Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా… కథానాయకుడి నీతి…

March 3, 2024 by M S R

Subramanyam Dogiparthi …..  ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా, నీతీ లేదు నిజాయితీ లేదు అనే రంగుల్లో పాటకు మా నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ పేలస్ జనం ఈలలతో , డాన్సులతో దద్దరిల్లటం ఈరోజుకీ నాకు గుర్తే . ఈ పాట కోసమే నాలుగయిదు సార్లు చూసా ఈ సినిమాను . జనాన్ని ఒక ఊపు ఊపిన మరో పాట వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా మన మంచే గెలిచిందయ్యా పాట . ఈ తప్పెట్ల పాటలో జయలలిత బ్రహ్మాండంగా నృత్యించింది .

సంగీత దర్శకుడు టి వి రాజుని ప్రత్యేకంగా అభినందించాలి . పాటలన్నీ వీర హిట్ . ముత్యాల జల్లు కురిసె రతనాల మెరుపు మెరిసే వాన జల్లు పాటలో జయలలిత నిజంగానే జనం మీద తన రతనాల అందాన్ని కురిపించింది . మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి , వయసు మళ్ళిన బుల్లోడా కొంటె చూపుల కుర్రోడా , పళ్ళ పాట బాగుంటాయి . ఇల్లరికం అల్లుళ్ళు పద్మనాభం , రాజబాబుల పాట రావేలా దయ లేదా బాలా ఇంటికి రారాదా పాట పేరడీతో ఇప్పటికీ జనం పాడుకుంటూ ఉంటారు .

ఈ సినిమా కధను తయారు చేసిన ముళ్ళపూడి వెంకట రమణను , మాటలు పేల్చిన భమిడిపాటి రాధాకృష్ణను అభినందించాలి . అంతకుముందు పెద్ద మనుషులు , దేశద్రోహులు వంటి ఇలాంటి సినిమాలు ఉన్నా , ఈ సినిమాలో కధ పరుగులెత్తుతుంది . తర్వాత కాలంలో వచ్చిన ఈ మార్కు ఎన్నో సినిమాలకు ఈ సినిమా శ్రీకారం చుట్టింది .

Ads

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై చనిపోవడం , MGR డైరెక్ట్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం , నాగిరెడ్డి చక్రపాణిలను ఏదయినా సినిమా సజెస్ట్ చేయమంటే , ఈ కధానాయకుడు సినిమానే రీమేక్ చేద్దామని సజెస్ట్ చేయడం , MGR – జయలలితలు నటించి తమిళంలో కూడా ఓ ఊపు ఊపడం జరిగిపోయాయి . ఆ తర్వాత హిందీలో రాజేష్ ఖన్నా – ముంతాజ్ లతో అప్నా దేశ్ అనే టైటిల్ తో రీమేక్ చేసారు . అక్కడా బాగా హిట్టయింది .

NTR-జయలలితలు 12 సినిమాల్లో జోడీ కట్టారు . అన్ని సినిమాలలో వీరి జోడీ జనానికి కన్నుల పండుగ చేసినా , ఈ సినిమా బ్లాక్ బ్లస్టరుగా నిలిచింది . నాగభూషణం సాఫ్ట్ & క్రూయెల్ విలనీ బాగా పేలింది . అయితే ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఇలాంటి విలనీలో లక్ష ఆకులు ఎక్కువ చదివారనుకోండి .

అల్లు రామలింగయ్య , ధూళిపాళ , మిక్కిలినేని , టి జి కమలాదేవి , రావి కొండలరావు , రాధా కుమారి , కాకరాల , రమాప్రభ , నాగయ్య , ముక్కామల , బేబీ పద్మిని , బేబీ రాణి ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో గమ్మత్తు ఏంటంటే CBI వాళ్ళు విలన్లను అరెస్ట్ చేస్తారు . పెద్ద పెద్ద ఘరానా విలన్లను తాకటానికి కూడా వణికిపోయే ఇప్పటి నిజ CBI ని చూస్తే , కించిత్ హాశ్చర్యము కలుగక మానదు .

మరో విశేషం . ఇంత గొప్ప బ్లాక్ బస్టర్లో NTR-జయలలితలకు డ్యూయెట్ లేకపోవడం . దడదడసాగే సినిమా ఆ సంగతిని కూడా జనానికి తెలియనీయదు . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . నేడే చూడండి . ఆదివారమే కదా . చూసేయండి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ పిశాచిని ఈ న్యాయవ్యవస్థ శిక్షించగలదా..? ఎవ్వడూ నమ్మడు..?!
  • వర్తమాన రాజకీయాల్లో విజయశాంతి ‘ఆశయం’ నెరవేరేనా..?
  • కాంగ్రెస్‌లో నిమజ్జనం..? కర్మ ఎదురుతన్నడం అంటే ఇదే మరి..!!
  • ప్రత్యేక వర్గం, సొంత కుంపటీ కుదరవు… బీజేపీలో విలీనమే దిక్కు…
  • మోడీ తరువాత ఎవరు..? ఓ కొత్త బ్లూ ప్రింట్ సిద్ధమైపోతోందా..?!
  • ఈ ‘జాగీర్దారు’ ఇంకా గోకుతూనే ఉన్నాడు తెలంగాణ సమాజాన్ని..!!
  • ఈయన్ని ఇంకాస్త డిఫరెంటుగా, లోతుగా అర్థం చేసుకుందాం ఇలా…!
  • భేష్ సింగరేణి… తవ్వి వదిలేయలేదు… పచ్చగా ప్రకృతికి తిరిగి అప్పగింత…
  • టైమ్ ట్రావెల్… ఇండియన్ సినిమాలో ఈ కథతో ఇదే తొలిసారి…
  • ఫాఫం విష్ణుప్రియ..! చివరకు ఆ చీప్ జబర్దస్త్ షోలోనూ సెటైర్లు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions