కంగనా రనౌత్… కొన్నిసార్లు ఆమె ప్రదర్శించే తెగువకు ఆశ్చర్యం కలుగుతుంది… ముంబైలోని బాలీవుడ్ మాఫియాను, అక్కడి శివసేన సర్కారును ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన తీరు కూడా అబ్బురపరుస్తుంది… అదేసమయంలో కాస్త ఆమె తిక్క ధోరణి పట్ల నవ్వొస్తుంది కూడా..! తను ఏది అనుకుంటే అదే రైట్ అనుకునే వైఖరితో ఓ తింగరిది అనిపిస్తుంది… తాజాగా ఫిలిమ్ ఫేర్ అవార్డులకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆమె పరిపక్వతలేమినే ప్రదర్శిస్తున్నాయి… ఆమె ఏమంటున్నదంటే…? ‘‘నేను ఫిలిమ్ ఫేర్ […]
జొమాటో లెంపలేసుకుంది, సారీ చెప్పింది, వీడియో రిమూవ్ చేసింది..!
జొమాటో… ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండటం, లెంపలేసుకోవడం అలవాటే… ప్రత్యేకించి అది విడుదల చేసే వాణిజ్య ప్రకటనలు, సాగించే ప్రచారానికి సంబంధించిన టీం ఏదో దరిద్రంగా ఉన్నట్టుంది… తాజాగా మరో వివాదం… విషయం ఏమిటంటే..? ఆమధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఓ యాడ్ చేయించింది… ‘‘తాలి తినాలని ఉంది, మహాకాళ్ నుంచి తెప్పించాను’’ (రఫ్ అనువాదం)… అని అంటుంటాడు ఆ వీడియోలో… తాలి అంటే తెలుసు కదా, ఓ ప్లేటు భోజనం… సౌతిండియన్ తాలి, నార్త్ ఇండియన్ […]
ఓహో… ఆ పత్రిక రాసిన ‘పెయిడ్ స్టోరీస్’తోనే ఢిల్లీలో ముసలమా..!!
అదేదో శుద్ధపూస పత్రిక అయినట్టు… ఆప్, బీజేపీ తన్నుకుంటున్నాయి..! ఆప్ నేతలు చెబుతున్నారేమిటంటే..? ‘‘ఢిల్లీ ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్ని న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ప్రత్యేక కథనంగా కుమ్మేసింది… అది చూసి మోడీకి, షాకు బుగులు పట్టుకుంది, ఇక రాబోయే ఎన్నికలు కేజ్రీ వర్సెస్ మోడీ అనేది ఫిక్స్… పైగా అదే పత్రిక కరోనా సమయంలో మోడీ వైఫల్యాల్ని కూడా ఏకిపారేసింది… అదుగో, దాంతో కక్షపెట్టుకుని సిసోడియాను టార్గెట్ చేసి, సీబీఐ కేసు పెట్టించాడు […]
మద్యం సీసాడియా..! మింగలేక, కక్కలేక కేజ్రీ… కిక్కు దిగినా కిక్కుమనడు..!!
పార్ధసారధి పోట్లూరి ….. రేపో మాపో CBI కానీ, ED కానీ నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ! ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అంటున్నాడు ఇలా… ! ఇప్పటివరకు కేవలం సిబిఐ మాత్రమే దాడులు చేసింది ఈయన మీద, కానీ మధ్యలో ED పేరును తానే ఎందుకు ఇరికించాడు ? అంటే మనీ లాండరింగ్ చేశాడా ? ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలు ! Delhi Excise Policy 2021… దేశ రాజధానిలో […]
బీజేపోళ్లకు పనీపాటా ఉండదా..? నాన్సెన్స్… బీహారర్ వైపు వెళ్లనివ్వరా..?!
ఈ బీజేపీ వాళ్లకు పనిలేదు, పాటలేదు… ఎప్పుడూ బట్టకాల్చి మీద వేయడమే తెలుసు… అరె, అభివృద్ధికి సహకరించకుండా, ఎప్పుడూ బురదజల్లుడు రాజకీయాలేనా..? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు… ఫాఫం, 74 ఏళ్లు… ఆ సీఎం నీతిశ్ బీజేపీ ఏదో చేస్తుందని గజ్జున వణికిపోయి, ఈ పాము పక్కలో చేరాడు… ఐనాసరే, నీకెందుకు భయం, నేనున్నాను కదాని అభయం ఇచ్చాడు లాలూ… కానీ ఓపిక లేదు, తరాల తరబడీ ప్రజలకు సేవ చేసీ చేసీ అలిసిపోయాడు… ఐనాసరే, […]
విజయ్… నువ్వు తోపువే..! కానీ వెండితెర చాలా క్షిపణుల్నే చూసింది…!!
ఒకరు… పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నా సరే, అనుకోకుండా తన సినిమాలు ఒకటీరెండు హిట్టయ్యాయి… దాంతో తన పిచ్చికూతలకు జనామోదం ఉందనీ, దాన్నే జనం ఇష్టపడుతున్నారనే పిచ్చి భ్రమల్లో పడిపోయాడు తను… ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే నీతి తనకు ఎవడూ చెప్పినట్టు లేడు… పెద్ద పెద్ద స్టార్లు సైతం జనంలోకి వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడతారనీ, సగటు ప్రేక్షకుడు తన బాడీ లాంగ్వేజీ, టాకింగ్ స్టయిల్ కూడా పరిశీలిస్తారనీ, లాంగ్‌రన్‌లో అవన్నీ కౌంట్లోకి వస్తాయనే సోయి కూడా లేనట్టుంది […]
నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
Bharadwaja Rangavajhala……… నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా…… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బరామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు. చెంచులక్ష్మితో స్టార్ట్ […]
జై కేసీయార్… జైజై టీఆర్ఎస్… మేమిప్పుడు గులాబీ తోకలం…
‘‘మంచి తోకలుగా ఉంటాం… దయచేసి మమ్మల్ని అతికించుకొండి, ప్లీజ్… నమ్మకంగా విధేయంగా ఉంటాం… జెండాలు మోస్తాం, ఎజెండాలు మోస్తాం…’’ అంటూ ఏ ప్రధాన పార్టీ పిలుస్తుందా..? ఎప్పుడు లటుక్కున అతుక్కుపోదామా..? అన్నట్టుగా మారిపోయాయ్ లెఫ్ట్ పార్టీల ప్రస్థానాలు… వ్యంగ్యంగా అనుకున్నా, నిజమైన కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్ అభిమానుల్లో ఉన్న ఆవేదనే ఇది… అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైనా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైనా… సొంతంగా ఎదగడానికి చేసే పోరాటం లేదు, ఆ ఆరాటమూ లేదు ఇప్పుడు… ఏదో ఓ పార్టీకి […]
రామోజీ దౌత్యం… బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు డెస్పరేట్ ప్రయత్నాలు…
‘‘ఏమోయ్ మోడీ… చంద్రబాబు నిన్ను వెన్నుపోటు పొడిచి ఉండవచ్చుగాక… యూపీయే ప్రభుత్వంలోకి వస్తుందనే భ్రమల్లో పడి, నీ దోస్తీని తెంచుకుని, సోనియాకు ఆర్థికసాయం చేసి, ఇతర పార్టీలనూ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చుగాక… తరువాత బొక్కబోర్లాపడి, తన సొంత రాష్ట్రంలోనే 23 సీట్లకు పరిమితమై మూతిపళ్లు రాలిపోయి ఉండవచ్చుగాక… అంతకుముందే మోడీని తీవ్రంగా వ్యతిరేకించి, రాజకీయ కారణాలతో అంతకుముందు నీతో మళ్లీ దోస్తీ చేసి ఉండవచ్చుగాక… ఐనాసరే, మళ్లీ నీకు చంద్రబాబే శరణ్యం… వెంటనే తనతో దోస్తీ చేసుకో, […]
భారత జలాల్లోకి పాకిస్థానీ యుద్ధనౌక..! ఎందుకు..? ఏ కుట్ర కోసం..?!
Article By పార్ధసారధి పోట్లూరి ……….. ఆలస్యంగా అందిన వార్త ! గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీకి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాలలోకి ఏదో నౌక ప్రవేశించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించింది. వెంటనే మొదటి డోర్నియర్ నిఘా విమానంకి తోడుగా దగ్గరలోనే ఉన్న ఎయిర్ బేస్ నుండి మరో […]
మరో హిందీ సినిమా ఢామ్మని పేలిపోయింది… ఇది ఇంకా దారుణంగా…
మరో హిందీ సినిమా ఢామ్మని పేలిపోయింది… హీరో, హీరోయిన్లు ఎవరైతేనేం..? బ్యానర్ ఏదయితేనేం..? దర్శకుడు ఎవరైతేనేం..? సినిమా ఎలా ఉంటేనేం..? ఎంత ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేసుకుంటేనేం..? ‘‘మా సినిమా బాయ్‌కాట్ చేయండి ప్లీజ్, హ్యాష్ ట్యాగ్ వైరల్ చేయండి దయచేసి’’ అంటూ బాయ్‌కాట్ పిలుపుల మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు హీరోయిన్ తాప్సి, దర్శకుడు అనురాగ్ కశ్యప్… ‘అసలు ఈ షోలను కేన్సిల్ చేసే కల్చర్ ఏమిట్రా బాబోయ్’ అంటూ పకపకా జోకులేసుకుని నవ్వారు… సినిమా పేరు […]
గెటౌట్ విష్వక్సేన్..! ఆ మూవీకి అత్యంత దయనీయంగా టీఆర్పీలు..!!
అదేమిటో… విష్వక్సేన్ అనగానే… తన సినిమా కోసం ఓ ప్రాంక్ వీడియో చేయించి అడ్డగోలుగా బదనాం అయిపోయిన సంఘటన గుర్తొస్తుంది… అంతేకాదు, టీవీ9 దేవి తర్జని చూపిస్తూ గెటౌట్ ఫ్రం మై స్టూడియో అని హైపిచ్‌లో అరిచి, వెళ్లగొట్టిన ఉదంతం కూడా గుర్తొస్తుంది… దాని మీద బోలెడంత రచ్చ… ప్రజలకు వినోదం మాటేమిటో గానీ, సినిమాల చిల్లర ప్రమోషన్ల మీద మంచి చర్చ జరిగింది… ఐతే నిజంగా సదరు హీరోకు ఈ వివాదం వల్ల ఏమైనా మంచి […]
యువరానర్… ఈ మందులు, పరీక్షల కమీషన్ల కథలన్నీ తవ్వండి… ప్లీజ్…
కరోనా సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ మాట అటుంచితే… ఇప్పటికీ ఒమిక్రాన్ వెరయిటీ వదలడం లేదు… సోకిందని సందేహమొస్తే చాలు, రోగి మెడికల్ షాపు వద్దకు వెళ్తున్నాడు… నాలుగు డోలో-650 తెచ్చుకుంటున్నాడు… వేసుకుంటున్నాడు… నమ్మినా నమ్మకపోయినా రియాలిటీ అదే… మార్కెట్లో బోలెడు పారాసెటిమాల్ టాబ్లెట్లు దొరుకుతాయి… మరి డోలో-650 మీదే ఎందుకు నమ్మకం పెరిగింది..? హైడోస్ అనేనా..? నిజానికి డోలో-650 ప్రిస్క్రయిబ్ చేయాలని సదరు కంపెనీ భారీ ఎత్తున డాక్టర్లకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదేమో… ఎందుకంటే..? […]
హైవే… ఈ దర్శకుడు డ్రైవింగ్‌ను మధ్యలోనే వదిలేసినట్టున్నాడు…
కేవీ గుహన్… పెద్ద పెద్ద సినిమాలకు సినిమాటోగ్రాఫర్… సీనియర్… మెరిట్ కూడా ఉంది… తను దర్శకుడిగా మారి నందమూరి కల్యాణరాంతో తీసిన 118 సినిమా కూడా పర్లేదు, బాగుంటుంది… కానీ ఎందుకో పెద్దగా ఆడలేదు… ఇప్పుడు హైవే పేరిట ఆహా ఓటీటీ కోసం ఓ సినిమా తీశాడు… అల్లు అరవింద్ దీన్ని కేవలం ఓటీటీకే ఎందుకు పరిమితం చేశాడో తెలియదు… ‘‘ఎంతొస్తే అంత’’ పాలసీతో థియేటర్లలోకి పుష్ చేస్తాడేమో అనుకున్నారు, కానీ చేయలేదు… సినిమా విషయానికి వస్తే… […]
ఓహో… బుల్డోజర్ బాబా తొలి ప్రతాపం బాలీవుడ్ కేరక్టర్లపైనే అట…
మొన్నామధ్య అనురాగ్ కశ్యప్ అనబడే ఓ వెకిలి దర్శకుడు హీరోయిన్ తాప్సి స్తనాలపై చేసిన వెగటు వ్యాఖ్య గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ కశ్యపుడి కథేమిటా అని చెక్ చేస్తుంటే… మరో ఆసక్తికరమైన వార్త కనిపించింది… ఒక్క కశ్యప్ మాత్రమే కాదు… తనతోపాటు రాజ్‌బబ్బర్, ఆయన భార్య నదిర, విశాల్ భరధ్వాజ్, నవాజుద్దీన్ సిద్దిఖి ఎట్సెట్రా 172 మంది బాలీవుడ్ పర్సనాలిటీలు ప్లస్ కొందరు ఇతరులు నెలనెలా 50 వేల పెన్షన్లు పొందారట… షాకింగ్‌గా ఉందా..? అంతేమరి… […]
బొడ్డు తాత రాఘవేంద్రరావు ఇజ్జత్ తీసేసిన ‘పండుగాడ్’…!!
తెలుగు దిగ్దర్శకుడిగా పేరొంది, ఒకప్పటి స్టార్ హీరోలందరికీ సూపర్, బంపర్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు ప్రస్తుత ఆలోచన సరళి, వెళ్తున్న బాట తన మీద జాలేసేలా ఉంటోంది… ఎనభయ్యేళ్ల వయస్సులో తను ఎంత ఆదర్శంగా ఉండాలి ఈ తరానికి..? ఫాఫం… కొందరు అంతే… వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా చూస్తుంటే రాఘవేంద్రరావు మీద జాలివేయడం మినహా ఇంకేమీ ఫీలింగ్ కలగదు… జస్ట్, జాలి, సానుభూతి… ఈరోజుకూ రాఘవేంద్రరావు అనగానే జనం బొడ్డు-పండు అని వ్యాఖ్యానిస్తుంటే దాన్ని గొప్పతనంగా […]
ఫాఫం ఆది సాయికుమార్… ఓ శాపగ్రస్తుడు… తీస్మార్ఖాన్ తన తప్పిదమే…
ఇది ఖచ్చితంగా ఆది తప్పే… ఆది అంటే పినిశెట్టి ఆది కాదు… సాయికుమార్ కొడుకు ఆది… పుడిపెద్ది ఆది… పీజే శర్మ మనమడు… నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ తనకు బాబాయ్… మంచి నటనకు, మంచి వాయిస్ ఓవర్‌కు పెట్టింది పేరైన ఆ కుటుంబంలో ఆది ఓ హిట్ కోసం తన్నుకుంటున్నాడు పదకొండేళ్లుగా… తను ఏదో తక్కువ చేస్తాడని కాదు… తన మ్యాగ్జిమం ఇస్తాడు… కానీ ఓ శాపగ్రస్తుడు… తీసిన సినిమాలన్నీ ఫట్… మరీ కొన్నాళ్లుగా ఇంకా […]
ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే… ఓ మరుపురాని ఫోటో… ఆ సందర్భమేంటంటే…
ఒక్క ఫోటో వంద పదాలకు సరిసమానమంటుంటారు.. కొన్ని ఫోటోలైతే అలా పదాల సంఖ్యతో కూడా పోల్చలేని స్థాయిలో అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తాయి… ఇక మరికొన్నైతే అంతే ఆవేదనకూ నిలువెత్తు నిర్వచనమైతాయి. కథలు కాలగర్భంలో కలిసిపోయినా… చరిత్రను మన ముందుంచే ఫోటో అది! ఆ కథే ఇది!! అది 1945.. రెండో ప్రపంచ యుద్ధం. జపాన్ లోని హిరోషీమా- నాగసాకిపై కురిసిన బాంబుల వర్షానికి ఆ నగరాలు ఇప్పటికీ కోలుకోలేకుండా పోయి… ఓ చేదు చరిత్రను మిగిల్చిన యుద్ధభూమికి […]
బీజేపీలో పనిలేదు సరే… వెళ్లిపోదామంటే వేరే పార్టీ ఏం మిగిలింది..?!
నిజమే… ఆమెకు పనిచెప్పడం లేదు, ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ ఇవ్వడం లేదు… ఆమెను ముఖ్య సమావేశాలకు పిలవడం లేదు… ఆమెను అసలు పార్టీ నాయకురాలిగానే చూడటం లేదు… ఆమెకు తగిన గౌరవం లేదు… ఎస్, విజయశాంతికి తను బీజేపీలోనే ఉన్నానా అనే డౌట్ రోజుకు వేయిసార్లు వస్తూ ఉండవచ్చు బహుశా… అన్నీ నిజాలే… నాణేనికి ఒక కోణం ఆలోచిద్దాం… అది బీజేపీ… ఎవరూ పిలిచి పీటలేసి, కిరీటాలు పెట్టరు… చొరవ తీసుకోవాలి… పైగా ఆమె […]
తెలుగు పత్రికల్లో ఏది పెరుగు..? ఏది మజ్జిగ..? మీరే తేల్చండి..!
తెలుగు టీవీలను కాసేపు వదిలేద్దాం… మరోసారి చెప్పుకుందాం… ట్యాంపరింగుకు అతీతం కాకపోయినా వాటి మంచీచెడూ కొలవడానికి బార్క్ రేటింగ్స్ వస్తుంటయ్ వారంవారం… మరి పత్రికలు, వాటికి అనుబంధంగా ఉండే వెబ్సైట్లు… వాటి పరిస్థితేమిటి..? అసలు పాఠకుడు దేన్ని విశ్వసిస్తున్నాడు..? దేన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు..? ఏది విశ్వసనీయ పత్రిక..? పోనీ, ఏ వెబ్‌సైట్‌ను పాఠకుడు ఆదరిస్తున్నాడు..? ఎందుకు..? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలే… గతంలో ఏబీసీ అనే సిస్టం ఉండేది… ఏ పత్రిక ఎన్ని కాపీలు అమ్ముతున్నదో ఆడిట్ చేసి, […]
- « Previous Page
- 1
- …
- 339
- 340
- 341
- 342
- 343
- …
- 489
- Next Page »