ట్విస్టులే ట్విస్టులు… మొత్తానికి మాజీ మంత్రి, ప్రముఖ విద్యావ్యాపారి నారాయణ అరెస్టు వ్యవహారం రకరకాల ట్విస్టులతో, భిన్న కథనాలతో రాజమౌళి సినిమాలాగా సాగిపోతోంది… నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడని ఒక వార్త… ఎట్టకేలకు తనను, తన భార్యతోసహా అదుపులోకి తీసుకున్నాడని మరో వార్త… టెన్త్ క్లాస్ పరీక్షపత్రాల లీకేజీ కేసు పెట్టారని, ఇప్పటికే కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారని ఇంకో వార్త… సోషల్ మీడియాలో వార్తలు, ఎఫ్ఐఆర్ కాపీలు చూడగానే మొత్తం […]
ఈ రూపాయి ఇడ్లీ అవ్వ గుర్తుందా..? ఆమె కళ్లల్లో ఇప్పుడు ఓ కొత్త వెలుగు…!
ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్డు పక్కన ఓ ముసలామె వేసే దోసెలు తిన్నాడట… అబ్బో అంటూ వార్తలు… ఫోటోలు… ప్రచారం… సో వాట్..? ఆమె జీవితానికి వచ్చిన అదనపు ఫాయిదా ఏముంది దాంతో..?! ఓ పాపులర్ హీరోకు ఎక్కడా ఏమీ దొరక్క, రోడ్డు పక్కన చిన్న బడ్డీ హోటల్లో టిఫినీలు చేశాడట… మస్తు ప్రచారం, ఫోటోెలు, ఆహా, ఓహో, కీర్తనలు… సో వాట్..? ఆ హోటల్ వాడికి వచ్చిన ఫాయిదా ఏమిటట..?! రెండు ఉదాహరణల్లోనూ వీళ్లేదో […]
అరె, ఏం ప్రశ్నలు అడుగుతుర్ర భయ్… అన్నీ చచ్చు ఇంటర్వ్యూలు…
ప్రపంచంలో చాలారకాల మనుషులుంటారు… కొందరు ఎక్స్ట్రీమ్… మందకు ఎడంగా నడిచే బాపతు… అయితే పిచ్చోళ్లు లేకపోతే మేధావులు… అరుదుగా వర్మ వంటి కొత్త కేటగిరీ ఉంటుంది… అందరూ రాసీ రాసీ, చూపీ చూపీ, అడిగీ అడిగీ వర్మ మీద ఏదేదో టన్నుల కొద్దీ చెప్పారు కాబట్టి తన తత్వం లోతుల్లోకి వెళ్లే సాహసం మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు… తను కూడా ఎప్పటికప్పుడు తిక్క (?) చేష్టలతో వార్తల్లో ఉంటాడు కాబట్టి తన వ్యవహార ధోరణి […]
చాలా డేంజరట..? మానవతకు మచ్చ అట, మానవహక్కుల ఉల్లంఘన అట..!!
భక్తులు… పట్టణంలోకి ఏ మఠాధిపతినో పల్లకీలో ఊరేగిస్తూ, తాము పల్లకీ మోస్తూ తీసుకొస్తారు… ఆయన ఏవో పూజలు చేస్తాడు… ప్రవచనాలు చెబుతాడు… ఆ సీన్ చూస్తే, ఆ వార్త చదివితే మీకు ఏమనిపిస్తుంది..? అందులో తప్పేముంది..? స్వాములు ఇల్లిల్లూ తిరుగుతూ పాదపూజలు చేయించుకుని, దండిగా కానుకలు దండుకోవడం లేదా..? కొందరైతే పాదతాడనాలకూ డబ్బు తీసుకుంటారుగా… దొంగ బాబాలైతే నానా ఛండాలం పనులు చేయించుకుని భ్రష్టుపట్టించడం లేదా..? వాటితో పోలిస్తే ఈ పల్లకీ సేవలో తప్పేముంది… అది ఆ […]
నువ్వు సూపర్ మహేష్… ఎక్కడా తొణక్కుండా, కూల్‌గా భలే జవాబు చెప్పావ్…
‘‘ఫిల్మ్ బ్యూరో రాధా అడిగిన ప్రశ్నకు షాక్ అయిన సూపర్ స్టార్’’ అని ఓ వీడియో కనిపించింది… ఇలాంటి వీడియో వార్తల సంగతి తెలుసుకదా… అందుకని మనసులోనే ఆంజనేయస్వామిని ఓసారి పాహిమాం అని ధ్యానించి, చూడ సాహసించి, వీడియో ఓపెన్ చేస్తే… సదరు సూపర్ స్టార్ షాక్ సంగతేమిటో గానీ… నాకు కొన్ని షాక్స్ తగిలాయి… కానీ ఏమాటకామాట… ఆ తిక్క స్క్వేర్ ప్రశ్నకు మహేష్ జవాబు ఇచ్చిన తీరు, తను చూసిన చూపు మాత్రం భలే […]
షష్టి పూర్తి అంటేనే పెళ్లి రీసెలబ్రేషన్… సో, దానికీ ప్రివెడ్ షూట్లు… ఓ నయా ట్రెండ్…
అరవై దాటితే..? సో వాట్..? దాటితే…! పిల్లలు, అప్పులు, బాధ్యతలు, ఆస్తులు, చిక్కులు, మనోభారాలు, అనారోగ్యాలు, తరుముకొచ్చే యమకింకరులు… ఇవేనా గుర్తురావల్సినవి..? నెవ్వర్… కథ మారింది, కాలం మారింది…. 60లో ఇరవైని చూస్తున్నారు అనేకమంది… అసలు అరవై ఏళ్లు అనేది దేనికీ ఓ గీత కాదు… సగటు ఆయు ప్రమాణం పెరిగింది… ఇప్పుడు అరవై ఓ ప్రామాణిక రేఖ కానేకాదు… ఒకప్పుడు అరవై దాటితే షష్టిపూర్తి… హమ్మయ్య, అరవై దాటాను అని ఓ ఫీల్… యాగాలు, పూజలు, […]
అలాంటి నేతల్ని మళ్లీ చూస్తామా..? కనీసం వార్షిక స్మరణ కూడా లేదు…
ఒక వార్త బాగా ఆశ్చర్యపరిచింది… ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఓ నాయకుడి చివరి రోజుల్లో తనకు మిగిలిన ఆస్తులేమిటయ్యా అంటే… రేకుల పైకప్పు ఉన్న ఓ చిన్న ఇల్లు… కొన్ని పుస్తకాలు… తన హాఫ్ హ్యాండ్స్ కోటు పెట్టుకునే ఓ రేకులపెట్టె, భోజనం చేయడానికి ఓ ఇత్తడి పాత్ర… ఆయన పేరు దామోదరం సంజీవయ్య… నిన్న ఆయన వర్ధంతి… చోటాచోటా నేతలకూ బోలెడన్ని నివాళ్లు అర్పించి, స్మరించుకుంటుంటారు కదా… మరి […]
ఇన్నేళ్లుగా మహేష్ బాబుకు ఈత రాదు… 46 ఏళ్ల వయస్సులో నేర్చుకున్నాడు…
సాధారణంగా సినిమాల్లో హీరోలు అంటేనే… సముద్రాలు ఈదేస్తారు, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కేస్తారు… ఒంటి చేత్తో మడత నలగకుండా వందలాది మంది రౌడీలను ఉతికేస్తారు… ఏదంటే అది చేసేస్తారు… అంత సుప్రీం స్టామినా అన్నమాట… తెర మీద వాళ్లకు తెలియని విద్య ఉండదు… కానీ ఒరిజినల్‌గా వాళ్లూ మనుషులే కదా… నానా బలహీనతలు ఉంటయ్… కాకపోతే ఎప్పుడూ తమలోని మైనస్ పాయింట్లు, భయాలు గట్రా బయట ఫోకస్ గాకుండా జాగ్రత్త పడతారు… అది తమ ఇమేజీకి నష్టం […]
ఓహ్… ఆ సాయిపల్లవి వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదా..?
మొన్నామధ్య సాయిపల్లవి ఓ ఫోటో షేర్ చేసుకుంది… చీరెలో ఆమె, భుజాన ఓ హ్యాండ్ బ్యాగ్, వీథుల్లో పరుగు తీస్తున్న అడుగులు… అంతే, అందులో ఆమె మొహం ఏమీ లేదు… మే9న ఇదేమిటో వెల్లడవుతుందని చెప్పింది… అది ఆమె జన్మదినం… సో, ఆ ఫోటో ఎందుకు వైరల్ అయ్యిందీ అంటే… ఈమధ్య అందరూ తెగరాసేస్తున్నారు, ఆమె చేతిలో సినిమాల్లేవు, పెళ్లి చేసుకుంటోంది, సినిమాలకు దూరమవుతోంది అని…! ఒరేయ్ బాబూ, ఈ పెళ్లి ముచ్చట్లు ఫేక్, రాయకండ్రా బాబూ […]
రష్యన్ నేవీ బలహీనత పట్టేసిన నాటో…! మరి మన యుద్ధనౌకలు ఎంత సేఫ్..?!
పార్ధసారధి పోట్లూరి…… రష్యా నౌకా దళానికి మరో ఎదురు దెబ్బ తగిలింది ! అడ్మిరల్ గ్రిగోరోవిచ్ క్లాస్ ఫ్రిగేట్ ‘’ అడ్మిరల్ మాక్రోవ్ ‘’ [Grigorovich-class frigate “Admiral Makarov]అనే పేరు కల ఫ్రిగేట్ ని ఉక్రెయిన్ కి చెందిన యాంటీ షిప్ మిసైళ్లు ‘నెప్ట్యూన్ ‘ లు దాడి చేసి తీవ్ర నష్టంని కలుగచేశాయి ! కడపటి వార్తలు అందే సమయానికి అడ్మిరల్ మాక్రోవ్ నల్ల సముద్రంలో మంటలతో పోరాడుతున్నది కానీ మునిగిపోలేదు. అడ్మిరల్ మాక్రోవ్ […]
సో వాట్… భర్త మరణిస్తే ఎప్పుడూ ఓ మూల ఏడుస్తూ కూర్చోవాలా..?
భర్త చనిపోతే… ఆ చితిపైనే సతీసహగమనం చేయించేవాళ్లు ఒకప్పుడు… ఆ నీచమైన సంప్రదాయాన్ని మెచ్చుకునే కర్కశులు ఇప్పటికీ ఉంటారు… కాలం ఆ సంప్రదాయాన్ని కనుమరుగు చేసింది… మరోరెండుమూడు తరాలు పోతే జనం సతీసహగమనం ఒకప్పుడు ఇండియాలో ఉండేదని చెబితే నమ్మరేమో బహుశా..! భర్త చనిపోతే బొట్టు తీసేసి, తెల్లచీరెలో మాత్రమే, ఏ శుభకార్యాలకు వెళ్లకుండా, ఇంట్లో ఓ మూల ఏడుస్తూ కూర్చోవాలని వాదించే మూర్ఖత్వం ఇప్పటికీ ఉంది… నీతూకపూర్ తెలుసు కదా… రిషికపూర్ భార్య… రణబీర్ కపూర్ […]
వయస్సు 17… ఇప్పటికే నలుగురు గరల్ ఫ్రెండ్స్… రోజూ అయిదు పెగ్గులు…
Amarnath Vasireddy….. ఫేస్బుక్ మితృడు ఒకరు, తన బంధువుల అబ్బాయి చెడుదారిలో వెళుతున్నాడని, కౌన్సెలింగ్ కావాలని అభ్యర్తించాడు… ముందుగా ఆ మిత్రుడు నా రూమ్ లోకి వచ్చాడు . ఆ అబ్బాయి గురించి అయన చెప్పిన విషయాలు … “ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు .తండ్రి కాలేజీ ప్రిన్సిపాల్ . అయిదు- పది కోట్ల ఆస్థి ఉంది. ఫస్ట్ ఇయర్ లో 50 % మార్కులు సాధించాడు . ఇప్పటికి నలుగురు గర్ల్స్ ఫ్రెండ్స్ . తాగడం […]
అమ్మల దినోత్సవం సందర్భంగా అద్దిరిపోయిన సితార ఇంటర్వ్యూ…!!!
మదర్స్ డే… ప్రపంచవ్యాప్తంగా అమ్మతనాన్ని గుర్తుచేసుకోవడానికి ఓ దినం… అమ్మకు ప్రత్యేకంగా ఒక దినమేంట్రా, ప్రతిరోజూ అమ్మల రోజే కదా అనేవాళ్లూ ఉంటారు, అది వేరే చర్చ… మీడియా కూడా సెలబ్రిటీల అభిప్రాయాల్ని తీసుకుని, ఓచోట గుదిగుచ్చి, పబ్లిష్ చేసి, ప్రసారం చేసి, హమ్మయ్య ఈసారి అమ్మల దినోత్సవం చేసేశాం అనుకునే ధోరణి పెరిగిపోతోంది… నాసిరకం ఫీచర్ రిపోర్టింగ్ అది… కొంతలోకొంత టీవీ రియాలిటీ షోలు నయం… ఈసారి సింగర్స్ కంపిటీషన్ షోలు, కామెడీ షోలు, ఇతర […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారూ… ఈయన్ని ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా..?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమంటున్నాడంటే… ఈ దేశానికి వ్యూహకర్తల దరిద్రం పట్టుకుందట… కరెక్టు… రాజకీయ గండరగండడు అనిపించుకున్న కేసీయార్ సైతం ఎన్నికల వ్యూహకర్త పీకే సాయం తీసుకోవడం ఓ విషాదం… కరెక్టు… తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అందరినీ ముఖ్యమంత్రుల్ని చేస్తున్న తనే ముఖ్యమంత్రి అయితే తప్పేమిటి అనుకుని సొంత పార్టీ పెట్టేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్… కరెక్టు… పార్టీల సిద్ధాంతాలు గాలికి ఎగిరిపోయి వక్ర పద్ధతుల్లో ప్రజాభిప్రాయాన్ని మార్ఫింగ్ చేసే వ్యూహకర్తల ప్రాధాన్యం పెరిగింది… కరెక్టు… ఇలా పీకే […]
ఇదుగో మేం ఈ పనులు చేస్తాం… ఇది కాంగ్రెస్ మాట… మరి బీజేపీ బాట..?!
రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు సహజమే… తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా పాతుకుపోయి ఉంది… కేసీయార్ చాణక్యుడి బుర్రే దానికి అసలు బలం… ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్… రేప్పొద్దున మూడు పార్టీలూ బలంగా పోటీపడతాయా..? లేక బీజేపీ, కాంగ్రెస్ తన్నుకుని, వోట్లు చీలిపోయి, మళ్లీ కేసీయార్‌కు చాయిస్ ఇస్తారా అనేది వేరే సంగతి… రేపటి గురించి ఇప్పుడే చెప్పలేం.., రాజకీయాల్లో మితృత్వాలు, శతృత్వాలు రేపెలా ఉంటాయో చెప్పడం కష్టం… అయితే కేవలం నాయకుల అవినీతి […]
జాగ్రత్త… బీట్రూట్ సూపర్ ఫుడ్… కానీ కొందరికి ప్రాణాంతకం…
ఈమధ్య కరోనా చుట్టుముట్టాక అందరికీ ఆరోగ్యస్పృహ పెరిగింది… ప్రొటీన్లు, విటమిన్లు ఇచ్చేవి, ఇమ్యూనిటీ పెంచే ఆహారం మీద ధ్యాస కూడా పెరిగింది… ఆహారమే ఔషధం అనే కాన్సెప్టు కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది… కాకపోతే ప్రాబ్లం ఏమిటంటే… సైట్లు, యూట్యూబర్స్ ఇచ్చే కథనాలను నమ్మేసి, గుడ్డిగా ఫాలో అవుతున్నారు కొందరు… ఏ జాగ్రత్తలూ తీసుకోకుండానే… అర్ధ పాండిత్యం ప్రాణాంతకం అన్నట్టుగా ఆ స్టోరీలతో కొన్నిసార్లు ప్రమాదం తలెత్తే అవకాశాలున్నాయి… ఉదాహరణకు బీట్రూట్… మనకు అందుబాటులో ఉన్న కాయగూరలు, […]
ఓహ్.., తను రాహులేనా..? మెచ్యూర్డ్ స్పీచ్… పీసీసీపై రేవంత్ గ్రిప్…!
నిజానికి రాహుల్ ప్రసంగంపై చాలామంది తటస్థుల్లో పెద్ద ఆశలేమీ లేకుండా ఉండింది మొదట్లో… కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ప్రసంగాన్ని సరైన రీతిలో వెలువరించాడు రాహుల్… ఎక్కడా సందిగ్ధత లేదు… దాపరికం లేదు… కేసీయార్ ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ, ఇక అది చచ్చిపోయింది అనుకున్నాడు… కానీ కాంగ్రెస్ బతికే ఉందని, బతికే ఉంటుందని, జెండా మోసేవాళ్లకు కొదువ లేదని వరంగల్ సభ నిరూపించింది… తెలంగాణ ఏర్పాటు ఎంత కష్టసాధ్యమైనా మేమే ఇచ్చామని చెప్పుకోవడం దగ్గర్నుంచి… […]
ఆ తప్పు చేయకుండా ఉంటే… ‘‘భళా తందనాన’’ అని ఆడాల్సిన సినిమా…!!
ఇదేరోజు థియేటర్లలో విడుదలైన జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జునకల్యాణం, ఓటీటీలో విడుదలైన చిట్టి సినిమాల విశ్లేషణలు, కథనాల నడుమ ఫాఫం భళా తందనాన అనే సినిమా గురించిన చర్చ కనిపించకుండా పోయింది… నిజానికి తీసిపారేయదగిన సినిమా ఏమీ కాదు ఇది… మరీ నాసిరకం అని ఛీకొట్టాల్సిన పనిలేదు… కాకపోతే దర్శకుడి వైపు నుంచి ఓ సందిగ్ధత సినిమాను దెబ్బతీసినట్టు అనిపిస్తుంది… దర్శకుడు దంతులూరి చైతన్య… మొదట్లో బాణం… ఎవరబ్బా ఈ కొత్త దర్శకుడు అనిపించేలా కాస్త పర్లేదు… […]
ఊకో సుమక్కా ఊకో… ఏం తక్కువ చేస్తివి, నువ్వయితే మస్తు కష్టపడితివి…
ఏ జెర ఊకో సుమక్కా… జెర సైసు… నువ్వేం తక్కువ జేసినవ్ శెప్పు… అసలు ఏ హీరో అయినా నీ అంత భుజాన వేసుకుని సినిమాను ఇంత ఘనం ప్రమోట్ చేసిన్రా ఎప్పుడైనా..? గిర్రగిర్ర నెలరోజుల నుంచి తిరుగుతనే ఉన్నవ్… దొరికిన పెద్ద పెద్ద హీరోలను పట్టుకుని ట్రెయిలరో, టీజరో, పోస్టరో రిలీజ్ చేయిస్తనే ఉన్నవ్… ప్రతి టీవీ ప్రోగ్రాముకు ప్రమోషన్ కి పోతివి… నీ ఎనర్జీ చూసి అందరూ ఆశ్చర్యపోయిన్రు కూడా… కానీ ఏం లాభమొచ్చె […]
నో డౌట్… కీర్తి సురేష్ మహానటే… మరోసారి అదరగొట్టేసింది… భేష్…!!
రౌద్రం, కాఠిన్యం, కసి, కోపం, ప్రతీకారం రగిలే కొన్ని పాత్రలకు చాలామంది హీరోయిన్లు సూట్ కారు… ఆ మొహాల్లో ఆ ఉద్వేగాలు బలంగా ఎక్స్పోజ్ కావు… మరీ ఎక్స్పోజింగ్ పాత్రలు తప్ప ఇంకేమీ చేయని టైంపాస్ పల్లీబఠానీ హీరోయిన్లకు అస్సలు చేతకాదు… కానీ కీర్తి సురేష్ అలా కాదు… ఆమెలో తల్లి వారసత్వం ఉంది… ఏ ఎమోషనైనా సరే ఆ మొహంలో బలంగా ఆవిష్కరించగలదు… ప్రేమ, రొమాన్స్ గానీ… రౌద్రం గానీ… మహానటిలో ఆమెను చూశాం కదా… […]
- « Previous Page
- 1
- …
- 312
- 313
- 314
- 315
- 316
- …
- 448
- Next Page »