ఎస్, సినిమా పాటల తీరు మీద కాస్త స్వరజ్ఞానం, బుద్ధీజ్ఞానం ఉన్నవాడెవడూ సంతృప్తిగా లేడు… పిచ్చి పిచ్చి పదాలు, వెర్రెక్కించే వాక్యాలతో వెగటును, అశ్లీలాన్ని జనం మీదకు వదులుతూ ఉంటారు… అది ఇప్పటి ట్రెండ్ ఏమీ కాదు… నిజానికి ఇప్పుడు చాలా తక్కువ…. ఆత్రేయ, వేటూరి తదితరులు టన్నుల కొద్దీ అశ్లీలాన్ని వండి, తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలారు… ఎన్టీయార్, ఏఎన్నార్ దగ్గర్నుంచి ఎవరూ మినహాయింపు కాదు… బూతును దట్టంగా దట్టించిన పాటల్ని పిచ్చి గెంతులతో జనం […]
ఈ కోకిలకూ ఓ విషాద ప్రేమగాథ… ఆ రాజావారు తొక్కిపడేశారు…
సంగీత ప్రియుల్లో చాలామందికి తెలిసిన కథే కావచ్చు… కానీ మరోసారి మననం చేసుకోవచ్చు… లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు… ఎందుకు..? అదే ఈ కథ… నిజానికి ఓ నవలగానో, ఓ సినిమాగానో రాదగిన ప్రేమకథ… కానీ విషాదాంతం… భారతరత్నకు నిజమైన అర్హురాలు, కొన్ని వేల భారతీయ భాషల పాటల్ని పల్లవించిన గొంతులోని ఈ విషాద వీచికను తలుచుకుంటే తప్పేమీ లేదు… ఓ రాజావారి అహానికి బలైన ప్రేమకథ… అలాగని ఆ ప్రేమికుడు ఈమె ప్రేమ తాలూకు జ్ఞాపకాలనీ […]
ట్రాఫిక్ కష్టాలతో విడాకులు… ఆ సర్వే సంస్థ చెప్పిన కఠోరవాస్తవమేనా..?!
రాజకీయాల్లో ఉన్నవాళ్లు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, ప్రేలాపనలకు దిగడం పరిపాటే… ఓ రీతిరివాజు ఉండవు వాటికి… అఫ్కోర్స్, సమాజానికి కూడా అలవాటైపోయింది… అయితే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత చేసిన వ్యాఖ్యల్ని కూడా అదే కోవలో జమచేయాలా..? నవ్వి వదిలేయాలా..? ఆమె వైపు జాలిగా చూడాలా..? ఇంతకీ ఆమె ఏమన్నదో తెలుసా..? ‘‘ముంబై ట్రాఫిక్ జామ్స్ 3 శాతం విడాకులకు కారణమవుతున్నయ్’’..! మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఆమె విమర్శలు కొత్తేమీ […]
అధికారిణి అదరగొట్టింది… ఆ సోషల్ వీడియోవార్తకు నమ్మలేని స్పందన…
ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలు, ఫేక్ ఖాతాలు, ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలతో సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారు… ఆ ఆందోళన బలంగానే కనిపిస్తున్నా సరే, ప్రస్తుతం నిజానికి జనంలోకి బలంగా వెళ్తున్నది, జనం ఫాలో అవుతున్నదీ సోషల్ మీడియా మాత్రమే..! పలు సందర్భాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా వెలవెలబోతోంది… సోషల్ మీడియా మాత్రమే డామినేట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… మొన్న మూడో తారీఖున ‘‘నేను-నా వేములవాడ’’ పేజీలో ఓ పోస్టు కనిపించింది… విషయం ఏమిటంటే… కొత్తగా వచ్చిన ఈవో […]
ఈ ఇద్దరూ… నాటి పాత కాషాయ నాణేనికి రెండు వేర్వేరు పార్శ్వాలు…
1984… రెండు పేర్లు దేశమంతా మారుమోగాయి… ఇందిర హత్య బాపతు సానుభూతి పవనాలు బలంగా వీచిన ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు గెలుపొందింది… అప్పటికి బీజేపీ పార్టీ ఏర్పడి నాలుగు సంవత్సరాలే… పార్లమెంటులో బీజేపీ తరఫున తొలిసారి అడుగుపెట్టిన ఆ ఇద్దరిలో ఒకరు చందుపట్ల జంగారెడ్డి… ఆయన ఏకంగా పీవీనరసింహారావుపైనే గెలిచాడు హన్మకొండ సీటు నుంచి..! మరొకరు ఎంకే పటేల్, గుజరాత్లోని మెహసానా సీటు… కొన్నిసార్లు ఆశ్చర్యమేస్తుంది… ఇద్దరిదీ అరవైల నాటి జనసంఘ్ నేపథ్యమే… […]
ఇక ప్రికాషనరీ టీకా అట… తరువాత రీబూస్టర్, మధ్యలో సూపర్ ప్రికాషనరీ..!!
మోడీ కెరీర్ మొత్తం ఏమైనా గానీ, ఎలా సర్ఫ్ తెల్లదనంతో ఉన్నట్టు చెప్పబడినా సరే గానీ…. వేక్సిన్ల దందా మీద తన అడుగులు మాత్రం అడుగడుగునా సందేహాస్పదమే…. ఈ విషయంలో ఈ దేశప్రజలకు చిన్న క్లారిటీ కూడా లేదు, ఈ మహా అడ్డగోలు ధరలేమిటో, ఈ మహా మహా అడ్డగోలు నిర్ణయాలేమిటో ఎవరికీ అర్థం కావు… మంచినీళ్ల సీసా టీకా వేలకువేల కోట్లు ఎలా సంపాదిస్తున్నదో…. ఇంకా ఇంకా బూస్టర్ డోసులు, ముక్కు టీకాలు, పోరగాళ్ల టీకాల […]
హవ్వ… సమంతా, ఈ టీషర్ట్ నిజమేనా..? పోనీ, ఆంధ్రజ్యోతి సార్, మీరైనా చెప్పండి…
సోషల్ మీడియా అంటేనే మాగ్జిమం ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్, ఫేక్ ఖాతాలు… మరీ పీకే వైరస్ ప్రబలిన తరువాత ఇది విపరీతంగా వ్యాపించింది… ఇంటింటికీ ఒమిక్రాన్ తరహాలో ఎటుచూసినా సోషల్ మీడియాకు కూడా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు… హఠాత్తుగా ఆంధ్రజ్యోతి సైటులో ఓ వార్త కనిపించింది… అసలే ఇది సోషల్ మీడియాను అనుసరిస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏదిపడితే అది రాసేస్తున్న దుర్దినాలు కదా… డౌటొచ్చింది… తను ఏం రాశాడంటే… ‘‘సమంత టీ […]
మోడీ సైనిక దుస్తులు ధరిస్తే నేరమా..? శిక్షార్హమా..? ఏమిటీ కేసు..?!
ఒకాయన ఎవరో రాశాడు… మోడీ సైనిక దుస్తులు ధరించడం ఏమిటి… అని ఓ కేసు పడింది, కోర్టు ప్రధాని ఆఫీసుకు అక్షింతలు వేసింది, మొట్టికాయలు వేసింది అని… నిజానికి వార్తలో స్పష్టత ఏమిటంటే… కోర్టు పీఎంవోకు నోటీసులు జారీ చేసింది… ఏ కోర్టయినా సరే, ముందుగా నోటీసులు జారీ చేయడం సహజమే కదా… అయితే… మోడీ అంత దుర్మార్గానికి పాల్పడ్డాడా..? ఆ కేసు వార్తలో చెప్పినట్టు ఐపీసీ 140 ప్రకారం నేరమా..? ఓసారి ఈ వార్త చూడండి […]
‘‘ఆ అర్ధరాత్రి హరహరమహాదేవ్ అంటూ చైనా శిబిరాలపై విరుచుకు పడ్డారు…’’
……. By…. పార్ధసారధి పోట్లూరి ……… 2020 జూన్ నెలలో గాల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికుల మరణాల సంఖ్య 38 గా క్రమేపీ ద్రువీకరించబడుతోంది..! ఈ ఘర్షణలో భారత్ కి చెందిన 20 మంది సైనికుల వీర మరణం తెలిసిందే. అయితే అప్పట్లో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ సైనికులు కేవలం 4 గురు మాత్రమేచనిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది ! కానీ ఆ లెక్క తప్పు అంటూ ఇప్పుడు […]
ఆలియాభట్… బాలీవుడ్ రాణి గంగూబాయ్… అందరికీ ఆమే కావాలి…
పుష్ప బన్నీకి ఆలియా కావాలి… జూనియర్కు ఆలియా కావాలి… అందరికీ ఆమే కావాలి… ఆల్రెడీ ఆర్ఆర్ఆర్లో తనే మెరుపు… ఇప్పుడు గంగూబాయ్… ఇంకా చేతిలో బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్, రాకీ ఔర్ రాణికి ప్రేమ కథ… ఇవి కాదు, ఆమె సంతకాలు పెట్టాలే గానీ, గేటు బయట బోలెడు మంది నిర్మాతల క్యూ… బక్కపలచగా, ఎండుకుపోయినట్టుగా, ఇప్పటికీ ఓ టీనేజ్ పిల్లలా కనిపించే ఆలియా భట్ ఈరోజు బాలీవుడ్ యువరాణి… సారీ, బాలీవుడ్ అనే కామాటిపుర రాజ్యానికి ఆమె […]
నీ కడుపు నిండితే చాలా అక్కా..? మిగతా సొసైటీ ఎండిపోయినా సరేనా..?!
……… By… Gurram Seetaramulu………. అదొక ఆదివాసీ గ్రామం . దశాబ్దాల నిర్బంధం తిష్టవేసిన చెరసాల లాంటి గిరిజన గూడెం. కనీసం పేపర్ ఎర్ర బస్ కూడా టయానికి దొరకని నిజం. అక్కడొక బడి పంతులు. ఆయన తమ్ముడు నాకు ఆప్తుడు. ఆ వూరిలో కాన్వెంట్ లేదు, కనీసం నూటా యాభై కిలోమీటర్లు పోతే తప్ప ఇంగ్లీష్ మీడియం బడి అందుబాటులో లేదు. ఉదయం గంట మోగిన దగ్గర నుండి సాయంత్రం ఇంటి బెల్లు మోగే వరకు […]
‘‘రష్మి, సుధీర్ తొమ్మిదేళ్ల లాంగ్ లవ్వు… రాళ్లతో టీవీలు పగుల గొడుతున్నారట…’’
కామెడీ అంటే ఇదే… చాన్నాళ్ల తరువాత వీసమెత్తు బూతు వాసన లేని ఓ స్కిట్ ఎక్సట్రా జబర్దస్త్లో మనసారా నవ్వించింది… అన్నింటికీ మించి ఓ విషయంలో మెచ్చుకోవాలని కూడా అనిపించింది…… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు సహజమే కదా… ఒకవేళ ఇప్పుడు సెకండ్ లేయర్ కమెడియన్లుగా ఉన్న వాళ్లు టాప్ రేంజుకు చేరిపోయి, ఇప్పుడు పాపులర్ కమెడియన్లుగా ఉన్న గెటప్ సీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ గనుక చితికిపోతే..? పూలమ్మిన చోటే కట్టెలు అమ్మినట్టుగా ఆ […]
హమ్మయ్య… సిరి, శ్రీహాన్ కలిసిపోయారు… నెక్స్ట్ దీప్తి, షన్నూయేనా..?!
గుర్తుందా..? ఆమధ్య కొన్నిరోజులపాటు యూట్యూబ్ చానెళ్లు, సైట్లే గాకుండా సోషల్ మీడియా పోస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు సైతం ఓ అంశాన్ని రచ్చ రచ్చ చేశాయి… ఏమిటంటే..? బిగ్బాస్ గత సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హన్మంతు, మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ ఫుల్లు రెచ్చిపోయి బిహేవ్ చేసి, మొత్తం షో అంతా కంపు చేశారని బోలెడు విమర్శలొచ్చినయ్ కదా… తీరా చూస్తే సిరికి బయట శ్రీహాన్ అనే లవర్… లవర్ ఏమిటి సహజీవనమే అన్నారు… […]
అతీతులం అనే భ్రమల్ని బద్దలు కొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి..!!
నవీన్ పట్నాయక్ను అభినందించాలి… కాదు, ఆయన్ని ఆ కుర్చీ మీద అలాగే కొనసాగిస్తున్న ఒరిస్సా ప్రజల్ని అభినందించాలి… ఒక్క పొల్లు మాట లేదు, ప్రచార కండూతి లేదు, అబద్ధాలు లేవు, మాట తప్పడాలు లేవు, జనాకర్షక పథకాలు లేవు, కుటుంబ పాలన లేదు, తనకు అవినీతి అంటనివ్వడు… అసలు ఇవి కాదు, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా ఏ ఎస్ అయినా సరే, దొరికితే కేసులు పెట్టేయడం, వదిలించుకోవడం… కొడితే ఆ తిమింగిలాల్ని కొట్టాలి… చిన్న చిన్న […]
అనగనగా ఓ విశాలుడు… మరో ఉప్మా సినిమాని భుజాన వేసుకుని బయల్దేరెను..!!
Veeramae Vaagai Soodum…… ఇదీ విశాల్ తమిళంలో తను సొంతంగా నిర్మించిన చిత్రం పేరు… దాన్నే సామాన్యుడు అని తెలుగులోకి డబ్ చేసి మన మీదకు వదిలాడు… ఇప్పుడు అందరు హీరోలకూ అలవాటే కదా… తెలుగైనా, తమిళమైనా, మలయాళమైనా, కన్నడమైనా చకచకా ఇతర సౌత్ ఇండియా భాషల్లోకి కూడా డబ్ చేసి, ఒకేసారి రిలీజ్ చేసేయడం… వీలయితే హిందీలో కూడా విడుదల చేస్తే సరి… వస్తే నాలుగు డబ్బులు, లేదంటే చేతులు దులుపుకుంటే సరి… అలాగే సామాన్యుడు […]
అంతటి పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!
వర్మ ఇంటర్వ్యూలు చూసీ చూసీ, అందరూ ఏమనుకుంటారు..? తనకు ఏ ఉద్వేగాలూ ఉండవు అని…! తను కూడా ఎప్పుడూ అదే కలరింగ్ ఇస్తుంటాడు… అన్ని బంధాలకూ అతీతుడు అనిపించుకోవాలని తన తపన… అదేం వ్యాధి అనకండి, అదొక తత్వం… పర్వర్షన్కు కూడా అందడు అనేకసార్లు..! అయితే తను చెప్పేదంతా నిజమేనా..? కాదు, తప్పు… ఎమోషన్ లేనివాడు ఎందుకు ఉంటాడు..? ఎంతటి స్వార్థపరుడైనా, రాక్షసుడైనా, యోగిపుంగవుడైనా ఏదో ఒక ఎమోషన్ కదిలించడం ఖాయం… అంతెందుకు..? ఇదే వర్మ ఎన్నిసార్లు […]
అసలు సమస్య రాహుల్ అహం ప్లస్ కోటరీ… మోడీకి అదే బలం…
దేశంలో బీజేపీని నిలువరించడానికి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి… కాంగ్రెస్ పార్టీ ఆ అవసరానికి తగినట్టుగా ఎదిగే సిట్యుయేషన్ లేకపోవడంతోనే సంకుచిత, ప్రాంతీయ, కుటుంబ, అవినీతి పార్టీల నేతలు కూడా తొడలు కొడుతున్నారు… అన్నీ ఒక్కచోట కుట్టేసి, ఓ బలమైన బొంత తయారు చేసి, కుర్చీ ఎక్కాలనే ఆశలు, ప్రయత్నాలు సాగుతున్నయ్… ఈ కప్పలతక్కెడ పార్టీల కూటములు గతంలో ఈ దేశాన్ని ఏ స్థితుల్లోకి నెట్టేశాయో చూశాం… ఆ పతనావస్థలో చంద్రబాబు కూడా పాత్రధారే… దాన్నలా వదిలేద్దాం… […]
నితిన్ హిట్… సాయిధరమ్ బిలో యావరేజ్… ఆది ఫ్లాప్… జ్యోతిక అట్టర్ ఫ్లాప్…
నిజమే… హీరో నితిన్కు కాస్త రిలీఫ్… స్టార్ మాటీవీలో తన సినిమా మేస్ట్రో రిలీజ్ చేశారు ఆమధ్య (23 జనవరి) … హైదరాబాద్ కేటగిరీలో 6.59 టీఆర్పీలు వచ్చినయ్… మొత్తంగా లెక్కేస్తే 8 నుంచి 8.50 దాటి ఉంటుంది… నిజానికి ఇప్పుడున్న స్థితిలో ఇవి కాస్త మంచి రేటింగ్సే… పైగా ఇది అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన అంధాధున్ సినిమాకు రీమేక్… టీవీల్లో, ఓటీటీలో చూసీ చూసీ బాగా పాతచింతకాయ పచ్చడి అయిపోయింది… దాన్ని ఇప్పుడు నితిన్ హీరోగా […]
స్టాలిన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నట్టు..? సీబీఐ దర్యాప్తు జరిగితే తప్పేంటి..?!
ఈమధ్య కొన్ని అంశాల్లో స్టాలిన్ పనితీరును మెచ్చుకుంటున్నాం కదా… అలాగని తను అన్ని అంశాల్లోనూ సమర్థించదగినవాడు అని కాదు… ప్రత్యేకించి మతం అనే అంశం దగ్గర రిజిడ్గా ఉంటున్నాడు ఇప్పటికీ… తను నాస్తికుడు, అందులో తప్పులేదు, దేవుడిని నమ్మాలా లేదా అనేది వ్యక్తిగతం… కానీ నాస్తికత్వానికీ యాంటీ-హిందూ ధోరణికీ సంబంధం ఉండకూడదు, అన్ని మతాలకూ-దేవుళ్లకూ దూరంగా ఉండాలి… కానీ స్టాలిన్ తన తండ్రి, తన పార్టీ వ్యవస్థాపకులు పాటించిన యాంటీ-హిందూ ధోరణికే తను కూడా కట్టుబడి వ్యవహరిస్తున్నాడు… […]
అసలే లేటు వయస్సు పెళ్లి… అప్పుడే ఆ బంధంలో ఒడిదొడుకులా..?
ఎక్కడో చదివినట్టు గుర్తు… జేడీ చక్రవర్తి, తన భార్య అనుకృతి గోవింద శర్మకు బైబై చెప్పబోతున్నట్టు వార్త… కొన్ని సైట్లలో మాత్రమే… మిగతావాళ్లెవరూ పట్టించుకోలేదు, అయినా జేడీ ఇలాంటివి పట్టించుకునే టైపే కాదు… నిజమేమిటో వదిలేద్దాం… నమ్మబుల్ అనిపించలేదు, కానీ అసలే ఇది బ్రేకప్పులు, డైవోర్సుల సీజన్ కదా… నిజమే ఐనా పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు… ఐతే విశేషంగా అనిపించింది ఏమిటంటే..? తనకు శ్రీదేవి అక్క బిడ్డ, అప్పట్లో హీరోయిన్ మహేశ్వరితో ఎఫైర్ అని బోలెడు కథనాలు […]
- « Previous Page
- 1
- …
- 337
- 338
- 339
- 340
- 341
- …
- 448
- Next Page »