హీరో ఎంత తోపు అయినా సరే… డాన్సులు ఇరగదీసినా సరే… మ్యూజిక్ కంపోజర్ దునియా ట్యూన్ ఇచ్చినా సరే… సినిమాలో మంచి సందర్భంలో ఆ పాట ఫిట్టయినా సరే… ఆ పాట విస్తృతంగా జనంలోకి వెళ్లాలంటే మంచి కొరియోగ్రఫీ కావాలి… మంచి సింగర్ కావాలి… మంచి రైటర్ కావాలి… పోనీ, ఆ పాటకు అలా బాగా కుదరాలి… ఇది కామన్ సెన్స్… గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాట ఆస్కార్ పోటీలో ఉంది… ఏం […]
బట్టలిప్పుకున్న ఓ సిగ్గులేని బరిబాతల పాట… సీఎంను తిట్టడానికేముంది..?!
బేశరం పఠాన్ సినిమా… అంటే సిగ్గూశరం లేని సినిమాను తీసిన షారూక్‌ఖాన్‌ను వెనకేసుకుని రావడానికి కొందరికి ఇప్పుడు అస్సోం సీఎం దొరికాడు… ఒక్క బీజేపీవాడు దొరికితే చాలు, ఇక ఎవరిని సమర్థిస్తున్నామనే సోయి కూడా ఉండదు వాళ్లకు… ఎంతసేపూ బీజేపీ కోణంలోనే చూడాలా ప్రతి విషయాన్ని..? పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా ఒక్క అస్సోంలోనే కాదు, దేశంలో పలుచోట్ల నిరసనలు జరుగుతున్నయ్… పోస్టర్లు చింపేస్తున్నారు… థియేటర్లను బెదిరిస్తున్నారు… సోషల్ మీడియాలో బ్యాన్ పఠాన్ హ్యాష్ ట్యాగ్ హోరు కనిపిస్తోంది… […]
నమ్మ అప్పు… మళ్లీ మళ్లీ గుర్తొస్తాడు… 3 కోట్ల వ్యూస్‌తో కృపాల్ ఫుడ్ వీడియో…
అనుకోకుండా 3 కోట్ల వ్యూస్ ఉన్న ఒక ఫుడ్ వీడియో చూడబడ్డాను… జస్ట్ రెండేళ్లలో… కృపాల్ అమన్న తెలుసు కదా… వెరీ ఫేమస్ ఫుడ్ వ్లాగర్… మన గుండు నగల వ్యాపారిలాగే ఇతనూ గుండుతోనే కనిపిస్తాడు… ఎక్కువగా కర్నాటక రెస్టారెంట్ల పరిచయం చేస్తుంటాడు… అదుగో ఆయన వీడియో ఇది… 3 కోట్లు అనే అంకె ఒకటి ఆశ్చర్యపరిస్తే… అప్పటి స్టార్ హీరో నమ్మ అప్పు పునీత్ రాజకుమార్ ఒక దగ్గరి స్నేహితుడిలా తనతో కలిసి, అనేక విషయాల్ని […]
అగ్రహారంలో గాడిద… మతంపై వ్యంగ్యం… ఇప్పుడు తీయగలరా..? చూడగలమా..?
Bharadwaja Rangavajhala…….. అగ్రహారంలో గాడిద అని ఓ తమిళ సినిమా ఉంది … జాన్ అబ్రహాం తీశాడు … మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం అనంటారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ … కానీ మతం ఆ పని మాత్రమే చేస్తోంది అని చెప్పడమే లక్ష్యంగా ఓ సినిమా వచ్చింది… ఆ రోజుల్లో … దాని పేరే అగ్రహారంలో గాడిద… అనగనగా ఓ కాలేజీ ప్రొఫెసర్… ఆయనకు ఓ గాడిద పిల్ల దొరుకుతుంది. వాకబు […]
అబ్బే.., ఏం బాగుందిర భయ్ సినిమాలో… విలన్ హీరో ఎట్లయితడు..?
Prasen Bellamkonda…… విలన్….హీరో అనేవి పర్యాయపదాలా… కావు. కానీ కొన్ని సందర్భాలలో అవును. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ను అందరూ పొగుడుతుంటే చూసా. చిరాకేసింది. అతను మంచి నటుడే. కానీ మంచి నటన మంచి సినిమా అనిపించుకోదు. విలువలు ఇలా దిగజారడాన్ని మనం అంగీకారిస్తున్నామా అనేది ఇక్కడ ప్రశ్న. విలన్ చేయాల్సిన పనులన్నీ హీరో చేస్తే కూడా హీరోయేనా. కొన్ని తప్పుడు పనులను లార్జర్ దేన్ లైఫ్ సైజ్ లో చేసేవాళ్ళను విపరీతంగా ఆరాధించే మనుషులు మనకు […]
గోల్ ధన… ఈ తంతూ ఇక్కడ స్టార్ట్ చేయాలిక… ఔనూ, మళ్లీ ఆ అనంతుడి రూపమేంటి..?
మన తెలుగింటి పెళ్లి ఆచారాలు గంగలో కలిసిపోయినా సరే… మనం నార్త్ సంప్రదాయాాల్ని నెత్తిన పెట్టుకుంటాం… ‘‘మొన్న మా బిడ్డ పెళ్లిలో మెహందీ ఫంక్షన్ అదరగొట్టాం తెలుసా..? 5, 6 లక్షల ఖర్చు, పోతేపోయింది, మళ్లీ మళ్లీ చేసుకుంటామా ఏం..?’’ అని ఘనంగా చెబుతుంటుంది ఓ నడమంత్రపు సిరి… ‘‘అదేముందిలే ఒదినా, సంగీత్ చేశాం మా కొడుకు పెళ్లికి… భోజనాలు, మందు, డాన్సులు, కానుకలకు 10 లక్షల ఖర్చు… అంతేలే, నువ్వన్నట్టు ఖర్చు పోతేపోయింది, మళ్లీ మళ్లీ […]
వర్క్ ఫ్రమ్ హోమ్… సర్వీస్ ఎట్ హోమో… ఇంటి దగ్గరకే స్మశానవాటిక…
ఇప్పుడంతా ఇంట్లోనే… ఇంటికే… థియేటర్ ఇంటికే వచ్చింది… హాస్పిటల్ ఇంటికే వస్తోంది… షాపింగ్ మాల్ ఇంటికే వచ్చేస్తోంది… పనిచేసే ఆఫీసు కూడా ఇంటికే వచ్చి పనిచేయించుకుంటోంది… కేసినోలు, మసాజ్ సెంటర్లు ఎట్సెట్రా ఎట్సెట్రా… ఏదైనా సరే, జస్ట్, మ్యాటర్ ఆఫ్ వన్ క్లిక్… వన్ కాల్… చిన్న కబురు పెడితే చాలు, ప్రపంచమే ఇంటికొస్తోంది… మనీ మ్యాటర్స్… దట్సాల్… మరి మనిషి మరణిస్తే కాటిదాకా ఎందుకు వెళ్లడం…? కాల్ చేస్తే, వల్లకాడే తరలి రాదెందుకు..? ఇంటి దగ్గరే […]
పాకిస్థాన్ ఒంటరి..! చైనా, అమెరికా వదిలేస్తున్నాయి… అందుకే హఠాత్తుగా శాంతి కూతలు…
పార్ధసారధి పోట్లూరి …. అంతర్జాతీయంగా భారత్ దౌత్యం వలన పెను మార్పులు జరుగుతున్నాయి ! మూడు అంశాలని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉన్నది! మొదటి సారిగా చైనా పాకిస్థాన్ ని వదిలించుకోవడానికి ప్రయత్నించే పనిలో పడ్డది ! అమెరికా కూడా పాకిస్థాన్ ని వదిలించుకునే దిశగా అడుగులు వేస్తున్నది ! భారత్ విషయంలో చైనా దిగివచ్చే సూచనలు కనపడుతున్నాయి ! అయితే ఇలాంటివి ఏవీ అంత తేలికగా వాటికవే జరిగిపోవట్లేదు ! భారత్ విదేశాంగ విధానం దౌత్యపరమయిన […]
అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ పండోరా మెగా ప్రాజెక్టు… నయా అవతార్…
చుట్టూరా అనంతమైన హిందూ మహాసముద్రం… దట్టమైన అడవులు… దాదాపు 800 దీవుల్లో ఒకటైన గ్రేట్ నికోబార్ దీవి అది… ఆధునికత, నాగరికత ప్రభావాలు సోకకుండా, ఇంకా ప్రకృతి ఒడిలోనే మనుగడ సాగిస్తున్న వేలాది మంది ఆదిమవాసులు… వ్యవసాయం కూడా ఎరుగని ముందుకాలం నాటి జాతులవి… ఆ జన్యువులు వేరు, ఆ మనుషులే వేరు… ఆ అడవుల్లో జంతుజాలం, వృక్షజాతులు… అదొక అద్భుత సంపద… ఇప్పుడు ఆ సంపద మీద అభివృద్ధి అనే పడగనీడ పరుచుకుంటోంది… పండోరా గ్రహానికి […]
అమ్మా అలీదా గువేరా… వీళ్లకు సంఘీభావం చెప్పే అర్హత కూడా లేదమ్మా…
Gurram Seetaramulu………. చేగువేరా బిడ్డ హైదరాబాద్ వస్తోంది అని తెలిసి, అంత గొప్ప యోధుని బిడ్డను చివరిసారిగా చూడాలి అని ఆఘమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరా. రవీంద్ర భారతి ముందు ఈ ఇరవై ఏళ్ళలో అన్ని కార్లు ఆగి ఉండడం నేనెప్పుడూ చూడలేదు. మొత్తానికి నిలబడే స్థలం కూడా లేని, కిక్కిరిసిన రవీంద్ర భారతిలో ఒంటికాలి మీద నిలబడి ఒక్కసారి ఆమెను చూసి బయట పడ్డా.. ఐరిష్ మూలాలున్న చే కుటుంబం… లాటిన్ అమెరికాలో స్థిరపడ్డ మెడికో… […]
ప్రొఫెషనల్ డాన్సర్లకు దీటుగా… అదరగొట్టేస్తున్న బీబీజోడి డాన్స్ షో…
నిజానికి చాలారోజులైంది ఈ ప్రోగ్రాం స్టార్టయి… ఎహె, నలుగురు సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏవో పిచ్చి గెంతులు వేయిస్తారు, అంతేకదా అనుకున్నాను అందరిలాగే… కానీ స్టార్‌మాటీవీలో వచ్చే బీబీ జోడీ ప్రోగ్రాం డిఫరెంటుగా ఉంది… ఆకట్టుకుంటోంది… బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రాం చేయడం మాటీవీకి అలవాటే… వాళ్లకు కూడా అదనపు ఆదాయం కాబట్టి మాటీవీ చెప్పిన ప్రోగ్రామ్స్‌లో చేస్తుంటారు… మాటీవీకి నాన్-ఫిక్షన్ కేటగిరీలో రియాలిటీ షోల అవసరం ఉంది… లేకపోతే రేటింగుల్లో ఇంకా పడిపోయే ప్రమాదం […]
పద్మవ్యూహాన్ని ఛేదించిన ఖైదీల కథే.. ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్!
చుట్టంతా నీరు.. మధ్యలో ఓ దీవి. ప్రపంచం మొత్తం నుంచి ఏకాకై పడేసినట్టుండే ఆ దీవిలో ఎత్తైన గోడల మధ్య తప్పించుకోవడం అసంభవమయ్యే ఓ పెద్ద జైలు. అంతుకుమించి నిత్యం నిఘా నీడలో కనిపించే భారీభద్రత. ఆ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు.. కేవలం చెంచాలు ఉపయోగించి పారిపోతే..? ఆ వాస్తవ సంఘటనే ఎస్కేప్ ఫ్రమ్ అల్కాట్రాజ్ మూవీ నేపథ్యం. వివిధ నేరాల్లో శిక్షనుభవిస్తూ.. ఎంతటి భారీ భద్రత ఉన్న జైళ్లనుంచైనా పారిపోగల్గే కరుడుగట్టిన నేరస్థులకు… ఆ […]
సింగర్ మంగ్లిపై దాడి… కన్నడిగుల్లో ఉన్మాద స్థాయికి భాషాభిమానం…
మంగ్లికి వివాదాలు, తలనొప్పులు తప్పడం లేదు… ఇప్పుడైతే ఏకంగా తన కారు మీద దాడి చేశారు ఆగంతకులు… బళ్లారి ఉత్సవాల్లో పాల్టొనడానికి వెళ్లిన మంగ్లిపై (సత్యవతి రాథోడ్) దాడి… మున్సిపల్ కాలేజీ గ్రౌండ్స్‌లో తను పాల్గొన్న ప్రోగ్రాం ముగిసి, తిరిగి వెళ్లిపోతుంటే ఈ దాడి జరిగింది… కారు అద్దాలు ధ్వంసమయ్యాయి… అంతకుముందు కొందరు మేకప్ టెంటులో జొరబడ్డారు… తరువాత రాళ్లు రువ్వారు… సమయానికి పోలీసులు రంగప్రవేశం చేసి, వాళ్లను చెల్లాచెదురు చేశారు… మంగ్లి ఇప్పుడు దాదాపు అన్ని […]
ఈనాడు చెప్పలేదు… ఆమే ట్వీట్ ద్వారా ఆ సంఘటన వివరించింది…
నిజంగా కలవరం కలిగించే సంఘటనే… ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసే స్మిత సబర్వాల్ ఇంటికి రాత్రిపూట ఓ డిప్యూటీ తహసిల్దార్ వెళ్లిన తీరు ఆందోళనకరమే… రెండురోజుల క్రితం జరిగిన సంఘటనను ఈనాడు దాన్ని కవర్ చేయడం బాగానే ఉంది… కానీ ఆమె ఎవరో పేరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు… ఎందుకో భయపడింది… ఆ వార్త రాసిన తీరు కూడా ఆమె ఎవరో ఊహించేట్టుగా కూడా లేదు… వార్త ఏమిటంటే… స్మిత సబర్వాల్ భర్త ఐపీఎస్ అధికారి… ఆమె […]
బిరుదు కూడా కబ్జా ఏమిటి రామజోగయ్య శాస్త్రీ… ఇదేం చోద్యం..?!
రామజోగయ్య సరస్వతీపుత్ర అయితే… పుట్టపర్తి ఏమవుతాడు? “ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది; ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది; ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది; ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ మాది; తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ పదునాల్గు భాషలందు, బ్రతుకునకు బడిపంతులు, భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది” ఇది సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తన గురించి తనే చెప్పుకున్న […]
భలే చాన్సులే..! ఆ రెండూ వర్కవుటైతే సాయిపల్లవికి ఫుల్ ఫాయిదా..!
తెగింపు తరువాత అజిత్ చేయబోయే సినిమా… భారీ బడ్జెట్… తగ్గేదేలా… లైకా ప్రొడక్షన్స్ వాళ్ల సినిమా… 250 కోట్ల బడ్జెట్… సహజంగానే అందులో తనకు జోడీగా ఎవరు నటిస్తారు..? జానర్ ఏమిటి..? వంటి ప్రశ్నలు రేకెత్తుతాయి కదా… అసలు అజిత్ సినిమాకు అంత మార్కెట్ ఉందానేది మరో ప్రశ్న… తునివు (తెగింపు) సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 160 కోట్లు… మహా అయితే మరో 40 కోట్లు వచ్చి, 200 కోట్లు కష్టమ్మీద వస్తాయేమో… శాటిలైట్ టీవీ […]
‘బేశరం ప్రశ్న’ వేసిన జర్నలిస్టు… కంగనా నుంచి ఊహించని రిప్లయ్…
కంగనా రనౌత్… బాలీవుడ్లో ఓ ఇంట్రస్టింగ్, ఫైటింగ్ కేరక్టర్… ఆమె వార్తలకు రీచ్ ఎక్కువ… సహజంగానే ఆమె ప్రెస్మీట్లకు ఎక్కువ మంది రిపోర్టర్లు హాజరవుతుంటారు,… కవరేజీ కూడా ఎక్కువే… అయితే కంగనా ప్రెస్‌మీట్‌ను తమకు అనుకూల ప్రచారం కోసం వాడుకుందామని అనుకున్న దీపిక పడుకోన్ పీఆర్ టీం కంగనా బ్లంట్ రెస్సాన్స్తో భంగపడిపోయింది… బేశరం పాటతో దీపిక ఇజ్జత్ పోగొట్టుకుంది… జవాబులు చెప్పాల్సి వస్తుందనే భయంతో తను ప్రెస్‌కు కూడా దూరదూరంగా ఉంటోంది… కానీ ఆమె పీఆర్ […]
పైసలా, పెంకాసులా… వరల్డ్ ఫోర్త్ రిచ్చెస్ట్ యాక్టర్ ఆస్తి ఇన్నివేల కోట్లా..?
అమితాబ్ కుటుంబంలో ముగ్గురు సంపాదిస్తున్నారు… సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు… నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ దరిదాపుల్లోకి కూడా రారు… హాలీవుడ్ నటులకు ఇచ్చే రెమ్యునరేషన్లు, ఎండార్స్మెంట్ డబ్బులు అడ్డగోలు… ఐనా సరే, నో ప్రాబ్లం… షారూక్ ఖాన్ వాళ్లను కూడా దాటేసిపోయాడు… ప్రస్తుతం షారూక్ పొజిషన్ ఏమిటో తెలుసా..? ప్రపంచంలోకెల్లా నాలుగో అత్యంత ధనిక నటుడు… పఠాన్ సినిమాను బ్యాన్ చేస్తారా..? చేసుకొండి… కొడుకు ఆర్యన్ ఖాన్ మరింతగా డ్రగ్ కేసుల్లో ఇరుక్కుంటాడా..? […]
ఓ పిచ్చి రాజు వర్సెస్ ప్రకృతి… కాంతార-2 కథేమిటో ముందే చెప్పేశారు…
అయ్యో అయ్యో, కథ ముందే తెలిస్తే ఇంకేమైనా ఉందా..? థ్రిల్ ఉండదు కదా, సస్పెన్స్ ఉండదు కదా… అని నిర్మాతలు, దర్శకులు, హీరోలు భలే కంగారుపడిపోతుంటారు….. కానీ దమ్మున్న దర్శకుడైతే ముందే కథ చెబుతాడు, లేదా సినిమాలోనే ముగింపుతోనే కథ ప్రారంభిస్తాడు… తను కథ చెప్పబోయే తీరు మీద కాన్ఫిడెన్స్ అన్నమాట… కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ఆ నమ్మకం ఉంది… అందుకే తీయబోయే కాంతార-2 కథ ముందే చెప్పేశాడు… అందరూ అనుకున్నట్టు ఇది కాంతార […]
అయ్యో కృష్ణ వంశీ… నీ మార్క్ పాటను ఆశపడితే… ఎంత పని చేశావయ్యా…
మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ పాట… దానికి ఇ‘లయ రాజా’ సంగీతం… పాటల చిత్రీకరణలో కింగ్ కృష్ణ వంశీ… పాపులర్ రంజని గాయత్రి సిస్టర్స్ గాత్రం… అసలు ఇంకేం కావాలి..? చెవుల తుప్పు వదిలిపోవాలి కదా… చాన్నాళ్లుగా తన నుంచి ఓ మంచి క్రియేటివ్ కంటెంట్ కోసం రసజ్ఞులైన ప్రేక్షకులు, శ్రోతలు ఆసక్తిగా, దప్పికతో ఎదురుచూస్తున్నవేళ……. కృష్ణవంశీ తుస్సుమనిపించాడు…! రంగమార్తాండ సినిమా వీడియో పాట రిలీజ్ చేశారహో […]
- « Previous Page
- 1
- …
- 293
- 294
- 295
- 296
- 297
- …
- 490
- Next Page »