Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా కథ కదా… చిన్న పాప పెద్ద పెద్ద పనులూ చేయగలదు…

April 23, 2024 by M S R

Subramanyam Dogiparthi….  అలనాటి ప్రముఖ నటి వాసంతి నిర్మించిన సినిమా 1971 లో వచ్చిన ఈ భలే పాప సినిమా . ప్రముఖ దర్శకులు కె యస్ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో పాపే . పాపకోసం సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన బేబీ రాణీయే ఈ సినిమాలో కూడా సినిమా అంతా తానై నటించి ప్రేక్షకులను మెప్పించింది . ( ఆ అమ్మాయి స్టంట్ మాస్టర్ సాంబశివరావు కూతురు)… మా నరసరావుపేటలోనే చూసా . కమర్షియల్ గా సక్సెస్ అయిందా లేదా అనే విషయం గుర్తు లేదు .

సినిమా కధకొస్తే హరనాథ్ కె ఆర్ విజయని ప్రేమించానని చెప్పి , గర్భవతిని చేసి ఓ చిన్న రైల్వే స్టేషన్లో వదిలేస్తాడు . అక్కడే పుట్టిన పాప తండ్రిని వెతుక్కుంటూ నగరానికొచ్చి , ఆఖరిలో తండ్రిని , తాతని , తల్లిని కలుపుతుంది . అయిదారేళ్ళ పిల్ల అవన్నీ చేయగలదా అంటే సినిమాల్లో చేయగలదు . అయితే అక్కడక్కడా అసాధారణ పిల్లలు ఉంటారు . ఉండవచ్చు .
ఆర్ సుదర్శనం సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగానే ఉన్నాయి . అందాల జలపాతం చిందించు జల్లులో ఆనాడు ఒంటరిగా , చిట్టీ పాపా చిరునవ్వుల పాపా నా జాబిల్లీ నీవే బంగరు తల్లీ , అమ్మల్లారా అయ్యల్లారా మా అమ్మను ఎవరయినా చూసారా పాటలు శ్రావ్యంగా ఉంటాయి . జ్యోతిలక్ష్మి , విజయలలిత డాన్సులు హుషారుగా ఉంటాయి . యల్ ఆర్ ఈశ్వరి పాడిన నా వయసు పదహారు నా వలపు సెలయేరు పాట ఊగిస్తుంది .
హరనాథ్ , SVR , పద్మనాభం , నాగయ్య , ముక్కామల , త్యాగరాజు , రామదాసు , కె వి చలం , కె ఆర్ విజయ , జ్యోతిలక్ష్మి ప్రభృతులు నటించారు . బహుశా తమిళంలో కూడా ఉందేమో నాకు ఐడియా లేదు . సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . పాటల వీడియోలు కూడా ఉన్నాయి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • KTR ట్వీట్లు, ఆరోపణలు సరే… ఇంతకీ ఠాణాలో దాడి ఘటన జరిగిందా?
  • ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!
  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!
  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?
  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions