ఆట అన్నాక ఎవరో ఒకరు గెలుస్తారు… ఒకరు ఓడిపోతారు… కానీ ఇండియా, పాకిస్థాన్ నడుమ ఆట అంటే… అదీ ఓ యుద్ధమే… అంత ఎమోషన్ ఆటకు ముందే ఆవరించిపోతుంది… ప్రత్యేకించి రెండు దేశాల్లోనూ క్రికెట్ అంటే పిచ్చి… మరిక రెండు దేశాల నడుమ మ్యాచ్ అంటే, ప్రతి బంతీ ఓ ఓ క్షిపణి… రెండు దేశాల్లో ఎక్కడా మ్యాచ్ నిర్వహించడానికి కూడా వీలు లేనంతగా దూరం… ఉద్రిక్తతలు ఎప్పుడూ… ఏదో ఓ తటస్థ వేదిక దొరికినప్పుడు ఇక […]
ఈ కాంతార ‘హీరో’కు నిజమైన పరీక్ష ముందుంది… అదేమిటంటే..?
నిజమే… రిషబ్ శెట్టికి ముందుంది ముసళ్ల పండుగ… హార్ష్‌గా ఉన్నట్టుంది కదా వ్యాఖ్య… కానీ నిజమే… ఇన్నాళ్లూ తీసిన సినిమాలు వేరు, ఇప్పుడిక కాంతార తరువాత తీయబోయే సినిమా వేరు… తనకు తాను ఓ హైరేంజ్ బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు… హీరోగా, దర్శకుడిగా, కథకుడిగా..! ఎక్కడి 15 కోట్ల సినిమా… ఎక్కడి 250- 300 కోట్ల వసూళ్లు… డబ్బు సంగతి ఎలా ఉన్నా సరే, ఆ సినిమాయే ఓ ఊపు ఊపేస్తోంది… తన నటనను […]
కోహ్లీ కంటనీరు… ఎన్నాళ్ల బాధ బద్ధలై బయటికి వచ్చిందో… సింహం ఏడ్చింది…
విరాట్ కోహ్లీపై దేశమంతటా ప్రశంసల వర్షం… ప్రజలందరిదీ ఒకే ఎమోషన్… ప్రపంచకప్ వస్తే ఎంత..? పోతే ఎంత..? కానీ పాకిస్థాన్ మీద మ్యాచులో మాత్రం గెలవాలి… క్లిష్టమైన స్థితిలో ఆ గెలుపును తీసుకొచ్చి, దేశ ప్రజలకు, క్రికెట్ ప్రేమికులకు దీపావళి కానుకగా ఇచ్చాడు కోహ్లీ… కానీ ఎన్నాళ్లుగానో గూడుకట్టుకున్న ఏదో బాధ ఒక్కసారిగా బద్ధలైనట్టుంది… కన్నీరు ఆపుకోలేకపోయాడు… నిజానికి కోహ్లీ కంటనీరు అనేది చాలా అరుదైన విషయం… అంటే ఇప్పటిదాకా ఎంతటి బాధను లోలోపల అనుభవించాడో అనడానికి […]
4 గంటలు కాలినా… పండుగ స్పెషల్ తోకపటాకు పేలలేక తుస్సుమంది…
ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఓ చెత్త… అది రేటింగ్స్‌లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది… సర్ప్రయిజులు లేవు, సడెన్ ఎంట్రీలు లేవు, రీఎంట్రీలు లేవు, అసలు ఈసారి సీజన్ మీద నిర్వాహకుల్లో ఎవడికీ ఇంట్రస్టు లేదు… దాదాపు నాలుగు గంటలపాటు ఆదివారం సాయంత్రం దీపావళి స్పెషల్ అని ప్రత్యేకంగా షో నడిపించారు… అసలే పాతాళంలో రేటింగ్స్ ఉన్నప్పుడు వీకెండ్ షో, అదీ పండుగ స్పెషల్ షో అంటే ఎంత క్రియేటివ్ వర్క్ జరిగి ఉండాలి… ప్చ్, ఏమీలేదు… […]
‘‘పసుపుతో 21 బియ్యపుగింజలు ఎర్రటిబట్టలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి…’’
ధన త్రయోదశి సందర్భంగా అందరూ ఎంతోకొంత బంగారం కొనాలని కొన్నేళ్లుగా మన తెలుగు మీడియాలో సాగుతున్న ప్రచారం.., బోలెడు స్టోరీలు రాస్తారు… ఫోటోలు వేస్తారు… ధన్‌తేరాస్ పేరిట ఈరోజుకు అత్యంత పవిత్రతను కట్టబెట్టి తెలుగు మీడియా తమ వ్యాపార ప్రయోజనాల కోసం పాఠకులకు చేస్తున్న ద్రోహం… కేవలం బంగారం దుకాణాలకు గిరాకీ పెంచే ఓ పిచ్చి ప్రయత్నం… మనం ఆమధ్య విపరీతంగా మీమ్స్, పోస్టులు, సోషల్ చెణుకులు చదివాం గుర్తుందా…? పర్సులో అయిదు యాలకులు పెట్టుకోవడం, బీరువాలో […]
గల్ఫ్ జలాల్లో అమెరికా అణు సబ్మెరెన్లు ప్రత్యక్షం… సౌదీకి బెదిరింపులు…
పార్ధసారధి పోట్లూరి …… గల్ఫ్ జలాలు వేడెక్కుతున్నాయి ! సౌదీ అరేబియాని బెదిరిస్తూ అమెరికన్ న్యూక్లియర్ జలాంతర్గాములు సౌదీ అరేబియా సముద్రంలో ప్రత్యక్షo అయ్యాయి! గత కొన్ని నెలలుగా సౌదీ రాజు అమెరికాని లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ! రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా విధించిన ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుదల సూచీ ఆకాశం వైపు చూస్తున్న తరుణంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచి ధరలు […]
అంతటి కంతారాలోనూ కొన్ని వెకిలి సీన్లు… కానీ ఈ సప్తమి భలే వెనకేసుకొచ్చింది…
లీల గుర్తుందా..? ఫారెస్ట్ గార్డ్ పాత్ర… కాంతార సినిమాలో రిషబ్ శెట్టి అలియాస్ శివ పాత్ర ప్రేమికురాలు… లీల పాత్రకు మరీ పెద్దగా ప్రాధాన్యం ఏమీ ఉండదు సినిమాలో… కానీ హీరోయిన్ హీరోయినే కదా… తన సినిమాలోని లీల పాత్రకు పనికొచ్చే ఫేస్ కావాలని రిషబ్ వెతుకుతూ, అనుకోకుండా ఇన్‌స్టాలో ఈమె ఫోటోలు చూశాడు… ఆల్రెడీ ఏదో సినిమాలో నటించింది… సో, ఆడిషన్‌కు రమ్మన్నాడు… తరువాత వోకే అన్నాడు… ఆమె పుట్టింది, పెరిగింది బెంగుళూరు… తండ్రి అసిస్టెంట్ […]
అమెరికాను నమ్మితే మనకు మునకే గతి… అది పాకిస్థానీ దోస్త్… తాజా ఉదాహరణ…
పార్ధసారధి పోట్లూరి …………. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ని CIA కి అప్పచెప్పినప్పుడే చెప్పాను పాకిస్థాన్ ని FATF నుండి బయటికి తెస్తుంది అమెరికా అని! నిన్న అదే జరిగింది ! FATF నుండి పాకిస్థాన్ కి ఉన్న గ్రే లిస్ట్ లో నుండి తీసేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గా పిలవబడే టెర్రర్ ఫండ్ ని అడ్డుకునే సంస్థని అమెరికా శాసిస్తుంది అని! పేరుకే జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు […]
వెన్నువిరిగిన రామోజీ..! హఠాత్తుగా ‘‘పెద్ద ఎండీ’’ కన్నుమూత..!!
ఈనాడు రామోజీరావుకు పెద్ద దెబ్బ… ఒకరకంగా తన వెన్నువిరిగినట్టే..! తన అప్పాజీ మరణించాడు… ఆయన పేరు ‘‘పెద్ద ఎండీ’’… నిజం, నిత్యవ్యవహారంలో ఆయన హోదా అదే… రామోజీరావు ఛైర్మన్ అయితే, ఆయన ఎండీ… అది ఏ సంస్థయినా అంతే… అంటే అర్థమైందిగా రామోజీ ఆర్థిక సామ్రాజ్యంలో ఆయన కీలక పాత్ర ఏమిటో… ఆయన పేరు అట్లూరి రామ్మోహనరావు… ఈ వార్త రాసే సమయానికి తన మరణవార్తను ఈనాడు సైట్, న్యూస్ యాప్ కూడా పబ్లిష్ చేయలేదు… లేకపోతే […]
డొల్లతనం..! ఒకప్పుడు ప్రపంచానికి నీతులు, పాఠాలు నేర్పిన బ్రిటన్ ఎడ్డిమొహం…
పార్ధసారధి పోట్లూరి ……… మేము ప్రపంచానికి నాగరికత నేర్పాము ! మేము ప్రపంచానికి ప్రజాస్వామ్యం ఇచ్చాము ! ప్రపంచంలో ఉన్న అన్ని జాతులలోకెల్లా భారతీయులు నీచ జాతి ! భారతీయులకి స్వాతంత్ర్యం ఇచ్చినా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేరు…..-1947 లో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్ స్టీన్ చర్చిల్! మొన్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేసింది ! రాజీనామా చేయకపోతే 1922 లో చేసిన చట్టాన్ని మార్చి అయినా అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ దించేస్తాము […]
అద్సరే గానీ… వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్… నిజమేనా..!!
Prasen Bellamkonda……. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా! వెస్టిండీస్ ను చూస్తే మనసు చివుక్కుమనిపిస్తోంది.. నిజానికి ట్వంటి ట్వంటి వాళ్ళ ఓన్ సొంత కప్ ఆఫ్ టీ కదా… వాళ్లకు ఈ ఆట బాయే హాత్ క ఖేల్ కదా.. అసలు వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారో తెలుసా.. సముద్రపు ఒడ్డున అలల అంచున నిలబడి, బంతిని సముద్రంలోకి కొడతారు… అలలతో బంతి తిరిగొచ్చే వ్యవధిని బట్టి, అది వెళ్లిన దూరాన్ని […]
లక్కీ కార్తి..! పొన్నియిన్ సెల్వన్ సంబురాల్లోనే తాజాగా సర్దార్…!!
నటి లైలా పదహారు ఏళ్ల తరువాత మళ్లీ రంగు పూసుకుంది… సర్దార్ సినిమా కోసం..! హిందీ నటుడు చుంకీ పాండే తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… మొన్నమొన్ననే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో తమిళంలో బ్రహ్మాండమైన ఫేమ్ సంపాదించిన కార్తికి ఇది మళ్లీ వెంటనే ఓ స్పై థ్రిల్లర్… డబుల్ రోల్… చెప్పుకోదగిన హీరోయిన్లే… రాశిఖన్మా, రాజీష విజయన్… మంచి అభిరుచి కలిగిన దర్శకుడు మిత్రన్ దీనికి దర్శకుడు… సర్దార్ సినిమా రిలీజుకు ముందు విశేషాలు ఇవే… అవన్నీ […]
ఓరి దేవుడా… చిన్న హీరో ఐతేనేం… పెద్ద హీరో ఐతేనేం… అన్ని బాటలూ రీమేకులే…
విష్వక్సేన్ అయినా అంతే… చిరంజీవి అయినా అంతే… మనకు తెలుగులో సొంత కథల్లేవు, మనకు ప్రయోగాలు అక్కర్లేదు… ఏదో భాష నుంచి మన హీరోయిజానికి అనువుగా మల్చుకుని, ఓ రీమేకును జనంలోకి వదలడమే… ఓరి దేవుడా అనే సినిమా పోస్టర్ చూడగానే గుర్తొచ్చే నిజం ఇదే… పోనీ, అదైనా నిన్నటిదో మొన్నటిదో కూడా కాదు… ఏళ్ల క్రితం నాటి సినిమాలైనా సరే, రీమేకడమే… తమిళంలో రెండున్నరేళ్ల క్రితం వచ్చింది ఓ మై కడవులే అనే సినిమా… దాన్ని […]
జిన్నా..! అంతటి పోర్నరికి కూడా కథాప్రాధాన్యమున్న పాత్ర ఇచ్చారు…
ఏడు కొండల వెనుక నుంచి జిన్నా అనే టైటిల్ వస్తుంటే… అది ఏమైనా వివాదానికి దారితీస్తుందేమో అనుకున్నారు… ఐనా అనితర సాధ్యమైన మరో షిర్డి గుడిని కట్టించి, ఇక భక్తులు షిర్డికి వెళ్లనక్కర్లేదన్న అత్యంతాతి హిందూ భక్తిపరుడు మంచు మోహన్‌బాబుతో పెట్టుకోవాలంటే హిందూ సంస్థలకు కూడా అంత ధైర్యమెక్కడ ఉంటుంది..? పైగా ఇంట్రడక్షన్లో జైశ్రీరాం అనిపిస్తే సరి… అంతేనా..? హీరో చేతి మణికట్టుకు మూడు ఓంకారాలు చెక్కిన ఓ బ్రేస్లెట్, దానికి హనుమంతుడి బొమ్మ… ఇంకేం కావాలి..? […]
సిల్లీ కామెడీ..! మళ్లీ జాతిరత్నాలు తీయబోతే ఈ పంటికింద రాళ్లు తగిలాయ్…
దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమిటి..? ఒక సినిమాను జస్ట్ తనే నిర్మించి, మిగతా అంశాల్లో వేలుపెట్టకపోవడం, ఓ చిన్న దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇవ్వడం ఏమిటి… అని అప్పట్లో ఓ చిన్న ఆసక్తి… హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఆ సినిమాకు ప్రాణంగా నిలిచి… 4 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకు 40 కోట్లు వచ్చిపడ్డయ్… అందుకని ఆ దర్శకుడు కేవీ అనుదీప్ తదుపరి ప్రాజెక్టు మీద ఆసక్తి… తాజాగా విడుదలైన ఆ సినిమా పేరు […]
బీహారర్ రాజ్ సంకేతాలు మళ్లీ… అదే, పాత జంగ్లీరాజ్… దేశం నడుమ కొరివి…
లాలూప్రసాద్… రాజకీయాల్లో అసలు ఉండకూడని కేరక్టర్… కారణాలు తవ్వుతూ పోతే నాలుగైదు గ్రంథాలూ సరిపోవు… నితిశ్ అంతకుమించిన దరిద్రం… కుర్చీ కావాలి… అంతే, అటూఇటూ ఎటైనా జంప్ చేస్తాడు… అభివృద్ధి, ప్రణాళిక, పరిపాలన మన్నూమశానం అనే పదాలేవీ తను వినడు, వినిపించుకోడు, తనకు అక్కరలేదు… ఆ జంగిల్‌రాజ్ బీహార్‌కు ఒక్క మంచి లీడర్ వస్తే ఎంత బాగుండు..? ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్జేడీ చేరడంతో మళ్లీ పాత జంగిల్ రాజ్ జడలు విప్పుకుంటోంది… అదీ ఆందోళనకారకం… ఇంకొన్ని వివరాలు […]
చేతి చిటికెన వేళ్లు కలిపితే కళ్యాణమై… కాలి బొటన వేళ్లు కలిపితే నిర్యాణమై…
Bharadwaja Rangavajhala……….. భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు. దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే జాషువా గబ్బిలం రాస్తే, జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని జాలాది రాసేశారు గానీ… ఎవరి వల్లకాడు వారికే ఉంది. అగ్రవర్ణాలనే ఆదరించే చిత్ర సీమలోకి దళితుడుగా కాలుపెట్టి గౌరవం అందుకున్నాడు జాలాది. జాలాది పుట్టింది కృష్ణాజిల్లా దోసపాడు. తండ్రి […]
4 సినిమాలు… చదివి తీరాల్సిన పోలిక… కాంతార ఇంకేదో కథ చెబుతోంది…
కాంతారకు ఎందుకింత ప్రశంస..? అంధవిశ్వాసాలను పెంచి పోషించే సినిమాకు ఏమిటీ అభినందనలు..? ఇవీ వినిపించే ప్రశ్నలు… అవి పరిమిత, సంకుచిత జ్ఙానం వేసే ప్రశ్నలు… అయితే ప్రజలపై బలమైన ప్రభావం చూపించగల సినిమాను ఒకే చట్రంలో పరిశీలించడం మూర్ఖత్వం అవుతుంది… చూసే కోణం, విశ్లేషకుడి రాగద్వేషాలు, జ్ఙానపరిధి, విశ్లేషణ సామర్థ్యం వంటి ఎన్నో అంశాలుంటయ్… జస్ట్, ఊరకే కొట్టేస్తే ఎలా..? సింపుల్‌గా నాలుగు సినిమాల్ని పరిశీలిద్దాం… ఐఎండీబీలో టాప్ ర్యాంకు కాంతార… చాలా అరుదైన రికార్డు.,. గుడ్… […]
అన్‌స్టాపబుల్ షోపై చంద్రబాబు దెబ్బ… బభ్రాజమానం భజగోవిందం…
కొన్ని అలా చదువుకోవాలి… అంతే… బయటికి ప్రచారం వేరు, అసలు కథలు వేరు… సినిమాల వసూళ్ల లెక్కల్లాగే…! పిచ్చి అభిమానులు ఉంటారు కదా, వాళ్లు ప్రచారం చేసుకోవడానికి ఫేక్ కలెక్షన్లను లీక్ చేస్తుంటారు, లేదా రిలీజ్ చేస్తుంటారు… ఫ్యాన్స్ అంటేనే అరబుర్రలు కదా, ఓ ఓ అంటూ మొత్తుకుంటూ ఉంటారు… విషయం ఏమిటంటే… ఆహా అనే తెలుగు ఓటీటీలో బాలయ్య నిర్వహించే చాట్‌షో అన్‌స్టాపబుల్ సూపర్ హిట్ అనీ, 40 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్తో రికార్డులు బద్దలు […]
అమెరికాకు ఇంకా ముందుంది… తాజాగా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌదీ అరేబియా…
పార్ధసారధి పోట్లూరి …………. సౌదీ అరేబియా అమెరికా, యూరోపుల నుండి దూరంగా జరుగుతున్నదా ? జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది ! అక్టోబర్ 2, 2022 న అమెరికాలో స్థిరపడ్డ సౌదీ జాతీయుడు అయిన సాద్ ఇబ్రాహీం అల్మాది [Saad Ibrahim Almadi] కి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా ! సాద్ ఇబ్రాహీం అల్మాది వయస్సు 72 ఏళ్లు. జైలు శిక్ష పూర్తయిన తరువాత మరో 16 ఏళ్ల […]
- « Previous Page
- 1
- …
- 281
- 282
- 283
- 284
- 285
- …
- 459
- Next Page »