Sankar G…….. సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం. 1. యస్వీ రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లి చాప్లిన్ రంగారావు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మర్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు […]
ఎన్టీయార్ నాణెం కేవలం స్మారకం మాత్రమే… వంద రూపాయల కరెన్సీ కాదు…
ఈనాడులో ఓ వార్త… ఎన్టీయార్ చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం అని శీర్షిక… బాగుంది, కానీ లోపల మ్యాటర్లో ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఆర్బీఐ విడుదల చేస్తుందని రాశారు… కానీ అరుదేమీ కాదు… కొన్ని సందర్భాల్లో, కొందరు వ్యక్తుల స్మారకార్థం ఇలాంటి స్మారక నాణేల్ని విడుదల చేయడం పరిపాటే… అరుదైన విశేషం ఏమీ కాదు… తన తండ్రి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందనీ, దీన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామనీ ఎన్టీయార్ బిడ్డ పురంధేశ్వరి కాస్త సినిమా […]
ఈ పునాది రాళ్లపై నిలిచి… ‘మేకకొక తోక, తోకకొక మేక’ తెనాలి పద్యం విన్నాను…
Dasara at Hampi: విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు ముత్యాలు, రత్నాలు ఒదిగిన సీమ. సకల కళలు పసిడి పల్లకీల్లో ఊరేగిన సీమ. నిత్యం సంగీత, సాహిత్య, నాట్య కళల ప్రదర్శనలతో తుళ్లిపడిన సీమ. మనుషులతో పోటీలు పడి రాళ్లు రాగాలు పాడిన సీమ. ప్రాణమున్న మనుషుల నాట్యాన్ని […]
బాస్ బిడ్డ చెప్పులు పోయాయి… మూడు రైల్వే విభాగాల 30 రోజుల పరిశోధన…
వావ్… నెల రోజుల సునిశిత పరిశోధన… కోవర్టులు, గూఢచారులు, ప్రత్యేక బలగాలు అన్నీ రంగంలో దిగాయి… మూడు ప్రభుత్వ విభాగాలు ఈ కేసులోనే తలమునకలయ్యాయి… ఇదీ స్పిరిట్… ఇంకా మన మోడీ వందేమాతరం రైళ్లు, బుల్లెట్ రైళ్లు అంటూ జపిస్తున్నాడే గానీ.., తమ రైల్వే విభాగాల అధికారులు, సిబ్బంది అంకితభావాన్ని ఇంకా సరిగ్గా గుర్తిస్తున్నట్టు లేదు… గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) […]
Indian Idol… శ్రీరామచంద్ర, నిత్య Out… హేమచంద్ర, గీతామాధురి In…
ఆహా ఓటీటీలో బాగా క్లిక్కయిన రియాలిటీ షో అన్‌స్టాపబుల్… అందులో డౌట్ లేదు, కానీ అదంతా ఫస్ట్ సీజన్ వరకే, సెకండ్ సీజన్ వచ్చేసరికి బాలకృష్ణ ఎంపికలు బాగాలేవు, కంటెంట్ కూడా దారితప్పింది… ఎంటర్టెయిన్మెంట్ షో కాస్తా పొలిటికల్ షో అయిపోయి చాలామంది వదిలేశారు… దాని తరువాత ప్రేక్షకులు ఆసక్తిగా చూసింది ఇండియన్ ఐడల్ తెలుగు షో… మనం జీసరిగమప షో చూస్తున్నాం కదా… అనంత శ్రీరాం డాన్సులు, పాటలు పాడుతుంటే వెనుక గ్రూపు డాన్సులు… అది […]
పఠాన్ మూవీ గురించి ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడారంటే …!!
Bharadwaja Rangavajhala………… ప్రధాని మోదీ చాలా గర్వంగా పార్లమెంటులో పఠాన్ సినిమా గురించి మాట్లాడారు. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత ప్రాపర్ హిట్ లేని షారూఖ్ ఖాన్ పఠాన్ తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు… నిజమే … ఈ సినిమా వసూళ్ల గురించి ప్రధాని మోదీ సాక్షాత్తూ లోక్ సభలో ప్రస్తావించారు. పఠాన్ కాశ్మీర్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోందన్నారు. శ్రీనగర్ లో ఫలానా ఐనాక్స్ లో అన్ని స్క్రీన్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయన్నారు. […]
శ్రీమణికి ఒడుపు చిక్కింది… తెలంగాణ పదాల విరుపు, సొగసు పట్టుకున్నాడు…
ఇప్పుడు ఓ సినిమాకు సంగీత దర్శకత్వం అంటే రికార్డింగ్ స్టూడియోలో దూరి, నాలుగు ట్రాకులు పాడించుకుని, అన్నీ మిక్స్ చేసుకుని, నిర్మాతకు అప్పగించేయడం కాదు… ట్యూన్ కట్టాలి, ట్రాకులు పాడించుకోవాలి, ఓ సింగిల్ సాంగుగా మార్చాలి, హీరోతో నాలుగు స్టెప్పులు వేయాలి, రిలీజ్ చేసిన సింగిల్స్‌లో తనే ప్రముఖంగా కనిపించాలి… వీలైతే పాట కూడా తనే రాసుకోవాలి, లేదంటే కొరియోగ్రఫీ కూడా చేయాలి… ఎక్కడో తిరుచిరాపల్లిలో పుట్టిన సంతోష్ నారాయణన్‌కు కూడా ఈ విషయం బాగానే అర్థమైంది… […]
ఇలియానా కాంట్రవర్సీ..! హఠాత్తుగా ఇప్పుడెందుకో మరి పురాతన తవ్వకాలు..?!
నిజానికి ఇది కొత్త వార్తేమీ కాదు… చాలా ఏళ్ల క్రితం వార్తే… ఇప్పుడు ఏదో హఠాత్తుగా బయటికొచ్చినట్టు, వెలికితీసినట్టు రాసేస్తున్నారు కానీ ఇలియానా వివాదం చాలా పాతదే… బహుశా 2011 నాటిది… పైగా అందరూ ఆమెదే తప్పు అన్నట్టు రాస్తున్నారు తప్ప… ఆమె కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు… విషయం ఏమిటంటే..? తమిళంలో మోహన్ నటరాజన్ అనే ఓ నిర్మాత ఉన్నాడు… దైవత్తిరుమగల్ అని ఓ సినిమా తీశాడు… అందులో విక్రమ్ హీరో, అనుష్క శెట్టి హీరోయిన్… […]
ఇద్దరి అస్థికల ప్రేమకలశం..! ఓ అనిర్వచనీయ ప్రేమకథకు సూచిక…!
ప్రేమికుల దినం… కానుకలు ఇచ్చుకుంటారు… పూలు, ఉత్తరాలు, గ్రీటింగ్స్, డిన్నర్లు తదిరాలతో ప్రేమను వ్యక్తీకరించుకుంటారు ప్రేమికులు… ప్రపంచమంతా ఇదే వరుస… చాలా ప్రేమలు పెళ్లికి ముందే వాడిపోతాయి… కొన్ని పెళ్లి దాకా సాగుతాయి, పెళ్లయ్యాక కొన్నాళ్లకు మాడిపోతాయి… కొన్నిమాత్రమే అలాగే కొనసాగుతాయి… ఇది ప్రేమ గురించి… మరి పెళ్లి తరువాత ప్రేమ..? అది ముఖ్యమైంది… పెళ్లయ్యాక దంపతుల మధ్య ప్రేమలు కూడా కుటుంబ సమస్యలు, ఇతరత్రా వెతలతో మసకబారిపోతాయి… మరి దంపతుల్లో ఒకరి మరణం తరువాత..? కొందరు […]
విలాసం, సౌకర్యం, సౌందర్యం… ఇదీ విజయనగర రాజుల జీవన వైభవం…
Art-Architecture of Vijayanagara: ఇక్కడ రసికత అంటే శృంగారపరమయిన అర్థంగా కుంచించుకుపోయిన చిన్న మాట కాదు. సౌందర్యారాధన, కళాపోషణకు సంబంధించిన విస్తృత అర్థంలో ఉన్న పెద్ద మాట. రాయలు అంటే ఇరవై ఏళ్లపాటు విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే కాదు. మూడు వందల ఏళ్లకు పైగా విజయనగరాన్ని పాలించిన రాజులు అనే అర్థంలోనే చూడాలి. అనేక కావ్యాల్లో వర్ణనలు, శాసనాలు, ఇప్పుడు మిగిలి ఉన్న నిర్మాణాలు, ఆచారాలు, అలవాట్లు, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తరతరాలుగా జనం చెప్పుకుంటున్న […]
100 కాంతారలు- 1000 కేజీఎఫ్‌లు- లక్ష బాహుబలులు = మొఘలే ఆజమ్
అది భారతీయ వెండితెర కలలుగంటున్న కాలం. ఒక సృజనాత్మక సాహసం, ఒక కళాత్మక సౌరభం, చేతులు కలిపిన నడిచిన చారిత్రక సందర్భం. *** ఇతను మావాడు, మా భారతీయుడు, ప్రపంచ సినిమా గమనాన్ని మలుపు తిప్పగల మొనగాడు అని మనం అంతా మనస్ఫూర్తిగా చెప్పుకోగల సత్యజిత్ రే కలకత్తాలో ఒక అపూర్వమైన శిల్పం చెక్కుతున్నాడు. *** ఇక్కడ మన మద్రాసులో ఒక మాంత్రికుడూ మహా స్వాప్నికుడూ కదిరె వెంకటరెడ్డి అనే తెలుగువాడు ఒక పౌరాణిక కనికట్టు విద్యకు వ్యాకరణం రాసే పనిలో తలమునకలైవున్నాడు. […]
దానిమ్మ మొగ్గ… హిందీలో అనార్కలి…! మరుపురాని ఓ కల్ట్ క్లాసికల్ మూవీ…!
Taadi Prakash…………… కె.ఆసిఫ్ కన్న పసిడి కలల పంట…. MUGHAL-E-AZAM… A MASTERPIECE…. ఇప్పటికి సరిగ్గా 60 సంవత్సరాల క్రితం…. 1960 ఆగస్ట్ 5వ తేదీ : భారతదేశం అంతటా ‘మొగలే ఆజమ్’ అనే CULT CLASSIC విడుదలై చరిత్ర సృష్టించింది. భారతీయ ప్రేక్షకుడు అలాంటి సినిమా ఎన్నడూ చూసిఎరగడు. చూపు తిప్పుకోనివ్వని విజువల్ ఎఫెక్ట్‌తో, ఈ జన్మికక చాలు అనిపించే మధుర సంగీతంతో, పృథ్వీరాజ్ కపూర్ డైలాగుల మేఘ గర్జనతో, వెండితెర వీనస్ మధుబాల వెన్నెల సౌందర్యంతో […]
నో, నో… 144 ఏళ్లకు ఒక్కసారే ఇంతటి అద్భుతదినం అనేది శుష్కవాదన…
టీవీల్లో కనిపించే… యూట్యూబ్ చానెళ్లలో కనిపించి ఊదరగొట్టే సిద్ధాంతులకు రాద్ధాంతం తప్ప సిద్ధాంతం తెలియదు… అసలేమీ తెలియదు… ప్రేక్షకులను రకరకాల వ్యాఖ్యానాలతో పిచ్చివాళ్లను చేయడం తప్ప…. ఎలాగోలా ఒర్రేవాడు కావాలనేది ఆయా ట్యూబ్ చానెళ్లు, టీవీల సంకల్పం… ఇంకేముంది..? రంగురంగుల పూసల దండలు వేసుకుని ప్రత్యక్షమవుతారు ఈ రాద్ధాంతులు… సాధారణంగా శనిదోషాలు ఉన్నవాళ్లు శనిత్రయోదశి రోజున గుళ్లల్లో శనికి ఆరాధన చేస్తారు… నల్లబట్టలు, నల్లనువ్వులు, నువ్వులనూనె సమర్పణ… మంచిదే… కొందరు ప్రతి శనివారం గుళ్లల్లో నవగ్రహాల్లో ఒకడిగా […]
లెక్కల్లో ఈనాడు ఎక్కాలు వేరయా..! కేసీయార్ అంటే భయం, జగన్‌పై విషం…!!
జగన్ పాలన అడ్డదిడ్డంగా, ఓ దశ, ఓ దిశ లేకుండా కొట్టుకుపోతోంది… వోకే, అంగీకరిద్దాం… అడ్డగోలు అప్పులు చేయడం తప్ప, పంచిపెట్టడం తప్ప, జనానికి నాలుగు కాలాలపాటు ఉపయోగపడే పనులు ఒక్కటీ లేవు… సరే, ఒప్పేసుకుందాం… కానీ ఆ అప్పులు ఎన్ని..? ఓ నాయకుడు, ఓ పాలకుడి పట్ల విపరీత ద్వేషభావం ఉంటే… బుర్రలు పనిచేయడం మానేస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అనుకోవాలేమో… ఈనాడు బ్యానర్ వార్త… అసలు అప్పులు 9.16 లక్షల కోట్లు అని… అంటే, […]
గ్రహాంతరజీవులకు అమెరికా అంటేనే లవ్వు… అక్కడికే వస్తూపోతుంటారు…
అమెరికా తన గగనతలంలో కనిపించిన నాలుగో ‘గుర్తుతెలియని పరికరాన్ని లేదా వాహనాన్ని’ కూల్చేసింది… వారంలో ఇది నాలుగోది… మొదటిదేమో చైనా ప్రయోగించిన గూఢచార పరికరం… మరి మిగతా మూడు..? అవి గ్రహాంతర జీవుల వాహనాలు కూడా కావచ్చుననీ, ఆ కూలిన వస్తువుల శిథిలాలు దొరికితే, దర్యాప్తు జరిపితే, పరీక్షలు చేస్తే నిజాలు తెలుస్తాయని అమెరికా అంటోంది… ఎవరో అల్లాటప్పాగా కూసిన కూతలు కావు… నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (నొరాడ్) హెడ్ వాన్ హెర్క్ చెబుతున్నాడు అలా… […]
మన రాతిగుండెలు విప్పిచూస్తే… ఈ రాళ్లలో ఆ కళాసామ్రాజ్య గురుతులు… పార్ట్-3
Hampi- Pampa Virupaksha: “పంపా విరూపాక్ష బహు జటాజూటి కా రగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షా లతా ఫల స్తబకములకు కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న తాటంక యుగ ధాళధళ్యములకు నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు ప్రౌఢదేవేంద్ర రాయ భూపాలవరుని సమ్ముఖమ్మున దయ చూడు ముమ్మసుకవి” “నిగనిగలాడు సోయగము నాదేకాని నీలిమబ్బులకు రానేర దనుచు; గబగబ నడచు […]
వావ్… జస్ట్, పది సెకండ్లలోనే ఫుడ్ పార్శిల్ డెలివరీ… బ్రేవ్…
పది సెకండ్లలో ఫుడ్ ఆర్డర్ డెలివరీ..! ఎహె, అసాధ్యం అని కొట్టిపడేస్తున్నారా..? కానీ అనుకోని రీతిలో ఇది సాధ్యమైంది… జస్ట్, పది సెకండ్లలో ఫుడ్ పార్శిల్ అప్పగించాడు ఓ డెలివరీ బాయ్… ఇది జరిగింది బెంగుళూరులో… అన్నిసార్లూ ఇది ఇలాగే సాధ్యం కాకపోవచ్చు… కానీ అనుకోకుండా ఇది జరిగిపోయింది… వివరాల్లోకి వెళ్తే… బహుశా ఇది జరిగింది 9వ తేదీ… ఎన్డీటీవీ ఈ వార్తను కవర్ చేసింది… కాలెబ్ ఫ్రీసెన్ అని ఓ కెనెడియన్ బెంగుళూరులో ఉంటున్నాడు… అర్ధరాత్రి […]
ప్రభాస్ అంటే ప్రభాసే… కేజీఎఫ్ యశ్ కాదు కదా… ఫరమ్గా నో అనేశాడు…
అందుకే ప్రభాస్ అంటే ప్రభాసే… చేతిలో వేల కోట్ల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులున్నాయి… ఐనాసరే, ఎక్కడా ఒత్తిడి ఫీల్ కావడం లేదు… కొన్ని అంశాల్లో స్థిరంగా వ్యవహరిస్తున్నాడు… తనకు నచ్చని అంశమైతే నిర్మొహమాటంగా తోసిపుచ్చుతున్నాడు… తనతో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సాలార్ అని ఓ సినిమా తీస్తున్నాడు తెలుసు కదా… దాన్ని నిర్మించేది కాంతార, కేజీఎఫ్ నిర్మాతలు హొంబలె ఫిలిమ్స్ వాళ్లు… కాంతార, కేజీఎఫ్ సృష్టించిన వసూళ్ల సునామీ తెలుసు కదా, ఆ జోష్‌తో హొంబలె ఫిలిమ్స్ […]
అడుగు తీసి అడుగేస్తే డాక్టర్లు… ఐతేనేం యాభై ఏళ్లకే జీవితం ఖతం…
మైఖేల్ జాక్సన్… పరిచయం అక్కర్లేని పేరు… డాన్స్‌కు ఐకన్… ప్రాణమంటే తీపి, 150 ఏళ్లయినా బతకాలని కోరిక… బలమైన కాంక్ష… జుట్టు నుంచి కాలి వేళ్ల దాకా రోజూ పరీక్షించడానికి 12 మంది డాక్టర్లును పెట్టుకున్నాడు… తనకు పెట్టే ఆహారం ఖచ్చితంగా ప్రయోగశాలలో పరీక్షించబడేది… తన రోజువారీ వ్యాయామం, వర్కవుట్లను పర్యవేక్షించడానికి 15 మందిని నియమించుకున్నాడు… ఎప్పటికప్పుడు ఆక్సిజెన్ లెవల్స్ సరిచూసేలా, సరిచేసేలా కొత్త టెక్నాలజీ తన పడకమంచానికి బిగింపజేశాడు… ఎప్పుడు ఏ అవసరం పడుతుందో… కీలకమైన […]
కలకానిదీ విలువైనదీ… బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు…
Bharadwaja Rangavajhala……… [ 90528 64400 ] …. అన్నపూర్ణతో శ్రీశ్రీ…. తెలుగు సినిమా చరిత్రలో అన్నపూర్ణ సంస్ధకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దుక్కిపాటి మధుసూదనరావు గారి మానసపుత్రికగా ప్రారంభమైన అన్నపూర్ణా వారి తొలి చిత్రం దొంగరాముడు. ఈ అన్నపూర్ణ అక్కినేని వారి అర్ధాంగి కాదు. దుక్కిపాటి సవతి తల్లట. సవతి తల్లంటే గయ్యాళి అని సినిమా వాళ్లు బోల్డు ఉదాహరణలు తీశారు గానీ … దుక్కిపాటి వారికి మాత్రం సవతి తల్లి మీద బోల్డు […]
- « Previous Page
- 1
- …
- 289
- 290
- 291
- 292
- 293
- …
- 493
- Next Page »