Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భలే భలే… తెలంగాణలో కూడా ఓ మహిళ కమిషన్ ఉందోచ్… వావ్…

March 12, 2023 by M S R

bandi

Devika Reddy… అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను… ‘‘ఒక స్థాయిలో ఉన్నవాళ్లు ఆచితూచి మాట్లాడాలి… ఒక్క మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి… సామాన్యులు ఏం మాట్లాడినా చెల్లుతది… చెల్లకపోయినా పైవాళ్లు ఏదో కవర్ చేస్తారు… నడిపించే నాయకుడు జాగ్రత్తగా మాట్లాడాలి… ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించేప్పుడు… అసలైతే తెలంగాణలో కామన్ గా వాడే మాటే… (కొట్టకుంటే ముద్దుపెట్టుకుంటరా… తిట్టకుంటే ముద్దుపెట్టుకోవాల్నా అంటారు పెద్దవాళ్లు… పిల్లలు ఏదన్నా చిన్న తప్పుచేస్తే ..) కానీ… అవతల ఉన్నది మహిళ, పైగా ప్రత్యర్థి […]

రామోజీరావు, శైలజలపై సీఐడీ కేసులు… మార్గదర్శి చిట్స్‌పై జగన్ ‘దాడి’…

March 11, 2023 by M S R

margadarsi

రామోజీరావు డిపాజిట్ల సేకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో అలాగే ఉంది… ఉండవల్లి నడిపిస్తున్న కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది… రామోజీరావు మీద ప్రేమ ఎక్కువై కేసీయార్ తను ఇంప్లీడ్ గాకుండా సానుభూతి కనబరుస్తున్నాడు… అప్పట్లో హడావుడిగా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు గానీ ఉండవల్లి ఉడుం పట్టు పట్టడంతో ఆ కేసు సజీవంగా ఉండిపోయింది… ఇప్పుడు జగన్ ప్రభుత్వం (మార్గదర్శి డిపాజిట్లపై ఉరిమిన ఆ వైఎస్ కొడుకే కదా…) మార్గదర్శి చిట‌ఫండ్స్ మీద […]

72 ఏళ్లు… ఆధునిక ఫోరెన్సిక్ దర్యాప్తుల్లో దిట్ట… సొంతంగా పెద్ద లేబరేటరీ…

March 11, 2023 by M S R

forensic

క్రైం ఇన్వెస్టిగేటర్ అంటే సినిమాల్లో ఎలా చూపిస్తారు..? మీరు చూసిన ఏవైనా క్రైం సినిమాల్లో పాత్రల్ని ఓసారి గుర్తుతెచ్చుకొండి… నేను మరో భిన్నంగా కనిపించే వ్యక్తిని… అదీ మహిళను… వయస్సు మళ్లిన వ్యక్తిని చూపిస్తాను… ఆమెకు 72 ఏళ్ల వయస్సు… రుక్మిణి కృష్ణమూర్తి ఆమె పేరు… మెత్తగా మాట్లాడుతుంది… తల్లిలా కనిపిస్తుంది… సంప్రదాయిక చీరె కట్టుకుని, నొసట బొట్టు పెట్టుకుని, తనకు తగిన ఏదో నగ కూడా ధరించి కనిపిస్తుంది… పొడుగైన రూపం… నేను వెళ్లినప్పుడు నీలం […]

ఒక కాస్ట్‌లీ వాచ్ కథ… ‘చీప్’ ఆడంబరాల కథ… డబ్బు తెచ్చే అజ్ఞానం కథ…

March 11, 2023 by M S R

watch

Ashok Vemulapalli……….   ఇది ఇరవైఏళ్ల క్రితం జరిగిన సందర్భం.. మాకు బంధువైన మురళీగారు (పేరు మార్చాను) బాగా రిచ్ పర్సన్.. కానీ సింప్లిసిటీతో ఉండేవాడు.. తనకు డబ్బుందన్న అహంకారం ఏమాత్రం లేకుండా అందరితోనూ కలిసిపోయేవాడు.. ఒకసారి ఆయన నాకు చెప్పిన ఒక ఇష్యూ ఇప్పటికీ నా మెమొరీలో గుర్తుండిపోయింది.. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది ఆయన చెప్పిన విధానం ఇప్పటికీ గుర్తుంది.. అప్పట్లోనే ఆయన హోండా కారు వాడేవారు.. ఆర్టీసీ బస్సులోనూ ప్రయాణించేవారు.. అదే క్రమంలో అవసరమైతే […]

జర్నలిస్ట్, రైటర్, నావెలిస్ట్, ఎడిటర్… అవన్నీ కావు… ఓన్లీ పతంజలి..!

March 11, 2023 by M S R

patanjali

————————————————————- మార్చి 11 , పతంజలి 14వ వర్ధంతి బెజవాడ 1979. ఒక సాయంత్రం సబ్ఎడిటర్ పతంజలి, బెంజ్ కంపెనీ సెంటర్లోని ఈనాడు కాంపౌండ్ నుంచి వచ్చాడు. చుట్టుగుంట, చంద్రం బిల్డింగ్స్ లో విశాలాంధ్ర డైలీకి మరో మహాసబెడిటర్ నైన నేను కలిశాను. అరటావు కాయితాల కట్ట అందించాడు. కొక్కిరాయి రాతలో “ఖాకీవనం” అని రాసుంది. రాత్రికి రాత్రే చదివేశా. తెల్లారే పరిగెట్టుకుంటూ పోయి విశాలాంధ్ర నవలల పోటీకిచ్చా. ప్రైజ్ రాలేదు. * హైదరాబాద్, 1995 ఒక […]

మల్లన్న దేవుడికి 4500 ఎకరాల అడవి… నీ కొండలు నువ్వే కాపాడుకో…

March 11, 2023 by M S R

sslm

Chalasani Srinivas……….. ఇది చాలా ప్రాముఖ్యత గల వార్త శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని తిరిగి దేవాలయానికి అందజేయడం. కానీ తెలంగాణలో కొన్నిపత్రికల్లో తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన నాలుగు పత్రికల్లో ఈ వార్త నాకు కనపడలేదు, బహుశా ఏ మూలన్నా ఇరికించారేమో తెలియదు. టీవీలు సాధారణంగా నేను చూడను గనుక వేశారో లేదో తెలియదు. సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక్క పోస్టూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద […]

రసాతలమా! రంగుల వనమా!! ఆర్టిస్టుల ఆరో ప్రాణం స్టోన్‌ఫోర్డ్‌ ఆర్ట్‌ మ్యూజియం!

March 11, 2023 by M S R

art

కళకి ప్రకృతి మూలమంటారు చిత్రకారులు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ఆర్ట్‌ మ్యూజియంలోకి అడుగు పెట్టబోయే ముందు ఓ శిల్పం ఉంది. పేరు త్రీషేడ్స్‌. కళను ఆస్వాదించడం తప్ప అర్థం చెప్పే స్థాయి కాదు నాది. మోడరన్‌ ఆర్ట్‌ తెలిసినోళ్లు ఏమి చెబుతారో గాని నామటుకు నాకు ఆ ’త్రీషేడ్స్‌’… ఒకే మాదిరి ఆలోచించే ముగ్గురు మగాళ్లు ఓ పాయింట్‌ వద్ద ఏకాభిప్రాయానికి వచ్చినట్టుండే శిల్పసముదాయం. ఈ ముగ్గురూ తలలు వంచి మెడ, భుజాలు ఒకే లైన్లో ఉన్నట్టుగా ఉండి […]

కాలిపోయిన బల్బుకు ఎంత వాటేజీ ఉంటేనేం..? గతంలో ఎంత వెలిగిపోతేనేం..?!

March 11, 2023 by M S R

bulb

చదరంగం ఆటలో చంపబడిన పావులు… రాజు గానీ, బంటు గానీ… ఒకే బాక్సులోకి చేరతారు… అవి బతికి ఉన్నప్పుడే వాటి హోదాలు, విశిష్టతలు, విలువలు… సేమ్, కాలిపోయిన బల్బుల్లాగా… అన్ని ఫ్యూజ్డ్ బల్బులు ఒకటే… వాటి వాటేజ్ ఏమైనప్పటికీ -.. 0, 10, 40, 60, 100 వాట్స్ – ఇదిప్పుడు పట్టింపు లేదు… LED, CFL, హాలోజన్, ఫ్లోరోసెంట్ లేదా డెకరేటివ్ – కాలిపోయే ముందు అది ఏమిటనేది, కాలిపోయాక పట్టింపునకు రాదు… ఒక సీనియర్ […]

Barc News… సుమ ‘అడ్డా’ ఢమాల్… జెమినిటీవీ మటాష్… జబర్దస్త్ ఫ్లాప్…

March 11, 2023 by M S R

suma

మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్‌లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు… మరోసారి నిరూపితమైంది… దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? […]

నాడు సరిగమపలో ప్రదీప్ ర్యాగింగ్… నేడు ఇండియన్ ఐడల్‌లో రాకింగ్…

March 11, 2023 by M S R

ఇండియన్ ఐడల్ తెలుగు సెకండ్ సీజన్‌ స్టార్టయింది కదా ఆహా ఓటీటీలో… దానికి చాలా వ్యూయర్ షిప్ ఉంది… థమన్, కార్తీక్ ప్లస్ పాయింట్స్,.. శుక్రవారం రాత్రి థర్డ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు… అమెరికా నుంచి వచ్చిన ఓ గాయని కమ్ డాక్టర్ గోల్డెన్ మైక్ పొంది టాప్ 12 జాబితాలోకి వెళ్లిపోయింది… సిద్దిపేట నుంచి వచ్చిన లాస్య కూడా బాగా పాడింది… అకస్మాత్తుగా ఓ గాయని సింగర్ కార్తీక్‌ను ఆటపట్టిస్తూ… (ఆహా టీం స్క్రిప్టు)… […]

RRR… తక్షణ లబ్ధి కాదు… రాజమౌళి లాబీయింగు అసలు టార్గెట్ డిఫరెంట్…

March 10, 2023 by M S R

rrr

(  Raj Madiraju  )    కొంచెం చాలా పెద్ద పోస్టు.. ఓపికుంటే చదవండి.. ఇరవయ్యేళ్ళక్రితం లగాన్ ఆస్కార్లకు నామినేట్ అయినప్పుడు అమీర్ ఖాన్ దానికి గట్టి బందోబస్తుతోటే వెళ్ళాడు.. రెండుమిలియన్ డాలర్ల బడ్జెట్టుతో (అప్పటి విలువ ప్రకారం సుమారు పదికోట్ల రూపాయలు – సినిమా బడ్జెట్లో నలభై శాతం) దాదాపు రెండున్నర నెలలు అక్కడే తిష్టవేసి వాళ్ళనీ వీళ్ళనీ కలిసి, తన ఫ్రెండ్స్‌తో హాలీవుడ్ డైరెక్టర్లు స్పీల్‌బర్గు, స్కోర్సీసి లాంటివాళ్లకు సినిమా చూడమని ఫోన్లు చేయించి, చూశాక […]

ఫాఫం వెంకీ… ఈ ఒక్క పాత్రతో విశిష్ట కెరీర్ కాస్తా మటాష్… జాలిపడదాం…

March 10, 2023 by M S R

రానా నాయుడు

రచయిత, దర్శకుడు, నిర్మాత, మిత్రుడు  Prabhakar Jaini  ఫేస్ బుక్ వాల్ మీద ఓ పోస్టు కనిపించింది… అది… ‘‘పొరపాటున కూడా, మన వెంకటేశ్, మన రానా ఉన్నాడని ఈ వెబ్ సీరీస్ చూడకండి. అలగా జనం కూడా మాట్లాడలేని, అతి హేయమైన బూతులు, ఎంత దరిద్రంగా ఉందంటే, వీళ్ళ ముఖాలు జన్మలో చూడకూడదన్నంత ఛండాలంగా ఉంది. అందుకే, రానా, వెంకటేశ్ లు కూడా, ఇంటర్వ్యూలలో, మా అభిమానులు ఈ వెబ్ సీరీస్ చూడకండి అని చెబుతున్నారు… ఇక […]

జవాన్ లీక్డ్ వైరల్ వీడియో మాయం..! నిజానికి అది కాదు సినిమా విశేషం…

March 10, 2023 by M S R

షారూక్ ఖాన్ రాబోయే సినిమా జవాన్ నుంచి అయిదారు సెకండ్ల వీడియో క్లిప్ ఒకటి లీకయిందనే వార్త నిజానికి పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు… కొన్నిసార్లు సినిమా యూనిటే హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వేషాలు వేస్తుంటారు… కానీ ఇది అది కాదు… ట్విట్టర్‌లో ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిపోగానే, సినిమా యూనిట్ ట్విట్టర్‌కు కాపీ రైట్స్ కింద కంప్లయింట్ చేసింది… దాంతో ట్విట్టర్ అన్ని ట్వీట్ల నుంచి ఆ వీడియోను తీసేసింది… కాబట్టి ఎవరో యూనిట్ […]

కేటీయార్ టీవీ చానెల్ పైపైకి… జగన్, బీజేపీ టీవీ చానెళ్లు నానాటికీ లోపలికి…

March 10, 2023 by M S R

barc

ఆల్‌రెడీ హైదరాబాద్ బార్క్ మార్కెట్‌లో ఎన్టీటీవీ ఫాఫం నాలుగో ప్లేసుకు పడిపోయింది… పేరుకు అది తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్… కానీ కీలకమైన ఫైనాన్షియల్ మార్కెట్ హైదరాబాద్‌లో మాత్రం దాని ప్రగతి ఇదీ…! ఇంకో విశేషం తెలుసా..? మేం టీవీ9 చానెల్‌నే కొట్టేశాం అంటున్నారు కదా… ఇప్పుడు ఆ ఎన్టీవీని ఫస్ట్ ప్లేసు నుంచి పడగొట్టేయడానికి టీవీ9 జస్ట్, ఒకే అడుగు దూరంలో ఉంది… అంటే రెండు చానెళ్ల నడుమ తేడా కేవలం ఒక జీఆర్పీ […]

నాటునాటు పాటకు మోటు భాషలో వత్తాసు… నెత్తిమాసిన చిల్లర తగాదాలు…

March 10, 2023 by M S R

rrr

ఆర్ఆర్ఆర్ ఏదో పవిత్రం అన్నట్టు…. దాన్నేమైనా అంటే ఎగబడిపోతున్నారు… మరీ చిత్రమైన భాషలో…! అయిదుగురు దర్శకులు, ఓ యాంకర్ కలిసి కేజీఎఫ్ ప్రధాన పాత్ర రాఖీ కేరక్టరైజేషన్ మీద ఇకఇకలు, పకపకలతో వెక్కిరింపులకు దిగారు… ( ఆ సినిమా దర్శకుడు తెలుగువాడు, యాదవుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కొడుకు ) దాని మీద రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరధ్వాజ, నాగబాబు తదితరులు కిక్కుమనలేదు… కానీ ఆర్ఆర్ఆర్ అనగానే ఎగబడుతున్నారు… అదేమంటే, అది మన సినిమా కాదు, అది […]

రమ్యా రఘుపతీ..! నీ మొగుడు నాలుగో పెళ్లి చేసేసుకున్నాడట తెలుసా..?!

March 10, 2023 by M S R

naresh pavitra

ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్లు ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు – మీ #PavitraNaresh ……… అని సీనియర్ యాక్టర్ నరేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు… ఓ వీడియో కనిపిస్తోంది… అందులో నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఉంది… ఓహ్, వీళ్లిద్దరూ పెళ్లి చేసేసుకున్నారా అనిపించేలా ఉంది… అయితే ఇది నిజమేనా..? నరేష్ ఆమెను పెళ్లిచేసుకోవడం నిజమేనా..? నరేష్‌కు ఇప్పటికి మూడు పెళ్లిళ్లయ్యాయి… మూడూ పెటాకులే… ఇప్పుడు పవిత్రను నాలుగో […]

టీనేజ్ లవ్… కాదు, టెర్రిఫిక్ లవ్… హారిఫిక్ లవ్… పరపరా కోసేసే లవ్…

March 10, 2023 by M S R

love

Gift De(a)ed: స్టాచ్యుటరి వార్నింగ్:- గుండె బలహీనంగా ఉన్నవారు, అతి సున్నిత మనస్కులు దీన్ని చదవకండి. అబ్బాయి:- వస్తావా? నిన్నేడిపించినవాడి గుండె కోసి కొమ్మకు వేలాడేశా. నీకు లవ్ లెటర్ రాసిన వాడి వేళ్లు కత్తిరించి వాడి జేబులోనే పెట్టా. అమ్మాయి:- అబ్బ! ఎంత చల్లని వార్త చెప్పావ్! వస్తున్నా కానీ… అంతదాకా ఆగలేను వాడి గుండె, వేళ్ల ఫోటోలు అర్జంటుగా వాట్సాప్పులో పెట్టవా? అబ్బాయి:- ఇదుగో… చూసుకో. ఇంకేం ఫికర్ కాకు. అమ్మాయి:- ఓ మై […]

యతో ధర్మః తతో జయః … తథాస్తు… తప్పదు, ధర్మమే జయించాలి…

March 10, 2023 by M S R

liquor scam

యతో ధర్మహ తతో జయహ… కవిత నోటి వెంట వచ్చిన సూక్తి ఇది… నిజమే, ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది… జయించాలి కూడా… తథాస్తు, నీ కోరిక నిండుగా నెరవేరాలక్కా… అయితే ఇక్కడ డౌటేమిటంటే… ఏది ధర్మం, ఏది జయించాలి… నేను కవిత బినామీని అని పిళ్లై అంగీకరిస్తాడు, స్కామ్ నిజమే అంటాడు… ఐఫోన్లన్నీ అందుకే ఫర్నేస్ చేశామనీ చెబుతాడు, అదంతా ఓ స్కామ్ అని సీబీఐ, ఈడీ దర్యాప్తులో నిజాలు వెల్లడవుతున్నాయి… మరి ఆ దర్యాప్తు ధర్మమా […]

సత్తిబాబు 2 పుస్తెలూ కట్టేశాడు… ఆ ప్రాంత గిరిజనం తరలివచ్చి ఆశీర్వదించింది…

March 10, 2023 by M S R

bride

మూడు రోజులుగా ఈ వార్తను ఫాలో అవుతుంటే… ఈరోజు వార్తల్లోని చివరి వాక్యం ఇంట్రస్టింగుగా ఉంది కనెక్ట్ అయిపోయింది… ఆ వాక్యం ‘‘ఈ పెళ్లి కోసం చుట్టుపక్కల నుంచి గిరిజనం విశేషంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు..’’ ముందుగా ఈ వార్త ఏమిటో సంక్షిప్తంగా… భద్రాచలం ఏరియాలో చర్ల మండలం, ఎర్రబోరు గ్రామం… సత్తిబాబు (ఎస్టీ) ఇంటర్ చదువుతున్నప్పుడు స్వప్న అనే అమ్మాయిని ప్రేమించాడు… ఆ ప్రాంత గిరిజన సంప్రదాయంలో అమ్మాయిని పెళ్లికి ముందే ఉంచేసుకోవచ్చు… సారీ, […]

Laila… చెరగని అదే నవ్వు… ‘శబ్దం’తో వెండితెరపైకి రీఎంట్రీ… నిశ్శబ్దంగా…

March 10, 2023 by M S R

laila

లైలా… ఈ పేరు వినగానే నాటి ఎగిరే పావురమా సినిమా గుర్తొస్తుంది… ఆమె ముగ్ధమైన నవ్వు గుర్తొస్తుంది… 42 ఏళ్ల లైలా నవ్వు ఇప్పటికీ అలాగే ఉంది… నిజానికి పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఉండి… కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన పాన్ ఇండియా స్టార్… కానీ ఒక్కటంటే ఒక్కటీ మంచి పాత్ర పడలేదు ఆమె కెరీర్‌లో… సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలిక… గోవాలో పుట్టిన ఈమె 1996 నుంచి 2006 వరకూ చెప్పుకోదగిన […]

  • « Previous Page
  • 1
  • …
  • 339
  • 340
  • 341
  • 342
  • 343
  • …
  • 371
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…
  • పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…
  • నీ నల్లకోటు పుస్తకంలో కథలు చాలా బాగున్నయ్ మిలార్డ్…
  • ఎంత తేడా..? కేసీయార్ జనంలోకే రాడు… రేవంత్ మాత్రం పూర్తి భిన్నం..!!
  • అవ్‌ గణేశా… ఇంకొన్నొద్దులు ఇక్కడే ఉండిపోరాదు ప్లీజ్..!!
  • అది ఫాస్ట్ బ్రేక్..! ఉప్మాను ఏమైనా అంటే మర్యాద దక్కదు సుమీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions