అమ్మా షఫాలి…. కొంత ఫేమ్ రాగానే అవాకులు పేలడం Actors కి అలవాటే… మొన్నామధ్య ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో చేసిన సినిమాలపైన కొంత కాంట్రవర్సీగా మాట్లాడుతావా… ‘‘వక్త్ అనే సిని మాలో హీరో అక్షయ కుమార్ కి తల్లిగా చేయాల్సి వచ్చింది. తెరపై హీరో తల్లులు నిజానికి వారికంటే చిన్న ఏజ్ వారు. నేను ఇకపై అలాంటి పాత్రలు చెయ్యను అంటావా…?!’’ సర్లే, అది నీ అభిప్రాయం, నిన్ను నువ్వు హీరోయిన్ […]
మొన్న మేడిగడ్డ… నేడు అన్నారం… ఇప్పటికీ నోరువిప్పని ‘‘బాధ్యులు’’…
నిన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఓ పోస్ట్ పెట్టింది… మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు మీద మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమ్మీద నాణ్యత పరీక్షలు జరగాలనీ, లేకపోతే మొత్తం ప్రాజెక్టే ప్రమాదకరంగా మారొచ్చుననీ, కానీ కేంద్రం అడుగుతున్న వివరాల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదనీ ఆ పోస్ట్ సారాంశం… ఆ పోస్ట్ మరీ జనాన్ని ఎక్కువ భయపెట్టేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు… ఇప్పుడు కేసీయార్ తమ రహస్య స్నేహితుడు కాబట్టి బీజేపీ నేతలు పెద్దగా […]
బీఆర్ఎస్ నోరుపారేసుకుంది… పోలీస్ వెర్షన్ పూర్తి భిన్నంగా ఉంది…
దుబ్బాక అభ్యర్థి, బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసుల ప్రకటన ఆశ్యర్యపోయేలా చేసింది… వీళ్లు మనకు తెలిసిన తెలంగాణ పోలీసులేనా అనేది ఆ విస్మయం… అందరూ అని కాదు, కానీ చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికార్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్న కాలమిది… ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా సరే… ఒకరిద్దరు కేసీయార్ కాళ్లను మొక్కుతున్న సీన్లు, ఒకాయన ఏకంగా పార్టీలో చేరి రిచ్చెస్ట్‌గా అవతరిస్తున్న సీన్లూ చూశాం, చూస్తున్నాం… అనేక సందర్భాల్లో నిజాల్ని దాచేసి, కేసీయార్ […]
మళ్లీ ఫోన్ల హ్యాకింగ్ లొల్లి… రాహుల్ పీఎం ఐనాసరే… ట్యాపింగులు తప్పవు…
మళ్లీ మొదలుపెట్టారు… రాహుల్ గాంధీ అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేసి, మా ఫోన్లు హ్యాక్ అవుతున్నయ్, ఐనా సరే, ఏం చేసుకుంటారో చేసుకొండి, డోన్ట్ కేర్, నా ఫోన్ ఇవ్వమన్నా ఇస్తాను అంటూ భీకరమైన ప్రకటనలు జారీ చేశాడు… కేటీయార్, రేవంత్ సహా పలు బీజేపీ విపక్షనేతలు కూడా వంత పలికారు… శశిధరూర్, అఖిలేష్, ఏచూరి, మహువా ఇవే ట్వీట్లు చేశారు… తమకు యాపిల్ అలర్ట్ మెసేజులు వచ్చాయి కాబట్టి మా ఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నట్టే అని […]
పండుగలా చంద్రబాబు విడుదల… కానీ నిజంగానే ‘సత్యం గెలిచిందా..?’
చంద్రబాబుకు బెయిలొచ్చింది… టీడీపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి… నిజంగానే చంద్రబాబు ఊహించనంతగా తన కుటుంబసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, కొన్నిచోట్ల జనం, సానుభూతిపరులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు… ఇక ఏబీఎన్, టీావీ5, ఈటీవీ కూడా సంక్రాంతి జరుపుకున్నాయి… ఇవన్నీ సహజమే… ఇన్నేళ్ల ప్రజాజీవితంలో ఎప్పుడూ కోర్టు మెట్లు ఎక్కనివాడు, జైలు గుమ్మం దాటనివాడు హఠాత్తుగా పలు కేసుల్లో ఇరుక్కుని, 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉండాల్సి రావడం ఏపీ రాజకీయాల తీరును చూస్తే పెద్ద ఆశ్చర్యం […]
మా పెళ్లి పెటాకుల మహోత్సవానికి మీకిదే మా సాదర ‘ఆహ్వానం’…
Grey divorce: కలిసి ఉండడం కష్టమనుకున్నప్పుడు విడిపోవడమే మంచిదన్నది ఆధునిక నాగరికత. సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. భరించాల్సిన పని లేదు. కూరిమిలో ఓరిమికి చోటు లేదు. వద్దంటే వద్దు- అంతే. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి– అన్నంత మాత్రాన మంత్రానికి కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. భారతదేశంలో మహానగరాల్లో అరవై నుండి డెబ్బయ్యేళ్ళ వయసులో విడాకులు తీసుకుంటున్న వృద్ధ దంపతుల సంఖ్య ఏటేటా క్రమంగా పెరుగుతోంది. ఈమధ్య బాంబేలో ఒక వృద్ధ దంపతుల విడాకులు పెద్ద వార్త అయ్యింది. ఆమె వయసు-70; […]
చివరకు టీడీపీకి తెలంగాణలో మిగిలింది ఆ ట్రస్ట్ భవన్ ఒక్కటే..!
తెలంగాణ లో జరిగే 2023 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు . రాజమండ్రి జైలులో ఉన్న బాబు ములాఖత్ లో తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ విషయం చెప్పారు . ఆ పార్టీ ఉనికి తెలంగాణలో అంతంత మాత్రమే . పోటీ చేసినా చేయక పోయినా పెద్దగా ప్రభావం ఉండదు . ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రభావం ఎంతో టీడీపీ ప్రభావం అంతే ఉటుంది . ఐతే నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని […]
రోత రాజకీయం… సిద్ధాంతాల్లేవ్, రాద్ధాంతాలే… వెగటు వాసనల స్వార్థాలే…
టికెట్టు దొరక్కపోతే వెంటనే జంప్… ఎవడు టికెట్టిస్తే వాడే బాస్… డప్పు ట్యూన్ మారుతుంది అంతే… నాకు టికెట్టు ఇవ్వరా, నా కొడుక్కి ఇవ్వు, నా బిడ్డకు ఇవ్వు, లేదంటే ఇద్దరికీ ఇవ్వు… లేకపోతే ఆ పార్టీ వాడు పిలుస్తున్నాడు, కండువా చేంజ్ అంతే… సిద్ధాంతాల్లేవ్, రాద్దాంతాల్లేవ్… ఒకటే సిద్ధాంతం, టికెట్ కావాలి, నిలబడాలి, ఎమ్మెల్యే అయిపోవాలి… కబ్జాలు, అక్రమ సంపాదన, సెటిల్మెంట్లు, మైనింగ్… వాట్ నాట్… ఏదంటే అది చేసుకోవచ్చు… అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు… […]
తెరపై నయనతార వేరు… ఆమె అసలు అభిరుచి వేరు… కూళామ్‌గళ్ ఓ ఉదాహరణ…
ఫుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా… ఫైర్… అని కొత్త నిర్వచనం చెబుతాడు కదా బన్నీ… సేమ్, హీరోయిన్ అనగానే హీరో పక్కన దేభ్యం మొహం వేసుకుని నిలబడుతూ, పాటలు రాగానే పిచ్చిగెంతులు వేసే బొమ్మలు అనుకున్నారా… కాదు, కొందరు అంతకుమించి…! అబ్బే, మన తెలుగులో ఎవరూ లేరులెండి… తమిళంలో మాత్రం కనిపిస్తారు… (మలయాళంలో కూడా హీరోయిన్ల లెక్కలు, అడుగులు, నడకలు వేరు…) సపోజ్… సూర్య-జ్యోతిక కొన్ని సినిమాలను నిర్మించారు… వాళ్ల టేస్టుకు అందరి చప్పట్లూ పడ్డాయి… సేమ్, […]
ఆ దేవుడు మతిమరిస్తే బాగుండు… విను తెలంగాణ -5
Kandukuri Ramesh Babu ….. విను తెలంగాణ – 5… ఆ దేవుడు మతిమరిస్తే బాగుండు! పాలమూరు లేబర్ దేశాలు పట్టి వలస పోవడాన్ని సాధారణంగా ఎన్ని సీజన్లు వెళ్లారనే దాన్నిబట్టి లెక్కిస్తాము. 80 సంవత్సరాల ఈ బుడగ జంగాల వృద్ధురాలు పెళ్లూరుల సవారమ్మ సీజన్ కు తొమ్మిది నెలల చొప్పున మొత్తం 22 సీజన్లు వెళ్లి వచ్చింది. అలా వెళ్లి వస్తూ సంపాదించిన డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం ఒక కొడుకు రిక్షా తొక్కి […]
టిపికల్ ఇండియన్ పొలిటిషియన్ తరహాలో పుతిన్ తాజా వ్యాఖ్యలు…
పార్ధసారధి పోట్లూరి ….. యూదులు రష్యాలో మాత్రమే సురక్షితంగా ఉండగలరు…. పుతిన్ తాజా వ్యాఖ్య… సగటు భారతీయ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతూ, ఎలా ప్రవర్తిస్తారో అచ్చంగా అలానే ప్రవర్తిస్తున్నాడు పుతిన్! వివరాలలోకి వెళ్లేముందు… ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తాను… మాస్కోలో నివాసం ఉండే యూదుల మత పెద్ద (Cheif Rabbi) పించాస్ గోల్డ్‌స్మిత్ (Pinchas Goldschmidt) పుతిన్ స్పెషల్ మిలటరీ ఆపరేషన్ మొదలు పెట్టగానే రష్యాని వదిలి వెళ్ళిపోయాడు 2022 డిసెంబర్ లో ! అక్టోబర్ 25. పుతిన్ రష్యా […]
ఏడుపులు, పెడబొబ్బలు… అంతా నటనే… అందరూ స్క్రిప్టెడ్ పాత్రధారులే…
అది హౌజ్… పేరుకు బిగ్‌బాస్ హౌజ్… అదొక బిగ్ డ్రామా ప్లాట్‌ఫామ్… ఓ డిఫరెంటు రంగస్థలం… ఆడాలి, పాడాలి, టాస్కులు చేయాలి, నామినేషన్లలో గొడవలు పెట్టుకోవాలి ఎట్సెట్రా ఎన్నో ఉంటాయి… కానీ అన్నింటికీ మించి నటించాలి… అప్పుడే ఛీత్కరించాలి, అప్పుడే కౌగిలించుకోవాలి… సందర్భాన్ని బట్టి గ్రూపులు మారాలి, బిగ్‌బాసోడు చెబితే లవ్ ఎఫయిర్లు నడపాలి, నడిపినట్టు నటించాలి… అఫ్ కోర్స్ ఈసారి ఈ లవ్వు ట్రాకుల పైత్యం లేదు, అదొక రిలీఫ్… హౌజులోకి వచ్చాక ప్రతి వారం […]
రేవంత్ జపం..! నమస్తే తెలంగాణ హెడ్డింగుల్లో అదే పేరు పదే పదే…!!
రేవంత్ చేతిలో పార్టీ ఖతం… అబ్దుల్లా సోహెల్ … ఫస్ట్ పేజీ కొట్లాటల కాంగ్రెస్… రేవంత్ బేరాలపై విమర్శలు… ఫస్ట్ పేజీ రేవంత్ తీరు దారుణం… విష్ణవర్ధనరెడ్డి ధ్వజం… ఐదో పేజీ రేవంత్ దమ్ముంటే రా, చూసుకుందాం… సుభాష్ రెడ్డి… ఐదో పేజీ కుక్క నోట్లో రేవంత్ మూతి… పాల్వాయి స్రవంతి… ఐదో పేజీ రేవంత్ నీ బాగోతం బయటపెడతా… విజయకుమార్‌రెడ్డి… ఐదో పేజీ రేవంత్ స్వలాభానికి కాంగ్రెస్ నాశనం… ఐదో పేజీ రేవంత్ దగా చేశాడు… […]
హమ్మా… చంచల్‌గూడ జైలులో జగన్ అంత ఉల్లాస, విలాస జీవనం గడిపాడా..?
ఇక ఈ దేశాన్ని, ఈ న్యాయవ్యవస్థను బాగుచేయడం నా వల్ల కాదు అన్నట్టుగా సాగిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసంలోకి మరీ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు… తన బాస్ జైలులో పడితే అర్జెంటుగా బెయిల్ ఇచ్చేయాలి, క్వాష్ పిటిషన్ క్లియర్ చేసి, చంద్రబాబును బయటికి పంపించేయాలి… కేసులు పెట్టిన సీఐడీ అధికారులను, వాళ్ల బాస్ జగన్‌ను శిక్షించాలి వీలైతే… అన్నట్గుగా సాగింది తన వ్యాసం… సహజమే… చంద్రబాబు గురించి చంద్రబాబుకన్నా ఎక్కువ ఆందోళనపడే బ్యాచులో అగ్రగణ్యుడు రాధాకృష్ణ… […]
పంటలకు పాత చీరెల రక్ష… అడవి పందుల బెడద నుంచి శ్రీరామరక్ష…
Kandukuri Ramesh Babu ……. విను తెలంగాణ -4 ……. రెహమాన్ విజిటింగ్ కార్డు: చేనుకు కట్టే చీరలు అమ్మబడును… నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు, దశాబ్దాలుగా మనం అవలంబించిన అభివృద్ధి నమూనా కారణంగా కోతులు కూడా గ్రామాల్లోకి వచ్చి మనం పరిపరి విధాల ఇబ్బందులు పడుతున్నామని, ఆ బాధలు ఇంకా పెరుగుతాయని 2016లో రాసిన వ్యాసం “అభివృద్ధికి పుట్టిన కోతి”. అది గతంలో నమస్తే తెలంగాణలో అచ్చయింది. ఇప్పుడు చెబుతున్న అంశం అడవి పందుల […]
బాయి బొడ్డెమ్మ… పదిరోజుల పండుగ… దోసకాయ పలారం నాకు – దోసెడు పాటలు నీకు…
Sampathkumar Reddy Matta……… బాయి బొడ్డెమ్మ – కోజాగర పున్నమ……. #ఇది_శరదుత్సవ_సంబురం… పీటబొడ్డెమ్మ, చెక్కబొడ్డెమ్మ, పందిరిబొడ్డెమ్మ, పెండబొడ్డెమ్మ, చల్లుడుబొడ్డెమ్మ, గుంటబొడ్డెమ్మ బొడ్డెమ్మ తాత్త్వికరూపాలు రకరకాలు. వీటిలో మరో ముఖ్యరూపం…బావి బొడ్డెమ్మ. ఊరు చావడికాడ లేదంటె మూడుతొవ్వలకాడ నడితొవ్వల బావిరూపంలో తవ్వేదే బావిబొడ్డెమ్మ. ఇది ప్రాణికోటి జీవనాధారమైన జలగౌరికి సంకేతం. కొందరు అమావాస్యనాడు, కొందరు తదియ నెలపొడుపుకూ బొడ్డెమ్మ బాయితవ్వుతరు. గడ్డపారకు,పారకు, స్థలగౌరియైన భూదేవికి పూజచేసి బాయిదవ్వే మొగపిల్లగాండ్లకు కంకణం కట్టి బాయి మొదలుపెడుతరు. తూర్పుపడమర సూర్య చంద్రగద్దెలు […]
తబరన కథె… కమల్ హాసన్‌కే అన్న కదా మరి… జీవించేశాడు…
… 2009-2011 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో దాదాపు 1400 మంది రైతులు అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతకు ముందే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి రూ.7 వేల కోట్ల నిధులు మంజూరైనా అవేవీ ఆ ఘోరాన్ని ఆపలేకపోయాయి. ఆ నిధుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు గద్దల్లా కాచుకున్నారు. లంచం ఇస్తే తప్ప రైతుల చేతికి పరిహారం రాదన్నారు. National Human Rights Commission ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పదేళ్లు గడిచిపోయాయి. పరిస్థితి ఏమైనా మారిందా? […]
నాగార్జున బాబు గారూ… శివాజీ మీద ఈ అవ్యాజమైన ప్రేమ ఏమిటండీ…
శోభాశెట్టి పిచ్చోడా అని యావర్‌ను తిట్టిపోసింది, తన తిట్టు మీదే నిలబడింది… తప్పు… ఎస్… ఆట సందీప్ బొంగులో అనే పదం వాడాదు… సమర్థించుకునే ప్రయత్నం చేశాడు… తప్పు… ఎస్… యావర్ మళ్లీ అరుపులు, కేకల కేరక్టర్ అయిపోయాడు… తప్పు… ఎస్… మరి శివాజీ కూడా చాలాసార్లు బిగ్‌బాస్‌ను తిట్టాడు, పరుషమైన పదాలు వాడాడు… ఈసారైతే ఏకంగా ఎవడో ఒకడిని తన్ని బయటికి పోతాను అని వీరంగం వేశాడు… అది తప్పు కాదా నాగార్జున బాబు గారూ… […]
ఖైదీ… తెలుగు ఇండస్ట్రీలో ఒక మెగా సామ్రాజ్యానికి పునాది…
▪️ ఏరా ఏకాకి.. కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వెళ్తున్నావేం ? అంటూ సూర్యాన్ని ఒడిసిపట్టి జీపులో ఎక్కించిన ఇన్స్పెక్టర్ ఆయన్ను సరాసరి స్టేషన్ కు తీసుకెళ్తాడు. అక్కడ సూర్యంతో వేలిముద్ర వేయించడానికి పోలీసులు ఎంతగా ప్రయత్నించింది.. స్టేషన్ లో అందర్నీ కొట్టి సూర్యం ఎలా పారిపోయిందీ ఇంకా కళ్ళ ముందే ఉంది. ▪️ సూర్యాన్ని , అయన కుటుంబాన్ని వీరభద్రయ్య పెడుతున్న హింసలు చూస్తుంటే థియేటర్లో వాళ్లకు మనసు రగిలిపోయేది. అంత పేదరికంలోనూ సూర్యాన్ని మధులత […]
బతుకమ్మను పేర్చే గునుగు పూలు… రొట్టెలకు కూరలై… బతికించాయి,
Kandukuri Ramesh Babu ….. విను తెలంగాణ -3…. వలస కూలీల ‘గునుగు కూర’ గురించి విన్నారా? పాలమూరు ఉమ్మడి జిల్లాల్లో వలస వెళ్లడానికి గల కారణాలు అన్వేషిస్తుండగా 70 దశంలో వచ్చిన తీవ్రమైన కరువు గురించి చాలామంది వివరించి చెప్పారు. దాదాపు ఏడేళ్ల తీవ్రమైన కరువు వారిని అనేక విధాల ఇబ్బందులు పెట్టిందని చెప్పారు. అప్పటికే వలస వెళ్లడం మొదలైన వారికి అదనంగా OC కులస్తులు తప్పించి మిగతా కులాల వారంతా పెద్ద ఎత్తున వలస […]
- « Previous Page
- 1
- …
- 293
- 294
- 295
- 296
- 297
- …
- 384
- Next Page »