పార్ధసారధి పోట్లూరి ……… పాకిస్థాన్ కి చెందిన భూమిని యూదులు కొనబోతున్నారు ! అమెరికాలోని వాషింగ్టన్ DC లో గల తన కాన్సులేట్ కార్యాలయాన్ని వేలానికి పెట్టింది పాకిస్థాన్ ! ఈ వేలంలో అత్యధిక ధరకి బిడ్డింగ్ వేసింది ముగ్గురు. 1. అమెరికాలోని యూదు సమాజం 2. అమెరికాలోని భారతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారి . 3. అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. యూదు సమాజం వాళ్ళు 6.8 మిలియన్ డాలర్లకి కొంటామని బిడ్ […]
మోడీ ఇప్పుడిక పూర్తి ఒంటరి సన్యాసి… ఆ ఒక్క పేగుబంధమూ తెగిపోయింది…
తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ప్రధాని తన అధికార విధుల్లో మళ్లీ మునిగిపోయాడు అనే వార్త మరీ పెద్దగా కనెక్ట్ కాలేదు… ఆయన ఎప్పుడో వదిలేసిన భార్య జశోదాబెన్ తన అత్తగారి అంత్యక్రియల సందర్భంగా కనిపించిందా లేదా అనే అంశమూ పెద్దగా ఆసక్తిని కలిగించలేదు… అన్న, తమ్ముడు ఉండగా తనెందుకు చితికి నిప్పు పెట్టాడు అనేది కూడా ఆలోచనల్లోకి రాలేదు… కానీ ఆమె మరణించిన వెంటనే ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లిపోవడం.., అత్యంత నిరాడంబరంగా, నిశ్చల చిత్తంతో, […]
వినరో భాగ్యము విష్ణు కథ… వాసవ సుహాస సినీగీతంపై ఉత్తమ సమీక్ష…
వచ్చే ఫిబ్రవరిలో ఓ సినిమా విడుదల అవుతుందట… అల్లు అరవింద్ సమర్పణ… సినిమా పేరు ‘వినరో భాగ్యము విష్ణు కథ’… అందులో ఓ పాట… వాసవ సుహాస అని మొదలవుతుంది… పాడింది కారుణ్య… తనకు వొంకేమీ ఉండదు, ప్రతిభ ఉన్న గాయకుడు… ఈ పాటను చంద్రబోస్ మెచ్చుకుని, ఓ ట్వీట్ పెట్టాడు అనే వార్త పలు సైట్లలో కనిపించింది… తీరా చూస్తే ఆ ట్వీట్లో ఆశంసలు, సంస్కరం వంటి పదాలు కనిపించి జాలేసింది… ఒరిజినల్ ట్వీట్ చూద్దామంటే, […]
బాహుబలి రేంజ్ బిల్డప్ ఇచ్చి… మరీ రాధేశ్యామ్ సినిమా చూపించారుగా…
నువ్వు రాధేశ్యాం సినిమాలో పామిస్టు (హస్తసాముద్రికుడు)వి కదా… ఏదీ నా చెయ్యి చూసి వచ్చే పదేళ్లు నా భవిష్యత్తు ఏమిటో చెప్పు అని అడుగుతాడు బాలకృష్ణ ప్రభాస్‌ను తాజా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో… తన చెయ్యి చూసి, మీకేంటి సార్, పదేళ్లూ మీరు అన్‌స్టాపబుల్ అంటాడు ప్రభాస్… అదే రాసి ఉంది అంటాడు… తన అరచెయ్యిని ప్రేక్షకులకు చూపిస్తాడు బాలకృష్ణ… దానిపై నిజంగానే మార్కర్ పెన్‌తో అన్‌స్టాపబుల్ అని ఇంగ్లిషులో రాసి ఉంటుంది……….. ఇదీ ప్రభాస్ ఎపిసోడ్ మీద […]
చైనా విలవిల… చివరకు ప్రాణావసర మందులకూ ఇండియాయే దిక్కు…
పార్ధసారధి పోట్లూరి …….. చైనాకి అవసరం అయితే భారత్ జెనెరిక్ ఔషధాలని సప్లై చేస్తుంది – భారత ప్రధాని నరేంద్ర మోడీ ! ఆయన చైనాకి ఇలాంటి ఆఫర్ ఇవ్వడం వెనుక కారణం ఉంది ! ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న వొమిక్రాన్ BF-7 వల్ల హాస్పిటల్స్ లో బెడ్లు లేక కిందనే పడుకోబెడుతున్నారు కోవిడ్ పేషంట్లని… ప్రతి రోజూ హీనపక్షంగా 10 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి చైనాలో ! మార్చి నెల 2023 నాటికి మొత్తం […]
శ్రీముఖికి ఏమైంది..? ఎందుకిలా చేస్తోంది..? ఈ అగ్లీ డ్రెస్ సెన్స్ ఏమిటి..?
ఇప్పుడు ఆంటీ పెద్దగా టీవీ తెరల మీద కనిపించడం లేదు… ఆమె చేతిలో హోస్ట్ చేయడానికి షోలు లేవు… ఆమె ఉన్నన్ని రోజులూ పొట్టి దుస్తులు, వెగటు దుస్తులకు వేరేవాళ్లకు చాన్స్ ఇచ్చేది కాదు… ధరించేది… అదేమంటే, చివరకు మా దుస్తుల మీద కూడా ఆంక్షలా అంటూ ఫైటింగుకు వచ్చేది… ఆమె అలా ఉండేది కాబట్టే ఒకటీరెండు సినిమా వ్యాంప్ పాత్రలు వచ్చి, నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నది అనే భ్రమ ఏమైనా శ్రీముఖిని ఆవరించిందేమో తెలియదు… అందుకని […]
నాగార్జున ఇజ్జత్ బర్బాద్… బిచ్చపు రేటింగ్స్ అంటే అచ్చంగా ఇవే బాసూ..!
ఇదే నెల… 18వ తేదీ… బిగ్‌బాస్ ఫినాలే… ‘‘ఒకవైపు ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్… ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు అక్కడే… ఇక ఈ దిక్కుమాలిన బిగ్‌బాస్ ఫినాలే ఎవడూ పెద్దగా దేకలేదు… వెరసి మొదటి నుంచీ చెత్తచెత్తగా సాగుతున్న ఈ సీజన్ బిగ్‌బాస్ చివరకు ఫినాలే విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ కాబోతోంది రేటింగ్స్‌లో… ఎవరు విన్నర్, ఎవరు రన్నర్… ఈ ప్రశ్నకు సింపుల్ జవాబు… ఈ ఆటలో ఎవడూ గెలవలేదు… చిత్తుగా ఓడింది మాత్రం […]
ఆహా సర్వర్లు క్రాష్… సాంకేతిక వైఫల్యమా…? లీగల్ కాంప్లికేషనా..?
ఆహా యాప్ క్రాష్ అయ్యింది… ఎవరికీ ఓపెన్ కావడం లేదు… యాజమాన్యం కూడా ఓ వివరణ జారీ చేస్తూ… ‘‘డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అమితమైన ప్రేమ కారణంగా ఓవర్ లోడ్ అయిపోయి మా యాప్ క్రాషయింది… దీని మీద వర్క్ చేయిస్తున్నాం, త్వరలో రీస్టోర్ అవుతుంది…’’ అని వెల్లడించారు… ఎస్, నిజం… ఈ ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ క్రియేటైంది… ప్రభాస్ పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది… పైగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు కూడా పాపులారిటీ ఉంది… […]
అసలు చంద్రబోసుడే ఓ తిమిర నేత్రుడు… ఈ విఫల సమర్థన చెప్పేది అదే…
ఒక ప్రయోగం విఫలమైనప్పుడు హుందాగా అంగీకరించాలి… కానీ చంద్రబోస్‌కు ఆ అలవాటు లేనట్టుంది… ఈమధ్య అన్నీ తిక్కతిక్క పదాల్ని పేరుస్తూ ఏదేదో రాసేస్తున్నాడు… తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌లో పిచ్చి ప్రయోగపదాల్ని వాడాడు… దాని మీద నెట్లో చర్చ సాగుతోంది… ‘ముచ్చట’ చెప్పింది ఏమిటంటే… తను ఏవో పారడాక్స్ ప్రయోగాలు చేయబోయాడు చరణాల్లో… కానీ ఫెయిలయ్యాడు అని… ఎస్, యండమూరితో సహా చాలామంది అభిప్రాయం అదే… ఎవరో ఆల్రెడీ చంద్రబోస్ వివరణ అడిగినట్టున్నారు… దానికి పాటలో […]
జగన్ ట్యాబ్స్ ఇచ్చాడు కదా… ఓ మహారాష్ట్ర స్కూల్ సక్సెస్ స్టోరీ చదవాలి మనం…
ఇంకా పలకలు, బలపాల కాలంలోనే ఉండిపోవాలని కోరుకుంటారు కొందరు… పల్లె పిల్లలకు ఆధునిక చదువు అక్కర్లేదనీ భావిస్తారు… అధికారమున్నా అడుగు ముందుకు వేయరు… కరోనా కాలంలో కష్టపడి కోట్ల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను కొనిచ్చారు పిల్లలకు… అయితే ఈ ఫోన్ల వల్ల పిల్లల్ని చెడగొట్టే దుష్ట సంస్కృతి వ్యాపిస్తున్నదనే భయసందేహాలున్నా సరే… ఎక్కడో ఓచోట స్టార్ట్ కావాలి, కరెక్షన్ కూడా జరగాలి… అంతేతప్ప, అసలు ఆవైపు అడుగులే వేయవద్దని ఆగిపోతే ఎలా..? జగన్ స్కూల్ పిల్లలకు […]
సో వాట్… నో, యండమూరి ఏదో విమర్శిస్తే చంద్రబోస్ జవాబివ్వాలా..?
చిరంజీవి పాట అంటే అతి పవిత్రం… అది ఎవరితో రాయబడినా, అందులో ఏమున్నా సరే, ఎవరూ ఏమనకూడదు..? అలా ట్రీట్ చేస్తుంటారు… కానీ కోపం, ఏవగింపు పరిధులు దాటితే చిరంజీవి పాటయితేనేం, మరొకటయితేనేం ప్రేక్షకులు, నెటిజనులు ఈడ్చికొడతారు… ఎస్, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఓ దరిద్రమైన వ్యక్తీకరణ అనే భావన వ్యాప్తి చెందుతోంది… ప్రత్యేకించి తనేం రాస్తున్నాడో తనకే అర్థం కాని చంద్రబోస్ కక్కిన అజ్ఞానం మీద చర్చ మొదలైంది… ఆ పాట రచనే కాదు, […]
ఏమి సేతురా లింగా… KCR లో హఠాత్తుగా ఓ నిర్లిప్తత… తల బొప్పి కడుతోంది…
నిజమే… వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో కేసీయార్ చాణక్యుడే… రాజకీయంగా ఎత్తులుజిత్తులు తెలిసిన మాయలమరాఠీ… కానీ గ్రహచారం ఎక్కడో ఎదురుతంతోంది… అందుకే జస్ట్, అలా అలా వోటుకునోటు కేసులాగే బీజేపీ అగ్రనేతలను బజారుకు లాగి బర్బాద్ చేస్తానని అనుకున్నాడు… కానీ వరుసగా తనకే దెబ్బలు పడుతూ తలబొప్పి కడుతోంది… ఇంకా చాలా ఉంది… వెరసి ఏమి సేతురా లింగా అనే పరిస్థితి…… ఇది ఒక వెర్షన్… నేను ప్లాన్ వేస్తే ఎదుటోడు చిత్తు చిత్తు అనుకున్నాడు… ఎమ్మెల్యేల కొనుగోలు […]
ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా అవతార్ పరుగు ఆగడం లేదు… 3, 4, 5 విశేషాలు తెలుసా..?!
ఎవడెంత ఏడ్చి మొత్తుకున్నా… ఎంత విద్వేషాన్ని చిమ్మినా… ఏ దుష్ప్రచారం చేసినా… సింగిల్ స్టార్ రేటింగులతో ఇజ్జత్ తీసినా… అవతార్-2 తన వసూళ్ల ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉంది… అసలు ఆ సినిమా నడవకపోతే ఇక ఆ సాంకేతిక పరిజ్ఞానానికి, ఆ ప్రయాసకు అర్థమే లేదు… పెద్ద థియేటర్, డోల్బీ సౌండ్, త్రీడీ ఎఫెక్ట్‌లో సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు… దాన్ని ప్రపంచవ్యాప్తంగా జనం ఎంజాయ్ చేస్తున్నారు… కథ ఏమిటో జానేదేవ్… వాహ్, క్యా సీన్ […]
విధిని గెలవాలి… ఆస్వాదిస్తూనే, ఆనందిస్తూనే… అనారోగ్యాన్ని జయించాలి…
ఒక అనుభవం… సుదీర్ఘంగా రాస్తే చిన్న నవలిక… పెద్ద కథ… నిజానికి ఆమె రచయిత కాబట్టి ఇలా ఆసక్తికరంగా అక్షరబద్ధం చేసింది… చదువుతూ ఉంటే అసలు ఇవి కదా చదవాల్సినవి అనిపించింది… వోకే, అది కేన్సర్ కావచ్చు, మరో అనారోగ్య విపత్తు కావచ్చు, ఎదురైతే ఏం చేయాలి..? కుంగిపోవాలా..? ఫ్రస్ట్రేషన్లో పడిపోయి మరింతగా ఆ విపత్తుకు దాసోహం అనాలా..? నిరాశలో కూరుకుపోయి ఏడవాలా..? లేదు…! ధైర్యంగా ఉంటూనే, అవసరమైనది చేస్తూనే… జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఆనందిస్తూనే, విధి విసిరిన […]
మన స్టార్ హీరోల భార్యలూ… వెండి తెర తారలకు తక్కువేమీ కాదు..!!
ఈ హీరోల సతీమణులు హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోరు…. అని ఓ ప్రధాన చానెల్ వెబ్సైట్లో ఓ వార్త… అశ్లీలంగా, కించపరిచేట్టుగా ఏమీలేదు కానీ… కొన్ని ఆలోచనల్ని ముసిరేలా చేస్తుంది వార్త… అదెలా ఉందంటే… స్టార్ హీరోల పెళ్లాలు కూడా హీరోయిన్ సరుకే అన్నట్టుగా ఉంది సూటిగా చెప్పాలంటే… నిజానికి ఇండస్ట్రీలో అత్యంత హీన పదం హీరోయిన్ సరుకు… హీరోయిన్ సరుకు అంటే ఏమిటి..? మంచి కలర్ ఉండాలి, మంచి అంగ సౌష్టవం కలిగి ఉండాలి, మంచి లుక్కు […]
ఎందుకు తిట్టాలి జగన్..? వంగబెట్టి వివరణలు రాయించుకునే తొవ్వలు లేవా..?
ఇది చదవగానే ముందుగా ఓ సందేహమొస్తుంది… జగన్‌కు నెగెటివ్ వార్త కాబట్టి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి, అది నిజమేనా అనేది ఆ డౌట్… ‘‘మీడియాను తిట్టండి, ప్రెస్ కాన్పరెన్స్‌లు పెట్టి మరీ తిట్టండి… మనం మంచి చేసినా కొందరు తప్పుడు రాతలు రాస్తున్నారు… మనం కౌంటర్ చేయకపోతే జనం నమ్మే ప్రమాదం ఉంది…’’ అని జగన్ కలెక్టర్లకు పిలుపునిచ్చాడట… వార్తలో ఏముందో పక్కన పెడితే… ఆ డెక్కుల్లోనే ఓ పాయింటుంది… ‘‘ఏ మంచి చేసినా నెగెటివ్‌గా రాస్తున్నారు… […]
ఎదురుతన్నిన సుమ ఏడుపు ప్రోమో… కవర్ చేయబోయి మరింత అభాసుపాలు…
ప్రాంక్ కాల్స్, ప్రాంక్ వీడియోస్, తప్పుడు తోవ పట్టించే ప్రోమోలు… అన్నీ వినోదాన్ని పంచుతాయి, సేఫ్‌గా ల్యాండవుతాయి అనేమీ లేదు… కొన్నిసార్లు ఎదురుతంతాయి… ఏం చేయాలో అర్థం కాదు… ఫాఫం, సీనియర్ యాంకర్ సుమదీ అదే స్థితి… యూట్యూబ్ స్టోరీల థంబ్ నెయిల్స్లాాగా టీవీల ప్రోమోలు కూడా ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేవి… కొందరు నిజంగానే నమ్మేస్తారు… దీనివల్ల సదరు యాంకర్లు, యాక్టర్ల ఇజ్జత్ పోతుంటుంది… క్రెడిబులిటీ పోతుంటుంది… ఆ సోయి వాళ్లకు ఉండదు… ఏం..? సుమ ఏమైనా […]
ప్రపంచంలో చాలామంది బండ్ల గణేష్‌లు, కేఏ పాల్లు ఉన్నారన్నమాట…!!
కాలగతిలో చాలామంది జ్యోతిష్కులు పుట్టుకొస్తుంటారు… రకరకాల పద్ధతుల్లో జోస్యాలు చెబుతుంటారు… నోస్ట్రా డామస్ దగ్గర నుంచి మన బ్రహ్మం గారి దాకా… కొందరి జోస్యాలు మాత్రమే అప్పుడప్పుడూ వార్తల్లోకి వస్తుంటాయి… నిజానికి వాళ్లు చెబుతున్నట్టుగా చెప్పబడే జోస్యాలన్నీ వాళ్లే చెప్పారో లేదో అనే డౌటనుమానాలు కూడా తరచూ వ్యక్తమవుతుంటాయి… ఇదంతా పక్కన పెడితే రష్యాలో ఇలాంటి కాలజ్ఞాని ఒకరు అర్జెంటుగా పుట్టుకొచ్చాడు… వీళ్లందరే కాదు, మన పంచాంగకర్తలు కూడా ఈ ఏడాది ఏం జరగబోతోంది అని పంచాంగ […]
రష్మిక పిల్లతనమా..? జాణతనమా..? తాజాగా సౌత్ పాటలపై తిక్క వ్యాఖ్యలు..!!
రష్మిక తెలివైందో, తిక్కదో అర్థం కాదు కొన్నిసార్లు… తన పిచ్చి వ్యాఖ్యలతో కన్నడ ఇండస్ట్రీకి శత్రువుగా మారిపోయింది… ఎంత కవర్ చేసినా కావడం లేదు… నిజానికి తన వ్యాఖ్యలతో తనకొచ్చే ఫాయిదా కూడా ఏమీ లేదు… తీట..! పెటాకులైన తన పెళ్లి నిశ్చితార్థం గురించి పదే పదే రక్షిత్ శెట్టి మీద రగిలిపోతూ, మొత్తం తన ఫ్రెండ్స్ గ్యాంగు మీద కక్షపెట్టుకుని… రక్షిత్ దోస్త్ రిషబ్ తీసిన కాంతార మీద అమర్యాదను కనబరిచింది… నిజానికి అనవసరం… ఒకవైపు […]
అనూహ్యం… అభినందనీయం… రెండే రెండు గంటల్లో కొత్త పాస్ పోర్టు జారీ…
నిజానికి ఇది చాలా చిన్న వార్త… సైజులో… పత్రికలో నిలువునా సింగిల్ కాలమ్‌లో వేస్తే సరిగ్గా కనిపించదు కూడా… కానీ ఎంత పెద్ద పాజిటివిటీ… అరె, మనం ఇండియాలోనే ఉన్నామా..? మన ప్రభుత్వ ఆఫీసులు ఇలా కూడా పనిచేస్తాయా అనే ఆశ్చర్యాన్ని, అభినందనను మోసుకొచ్చే వార్త… కనీసం డిజిటల్ మీడియా గుర్తించి, చప్పట్లు కొట్టకపోతే ఎలా…? గతంలో పాస్‌పోర్టు పొందడం అంటే గగనం… పెద్ద ప్రయాస… ఖర్చు… తిప్పట, ఆయాసం, బ్రోకర్లు… పైరవీలు… ఐనా మోసాలు… కానీ […]
- « Previous Page
- 1
- …
- 285
- 286
- 287
- 288
- 289
- …
- 482
- Next Page »