చాలా వార్తలు కనిపిస్తున్నయ్ కానీ… వాటిల్లో ఒక్క పాయింట్ మాత్రం భలే అనిపించింది… నవ్వొచ్చింది… అది చెప్పుకోవడానికి ముందు అసలు పూర్వ కథ ఏమిటో కాస్త చెప్పుకోవాలి కదా… తృణమూల్ కాంగ్రెస్… దమ్మున్న ఈ పార్టీ దగ్గూదమ్ముతో ఇప్పుడు ఊపిరాడక సతమతమవుతోంది… నంబర్ వన్ మమత, నంబర్ టూ అభిషేక్… నంబర్ త్రీ పార్థ ఛటర్జీ… ఇప్పుడాయన ఈడీకి చిక్కాడు… ఈడీ తవ్వేకొద్దీ చాలా అక్రమాల వేళ్లు తగులుతున్నయ్… టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ మాత్రమే కాదు, ఇంకా చాలా […]
మోడీ, షా సరిగ్గా పనిచేస్తే… వెంకయ్యకు ఈ శ్రమ, ఈ ప్రయాస ఉండేది కాదు…
ఎంతకీ సమజ్ కాలేదు… ఓ వార్త ఆంధ్రజ్యోతిలో కనిపించి చాలాసేపు ఆలోచనల్లో పడేసింది… ఆ వార్త సంక్షిప్తంగా ఏమిటంటే….? ‘‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీల మేరకు రాష్ట్రంలో వివిధ సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు… సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయన సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మంగళవారం సమీక్షించారు… సెంట్రల్ యూనివర్శిటీ (అనంతపురం), సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (విజయనగరం), ఐఐటీ (తిరుపతి), నిట్ (తాడేపల్లిగూడెం), ఐఐఎం (విశాఖపట్నం), ఐఐఎస్ఈఆర్ […]
బహుత్ అచ్చే దిన్… అబీ బాకీ హై భయ్యా…
Gottimukkala Kamalakar……. తాజా ఇంగువ తాళింపుతో పాత పచ్చడి: అచ్ఛేదిన్ ఒస్తయి. ఆర్జీవీ మంచి సీన్మలు తీస్తడు. బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రల కలిశే ఒస్తయి…! మా బాలయ్య బాబు ఆ బా దా అనకుట్ట తడబడకుండ మాట్లాడుతడు. వాళ్ల నాయిన ప్రసక్తి తేడు..! మా జగన్ సారు ఆంధ్రల అన్ని బ్రాండ్లను అమ్మనిస్తడు..! ఆంధ్రా గోల్డ్ బందైతది..! మా కేసీఆర్ సారు తెలంగాణాను సంపూర్ణ శాకాహార, మద్యనిషేధ రాష్ట్రాన్ని చేస్తడు…! తెలుగు రాష్ట్రాలు వరల్డు బ్యాంకుకు అప్పులిస్తయి..! […]
పెళ్లాంపిల్లలతో టూర్ల కోసం ఈ మలయాళీ ఇంజనీర్ ఏం చేశాడంటే..?!
చదువుతుంటేనే ఎంత థ్రిల్లో… ఆయన పేరు అశోక్… అలిసెరిళ్ తామరాక్షన్ అశోక్… మలయాళీ… కేరళ రూట్స్… తండ్రి ఏవీ తామరాక్షన్ కేరళలో మాజీ ఎమ్మెల్యే… అశోక్ 2006లో లండన్ వెళ్లాడు… ఫోర్డ్ మోటార్ కంపెనీలో కొలువు… తను స్వతహాగా మెకానికల్ ఇంజినీర్… ఇద్దరు బిడ్డలు… ఇదీ తన నేపథ్యం… పైలట్ పరీక్షలు రాశాడు… 2018లోనే పైలట్ లైసెన్సు వచ్చింది… ఇంకేముంది..? కుటుంబంతో టూర్లు వెళ్లాలనిపించింది… మరి తనదేమో అందరిలాంటి తత్వం కాదాయె… అడ్డగోలు టికెట్ రేట్లు, ఇరుకిరుకు […]
రష్యాతో గోక్కుని యూరప్ దేశాలు గజగజ… గ్యాస్ ఆగిపోతే మరింత వణుకే…
పార్ధసారధి పోట్లూరి …………… ఎంతకీ ఎగతెగని రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వలన అటు రష్యాతో పాటు ఇటు ఉక్రెయిన్ మరియు ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి… యూరోపియన్ దేశాలు తమ దేశాల గాస్ వాడకం మీద కఠిన ఆంక్షలు విధించే దిశగా ఆలోచన చేస్తున్నాయి… తన మీద విధించిన కఠిన ఆంక్షల మీద కోపంగా ఉన్న రష్యా ఏ క్షణమైనా మొత్తం గాస్ సరఫరాని ఆపేసే అవకాశాలు ఉండవచ్చుననే ఆందోళనతో… వచ్చే శీతాకాలానికి కావాల్సిన […]
ఇప్పుడు చదవాల్సిన కథ… కొన్నాళ్లు ఆగి తెర మీద చూడాల్సిన కథ…
ముందుగా ఓ కథ చెప్పుకుందాం… జయలలిత కొన్ని అంశాల్లో తింగరిదే గానీ… ఒకసారి కమిటైతే ఇక తన మాట తనే వినదు… ఓరోజు సిటీ పోలీస్ కమిషనర్‌ను పిలిచింది… సాధారణంగా డీజీపీని గానీ, హోం సెక్రెటరీని గానీ పిలిచి చెబుతుంటారు సీఎంలు ఎవరైనా, ఏదైనా… ఏకంగా తననే పిలిచేసరికి, పొద్దున్నే వెళ్లి, వణుకుతూ నిలబడ్డాడు… ఆమెకు ఎదురుగా నిలబడి, తొట్రుపాటు లేకుండా జవాబులు చెప్పడం చాలా పెద్ద టాస్క్… ఆమె ఓసారి తేరిపారచూసి అడిగింది… జీవజ్యోతి భర్త […]
రోగం అసలు మూలమొకటి… టాలీవుడ్ పెద్దల ట్రీట్మెంట్ ఇంకొకటి…
రోగం తగ్గాలంటే… ముందు ఆ రోగానికి మూలం ఏమిటో తెలియాలి… చికిత్సకు సరైన మందు పడాలి… అప్పుడే రోగం నుంచి విముక్తి… అలాగే మోకాళ్లకు తలనొప్పి మందు రాస్తానంటే కుదరదు… డెంగ్యూకు మలేరియా ఇంజక్షన్లు ఇస్తానంటే వికటిస్తాయి… సో, ఎక్కడ మందు పూయాలో అక్కడే పూయబడాలి… మందు వేయబడాలి… లేకపోతే రోగం మరింత ముదిరి, ప్రాణాలమీదికొస్తుంది… ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి అదే… వచ్చిన సినిమాలు వచ్చినట్టు తంతున్నయ్… పురుగు కూడా థియేటర్ల వైపు పోవడం లేదు… […]
నెవ్వర్… ఇంకెవ్వరూ ఇలాంటి వార్త రాయలేరు… బభ్రాజ‘మానం’- భజగోవిందం
నెవ్వర్… ఇప్పటికి తెలుగు పాత్రికేయంలో ఇదే అల్టిమేట్ వార్త… ఇంకెవరూ ఈ రేంజ్ వార్త రాయలేరు… చాలెంజ్… అసలు దీన్ని పాత్రికేయం అని పిలవకుండా ఇంకేమైనా పవిత్రమైన, బరువైన, గంభీరమైన పదాల్ని సృష్టించి పిలవడం బెటరేమో… టీన్యూస్ చానెల్‌కు సంబంధించిన వెబ్సైట్ ఇది… అరె, నమస్తే తెలంగాణకు ఓ సైట్ ఉంది కదా, మళ్లీ టీవీకి దేనికి అనడక్కండి… దేని వెబ్ దుకాణం దానిదే… ఎవరి గోల వాళ్లదే… ఇంతకీ వార్త ఏమిటయ్యా అంటే… మోడీని తిట్టిపోయడం… […]
డాలర్ బలిసింది సరే… రూపాయి నిజంగా బక్కచిక్కిందా..? నాణేనికి మరోవైపు..!!
పార్ధసారధి పోట్లూరి …… డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం! సోషల్ మీడియాలో మరియు న్యూస్ ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలో డాలర్ తో రూపాయి విలువ పతనం మీద చేస్తున్న విమర్శలు, విశ్లేషణలు అర్ధవంతంగా ఉండడం లేదు. ఎవరికి తోచిన లేదా వాళ్ళ రాజకీయ అజెండాతో విశ్లేషణలు చేస్తున్నారు కానీ అసలు విషయం మాత్రం ఎవరూ చెప్పట్లేదు. 1. మనకి స్వాతంత్ర్యం వచ్చిన 1947 లో ఒక రూపాయికి ఒక డాలర్ విలువగా ఉండేది. 2. […]
మీ బొంద జర్నలిజం… సిగ్గూశరం లేదా… అగ్గిమండిన లేడీ సింగర్…
ఎంకి పెళ్లి, సుబ్బి చావు…. అన్నట్టు ఎక్కడో ఏదో జరుగుతుంది… మన గాశారం బాగాలేకపోతే అది మనకు తగుల్కుని మన ఇజ్జత్ తీస్తది… ఇదీ అంతే… బెంగాల్లో ఈడీ పార్థ ఛటర్జీ అనే ఓ మంత్రి గారిపై కన్నేసి దాడులు చేసింది కదా… సారు గారి జాన్ జిగ్రీ దోస్త్, నటి, మోడల్ అర్పిత ముఖర్జీ ఇంట్లో 21 కోట్ల నగదు దొరికింది కదా… దాదాపు నెంబర్ టూ అనిపించుకున్న మంత్రి అరెస్టయితే పార్టీ సైలెంటుగా ఉండటం, […]
రాష్ట్రపతి వదినకు ఆ పేద మరదలి కానుక… ఓ సంప్రదాయిక నేత చీర, అరిశెలు…
కొన్ని వార్తల్లో పెద్ద విశేషం ఉన్నట్టుగా ఏమీ అనిపించదు… కాకపోతే అవి చదువుతుంటే ఇట్టే కనెక్టయిపోతాయి… ఇదీ అంతే… కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది… ఈ దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి కొన్ని సంప్రదాయాల మేరకు, పద్ధతుల మేరకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది… చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు… 21 తుపాకుల్ని గాలిలోకి కాల్చి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని సెలబ్రేట్ చేస్తారు… అంతేకాదు, టెక్నికల్‌గా అన్నిరకాల రక్షణ సైనిక విభాగాలకు […]
కాస్త నోటి దూల… తెలుగు మూలాలున్న ఈ ‘‘ఓవర్ స్పీకర్’’ కథ ఇదీ…
Nancharaiah Merugumala…………. నెహ్రూ– ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు………… ఇవీ కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్ కుమార్ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే! గురువారం రమేశ్ అన్న మాటలు సహజంగానే పాలకపక్షమైన బీజేపీకి ఆయుధాలుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేత, హోం మంత్రి అరగా జ్ఞానేంద్ర […]
తన జీవన సాఫల్యం మీద రజినీకాంత్‌కు తీవ్ర అసంతృప్తి… ఎందుకు..?
ఒక వార్త కనిపించింది… అది రజినీకాంత్ వార్త కాబట్టి ఇట్టే పట్టేసుకుంది… చదివించింది… నా జీవితంలో కనీసం పదిశాతం ప్రశాంతత, సంతోషం లేవని రజినీకాంత్ ఓచోట బహిరంగంగానే వ్యాఖ్యానించాడు… ఎస్… తెలుగు మీడియాలో ఎక్కడా కనిపించలేదు… నైదర్ పత్రికలు నార్ టీవీలు… కానీ అది కనెక్ట్ కావల్సిన వ్యాఖ్యే… ఎందుకంటే..? 71 ఏళ్ల వయస్సులో రజినీకాంత్ వంటి హీరో నా జీవితంలో సంతోషం లేదు, ప్రశాంతత లేదు అని ఎందుకు వగచే దురవస్థ… కావచ్చు, రజినీకాంత్ మొదట్లో […]
హయ్యారే… ఏం సేయుట..? సభ రద్దు చేయుటయా..? వేచి ఉండుటయా..?
కావచ్చు… 12 మంది టీఆర్ఎస్ సిట్టింగుల మీద బీజేపీ వలవిసిరి ఉండవచ్చు… వస్తే కాషాయకండువాలు కప్పవచ్చు… కానీ వాళ్లతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు రప్పించి, కేసీయార్‌ను చికాకు పెట్టే ఆలోచన బీజేపీకి ఉండదు… దేశవ్యాప్తంగా బీజేపీది ఒకే పాలసీ… వీలైనంతవరకూ కూల్‌గా వ్యవహారాలు సాగిపోవాలి… అంతేతప్ప ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తాయో తెలియని స్థితిలో బీజేపీ ఈ ఉపఎన్నికల రిస్క్ తీసుకోదు… కేసీయార్ మార్క్ స్వేచ్ఛతో చెలరేగిపోయి, జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులను గనుక బీజేపీ ఆదరిస్తే… […]
తెలియదు… ఏమో, గుర్తులేదు… సోనియా ఈడీ విచారణ సాగిన విధంబెట్టిదనిన…
పార్ధసారధి పోట్లూరి ………… ED-సోనియా విచారణ ! సోనియా ED ఆఫీస్ కి బయలుదేరే ముందు అన్ని రాష్ట్రాల నుండి ఛోటా మోటా నాయకులు ఢిల్లీ చేరుకొని ED ఆఫీసు ముందు ఆందోళనకి దిగారు. కక్ష సాధింపు రాజకీయాలు అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేశారు. ED ఆఫీసుకి వెళ్ళే ముందే సోనియా అధికారులకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నది… తనతో పాటు తన వ్యక్తిగత వైద్యుడిని అనుమతించాలి అంటూ..! అంతే కాదు, తనకి వ్యక్తిగత సహాయుకుడు కూడా […]
శ్రావణ భార్గవి ఓడి గెలిచింది… ‘ఒకపరి’ భిన్నకోణంలో చూడాలి దీన్ని…
శ్రావణ భార్గవి వివాదానికి దారితీసిన ఆ వీడియో తీసేసింది… అదే వీడియోకు ఓ వేణుగానాన్ని యాడ్ చేసి, మళ్లీ పెట్టింది… అదేమంటే ఆ వీడియోకు బాగా కష్టపడ్డాం అంటోంది… ఆ వీడియోకు నిజానికి అంత సీన్ లేదు, సరే, ఆమె ఇష్టం… అయితే అన్నమయ్య వంశస్థులు కూడా ‘అతి’ చేసినట్టనిపించింది… నచ్చనప్పుడు అభ్యంతరపెట్టారు, తప్పులేదు… వాళ్లు చెప్పేదీ ఓ గందరగోళం… ఈ పిల్లది తింగరి వేషం… ఈమె వాదన, మాటతీరు కూడా అంతే గందరగోళం… కానీ కేసు […]
వామ్మో జర్నలిస్టు..! గొట్టాలు చూస్తేనే జనంలో దడ… ఇవి ‘పెన్ గ్యాంగ్స్…
జనం మీద పడే తోడేళ్లలా ప్రభుత్వ అధికారులు కనిపించేవాళ్లు గతంలో… రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కులసంఘాలు, సామాజిక సంస్థలు నిర్బంధ చందాల దందాలు జతకలిశాయి… తరువాత పట్టణాలు, నగరాలయితే హిజ్డాలు ఓ ఆర్గనైజ్డ్ ముఠాలుగా జనంపై పడసాగారు… వీళ్లందరినీ మించి సమాజానికి ఇప్పుడు పెద్ద జాఢ్యం జర్నలిజం… ఈ హైనాల బెడద గతంలో లేదని కాదు, కాకపోతే అప్పట్లో పత్రికల సంఖ్య తక్కువ… తరువాత టీవీ గొట్టాలు చేరాయి… ఇక కొన్నేళ్లుగా యూట్యూబ్ చానెళ్ల పేరిట, […]
చివరకు సుధీర్‌ను బకరా చేశారా..? లేక మల్లెమాలతో ఓ గేమ్ ప్లే చేస్తున్నారా…?!
మల్లెమాల మీద నాగబాబు వీరాభిమాని ఆర్పీ కూతలు… కౌంటర్‌గా ఇతర కమెడియన్ల ఎదురుకూతలు… పరస్పరం వాతలు… కొద్దిరోజులుగా ఇదే తంతు కదా… ఈటీవీ, మల్లెమాల, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ప్రోగ్రామ్ ఎట్సెట్రా ఉమ్మడిగా ఇజ్జత్ తీసుకుంటున్నాయి… అసలే ఈటీవీలో సినిమా ప్రమోషన్ల కక్కుర్తి కారణంగా మిగతా రియాలిటీ షోల రేటింగ్స్ పాతాళంలోకి వెళ్లిపోయాయి… ఇక ఈ కామెడీ షోలు కూడా ఢమాల్ అంటే, అసలే మూడో ప్లేసులో కొట్టుకుంటున్న ఈటీవీ జెమిని కిందకు, అంటే […]
ఎవరా ఇద్దరు లేడీస్..? ఏమా కథ..? పార్థ మంత్రి గారు ఘటికులే సుమీ…!!
నిన్న ఈడీ దాడుల్లో బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ దొరికిపోయాడు కదా… అరెస్టు కూడా చేశారు… అక్కడక్కడా రణగొణ ధ్వనులు మినహా టీఎంసీ క్యాంపు కిమ్మనడం లేదు… దొరికిన సారు గారు చిన్న నాయకుడేమీ కాదు… ఘటికుడు… మమతకు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు… అంతెందుకు..? ఒక దశలో అసెంబ్లీలో అతనే ప్రతిపక్ష నేత… టీఎంసీ తరఫున… ఆల్రెడీ తనపై సీబీఐ కేసు ఉంది… దానికి కొనసాగింపే ఈడీ దర్యాప్తు… పక్కాగా సమాచారం తీసుకుని, […]
24 సెకండ్ల చిన్న వీడియో… ఓ వంద నయాగారాల్ని చూసినట్టు…
పెద్ద పెద్ద వివరణలు, వర్ణనలు అక్కర్లేదు… ఒక్కసారి ఈ వీడియో చూడండి… ఓ వంద నయాగారా జలపాతాలు కళ్లెదుట భీకరఘోషతో కిందకు దూకుతున్నట్టు అనిపిస్తుంది… ఎక్కడో కాదు… కర్నాటకలోని షిమోగా జిల్లాలో… జోగ్ జలపాతాలు… జోగ్ ఫాల్స్… నిజానికి మామూలు రోజుల్లో పెద్దగా నీళ్లుండవు… బోసిగా కనిపిస్తుంది… అందుకే ఆ పరిసరాలు పెద్దగా కమర్షియలైజ్ కాలేదు… కాకపోతే జలపాతం సరిగ్గా చూడటానికి ఏర్పాట్లు బాగుంటాయి… ఇప్పుడు భారీవర్షాలు కురుస్తూ, జోగ్ ఫాల్స్ కన్నులపండువగా మారాయి… ఎవరో మిత్రులు […]
- « Previous Page
- 1
- …
- 330
- 331
- 332
- 333
- 334
- …
- 483
- Next Page »