సంపాదన… కుమారీ ఆంటీ కథ అంతా తెలిసిందే కదా… ఎవరెవరికో ఇంటర్వ్యూలు ఇస్తే, అవి కాస్తా వైరల్ అయిపోయి, రష్ పెరిగిపోయి, ట్రాఫిక్ నాన్సెన్స్ పెరిగిపోయి, పోలీసులు తన స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ మూసేయడం, సీఎం జోక్యం చేసుకుని, పోనీ వదిలేయాలంటూ ఆదేశించడం అందరికీ తెలిసిందే కదా… ఈ దెబ్బకు ఫుడ్ స్టాల్ పూర్తిగా మూతపడాల్సింది పోయి, రేవంత్ పుణ్యమాని ఇంకా […]

సాయి ధరమ్‌ తేజకు గాంజా నోటీసులు… సెన్సార్‌ను అలర్ట్ చేస్తే సరిపోయేది…

February 18, 2024 by M S R

ganja

ఒక వార్త… గాంజా శంకర్ అనే సినిమాకు సంబంధించి యాంటీ నార్కొటిక్స్ బ్యూరో హీరోకు, నిర్మాతకు, దర్శకుడికి మరికొందరికి నోటీసులు జారీ చేసింది… కారణం ఏమిటంటే..? సినిమా టైటిల్ సరికాదు, ఫస్ట్ హై పేరిట రిలీజ్ చేసిన ట్రెయిలర్ కూడా యువతను పెడదోవ పట్టించేలా ఉంది, కొన్ని సీన్లు సరైన దిశలో లేవు, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలను నియంత్రించే సెక్షన్ల ప్రకారం ఇలా పెడదోవ పట్టించే ప్రసారాలూ సరికావు,.. సో, టైటిల్ మార్చండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.,.. ఇదీ […]

ఊకో ఊకో ఉండవల్లీ… పదేళ్లుగా పాడీ పాడీ అరిగిన ఆ పాత పాట వదిలెయ్…

February 18, 2024 by M S R

undavalli

Nancharaiah Merugumala… ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సాంగంత హిట్‌ ఎప్పుడవుతుందో! –––––––––––––––––––––––––––––––––––––––––––––––– ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సినిమా సాంగంత హిట్‌ కావాల్సింది. కాని, అదృష్టవశాత్తూ అంతటి ప్రమాదం జరగలేదు. ‘రాజ్యసభ, లోక్‌ సభల మొత్తం డోర్లు అన్నీ మూసి వేయించేసి […]

సెల్ఫీల ప్రకోప యుగం ఇది… ‘స్మార్ట్ ఫోనోగ్రాఫర్ల’ ట్రెండ్ ఇది…

February 18, 2024 by M S R

selfie

సెల్ఫీ పిచ్చి… సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని పెట్టి ఉంటే స్వీచి వీచుల వీధుల్లో నిత్యం స్వైర విహారం చేసేవారికి ఎలా ఉన్నా భాషా ప్రేమికులకు మరింత ముద్దొచ్చేది. అందం మాటకు అర్థం చెప్పడం కష్టం. మనం తప్ప ప్రపంచంలో మిగతా అందరూ అందవిహీనంగా ఉన్నారనుకోవడం ఒక భావన. మనం తప్ప ప్రపంచంలో […]

‘మాట తప్పని గాంధీ సగం మాట తప్పాడు.., అందుకే సగం సొమ్మే ఇస్తున్నా..’

February 18, 2024 by M S R

gauhar

Chegondi Chandrashekar….    మొన్న అనుకోకుండా అటు వెళ్ళినపుడు, బుక్ ఫెయిర్ వేదిక మీద విక్రమ్ సంపత్ స్పీచ్ విన్నాను. ఆయన రాసిన పుస్తకం my name is gauhar jaan ని తెలుగులో కూడా తెచ్చారు. దాని ఆవిష్కరణ సభ. నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదు. ఆయన షార్ట్ స్పీచ్ ద్వారా కొంచెం తెలిసింది. మన దేశంలో మొట్టమొదటిగా గ్రామ్ ఫోన్ లో రికార్డ్ అయిన వాయిస్ ఆమెదే. అప్పట్లోనే ఆమె ఒక్క కచేరికి 3000 […]

2 రోజుల బాలింత… ఒడిలో ఆ పసిగుడ్డుతోనే 250 కిలోమీటర్ల ప్రయాణం…

February 18, 2024 by M S R

inspiring

Padmakar Daggumati…. ఒక గొప్ప విజయగాథ. టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. శ్రీపతి.. చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు.. శ్రీపతికి చెల్లెలు తమ్ముడు ఉన్నారు. పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నవర్ పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా పోడు వ్యవసాయం. […]

ఉండమ్మా బొట్టు పెడతా… అప్పట్లో మహిళల్ని విశేషంగా ఏడ్పించింది…

February 18, 2024 by M S R

jamuna

Subramanyam Dogiparthi…. మహిళలకు నచ్చిన సినిమా . మహిళలు మెచ్చిన సినిమా . బాగా ఆడింది . మంచి పేరు కూడా వచ్చింది . గొప్ప మహిళా సెంటిమెంట్ పిక్చర్ . ఉమ్మడి కుటుంబం , పండంటి కాపురం వంటి చాలా సినిమాలకు భిన్నంగా కుటుంబం కోసం , లక్ష్మీ దేవిని ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపటానికి ఆత్మాహుతి చేసుకునే కధ . జమున బాగా నటించింది . సినిమా ఆఖరిలో లక్ష్మీ దేవి పాత్రలో ఉన్న […]

‘ఆర్టిఫిషియల్ బాలు సాంగ్స్’… అనుచితమా..? సముచితమా..? అగౌరవమా..?

February 18, 2024 by M S R

spbalu

ఒక వార్త… గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ కీడాకోలా అనే సినిమా నిర్మాతకు నోటీసులు పంపించాడు… ఎందుకయ్యా అంటే..? తండ్రి గొంతును కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) ఒక పాటకు వాడుకున్నందుకు..! గుడ్… సరైన చర్య అనిపించింది స్థూలంగా చదవగానే… కానీ అదే వార్తలో చివరలో ఓ ట్విస్టు నచ్చలేదు… తండ్రి గొంతును ఈ కొత్త టెక్నాలజీతో వాడుకున్నందుకు కాదట, తన నోటీసులు ఎందుకంటే, తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకట… అక్కడ […]

భామాకలాపం2… శరణ్య, ప్రియమణి జుగల్‌బందీ ప్రదర్శనే అసలు బలం…

February 17, 2024 by M S R

bhamakalapam2

జస్ట్, 20- 25 నిమిషాలు చూసి ఉంటానేమో… పర్లేదు అనిపించింది… కాదు, సరిగ్గా ఇలాంటి వెబ్ సీరీస్‌లే ప్రస్తుతం అవసరమేమో అనిపించింది… ప్రత్యేకించి మహిళా ప్రేక్షకులకు..! వెబ్ సీరీస్ అని ఎందుకంటున్నానంటే… భామాకలాపం ఫస్ట్ పార్ట్ హిట్ అట… ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులు బాగా చూస్తున్నారట… మూడో పార్ట్ కూడా ఉంటుందని చివరలో హింట్ కూడా ఇచ్చారట… అదీ హిట్టయితే ఫోర్త్ పార్ట్… అందుకే సీరీస్ అన్నాను… కాకపోతే సినిమాల సీరీస్… బాగా చూస్తున్నారట […]

అంతటి తెలుగు దిగ్దర్శకుడికీ ఎన్టీయార్‌తో డిజాస్టర్ తప్పలేదు…

February 17, 2024 by M S R

kvreddy

Subramanyam Dogiparthi…   టైం బాగుండకపోతే బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది . జీవితంలో గెలవటానికి కూడా సుడి ఉండాలి . సుడి ఉండటం లేకపోవటం వివరిస్తానికి మంచి ఉదాహరణ పేకాట . Card show count పడుద్ది . ఒక్క డైమండ్ రెండే కావాలి షో తిప్పటానికి . సుడి లేనోడికి డీల్ లోనే 12 అయి పడుతుంది . కేవలం extension కావాలి . పేకలోకి వెళతాడు . డైమండ్ రెండు వస్తుంది . కోపం […]

పాతవి ఎన్నున్నా… కేసీయార్‌కు సీఎం, గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు…

February 17, 2024 by M S R

చిలకమర్తి ఎక్కడో రాసినట్టు గుర్తు… కొన్ని వందల కణితులను తొలగించిన ఓ వైద్యుడికే ఓ కణితి మొలిచింది… ఇంకెవరో డాక్టర్ వచ్చాడు, తీశాడు… అప్పుడన్నాడట, కణితి తీసేటప్పుడు ఇంత నొప్పి ఉంటుందా అని..! మొన్న రేవంత్ రెడ్డి రండ అనే పదాన్ని వాడటం దుర్మార్గం, సంస్కారరాహిత్యం అని నానా విమర్శలూ చేశారు, రచ్చ చేశారు కదా… అవును, అదే మాటను అదే కేసీయార్ ఓ కేంద్ర మంత్రిని ఉద్దేశించి వాడలేదా..? ఆ పదంతో నొప్పి ఇంతగా ఉంటుందని […]

పత్రిక వెలిసిపోతూ… స్మార్ట్ ఫోన్‌లోకి ప్రపంచ జర్నలిజం వేగంగా ఒదిగిపోతోంది…

February 17, 2024 by M S R

media

వన్నె తగ్గిన సంపాదకీయం… పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం. ఒక్క సంపాదకీయం మాత్రం పత్రిక అభిప్రాయం. సంపాదకుడి వ్యాఖ్య, విశ్లేషణ. యజమాని- సంపాదకుడు ఒకరే అయిన రోజులు కాబట్టి ఇప్పుడు సంపాదకీయం అంటే యాజమాన్య విధానం అనే అనుకోవాలి. తెలుగులో సంపాదకీయాల కోసమే పత్రికలు చదివిన రోజులు కొన్ని దశాబ్దాలపాటు […]

… అందుకే అడుగుతున్నం, నువ్వు నా జాతి పితవు ఎట్లయితవ్..?

February 17, 2024 by M S R

జాతిపిత

Gurram Seetaramulu….  జీవన తత్వాన్ని కుదించి చెప్పడంలో మా అమ్మ మాస్టర్. బాలి గాడు, పోలిగాడు కౌలు సేద్యానికి దిగారు. మొదటి రోజు ముళ్ళు, రాళ్లు, తుప్పలు ఉన్న ఆ బీడు సరి చేయడానికి పొద్దున్నే సద్ది కట్టుకుని పొలానికి పోయారు. కాసిన్ని గంజినీళ్ళు తాగి గొడ్డలి ఎత్తారు. కంపలోంచి ఒక కుందేలు ఉరికింది. ‘అరె, దాన్ని పోనీయకురా పోలిగా’ అన్నాడు బాలిగాడు. అలా కుందేలు కోసం ఎల్లినోడు ఇక రాడాయె, పోలిగాని కోసం బాలిగాడు ఎదురు […]

గీతాభవన్ చౌరస్తా దాటని బండి సంజయుడు… క్రీస్తుపూర్వం ఆలోచనలు…

February 16, 2024 by M S R

tbjp

అప్పుడప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది… జాతీయ స్థాయిలో అనితర సాధ్యమైన రాజకీయ ప్రణాళికల్ని అమలు చేసే సాధనసంపత్తి, సామర్థ్యం ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అచేతనంగా ఉండిపోతోంది..? ఏపీని వదిలేయండి, ఇప్పట్లో బీజేపీ పెరగదు అక్కడ… ఆ రాష్ట్రాన్ని బీజేపీ వదిలేసినట్టుంది… కానీ మంచి అవకాశాలున్న తెలంగాణ బరిని కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తోంది..? మొత్తం దక్షిణాదిలో బీజేపీకి కర్నాటక తరువాత మంచి అవకాశాలున్నది తెలంగాణలోనే… కానీ సరైన వ్యూహం లేదు, ఆచరణ లేదు… నిజానికి మొన్నటి […]

తొలి భార్య ఆత్మహత్య… మలి భార్య కొడుకు దగ్గర కిరోసిన్ వాసన…

February 16, 2024 by M S R

పంజరం

Jagan Rao….   హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 సందర్భంగా – నాకు నచ్చిన భారతీయ కవయిత్రి అమ్రుతా ప్రీతం గురించి..! అమ్రుతా ప్రీతం రాసిన “స్టెంచ్ ఆఫ్ కిరోసిన్” అనే ఇంగ్లీష్ నాన్ డిటెయిల్ పాఠం (కిరోసిన్ వాసన) ఎవరికైనా గుర్తు ఉందా..? చంబ అనే ఊర్లో ఒక తల్లితండ్రుల గారాలపట్టి గుళేరి. వయస్సు వచ్చిన గుళేరికి మానక్ అనే వ్యక్తితో వివాహం జరిపిస్తారు. 7 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టరు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుళేరిని […]

హేట్సాఫ్ మమ్ముట్టి… అనితర సాధ్యుడివి… ఈ భ్రమయుగం సాక్షిగా…

February 16, 2024 by M S R

mammotty

అందరిలోనూ ఓ సందేహం… మమ్ముట్టి నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాను ప్రేక్షకగణం ఆదరిస్తుందా..? తను పేరొందిన స్టార్ హీరో… సుదీర్ఘమైన కెరీర్… తనతో సినిమా అంటే బోలెడు సమీకరణాలు, కమర్షియల్ జోడింపులు… కానీ ఓ పాతకాలం కథను బ్లాక్ అండ్ వైట్‌లో, అదీ ఓ అగ్లీ రగ్గడ్ లుక్కుతో… కేవలం మూడే పాత్రలతో… ఏ అట్టహాసాలు లేని ఓ అటవీగృహంలో… అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? సాధ్యమేనని నిరూపించాడు మమ్ముట్టి… సినిమా పట్ల, […]

  • « Previous Page
  • 1
  • …
  • 276
  • 277
  • 278
  • 279
  • 280
  • …
  • 384
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • బీసీ సీట్లపై బీఆర్ఎస్ ఫేక్ ప్రాపగాండా..! నిజాలేమిటో ఓసారి చూద్దాం..!!
  • ఒకటే చెట్టు… పది పక్షులు… ఒక తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…
  • బాబోయ్ విలేకర్స్..! సొసైటీకి బెడదగా న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్థ..!!
  • ఈ విశ్వసుందరి కిరీటం ధగధగల వెనుక కొన్ని చీకటి నీడలు…!!
  • అసలు తండ్రిని నేనేనా..?! కుటుంబ వ్యవస్థనే కూల్చేసే ‘పితృత్వపరీక్షలు’..!!
  • నచ్చిన వార్త..! ఓ ఉచిత ఇంజక్షన్‌తో రోజూ ఆరు ప్రాణాలు కాపాడారు..!!
  • పవర్ పాలసీ..! కేసీయార్ నష్టకారకాలు Vs రేవంత్ రెడ్డి కొత్త టెక్నాలజీలు..!!
  • సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!
  • అందరికీ కొత్త ఆధార్ కార్డులు..! అవసరం ఏమిటి..? ఎప్పటి నుంచి..?!
  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions