అగ్గి పుట్టిస్తా… గాయిగత్తర చేస్తా…. వంటి మాటలు విన్నాం, సారు గారు ఓ పెద్ద బలగాన్ని వెంటేసుకుని ఢిల్లీ వెళ్లారు, వచ్చారు… సమయానికి అగ్గిపెట్టె దొరకలేదు… అసలు రైతుసంఘాల్నే కలవలేదు, మంత్రులతో భేటీ లేదు, తీరా ఆ రైతునేత హైదరాబాద్ వచ్చి సారుకే సురకలు పెట్టి పోయాడు…… మరోవైపు ఫీల్డులో టీఆర్ఎస్ మీద విపరీతమైన ప్రెజర్ పడుతోంది… రైతులకు అన్నీ అర్థమవుతున్నయ్… యాసంగి వరిని కేంద్రం కొంటుందా లేదా తరువాత సంగతి, ఈ వానాకాలం పంట మొత్తాన్ని […]
సో వాట్..? కత్రినా, విక్కీల పెళ్లి అంత గ్రేటా..? దేవుడు కూడా అలుసేనా..?
నిజానికి ఇందులో విక్కీ, కత్రినాల తప్పేమీ లేదు… మస్తు డబ్బుంది, కీర్తి ఉంది, సాధన సంపత్తి ఉంది, చిటికేస్తే చాలు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి… అదేదో సినిమాలో శ్రీదేవితో వెంకటేష్ అంటాడు కదా… కో అంటే కోతి, దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి… వాళ్లిద్దరూ కో అన్నారు… ఇంకేముంది..? వాళ్ల పెళ్లికి వేదికగా మారిన సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్ హోటల్ ఓవరాక్షన్‌కు దిగింది… ఇక ప్రపంచంలో ఎవరికీ పెళ్లే కానట్టు, ఇంతకుమించిన ఘనమైన పెళ్లి […]
సుధీర్ నిష్క్రమణ ప్రచారంపై… ‘జబర్దస్త్’ మార్క్ స్కిట్‌తో కౌంటర్…
మొత్తానికి మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి తనే స్వయంగా రంగంలోకి దిగి, సుడిగాలి సుధీర్ ఇష్యూను సెట్ చేసుకున్నట్టున్నాడు..! ఈమధ్య చాలా ప్రచారం జరిగింది కదా, జబర్దస్త్‌ను సుధీర్ విడిచివెళ్లిపోతున్నాడు, తనతోపాటు ఇక ఆ టీం కూడా డిస్టర్బ్ కాబోతుంది అని..! తనకు సినిమాలతో బిజీ, అందుకే టైం ఇవ్వలేకపోతున్నాడు, అందుకే వదిలేస్తున్నాడు అని ఫేక్ వార్తలు వచ్చాయి… కానీ సుధీర్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా జబర్దస్త్ విడిచిపెట్టేరకం కాదు… తనకే కాదు, కమెడియన్లందరికీ జబర్దస్త్, టీవీ కామెడీ […]
భజన చేయకపోతే బహుపరాక్… బంగాళాఖాతంలోకి విసిరేస్తాం…
ఎమర్జన్సీ… ప్రభుత్వ వ్యతిరేక వార్త అనిపిస్తే చాలు, జర్నలిజంతో ఏమాత్రం టచ్ లేకపోయినా సరే అధికారులు రంగంలోకి దిగేవాళ్లు… కత్తి కట్టేవాళ్లు, సెన్సార్ అనేవాళ్లు, కొరడా పట్టుకునేవాళ్లు, ఒరేయ్, నీ పత్రిక రావాలని లేదా అని బెదిరించేవాళ్లు, జైళ్లోకి వెళ్లాలని ఉందా అని కూడా మెడ మీద కత్తి పెట్టేవాళ్లు… దేవుడా అనుకుంటూ సదరు పత్రికలు వాటికి బ్లాక్ చేసి, పత్రికల్ని రిలీజ్ చేసేవి… అంతే… పత్రికలపై సెన్సార్ అంటే అలాగే ఉండేది… తెలంగాణలో ఒకరకం ఎమర్జెన్సీ… […]
గంధదగుడి..! పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ కన్నీళ్లు… ఏమిటా కథ..?!
పునీత్ రాజకుమార్ అలియాస్ అప్పు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు… తన డ్రీమ్ ప్రాజెక్టు గంధదగుడి టీజర్‌ను రిలీజ్ చేశారు… ఇది పునీత్ సొంత సినిమా… నిజానికి నవంబరులోనే రిలీజ్ కావల్సిన సినిమా… అప్పు హఠాన్మరణంతో ఆగిపోయింది… వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, దర్శకుడు అమోఘవర్ష కూడా ఈ సినిమాలో నటించాడు, షూటింగ్ చాలావరకూ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు అప్పు చనిపోయాడు… ఇప్పుడిక సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు… అప్పు చివరి సినిమా కాబట్టి సహజంగానే […]
వేల కోట్లు..! మన డబ్బే విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది..!!
స్వదేశీ కంపెనీ అయితే… ఇక్కడ సంపాదించిన ప్రతి పైసా మళ్లీ ఇక్కడే ఏదో ఓ రంగంలో ఇన్వెస్ట్ చేయబడుతుంది… అది ఈ దేశ ఎకనమిక్ యాక్టివిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది… అంటే ఇక్కడే వినియోగించబడుతుంది… కానీ విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు అయితే..? ఇక్కడి సహజ వనరులు, ఇక్కడి మానవ వనరులతో ఇక్కడే డబ్బు సంపాదించి, ఆ డబ్బును తమ దేశాలకు తరలించుకుంటాయి… అవి ఆ దేశాల ఎకనమిక్ యాక్టివిటీకి దోహదపడుతుంది… సో, ప్రభుత్వాలు ఉచితంగా ఎకరాలకొద్దీ జాగా […]
మన మీడియా కుయ్యోమొర్రో… గూగుల్-ఫేస్బుక్ దున్నేసుకుంటున్నయ్..!!
కరోనా భయాలు, లాక్ డౌన్లు, థియేటర్ బందులు, స్టే హోమ్ ఇబ్బందులు, ఫంక్షన్ల రద్దులు, సోషల్ గ్యాదరింగుల ఆంక్షలు… ఇవన్నీ జనాన్ని ఎటువెైపు నెట్టాయి..? కంప్యూటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఓటీటీల వైపు జనం మళ్లిపోయారు… ఫలితంగా జనం వాడే బ్రాడ్‌బ్యాండ్ పెరిగింది… టైమ్ పెరిగింది… దీని రిజల్ట్ ఏమిటంటే..? గూగుల్, ఫేస్బుక్ మరింత పాతుకుపోయాయి… 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి ఇండియా ఆదాయం ఎంతో తెలుసా..? 23,215 కోట్లు…! 29 శాతం […]
తెలుగు దర్శకులకు బాలయ్య సవాల్… కమాన్ నేను రెడీ అంటున్నాడు…
అఖండమైన ఉత్సాహంతో ఉన్నాడు బాలయ్య… ఇన్నాళ్లు ఫ్లాపుల వైరాగ్యం మొత్తం పోయింది… అఘోరా శివతాండవానికి బాక్సులు బద్దలవుతున్నయ్… ఎస్, బాలయ్యకు శాతకర్ణులు, కథానాయకులు, మహానాయకులు పనికిరారు… అఘోరాలే కరెక్టు అని తేలిపోయింది… (నిజానికి శాతకర్ణి వంటి సబ్జెక్టు ప్రస్తుత తెలుగు హీరోల్లో ఎవరికీ చేతకాదు… అంతేకాదు, అఖండ పాత్ర కూడా…) ఈ ఉత్సాహపు ఊపులో దర్శకులకు, నిర్మాతలకు ఓ సవాల్ వంటిది విసిరాడు… ‘‘నేను విలన్‌గా చేస్తాను’’ ఇదీ ఆ ప్రకటన… ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో […]
భారతీయ సినిమా తెర మీద… అత్యంత ఖరీదైన పందెంపుంజు…
గత కొద్దిరోజుల్లో కాస్త ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా వార్త… ప్రాజెక్ట్ కె..! ఆ సినిమా షూటింగు కోసం హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ దీపిక పడుకోన్‌కు సినిమా యూనిట్ పసుపు, కుంకుమ, గాజులతో స్వాగతం చెప్పారనే పాయింట్ కాదు… ఆమె వాటిని పెద్దగా పట్టించుకోదు కూడా… కాకపోతే సినిమాకు భిన్నమైన ప్రచారం దక్కాలంటే ఇలాంటివేవో చేయాలి కదా మరి… ఇంకా సరదాగా చెప్పుకోవాలంటే బహుశా ఆ స్వాగతం దీపికకు బదులు కంగనా రనౌత్‌కు సరిగ్గా సూటయ్యేదేమో… సినిమా […]
ఇది అఖండ రివ్యూలకు మరోకోణం… పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి…
మొత్తానికి బాలయ్య ప్రకంపనలు సృష్టిస్తున్నాడు… ఇప్పట్లో ఈ రణగొణ ధ్వని ఆగదు… నేను చెప్పేది కలెక్షన్ల గురించి కాదు, ఈ సినిమా చుట్టూ అల్లుకున్న, అల్లబడుతున్న వివాదాల గురించి… బాలయ్య బ్రీడ్, బ్లడ్ కమ్మ, టీడీపీ కాబట్టి కొందరికి నచ్చదు, సినిమా చూడకుండానే తిట్టేస్తుంటారు, ఇంకా ఈ ముసలోళ్ల పైత్యం ఎన్నాళ్లు అని వేరే సాకుతో ట్రోల్ చేస్తుంటారు… సినిమాలో హిందుత్వను ప్రమోట్ చేసినట్టుగా కథ సాగుతుంది కాబట్టి ఇక నాస్తికవాదులందరూ పెద్దపెట్టున శాపనార్థాలకు దిగారు… అయ్యో, […]
ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
కార్యకారణ సంబంధం… ఎక్కడో ఓ గడ్డిపోచ ఇటు నుంచి అటు పడిపోయిందంటే దానికీ ఓ కారణం ఉంటుంది, ఎక్కడో ఏదో ప్రభావం ఉండి ఉండవచ్చు… లేదా ప్రభావం వల్ల కావచ్చు… దేన్నీ తేలికగా తీసుకోవద్దు… సెప్టెంబరు 11… అమెరికాను కుదిపేసిన జంట టవర్ల ధ్వంసం సంఘటన అందరికీ తెలిసిందే… ఆ చేదు అనుభవాల నుంచి, భయాల నుంచి కాస్త తేరుకున్నాక, గతంలో ఆ టవర్లలో ఓ పెద్ద ఆఫీసు నడిపించిన కంపెనీ ఏం చేసిందంటే… ఆ విలయం […]
రోశయ్యను కులమూ వదిలేసిందా..? నిజం నిష్టురంగానే ఉంటుంది మరి..!!
ఒక కాకి చనిపోతే… వందల కాకులు గుమిగూడతయ్… ఉమ్మడిగా కన్నీళ్లు పెట్టుకుంటయ్… అది కాకుల్లో కూడా కనిపించే సంస్కారం… జాతి సంస్కారం అనాలి దాన్ని..! అలాగే భారతీయ సమాజంలో కులం అనేది ఓ రియాలిటీ… కులం ప్రభావం లేని రంగం లేదు… అంగీకరించాల్సిన నిజం… ఎవరొచ్చినా రాకపోయినా ఓ మనిషి మరణిస్తే, అదీ ఆ కులానికి ఓ లెజెండరీ ఐకన్‌గా ఉన్న వ్యక్తి దూరమైతే… అప్పటిదాకా రకరకాల లబ్ది కోసం ఆయన చుట్టూ తిరిగి, ప్రదక్షిణలు చేసి, […]
హఠాత్తుగా సెలబ్రిటీ హోదా… గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదు…
ఈమధ్య కొన్ని ఆసక్తి కలిగించే కేసులు పోలీసుల వద్దకు వస్తున్నయ్, వింటున్నం, చదువుతున్నం కదా… పైపైన చదివితే ఇదీ అలాగే అనిపిస్తుంది… కానీ దీంట్లో మనకు మనస్సు చివుక్కుమనిపించే అంశం ఉంది… ముందుగా విషయం చెప్పుకుందాం… బెంగాల్లో బిర్భూమ్ (వీరభూమ్) అనే ఓ పల్లెటూరు… అక్కడ భుబన్ బద్యాకర్ (భువన్) ఓ వీథివర్తకుడు… పచ్చి పల్లికాయ (వేరుశెనగ)ను హోల్‌సేల్‌గా కొనుక్కుని, తేలికపాటి మోపెడ్‌పై వేసుకుని ఊళ్లు తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటాడు… డబ్బుల్లేకపోతే విరిగిపోయిన సెల్ఫోన్లు, వాడకుండా పక్కన […]
సాక్షి ప్లస్..! వారానికి ఓ పేజీ మైనస్..! మరెందుకు ఈ డిజిటల్ ఎడిషన్..?!
ఈరోజు సాక్షి పేపర్ చూశారా… అబ్బ, ఆ వార్తలు, వాటిల్లోని గొప్ప క్వాలిటీ గురించి కాదు, దాంట్లో చెప్పుకోవడానికి ఏమీలేదు… అక్కడ భజన, ఇక్కడా భజనే… నమస్తే సాక్షి… అది కాదు, కొన్నిరోజులుగా సాక్షి ప్లస్ అని ఓ డిజిటల్ ఎడిషన్ కనిపించేది… మొదట్లో నాలుగు పేజీలు కనిపించేవి… ప్రింట్ ఎడిషన్‌లో కవర్ చేయలేక, వదిలేయలేక, స్పేస్ లేక, అంతలేసి జీతాలతో పెట్టుకున్న రిపోర్టర్లు రాసిన వార్తలు ఏం చేయాలో తెలియక ఆ సాక్షి ప్లస్ డిజిటల్ […]
రోశయ్యకు తగిన నివాళి దక్కిందా..? మీడియా ధోరణి కరెక్టేనా..?
నిజమే… ఏదో ఓ సోషల్ పోస్టులో చదివాం కానీ… ఒక సిరివెన్నెల మరణిస్తే మీడియా ఇచ్చిన కవరేజీకి, ఒక రోశయ్య మరణ కవరేజీకి నడుమ తేడాను చూడటం కరెక్టు కాదు… ఇద్దరూ వేర్వేరు… రంగాలు వేరు, ప్రావీణ్యతల తీరు వేరు, అసలు పోలికే లేదు… కానీ మీడియా పోకడల్ని ఓసారి అవలోకించడానికి పనికొచ్చే ఉదాహరణ ఇది… నిజానికి మీడియాకు ఏం కావాలి..? పది మందీ చూడటం కావాలి, రేటింగ్స్ రావాలి, తద్వారా యాడ్స్ కావాలి, దాంతో డబ్బు […]
ఈనాడు డౌన్ ఫాల్ సరే… ఈటీవీ కూడా అదే బాటలో…! ఎందుకిలా…?!
ఈసారి బార్క్ వాడి రేటింగ్స్ పరిశీలిస్తుంటే… ఓ పాయింట్ ఇంట్రస్టింగుగా అనిపించింది… దేశం మొత్తమ్మీద సన్ టీవీ టాప్… నంబర్ వన్… కానీ తెలుగులో ఆ గ్రూపు చానెల్ జెమిని అట్టర్ ఫ్లాప్… ఎప్పుడైనా ఏదైనా కొత్త సినిమా ప్రసారం తప్ప, ఇక మిగతా ఏ విషయంలోనూ ఇదొక చానెల్ ఉన్నట్టుగా కనిపించదు… అంత ఘోరమైన పర్ఫామెన్స్… ఎక్కడ కొడుతోంది తేడా..? టీం వైఫల్యమా..? యాజమాన్యానికే తెలుగు మీద ఇంట్రస్టు లేదా..? ఎందుకలా భ్రష్టుపట్టిపోయింది..? ఇదే ఆలోచిస్తుంటే […]
సైబర్ రేప్స్..! ఈ సోషల్ పిశాచాలు చిన్నారులనూ వదలడం లేదు..!!
సోషల్ మీడియా ట్రోలర్స్ ఓ పిశాచజాతి… దానికి ఉచ్చంనీచం, మంచీచెడూ, నీతి-రీతి వంటివేమీ ఉండవు… నిలువెల్లా ఉన్మాదం నింపుకుని, ఫేక్ ఐడీలతో రకరకాల బూతులతో, హీనమైన బెదిరింపులతో దాడి చేసే ఓ రాక్షసగణం అది… సెలబ్రిటీలే కాదు, ఈ ప్రేత గణం ఎవరినీ వదిలిపెట్టదు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కరోనాలో డెల్టా వేరియంట్..!! రీసెంటుగా మీడియాలో పెద్దగా చర్చకు రాని విషయం ఒకటుంది… అది అభిషేక్ బచ్చన్ ఆక్రోశం… ఎందుకంటే..? ఈమధ్య అభిషేక్, ఐశ్వర్యల జంట […]
ప్రియాంక అలియాస్ పింకీ ఔట్…! లక్కీగా కాజల్, సిరి బతికిపోయారు..!!
బిగ్‌బాస్ సీజన్ ముగింపుకొస్తోంది… హీట్ పెరుగుతోంది… తాజాగా ప్రియాంక అలియాస్ పింకీ ఎలిమినేట్ అయిపోయింది… బిగ్‌బాస్ టీం మరో జంటను విడదీసింది… టికెట్టుఫినాలె పోటీలో శ్రీరాంచంద్రతో ఓడిపోయిన మానస్‌కు ఇది ఇంకో షాక్… ఇప్పుడిక మిగిలింది ఆరుగురు… ఆ వెగటు రొమాన్స్ పండిస్తున్న సిరి, షన్ను జంటను వోట్లతో సంబంధం లేకుండా హౌజు బయటికి తన్ని తరిమేస్తే బాగుండునని ప్రేక్షకజనం కోరుకుంటున్నారేమో గానీ, షన్ను అంటే బిగ్‌బాస్ టీంకు మస్తు లవ్వు… ఆ షన్ను తోక సిరి […]
కథ అదుపు తప్పి… ఎక్కడో కూలిపోయిన స్కైలాబ్… నిత్యా, బ్యాడ్ లక్…
త్వరలో చచ్చిపోతాం అనే భావన మనిషిలో విపరీతమైన మార్పులకు దారితీస్తుంది… ఒక కుదుపు… కరోనా మరణాల సీజన్లో చూశాం కదా… ఎన్ని ఉద్వేగాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని బాధాకర అనుభవాలు… కుటుంబాలకు కుటుంబాలే కుప్పకూలాయి… కరోనా విపత్తు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఫార్మా మాఫియా విశ్వరూపం, ఆసుపత్రుల నిలువుదోపిడీ… బంధాలు కకావికలం… అలాంటిది ఒక ఊరు, ఒక సమాజం, ఒక ప్రాంతం ధ్వంసం అయిపోతుంది అంటే అప్పుడు చెలరేగే ఎమోషన్ల మాటేమిటి..? ఉంటామో, పోతామో అన్నట్టుగా… ఉన్నప్పుడే తిందాం, […]
‘స్మార్ట్’గా బుక్కయిపోతున్నం… ప్రైవసీ ఓ భ్రమ… మన కాల్స్ కూడా ఓపెన్…
ఒక కొత్త నంబర్ ఫోన్లో సేవ్ చేసుకున్నా… తరువాత కాసేపటికే ఆ పేరు, అకౌంట్ ఫేస్బుక్లో ‘people you may know’ జాబితాలో పదే పదే కనిపించింది… ఈమధ్య ఏదో పని అవసరమై ఒక వ్యక్తితో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది… అంతకుముందు పరిచయం కూడా లేదు… ఆ వ్యక్తి పేరు, అకౌంట్ ఫేస్బుక్ ‘యు మే నో’ జాబితాలోకి వచ్చేసింది… ఏదైనా ఊరికి వెళ్తున్నారా..? మీకు ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు సమీపంలోని మిత్రుల వివరాలు అందుతూనే ఉంటయ్… […]
- « Previous Page
- 1
- …
- 353
- 354
- 355
- 356
- 357
- …
- 449
- Next Page »