కార్తీకదీపం… ఎవరొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే… ఇండియన్ టీవీ సీరియళ్ల హిస్టరీలో నెంబర్ వన్… ఆ రేంజ్ టీఆర్పీలు బహుశా ఇక ఏ సీరియల్ సాధించదేమో… (టీవీ రామాయణం, టీవీ మహాభారతం గాకుండా…) ప్రత్యేకించి ప్రాంతీయ భాష సీరియళ్లలో ఆ స్థాయి సక్సెస్ ఓ రికార్డు… సూపర్, బంపర్ హిట్ సినిమాల ప్రీమియర్ల ప్రసారం టీఆర్పీలకన్నా కార్తీకదీపం రేటింగ్స్ ఎక్కువ… దానికి ప్రధాన కారణం ప్రేమి విశ్వనాథ్… దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క పాత్రలో అనితర […]
మన టీవీలను బతికిస్తున్న టాప్ టెన్ ప్రొడక్ట్స్ ఏమిటో తెలుసా..? ఆశ్చర్యం..!
ఓ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటో తెలుసా..? మనం టీవీలు చూస్తున్నాం… సంవత్సర చందాలు కడుతున్నాం… రకరకాల ప్యాకేజీలు, రేట్లతో డబ్బు చెల్లిస్తున్నాం… కానీ అవి టీవీ చానెళ్లకు ఉత్త జుజుబీ… పత్రికల కవర్ ప్రైస్లాగా… అసలు రెవిన్యూ యాడ్స్ ద్వారా వస్తుంది… అసలు పెద్ద కంపెనీల యాడ్స్ లేకపోతే ఒక్క టీవీ చానెల్ కూడా నడవదు… అయితే ఏ కంపెనీలు, ప్రధానంగా ఏ ఉత్పత్తులు టీవీ ప్రకటనల్ని శాసిస్తున్నయ్… మన డబ్బు ప్రధానంగా ఏయే ఉత్పత్తుల ద్వారా […]
ఓ చిన్న ప్రశ్న… పెద్ద చర్చ… అమలా పాల్‌ను గుడిలోకి అనుమతిస్తే తప్పేమిటి..?!
హిందూ బంధుగణానికి ఓ ప్రశ్న… సినిమా నటి అమలా పాల్‌ను ఓ గుడిలోకి రానివ్వకపోవడం కరెక్టేనా..? కేరళలోని తిరువైరానిక్కుళం మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లగా… అక్కడి అర్చకులు, ఆలయ కమిటీ, సిబ్బంది అడ్డుకున్నారు… అన్యమతస్తులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు… మహాదేవ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు… ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చని సూచించారు… విధి లేక ఆమె అలాగే చేసింది… ఇదీ వార్త… ప్రశ్న ఏమిటంటే..? ఆమె ప్రవేశాన్ని ఆలయ ఆచారాలు, […]
ఫాఫం సుమక్క… మొనాటనీ వచ్చేసింది… కొత్త కిచిడీ షో అప్పుడే ఢమాల్…
మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు… దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? మస్తు హైప్ […]
పవన కల్యాణం అనుష్టుప్ నారసింహం… అబ్బో, అదొక వ్యా‘కారణ యాత్ర…
Yatra Names: హిందూపురం ఎస్.డి.జి ఎస్ కాలేజీ తెలుగు అధ్యాపకుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ అంటే మా నాన్నకు అపారమయిన గౌరవం. మా నాన్న అవధానాల్లో నిషిద్ధాక్షరి పృచ్ఛకుడుగా చాలావరకు కర్రా సారే ఉండేవారు. కర్రా సార్ దగ్గర అయిదేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నానని మొదట్లో అనుకునేవాడిని. తరువాత కేవలం విన్నానని అర్థమయ్యింది. వ్యాకరణ పాఠం అయ్యాక కొంతకాలం ఛందస్సు కూడా చెప్పారు. గురు, లఘువుల గణాలు పెన్సిల్ తో గీతలు గీసుకుని, యతి ప్రాసలు […]
ఈ ఉద్దండుగలతో కలిసి కేసీయార్ యాంటీ-మోడీ జాతీయ పోరాటం..?!
ఖమ్మంలో జరిగిన సభలకు తాతల్లాంటి సభల్ని కూడా కేసీయార్ మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆర్గనైజ్ చేయగలడు… కానీ ఖమ్మం సభలో ఓ జోష్ కనిపించలేదు… సాధారణంగా కేసీయార్ సభలంటే వాటిల్లో తెలంగాణతనం బాపతు ఓ ఎమోషన్, ఉత్తేజం అంతర్లీనంగా కనిపిస్తూ ఉండేది… ఇప్పుడది లోపించింది… అసలు వీళ్లు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారనేదే తెలంగాణ జనానికి పెద్ద ప్రశ్న… దానికి జవాబు సున్నా… వివరంగా చెప్పాలంటే..? త్వరలో మా జాతీయ విధానం ఏమిటో ప్రకటిస్తాం అని కేసీయార్ […]
చివరకు సర్వపిండి అని రాసినా మైలపడిపోతారా ఎడిటర్ మహాశయా…
సీపీఎం… తెలుగునాట దాని బతుకంతా తెలంగాణ వ్యతిరేకతే… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు సైతం తన సమైక్యాంధ్ర పోకడను దాచుకోలేదు… ఏవో పిచ్చి సూత్రాన్ని బయటకు ప్రదర్శిస్తూ యాంటీ తెలంగాణ ధోరణిని స్పష్టంగానే కనబరిచింది… సరే, సోనియా పుణ్యమాని తెలంగాణను ఎవరూ ఆపలేదు… ఎర్రజెండాకు ఆపే సీన్ కూడా లేదు… తెలంగాణ ఏర్పడగానే సీపీఎం ఉమ్మడి ఆస్తులు చకచకా పంచేసుకున్నారు… ఇకనైనా అది యాంటీ తెలంగాణ పోకడను మార్చుకుంటుందని అనుకున్నారు అందరూ… కానీ ప్చ్… అది మారదు… […]
వందే భారత్… ఈ రైలు క్రియేటర్నూ నంబి నారాయణన్లాగే వేధించారు…
Chada Sastry…. వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఇంట్రస్టింగుగా ఉంది… అంతకుమించి… వందే భారత్ రైలును ఆపడానికి ఎలాంటి కుట్రలు జరిగాయో కూడా పోస్టు చెబుతోంది… మన రైల్వేస్‌లో కూడా ఒక ఇస్రో నంబి నారాయణన్ ఉన్నాడు… వేధించబడ్డాడు… ఓసారి డిటెయిల్డ్గా చదవండి… అది 2016వ సంవత్సరం. సాధారణంగా, పదవీ విరమణ సమయంలో, చివరి 2 సం.లలో తనకు అనువైన ప్రాంతంలో తేలికైన బాధ్యత గల పోస్టింగ్ పొంది, ప్రశాంతంగా రిటైర్ అవ్వడానికి లేదా చివరి […]
లలిత, సరళ పదాలు పొదిగిన ఓ తేటగీతం… అది మల్లికా శాకుంతలం…
ఏవో పిచ్చి పదాలు… అర్థం లేనివి, అర్థం కానివి… ట్యూన్లో ఏది ఒదిగితే అవి… కూర్చడం, పేర్చడం, అదే సాహిత్యమని దబాయించడం… మ్యూజిక్ కంపోజర్లు కూడా ఏదో ట్యూన్ ఇచ్చామా, శెనిగెలు బుక్కి చేతులు కడుక్కున్నామా… గాయకులూ అలాగే తయారయ్యారు… అన్నీ అనికాదు, చాలా తెలుగు సినిమా రీసెంటు పాటల గతి ఇలాగే ఉంది… గతి అంటే ఇక్కడ నెగెటివ్ దుర్గతి కాదు, పయనం… శాకుంతలంలో మల్లికా మల్లికా పాట అంత గొప్పగా ఏమీ లేదు కానీ… […]
నాటి ఈటీవీ ఇంటర్వ్యూ ఒకటి ఎన్టీయార్ జీవితాన్నే మార్చేసింది.. !!
Murali Buddha……… ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన్ని అంతులేని భక్తితో స్మరించుకొంటోంది ఈటివి– ఈటివిలో ఎన్టీఆర్ సినిమాలు వేస్తూ, నిమిషానికి ఓసారి భక్తితో స్మరించుకొంటోంది అని ప్రకటన… ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించి … గద్దె దించేంత వరకు నిద్రపోని ఈనాడులో భక్తితో స్మరించుకుంటున్నాం అనే ప్రకటన చూశాక …. జీవితంలో ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది … అప్పట్లో ఈటివిలో ఆంధ్రావని వార్తలు వచ్చేవి… ఈ రోజు వార్తలు మరుసటి రోజు సింగ పూర్ […]
భక్ష్యం… భోజ్యం… లేహ్యం… పానీయం… మాతా అన్నపూర్ణేశ్వరి…
Alludu – Aaharam: కాశీలో వ్యాసుడికి వరుసగా కొన్ని రోజులపాటు భిక్ష- అన్నం దొరకదు. వారం గడిచినా మింగడానికి ఒక్క మెతుకయినా భిక్షాపాత్రలో పడలేదు. అన్నపూర్ణకు నిలయమయిన కాశీలో అన్నమే పుట్టలేదన్న అసహనంతో కాశీని శపించబోతాడు. ఈలోపు పండు ముసలి ముత్తయిదువు వాకిట్లోకి వచ్చి నాయనా! గంగలో మునిగి… భోజనానికి రండి అని ఆహ్వానిస్తుంది. అమ్మా! నాతోపాటు లెక్కలేనంతమంది నా శిష్యులు కూడా ఆకలితో అలమటిస్తున్నారు… అంటే… దానికేమి భాగ్యం వందలమంది ఒకేసారి రండి…మీరు స్నానం చేసి […]
విన్న ఎన్టీయార్ వేరు… చూసిన ఎన్టీయార్ వేరు… ఓ ఆర్టిస్టు స్వగతం…
…….. By……… Taadi Prakash……….. “చండ్ర, సుందరయ్య కంటే గొప్పోణ్ణి కాదు” Artist mohan encounter with NTR —————————————————– అది 1984, డిసెంబర్ 29. దాసరి ‘ఉదయం’ దినపత్రిక ప్రారంభమైన రోజు. ఆరోజే మోహన్ని రమ్మని పిలిచారు ఎన్టీయార్. N T R … Darling of the millions. Larger than life hero. Pure artiste to the core. అయితే, మోహన్ ఆరోజు … other side of the N T […]
మన ఆధునిక జీవితాల్లో ఏదో దారుణంగా మిస్సవుతున్నాం… ఈ వార్తలాగే…
Padmakar Daggumati………. ఒక విధంగా జీవితం పెళ్లితో ఫిక్స్ అయ్యాక, అది ఏ కారణాలతో ఐనా చెదిరి కొత్తగా జీవితం జీవించే అవకాశాలు ఇండియాలో తక్కువ. ఆడకైనా మగకైనా. ఇక్కడే ఫ్రస్టేషన్ పెరగడానికి అవకాశం ఉంది. సమాజం లో ఒక కొత్తమార్పు వచ్చిందంటే అది ఎక్కడో వొకచోట పాత పునాదులను పెకలిస్తుంది. ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వశాఖలు పట్టించుకోవాలి అనడం పెద్ద జోక్ అవుతుందేమో. కుటుంబ సంక్షేమశాఖ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందో నాకు పెద్దగా […]
వందే భారత్ ఎత్తేస్తారా ఏమిటి..!? ఓ దిక్కుమాలిన కథ… ఓ దరిద్రపు శీర్షిక…!!
ఇదే వందే భారత్ రైలు… ఒకవేళ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే… అది కేంద్రంతో సఖ్యంగా ఉండి ఉంటే… ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతిల్లో పాజిటివ్ వార్తలు మోతమోగిపోయేవి… ప్చ్, ఆ సీన్ లేదు కదా… వందే భారత్ రేట్లు ఆకాశంలో ఉంటాయి… విమానం రేట్లతో సమానంగా ఉంటాయి… అదీ ఒక్కరోజు ముచ్చటే అయిపోతుంది… ఈ వార్తలాగే… దరిద్రంగా… ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించవచ్చుగాక… కానీ నిజమే కదా… వందే భారత్ ఇక నడవదా..? ఒకేరోజు […]
ఆరాధించిన తమిళ ఇండస్ట్రీలోనే ఖుష్బూకు అవమానం..! కారణం ఓ మిస్టరీ..!!
ఒకప్పుడు ఖుష్బూకు గుడి కట్టి ఆరాధించారు తమిళజనం… అలాంటి ఖుష్బూను పులుసులో ఈగలా తీసిపారేశాడు దిల్ రాజు… ఇందులో ఆమె పాత్ర ఎంతో గానీ, ఖచ్చితంగా ఇది ఖుష్బూకు అవమానమే… కారణం ఏమిటి..? దీనిపై తెలుగులో ఎవరూ ఏమీ రాయడం లేదు గానీ, తమిళంలో మీడియా భలే చర్చలు సాగిస్తోంది… ఊహాగానాలు చేస్తోంది… నిజానికి ఖుష్బూ వంటి సీనియర్ నటికి జరగకూడని అవమానమే ఇది… సినిమా తెలుగులో, కన్నడంలో వీర ఫ్లాప్… రకరకాల పాత సినిమాలన్నీ మిక్సీలో […]
అప్పటి నీ విజేత సినిమాను ఓసారి మళ్లీ చూడు డియర్ గాడ్ ఫాదర్..!
చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చూడబడ్డాను… పాజిటివ్ హీరోయిజం ఎలివేట్ కావాలంటే స్టెప్పులు, తుపాకుల మోతలు, ఐటమ్ సాంగ్స్ అవసరం లేదనే నిజాన్ని ఇన్నేళ్ల టాలీవుడ్ గాడ్‌ఫాదర్ చిరంజీవి విస్మరించిన తీరు విస్మయపరిచింది… మితిమీరిన హీరోయిజం ఒక సెక్షన్‌కు మాత్రమే ఆకర్షణ… అదీ వయస్సు మళ్లుతున్న చిరంజీవికి ఇప్పుడు అవి అస్సలు నప్పవు… పైగా సల్మాన్ ఖాన్ పాత్ర, ఓవరాక్షన్ చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు అవసరమా..? ప్లెయిన్‌గా, స్ట్రెయిట్‌గా… ఏ ఇమేజీ బిల్డప్పులు లేకుండా మలయాళీ ఒరిజినల్ […]
హా-రుద్ర..! సొంత భార్య రామలక్ష్మికే సమజ్ కాని ‘‘త్వమేవాహమ్’’…!!
పాఠకులకు ‘కవిత్వం’ అర్థంకాకుంటే….. ఆ తప్పు కవిదా ? పాఠకులదా ? *ఆరుద్ర గారూ.! అర్థం కాకపోతే …….. “అన్ ఎడ్యుకేటెడ్ ఆంధ్రా” నా ? హవ్వ.! ఆరుద్రగారు సాంప్రదాయరీతులకు భిన్నంగా టెక్నిక్ తో ” త్వమేవాహమ్ ” కావ్యాన్ని రాశారు. తన కళాకేళీ ప్రచురణల తరపున. ‘ ఆవంత్స… సోమసుందర్’ (పిఠాపురం) గారు అచ్చేయించారు. అది పాఠకులకు ఓ పట్టాన కొరుకుడు పడలేదు. బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా కూడా…. కవి హృదయం అర్ధం కాలేదు.!! అప్పుడు పాఠకులేం […]
10 లక్షల మిర్చి బజ్జీలు… ఆరేడు లక్షల బొబ్బట్లు… లక్షల యాత్రికులు…
కొప్పల్… కర్నాటక నడిబొడ్డున ఉంటుంది… అక్కడ సంక్రాంతి వచ్చిందంటే చాలు… ఓ జాతర కోలాహలం మిన్నంటుతుంది… పదిహేను రోజులపాటు జరిగే ఈ జాతర యూనిక్… గవి సిద్ధేశ్వర మఠ్ జాతర అంటారు దీన్ని… ఈ జాతర పుట్టుక, స్థలపురాణం జోలికి పోవడం లేదు ఇక్కడ… అక్కడి స్థానికుల ఆనందంగా దీన్ని మరో పూరి ఉత్సవంగా చెప్పుకుంటారు… దాన్ని మించిన రథోత్సవం అనీ చెబుతారు… కానీ దేని విశిష్టత దానిదే… 3 రోజుల్లో కోటి మంది భక్తులు ఒక్కచోట […]
బ్రహ్మముడి తెలుగు టీవీ సీరియల్‌కు షారూక్ ఖాన్ ప్రమోషన్… ఇంట్రస్టింగు…
ఒక తెలుగు టీవీ సీరియల్‌కు బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడైన షారూక్ ఖాన్‌తో ప్రమోషన్..! మీరు చదివింది నిజమే… ఈ శనివారంతో ఎట్టకేలకు కార్తీకదీపం సీరియల్‌కు పూర్తిగా తెరపడబోతోంది… ఆ దర్శకుడెవరో గానీ తెలుగు ప్రేక్షకులను ఎట్టకేలకు కరుణించి విముక్తిని ప్రసాదించాడు… ఏ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు రానట్టుగా రేటింగ్స్ రాబట్టి, స్టార్ మాటీవీ ఓవరాల్ రేటింగ్‌ను దాదాపు డిసైడ్ చేసిన ఆ సీరియల్ ఏదో ఒక క్లైమాక్స్‌తో ముగిసిపోతోంది కదా… సరే, వాట్ నెక్స్ట్..? అదే […]
ఫేస్బుక్ రచయితలు… సినిమా సమీక్షకకులు పలురకములు ఇలలో సుమతీ…
Sai Vamshi ……….. Facebookలో సినిమా రివ్యూలు – రకరకాల మనుషులు (Disclaimer: (ఇది నా అబ్జర్వేషన్‌తో సరదాగా రాసింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు. కాబట్టి ఏకీభవించినా, విభేదించినా చివరిదాకా హాయిగా చదవొచ్చు). 1) రాయని భాస్కరులు: వీళ్లు సినిమాలు చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తమ పనుల్లో బిజీ అయిపోతారు. సినిమా చూశాక రివ్యూ రాయాలన్న ఆశ, ఆలోచన లేని సగటు జీవులు. 2) నా ఇష్టం: వీళ్లు ఎవరికీ లొంగరు. ఏ భావజాలానికీ […]
- « Previous Page
- 1
- …
- 298
- 299
- 300
- 301
- 302
- …
- 493
- Next Page »