మనిషి విధిని గెలవగలడా..? ఎలా గెలుస్తాడు..? జరగాల్సింది ఏదో ముందే రాయబడి ఉన్న తరువాత, ఇక మారేదేముంది..? సో, తన రాతను విధి కూడా మార్చలేదు… ఇది నమ్మకం… గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు… అయితే దీనికి భిన్నంగా, విధిని కూడా గెలవొచ్చు ప్రయత్నిస్తే… అనే కాన్సెప్టు ఓ కల్పన… మంచిదే… కానీ అది బలంగా ప్రజలకు ఎక్కించాలంటే, నమ్మించాలంటే ఎక్సట్రా ఆర్డినరీ ఎఫర్ట్ అవసరం… యమధర్మరాజును తప్పుదోవ పట్టించిన సతీ సావిత్రి రేంజులో జనాన్ని నమ్మించగలగాలి… […]
బాహుబలి-3… అంత సీన్ లేదు, వర్కవుట్ కాదు, రాజమౌళి మాట అబద్ధం…
బాహుబలి-3 అంటూ అందరూ ఏవేవో రాసేస్తున్నారు… అర్జెంటుగా కొత్త కథలు అల్లేస్తున్నారు… దాన్ని బలంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు… ఒకరకంగా ఇప్పుడిది ప్రచారంలోకి రావడం రాజమౌళి బ్లండరే… ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ జరగాల్సినవేళ చర్చను బాహుబలి సీక్వెన్స్ మీదకు తనే ఒకరకంగా మళ్లించాడు… కరెక్టు కాదు… ఏదో భేటీలో ప్రభాస్ సరదాగా అన్నాడు, ఆర్ఆర్ఆర్ సినిమాలో కనీసం అతిథి పాత్రకైనా నన్ను అడగలేదు అని… నిజంగా చేస్తే గీస్తే హీరో పాత్రే, ప్రభాస్‌ను తీసుకోవాలంటే ఇప్పుడు అంత వీజీ కాదు… […]
రష్యా, చైనాలు కలిసి… అమెరికాను ఏం ఫిక్స్ చేస్తున్నారురా బాబూ…
పార్ధసారధి పోట్లూరి…….. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు! అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ దేశాలు రష్యాతో ఎలాంటి వ్యాపార, ఆర్ధిక లావాదేవీలు జరపవు మరియు డాలర్లని చెల్లింపుల రూపంలో చేయవు. అయితే రష్యా 2014 లో క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించింది. కాగా అప్పుటికే రష్యా దగ్గర దాదాపుగా 558 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. 2014 నుండి క్రమంగా […]
అర్థమయ్యేట్టుగానే చెప్పాడు… కానీ అర్థం కాని చిక్కులూ బోలెడున్నయ్…
జనసేనాని మార్మికంగా ఏమీ చెప్పలేదు… పరోక్షంగా చెప్పినట్టు అనిపించినా సరే, అందరికీ అర్థమయ్యేట్టుగానే చెప్పాడు… ‘‘రాబోయే ఎన్నికల్లో వైసీపీ వోట్లు చీలనివ్వను’’ అని పార్టీ తొమ్మిదో వార్షికోత్సవ సభలో గట్టిగానే చెప్పాడు… అంటే ఏమిటి..? వైసీపీకి ప్రధాన వ్యతిరేక వోటు తెలుగుదేశం వోటు… ప్లస్ బీజేపీ, జనసేన కూటమి… వీళ్లు చీల్చుకోవద్దు అంటే… ఈ రెండూ ఆ టీడీపీతో కలవాలి… ఆ సంకేతాలు ఇస్తున్నాడు పవన్ కల్యాణ్… బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కావాలంటాడు, టీడీపీ వైపు […]
మానస సరోవర యాత్ర..! ఆస్తికులు, ఆసక్తిపరులకు మాత్రమే ఈ కథనం..!
…….. By…. Nàgaràju Munnuru…….. == కైలాస మానస సరోవర్ యాత్ర == ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలి అనుకునే యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్నాడని భావించే కైలాస పర్వతం హిమాలయాల్లోని కైలాస పర్వతశ్రేణిలో ఒక శిఖరం. కైలాస పర్వతం పశ్చిమ టిబెట్‌లోని హిమాలయాల్లో 22,000 అడుగుల ఎత్తులో ఉంది. కైలాస మానస సరోవర యాత్ర హిందువులకే కాకుండా జైనులు మరియు బౌద్ధులకు కూడా సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత […]
ప్రెస్‌క్లబ్ యవ్వారంలో ట్విస్ట్… కథ ముదురుతోంది… ఇప్పట్లో ఆగకపోవచ్చు…
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల యవ్వారం ఓ ఇంట్రస్టింగు మలుపు తిరిగింది… ఈ ఎన్నికల్లో అక్రమాలపై అభ్యంతరాలు వస్తున్నందున ఫలితాల్ని హోల్డ్‌లో పెడుతున్నామంటూ ఓ లిఖిత నోటీసును అతికించిన రిటర్నింగ్ అధికారి ఎం.హేమసుందర్రావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తాజాగా ఓ ఫిర్యాదు దాఖలు చేశాడు… అది పూర్తిగా అధ్యక్ష పదవికి పోటీపడి, రెండోస్థానంలో నిలిచిన సూరజ్ అనే అభ్యర్థి గురించి… మొత్తానికి ఈ వ్యవహారం పోలీసులు, కోర్టుల వరకే కాదు, ఇంకా ముదిరేట్టుంది… సదరు రిటర్నింగ్ అధికారి ఏమని […]
గెటప్ సీను..! కమెడియన్ విషాదాన్ని పండించడం కష్టం… సో, బాగా చేసినవ్..!!
ఏమాటకామాట… జబర్దస్త్ తదితర షోలలో ఈటీవీ, మల్లెమాల కంపెనీ కనబరిచే నీచాభిరుచిని కాసేపు వదిలేస్తే… శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త బెటర్… కామెడీ, ఎంటర్టెయిన్మెంట్ షో అయినా సమాజంలో రకరకాల బాధితులతో స్కిట్లు చేస్తున్నారు… దానికితోడు డాన్సులు, సాంగ్స్ ఎట్సెట్రా… స్థూలంగా షో కాస్త బెటర్… ప్రత్యేకించి వావ్, క్యాష్ ఎట్సెట్రా పిచ్చి షోలకన్నా బెటర్… ఇంద్రజ ప్రజెన్స్, సుధీర్ యాంకరింగ్ ప్లస్ పాయింట్స్ దానికి… ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే… గెటప్ సీను గురించి… తను చాలా […]
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు… పరువు తీసిన అక్రమాల దుర్గంధం…
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు ఓ చరిత్ర ఉంది… నిష్ణాతులైన హైదరాబాదీ పాత్రికేయులెందరికో అది సాయంకాలం ఆటవిడుపు అడ్డా… స్వల్ప రుసుముతో ప్రజాసంఘాలు, బాధితులు ప్రెస్మీట్లు పెట్టుకోగలిగిన వేదిక… తొలిసారి దాని ఇజ్జత్ పోయింది… తెల్లారిలేస్తే ఎన్నికల అక్రమాల మీద మాట్లాడి, అందరినీ ప్రశ్నించి, నిలదీసి, నీతులు చెప్పే పాత్రికేయులు ఇప్పుడు సిగ్గుతో తలదించుకునే దురవస్థ.,. ఎందుకు..? మునుపెన్నడూ లేనట్టుగా అక్రమాలు… స్వస్తిక్ గుర్తుకు తోడుగా ఇంకేవో గుర్తులు… ఇంటూ మార్కులు… ఐనా అన్నీ కౌంట్ చేశారు… అర్ధరాత్రి దాకా […]
కేసీయార్‌కు బండి సంజయ్ థాంక్స్ చెప్పాలి… ఖాళీగా ఉంచడం లేదు…
నిజానికి బండి సంజయ్ కేసీయార్‌కు, కేటీయార్‌కు, టీఆర్ఎస్కు థాంక్స్ చెప్పాలి… సంజయ్ చేతిలో అస్త్రాలు ఏమీ లేనప్పుడు, బాధపడకు, మేం ఇస్తాం కదా అస్త్రాలు అని ముందుకొస్తున్నారు కేసీయార్, కేటీయార్… పార్టీలోనే సంజయ్‌కు తలనొప్పులున్నయ్, తనను వీక్ చేసే ప్రయత్నాలూ ఉంటయ్… పైగా మాటిమాటికీ కేసీయార్‌ను జైలులో వేస్తాం అనే నిరర్థక మాటలు తప్ప సంజయ్ దగ్గర ప్రభుత్వంపై విరుచుకుపడే అస్త్రాలేమీ ఉండటం లేదు… తెరవెనుక బీజేపీ, టీఆర్ఎస్ నడుమ సత్సంబంధాలే ఉన్నాయనే సందేహాలు కూడా తెలంగాణ […]
ది కశ్మీర్ ఫైల్స్… అనూహ్య ఆదరణ… అప్పుడే ఏడ్పులు, పెడబొబ్బలు షురూ…
కశ్మీరీ ఫైల్స్… ఇప్పుడు ఇదొక సంచలనం… హైదరాబాదులో మొన్న 10 షోలు… నిన్న 40 షోలు… రేపు 100 షోలు అట… కుటుంబాలతో వెళ్లి చూస్తున్నారు సినిమాను… హౌజ్ ఫుల్… ఓ మిత్రుడు ఇలా రాసుకున్నాడు ఫేస్బుక్లో… ‘‘సినిమా అయిపోయింది. చాలా మంది ఎమోషనల్ గా ఉన్నారు. ఓ పాతికేళ్ల అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వెళ్తోంది. వృద్ధులు బాగా ఎమోషనల్ అయిపోయి సీట్లలో నుంచి త్వరగా లేవడం లేదు. ఎక్స్ ప్రెషన్లు భారంగా ఉన్నాయి. ఉన్నట్టుండి […]
ఆమె స్త్రీయే కాదు, మగాడు కూడా…! మరి ఆ భర్త గతేమిటి..? సుప్రీంలో ఓ కేసు..!!
hermaphroditism… వైద్యపరిభాషలో ఇదే సరైన పదం… తెలుగులో ఏమంటారో… ఉభయలింగ అని పిలవాలేమో… అంటే, అర్థమైంది కదా… ఒక వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు ఉండటం..! ప్రపంచంలో ఇదేమీ వింత కాదు, ఇప్పుడు వినడం కూడా కొత్తేమీ కాదు… కానీ ఓ కేసు సుప్రీం దాకా వచ్చింది…. అందుకే మళ్లీ కాస్త చర్చ… (ఈ స్థితిని congenital adrenal hyperplasia అని కూడా అంటారట…) హడావుడిగా చదివితే అంత తేలికగా జీర్ణం కాదు… సున్నితంగా ఉంటుంది, అబ్బురంగానూ ఉంటుంది… […]
ఈటీవీలో గతితప్పిన బాడీషేమింగ్… లేడీగెటప్ అని పదే పదే వెక్కిరింపు… వర్ష ఏడుపు…
బాడీ షేమింగ్… కాదు, అదోరకం ర్యాగింగ్… ఈటీవీలో శృతిమించుతోంది… ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా… ఈటీవీలో క్రియేటివ్ డైరెక్టర్లు ఎవరో గానీ… వాళ్లది మరీ నీచాభిరుచి కనిపిస్తోంది… లేడీ కమెడియన్లు, లేడీ ఆర్టిస్టులు, ఎంత వెకిలి జోకులు వేసినా ఏమీ అనలేరు, సున్నితమైన కెరీర్లు… వేధింపులు… తలొంచుకుని భరించాలి… లేదంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారు… వేరే ఎక్కడా చాన్సులు రాకుండా చేస్తారు… దుష్ప్రచారాలు చేస్తారు… తాజాగా మరో ఉదాహరణ… వర్ష… టీవీల్లో కామెడీ షోలలో కమెడియన్లు అంటేనే కొందరు […]
కంటతడి ఆగదు… నాన్నా, నీ మొహం చూస్తేనే దుఖం తన్నుకొస్తోందిరా…
కొన్ని వార్తలు మనస్సుల్ని ద్రవింపజేస్తయ్…. ఈ దుర్మార్గమైన, చెత్తా, దుర్గంధ రాజకీయ వార్తలు రాసీ రాసీ పత్రికలు, విలేకరులు పోస్ట్‌మార్టం డాక్టర్లలాగా ఓతరహా నిర్లిప్తతలోకి, స్పందనరాహిత్యంలోకి జారిపోతున్నారేమో…. అందుకే వాటికి ప్రయారిటీ ఉండదు… అఫ్కోర్స్, తమ పత్రికల యజమానుల రాజకీయ ఉద్దేశాలకు అనుగుణంగా డప్పు కొడుతూ, లేదా తిట్టిపోస్తూ సున్నితమైన మానవసంబంధ భావనల్ని కోల్పోయారేమో… ఈ వార్త చదవండి… ఒక్కసారిగా కళ్లలో తడి వెల్లువైపోదా… మీడియాలో, సోషల్ మీడియాలో చెలరేగిపోయే చెత్తా ట్రోలర్స్‌ను కాసేపు వదిలేయండి… పరమ […]
బ్రహ్మోస్ మిస్ ఫైర్ కావడమా..? ఆశ్చర్యం… ఇంకేదో ఉంది… కుట్ర కాదు కదా…!!
పార్ధసారధి పోట్లూరి……….. సరిదిద్దుకో తగ్గది పొరపాటు ! సరిదిద్దికో లేనిది తప్పు ! భారత రక్షణ దళాలు తప్పు చేశాయి. బ్రహ్మోస్ మిసైల్ ని తప్పుగా ఫైర్ చేసాయి. రొటీన్ నిర్వహణలో భాగంగా మార్చి నెల 9 వ తేదీన బ్రహ్మోస్ మిసైల్ సిస్టంని సిద్ధం చేసే యత్నంలో ఫైర్ అయిపోయింది. అయితే ఇదేమీ చిన్న తప్పు కాదు. (పాకిస్థాన్ ఆల్రెడీ రచ్చ చేయడానికి ట్రై చేస్తోంది… సంయుక్త విచారణను డిమాండ్ చేస్తోంది…) పంజాబ్ లోని సిర్సా […]
తమన్‌కు బాగా తలకెక్కినట్టుంది సక్సెస్ కిక్కు… శృతి తప్పిపోతున్నాడు…
కాపీ కొడతావా..? కొట్టు..! ఓ టీం పెట్టుకుని, క్రియేటివ్ వర్క్ చేయించి, నీ పేరుతో నీ గొప్పగానే చెప్పుకుంటావా..? చెప్పుకో..! అసలు సరుకు ఏమీ లేకపోయినా, ఇంకేదో కళతో నెట్టుకొస్తున్నావా..? గుడ్, కంటిన్యూ…! సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే అల్టిమేట్… ఎలా సాధించావనేది ఎవడూ చూడడు, ఏం సాధించావనేదే చూస్తారు… విజయాల కిక్కు తలకెక్కినా పర్లేదు, ఇండస్ట్రీ భరిస్తుంది, పిచ్చి విలేకరులు భరిస్తారు, పిచ్చి జనం భరిస్తారు… కానీ ఎన్నాళ్లు..? సంగీత దర్శకుడు తమన్ చాలా సీరియస్‌గా […]
డాళింగ్ పాన్ ఇండియా ప్రభాస్‌కు అభిమానంతో రాయునది ఏమనగా…
….. By ……… Sridhar Bollepalli……. డాళింగ్ ప్రభాస్.. వివాదాలకి దూరంగా వుండే మంచి మనిషి. అతని గురించి ఎవరూ నెగటివ్‌గా మాట్లాడుకోవడం మనం విని వుండం. నిజానికి రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ యింకో హీరోకి వచ్చివుంటే ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్లో వుండివుండేది. కానీ, ప్రభాస్ మీద వున్న పాజిటివ్ యింప్రెషన్ వల్ల.. రాధేశ్యామ్ బాగోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి చాలా సున్నితమైన పదాలు ఎంచుకుంటున్నారు జనాలు. ఈ కోణంలో ప్రభాస్ అదృష్టవంతుడు. కృష్ణంరాజుకి కొడుకు వరసవ్వడం […]
ఆయనకు ఒకాయనతో… ఆమెకు మరొకామెతో… అదోతరహా మూవీ, బాగానే తీశాడు…
….. Review :: John Kora……. బధాయ్ దో.. (శుభాకాంక్షలు చెప్పండి) ”నిన్ననో మొన్ననో ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు వెళ్లడానికి మెట్రో ఎక్కిన… స్టార్టింగ్ పాయింటే అయినా ఎల్బీనగర్లో స్టాండింగ్ పొజిషన్లో జర్నీ ప్రారంభించిన… దిల్షుక్నగర్ రాగానే మెట్రో ఫుల్ అయ్యింది… నా వెనుకే ఒక అంకుల్ పొట్టేసుకొని నిలబడ్డాడు… ప్రతీ స్టేషన్లో బ్రేక్ పడ్డ ప్రతీసారి ఆయన పొట్ట నాకు తగలడం… నాకు పరమ కంపరంగా అనిపించడం జరుగుతూనే ఉన్నది… సాటి మనుషులంటే నాకు […]
రాజమౌళి ఈగ కాదు… ఇది రాజీవ్‌గాంధీ ఈగ కథ… ఈగ చేసిన బదిలీ కథ…
…….. Taadi Prakash……………… ఒక ఈగ – రాజీవ్ గాంధీ కథ (A Real life story by Tota Bhavanarayana) తోట భావనాారాయణ… పేరెక్కడో విన్నట్టే ఉందా ? జర్నలిస్టు… సీనియర్ మోస్టు ! ఎలక్ట్రానిక్ మీడియా ఆనుపానులన్నీ బాగా తెలిసినవాడు. పాత సంఘటనలు, రాజకీయ విశేషాలు, అలనాటి అపురూప చమత్కారాలు హాయిగా చెప్పగలడు, సెన్సాఫ్ హ్యూమర్ కి ఏ లోటూ లేకుండా. భావనారాయణ చాాలా ఏళ్ల క్రితం రాసిన ‘ ఈగ – రాజీవ్ […]
రష్మి ఫస్ట్ టైమ్… సుధీర్ కూడా అంతే… జంప్ అయిపోయినట్టేనా జంట..?!
నిజంగానే టీవీ ప్రేక్షకులకు ఇది విశేషమే… తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మొదటిసారి ఈటీవీ గాకుండా వేరే టీవీలో కనిపించనున్నాడు… అంతేనా..? తనకు జోడీగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన రష్మి కూడా అంతే… ఇద్దరూ తొలిసారి మాటీవీ నిర్మించిన హోలీ స్పెషల్ షోలో కనిపించారు… రష్మి ఓ దశలో ఎమోషన్‌కు గురై, కంటి కాటుక తీసి, సుధీర్ బుగ్గపై చుక్క పెట్టి దిష్టి తీసింది… అఫ్కోర్స్, వాళ్ల స్నేహం సుదీర్ఘకాలంగా గాఢమైంది… అందులో […]
మనకు కూడా కొరడా పట్టుకున్న ఓ యోగి ఉంటే ఎంత బాగుండు..?!
ఒక ఫోటో గుర్తుందా..? వనమా రాఘవ అనే కిరాతకుడి వేధింపులకు ఓ కుటుంబం నిలువునా నిప్పుకు ఆహుతైపోయిన విషాదం గుర్తుందా..? అన్ని పత్రికలు తన చరిత్ర రాశాయి… పోలీస్ కేసు, బెయిల్, బయటికి వచ్చేశాడు… ఇప్పుడు ఆయన గారి తండ్రి గారు శ్రీమాన్ వనమా వెంకటేశ్వరరావు ఏమంటున్నాడో తెలుసా..? అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ… ”2 నెలలు ఆరోగ్యం బాగాలేదు, నేను లేని సమయంలో కొందరు కుట్ర చేసి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావల్సిన నా […]
- « Previous Page
- 1
- …
- 326
- 327
- 328
- 329
- 330
- …
- 447
- Next Page »