వడ్లను రైళ్లలో, వెయ్యి లారీల్లో తీసుకుపోయి ఇండియా గేట్ ముందు పారబోయాలి… నిన్నటి కేసీయార్ ఫామ్ హౌజులో అర్జెంటుగా సాగిన మంత్రుల భేటీలో ఈ నిర్ణయం మీద చర్చ జరిగిందట… ఢిల్లీని నెలల తరబడీ ముట్టడించి, చివరకు మోడీతో క్షమాపణలు చెప్పించుకున్న రైతులకు కూడా ఇలాంటి నిరసన ఆలోచన రాలేదు… అదీ మరి కేసీయార్ అంటే..? ఓ బృందంగా వెళ్లి అర్జెంటుగా మోడీని కలిసి, ఏయ్, యాసంగి వడ్లు కొంటవా కొనవా అని నిలదీయాలనేది మరో ఆలోచన… […]
పంటి కిందికి పలుగురాళ్లు… ఎస్పీ బాలు మహా బాగా చెప్పాడు…
నిన్న మనం ఓ పాట గురించి మాట్లాడుకున్నాం… ఊత్తుకాడు వెంకటసుబ్బ అయ్యర్ రాసిన అలై పొంగెరా గీతాన్ని వేటూరి అబ్బురంగా అనువదించిన తీరు గురించి… గాదిలి పదాన్ని కాదిలి అనే గాయకులు పాడటం, దానికి కారణం గట్రా చెప్పుకున్నాం కదా… ఇంత పాపులర్ గీతం కదా, ఏ స్వరాభిషేకంలోనో, ఏ పాడుతా తీయగా షోలోనో ఎస్పీ బాలు వివరణలు, సందేహనివృత్తులు ఏమైనా ఉన్నాయేమో అని వెతికితే… ఎప్పటిదో పాడుతా తీయగా వీడియో కనిపించింది… తను చెప్పిన కొన్ని […]
దర్శకుడికి స్వేచ్ఛనిస్తాడు- తను కాంప్రమైజ్ కాడు… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…
ఈనాడు రామోజీరావు దేన్నీ అర్ధమనస్కంగా చేయడు… పూర్తిగా ఎఫర్ట్ పెడతాడు, దృష్టి కేంద్రీకరిస్తాడు… అందుకే ఉషాకిరణ్ మూవీస్ మొదట్లో తీసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి… తరువాత ఆయన పట్టించుకోవడం మానేసేసరికి ఆ సంస్థను భ్రష్టుపట్టించారు ఆయన నమ్మినవాళ్లు… చివరకు ఆ బ్యానర్ కింద సినిమాలే మానేశారు… సినిమా ఆర్టిస్టుల ఎంపిక దగ్గర నుంచి ఆర్ఆర్ దాకా ఆయన ప్రతిదీ పరిశీలించేవాడు మొదట్లో… మొన్నామధ్య చెప్పుకున్నాం కదా, ప్రేమించు-పెళ్లాడు సినిమాకు రాజేంద్రప్రసాద్ హీరోగా మొదట్లో వద్దన్నాడు ఆయన… డైరెక్టర్ […]
ఆహా… ఊత్తుక్కాడు వెంకట కవి – ఊపిరులూదే వేటూరి కవి… స్వరసౌభాగ్యం…
……….. By…. విప్పగుంట రామ మనోహర అలై పాయుదే కన్నా… అలై పొంగెరా కన్నా. సఖి సినిమాలోని పాటగానే చాలా మందికి తెలుసు. ఊతుకాడి వెంకట సుబ్బయ్యర్ కవి రాసిన కృతిగా సంగీతాభిమానులకి తెలిసి ఉంటుంది. నాకు తెలీదు. పోయిన వారం ‘ఆహా’ లో తెలుగు ఇండియన్ ఐడల్ లో వాగ్దేవి అనే సింగర్ ఈ పాట పాడి జడ్జిల ప్రశంసలు అందుకుంది. ఆ ఎపిసోడ్ చూశాక అలై పొంగెరా లిరిక్స్ కోసం వెదికా. వేటూరి రాసిన పాట. […]
కార్తీకదీపం బండిని లాగాల్సింది ఇక వీళ్లిద్దరే… ఇంతకీ వీళ్లెవరో తెలుసా..?!
భయపడకండి… అస్సలు కార్తీకదీపం కథ గురించి చెప్పబోవడం లేదు… మీరు మరీ అంతగా ఠారెత్తిపోవాల్సిన అవసరమూ లేదు… కానీ 1300 ఎపిసోడ్లుగా కోట్లు కొల్లగొడుతున్న సీ-రి-య-ల్ గురించి కొన్ని వివరాలు చెప్పుకోకపోతే ఎలా..? సో, లోతుల్లోకి పోవడం లేదు… కానీ మోనిత పాత్రలోని శోభాశెట్టి, దీప పాత్రలోని ప్రేమీ విశ్వనాథ్ నిజంగానే ప్రతి తెలుగింటికీ ఆడపడుచులయ్యారు… ఆ పాత్రల కేరక్టరైజేషన్ చెత్త… కానీ ఆ ఇద్దరూ మంచి నటన కనబరిచారు… రియల్లీ… మొదట్లో బాగా నటించిన ప్రేమీ […]
తెలుగు పాత్రికేయంలో రిపోర్టర్లే కాదు… మేనేజర్లూ అలాగే తయారయ్యారట…
నిన్నటి నుంచీ తెగ హల్చల్ చేస్తోంది ఒక వాట్సప్ మెసేజ్… అంత పెద్ద సందేశం అవసరం లేదు గానీ, సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే… *ఈనాడులో పెద్ద తలకాయ మీద వేటు * పక్కా ఆధారాలతో దొరికిపోయిన మేనేజర్ శ్రీనివాసులు నాయుడు * అనంతపురం జిల్లా యాడికి మండలంలో రూ.కోటితో బంగ్లా నిర్మాణం * తిరుపతి యూనిట్ లో పెద్దల్ని ప్రసన్నం చేసుకుని పదేళ్ల పాటు మేనేజర్ గా కొనసాగింపు * పదుల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి బయటికి […]
మర్రిచెట్టు అరెస్ట్… 120 ఏళ్లుగా బేడీలతోనే… ఇలాగే ఓ బెంచీ కథ కూడా…
కొత్తగా ఓ ఆర్మీ క్యాంప్ కమాండర్ నియమితుడయ్యాడు… తన పరిధిలోని అన్ని విభాగాలు, ప్రాంతాలు తనిఖీ చేస్తున్నాడు… ఓ బెంచీ దగ్గర ఇద్దరు సైనికులు తుపాకులు పట్టుకుని కాపలా ఉన్న దృశ్యం గమనించాడు… దీనికి భద్రత దేనికి అని అడిగాడు… ‘‘సర్, మాకు తెలియదు, మాజీ కమాండర్ కాపలా ఉండమన్నాడు, ఉంటున్నాం, ఇది ఓ సంప్రదాయం అట…’’ అని బదులిచ్చారు వాళ్లు… . ఈ కమాండర్‌కు ఆశ్చర్యమేసింది… పాత కమాండర్ ఫోన్ నంబర్ కనుక్కుని కాల్ చేశాడు… […]
విషమ సమస్యలెన్నో విడిచి… ఈ పెట్టీ ఇష్యూస్‌పై ప్రజాసంఘాల పోరాటాలా..?
కామ్రేడ్స్.. కమాన్.. వీటికి బదులివ్వండి.. ! సుదీర్ఘ ఉద్యమ చరిత్ర, ఒకానొక దశలో ఈ దేశ రాజకీయాలనే శాసించిన శక్తివంతమైన ‘ఎర్ర’ జెండా ఇప్పుడు ఎక్కడ ఉన్నది.? ఏ స్థితిలో ఉన్నది..? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఎదిగిందో.. ఎలా పడిపోయిందో తల్చుకుంటే బాధేస్తున్నది, జాలేస్తున్నది. ఎందుకంటే.. నా కాలేజీ రోజుల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా పనిచేసినోడిని కాబట్టి..! నేనూ ఒకప్పడు ఆ ఎర్ర జెండాను మోసినోడిని కాబట్టి..!! నా ఇంటిపై ఆ జెండాను సగర్వంగా ఎగరేసినోడిని కాబట్టి..!!! […]
హేమిటో… ఆవకాయ, కేక్ అండ్ వైన్ కూడా వేర్వేరు మతాల గుర్తింపు చిహ్నాలా..?
కాస్త నవ్వొచ్చింది… సినీ మేధావులు తమను మించిన బుర్రలు లేవనుకుంటారు… వాళ్లు ఏవో ప్రవచనాలు వినిపిస్తారు… మీడియా మిత్రులు కళ్లకద్దుకుని, కలాలకు పదును పెట్టి భక్తిగా అచ్చేసి ప్రచారం చేస్తారు… మొన్న ‘అంటే సుందరానికీ’ అనే సినిమా తాలూకు హీరోయిన్ నజ్రియా ఫస్ట్ లుక్‌ను, వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు… టీజర్లు, ట్రెయిలర్లు, సాంగ్ రిలీజులు, వీడియో గ్లింప్స్, ఫస్ట్ లుక్, ప్రిరిలీజ్, ఆడియో రిలీజ… ఎన్నెన్ని ప్రచార మార్గాలో… నిజానికి ఎప్పట్నుంచో ఈ సినిమా వార్తల్లో […]
అమెరికా పుండు మీద పాకిస్థానీ కారం… దానికీ తత్వం తెలిసి వస్తోంది…
పార్ధసారధి పోట్లూరి….. పూరి జగన్నాథ్ సినిమా డైలాగ్ ఒకటి ఉంది “ రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను “ అని. కానీ పాకిస్థాన్ డైలాగ్ వేరే గా ఉంది “ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాను “ అని… తాజాగా అమెరికాలో పాకిస్థాన్ రాయబారిగా మసూద్ ఖాన్ ని నియమించింది. ఇది అమెరికాకి కాలే పుండు మీద ఉప్పు రాసినట్లుగా ఉంది. ఇంతకీ […]
ఫాఫం సాక్షి..! ఫాఫం జగన్..! నారా లోకేష్ స్పందిస్తే తప్ప నిద్రలేవలేదు…!!
ఫాఫం సాక్షి… ఫాఫం జగన్… వ్యర్థ కథనాలతో తెల్లారిలేస్తే బోలెడు జగన కీర్తనలు అచ్చేసే పత్రిక కొన్ని సందర్భాల్లో మాత్రం జగన్ వాయిస్‌లా మారలేక చతికిలపడుతోంది… జగన్ భజన తప్ప దానికి వేరే దిక్కులేదు, పత్రిక పెట్టుకున్నదే తన కోసం… దాని కేరక్టర్ అదే… దాగుడుమూతలు, పాత్రికేయ పాతివ్రత్యాలు కుదరవు… అదే ఆంధ్రజ్యోతి చూడండి, చంద్రబాబుకు ఓ కుడిభుజంగా పనిచేస్తోంది… పార్టీ నేతలకూ చేతకాని రీతిలో కష్టపడుతోంది… ఎటొచ్చీ సాక్షికే చేతకావడం లేదు… పెగాసస్… ఆమధ్య రచ్చ […]
కార్తీకదీపం..! వెక్కిరింపులతో ఓ రేంజులో ఆడుకుంటున్నారు నెటిజనం..!!
అప్పుడేం జరుగుతుందీ అంటే… సౌర్య ఆటోడ్రైవర్‌గా బతుకుతూ ఉంటుంది కదా… ఓసారి ఇద్దరు ముసలోళ్లు ఆటో ఎక్కడానికి వస్తారు… మొదట వాళ్లను సౌర్య గుర్తించదు… ఎప్పుడైతే వాళ్లు కార్తీక్, దీప అని గుర్తిస్తుందో అప్పుడు షాక్‌కు గురవుతుంది… బతికే ఉన్నారా అని విస్తుపోతుంది… వాళ్లేమో సౌర్యను గుర్తుపట్టరు… వాళ్లను కౌగిలించుకుని ఏడ్చేస్తుంది సౌర్య… తనెవరో చెబుతుంది… వాళ్లు షాక్… హిమను ద్వేషిస్తూ, ఇంటి నుంచి కోపంతో వచ్చానని చెబుతుంది… ‘‘మా కారు లోయలోకి దొర్లిపడింది, పడేముందు హిమను […]
రాహుల్, స్టాండప్ ఆన్ ది బెంచ్… సినిమా అంటే నీకు కామెడీ అయిపోయింది…
రాజ్ తరుణ్… మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు… షార్ట్ ఫిలిమ్స్‌తో వెలుగులోకి వచ్చి, కథానాయకుడు అయిపోయి, ప్రతి తెలుగింటికీ పరిచయమయ్యాడు… కానీ 9 ఏళ్లుగా కొట్టుకుంటున్నా సరే, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది… మొత్తం 15 సినిమాలు… సినిమా చూపిస్త మావ ఒకటి గుర్తొస్తుంది తన పేరు వినగానే… అదొచ్చి కూడా ఏడేళ్లయింది… ఇక సినిమాలు వస్తున్నయ్… పోతున్నయ్… ఫాఫం, తన తప్పేమీ లేదు, తన శక్తివంచన లేకుండా కష్టపడతాడు… కెరీర్‌పరంగా బ్యానర్లు, కథలు వంటి […]
ఏమోయ్ రాజమౌళీ… హాలీవుడ్ తారల్ని ఉంచావా..? కథలోనే పీకిపారేశావా..?!
హేమయ్యా రాజమౌళీ… ఓ కేపిటల్ అమరావతీ ప్లానరూ… సరే, జగన్‌ను కలిశావు, టికెట్ల ధరలు పెరిగినయ్… నీకు హేపీ… నువ్వు నీ సినిమా భారీ అని చెప్పడానికి 177 కోట్ల ఖర్చు చూపించావుట… నిజమేనా..? కాదు, కాదు, 350 కోట్లు చూపించాడు అని మరో వార్త… జీవో ప్రకారం హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషికాలు మినహాయించి అట…. అవునూ, హీరోలు, హీరోయిన్లు అనాలా..? లేక ఒకరే హీరో చూపించావా..? అయితే ఆ హీరో ఎవరు..? ఆ హీరోయిన్ […]
ఔనా… ఈ సినిమా వచ్చిందా తెలుగులో…. ఈటీవీకి భలే దొరుకుతున్నయ్…
బార్క్ రేటింగులు చూస్తుంటే ఓచోట దృష్టి చిక్కుబడిపోయింది… ఈటీవీలో ఆరో తారీఖు, ఆదివారం సాయంత్రం ప్రైమ్‌టైంలో ఓ సినిమా ప్రీమియర్ ప్రసారం అయ్యిందట… దాని పేరు యు అండ్ ఐ… మీరు చదివింది నిజమే… ఆ సినిమా పేరే అది… ప్రేమ, శృంగారం, ఆత్మహత్య అని ఇంగ్గిషులో ట్యాగ్‌లైన్… నిజమా..? ఆ పేరుతో ఓ సినిమా వచ్చిందా అనే డౌట్ రావడం సహజం కదా… నిజంగానే 2010లో వచ్చిందట… కార్తీక్ మ్యూజిక్, అనంతశ్రీరాం గీతాలు, దేవిశ్రీప్రసాద్ ఓ […]
ఇదీ ఓ వార్తేనా..? ఇది సరైన వార్తేనా..? ఆ అంబానీ మనమడు ఐతేనేం..!?
ఏది వార్త..? ఏది సరైన వార్త..? వార్త ఎలా ఉండాలి..? వార్త ప్రమాణాలు ఏమిటి..? ఈ ప్రశ్నలకు ప్రపంచంలో ఎవడూ సరిగ్గా జవాబులు, నిర్వచనాలు చెప్పలేడు… కీర్తనలే కథనాలుగా మారిన ఈరోజుల్లో మరీ కష్టం… ఒకప్పుడు పండితులు తమకు ఆశ్రయమిచ్చిన చక్రవర్తులు, రాజులను శ్లోకిస్తూ, భజిస్తూ, వాళ్లను విష్ణుస్వరూపులుగా చిత్రిస్తూ, రాజుల పట్ల ప్రజల్లో భయభక్తులు పెంచే రచనలు చేస్తూ, రాజుల కొలువులో ఇదే కొలువుగా చేస్తుండేవారు… ఇప్పుడూ అంతే… మనం అనుకుంటున్నాం, మారిపోయామని… నెవ్వర్… మరింత […]
స్వామివారు ప్రవచనాలు, ప్రసంగాలు మానేస్తే… అదే వైష్ణవానికి గొప్ప సేవ..!!
పురాణాల్లోని అనేకానేక అంశాలకు బాష్యం చెప్పడంలో, వివరణ ఇవ్వడంలో, సందేహ నివృత్తిలో ఉషశ్రీ పేరు చెబుతుంటారు… ఒక ప్రవచనం గురించి ఉదహరించాలంటే చాగంటి పేరు చెబుతుంటారు… అవధానం ప్లస్ ప్రవచనం గరికపాటి ఫేమస్… వీళ్లే కాదు, బోలెడుమంది ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుంటారు… అసలు దైవసంబంధ, మతసంబంధ అంశాల్ని అరటిపండు ఒలిచినోట్లో పెట్టినట్టుగా చెప్పడం ఓ కళ… పిట్టకథలు, సరస సంభాషణలు, చమక్కులు, నడుమ నడుమ పద్యాలు, పాటలు, రాగాలతో కొందరు భలే రంజింపజేస్తారు, రక్తికట్టిస్తారు… ఇప్పుడంటే హరికథల్లేవు […]
ధన్యజీవి పునీత్..! తన స్మరణ ఉద్వేగంలో ఊగిపోతున్న కర్నాటక..!!
ప్రతి థియేటర్లో 17 నంబర్ సీటు ఖాళీ ఉంచారు… ఎందుకు..? మరణించిన పునీత్ రాజకుమార్ వస్తాడు, ఆ సీట్లో కూర్చుని సినిమా చూస్తాడు అని..! అవును, కొన్ని ఉద్వేగాలకు రీజనింగ్ ఉండదు, అది అభిమానం, అంతే… కృత్రిమమైన అభిమానం కాదు, పునీత్ మీద కన్నడిగులు కనబరిచేది… ఆ అభిమానంలో స్వచ్ఛత కనిపిస్తుంది… తనను ఓ సినిమా నటుడికన్నా అంతకుమించి చూస్తున్నారు… చూశారు… తను మరణించి ఇన్ని రోజులవుతున్నా అదే అభిమానం… అదెలా వచ్చింది..? సగటు సినిమా హీరో […]
అమరావతి రాజధాని ప్లానర్ మీద జగన్ ప్రభువుల వారి అమితప్రేమ..!!
గతంలో చంద్రబాబు దుర్మార్గ, నీచ పాలన వల్ల ఆంధ్రా ప్రజలు చాలా పేదవాళ్లుగా ఉండేవాళ్లు… అష్టకష్టాలు పడేవాళ్లు… అంతెందుకు, ఆఫ్టరాల్ ఆ తెలుగు సినిమా టికెట్ ధరలను కూడా భరించే స్థితిలో లేని దుర్భర పేదరికం వాళ్లది… వాళ్లను ఉద్దరించడమే లక్ష్యంగా పనిచేసే జగన్ ప్రభుత్వం, నాన్సెన్స్, కనీసం సినిమాలు కూడా చూడలేని దురవస్థ దేనికి మనకు అనుకుంటూ… అత్యంత దయతో ఆ సినిమా టికెట్ల ధరల్ని తగ్గించింది… పేదల ప్రభుత్వం కదా… . కానీ అకస్మాత్తుగా […]
డియర్ శేఖర్ మాస్టర్… అబ్బే, అస్సలు నచ్చలేదు బాసూ… యాంటీ సెంటిమెంట్…
ఎవరేం తిట్టుకున్నా సరే… ఎవరెలా రిసీవ్ చేసుకున్నా సరే…. కొన్ని అంశాల్లో మరీ డిటాచ్డ్గా ఆలోచించలేం… మరీ తెలుగు ఇండస్ట్రీ మార్క్ లిబరల్లా ఆలోచించడం కుదరదు… బహుశా డాడీ, బిడ్డ బంధాన్ని అపూర్వంగా ప్రేమించే సంస్కృతిలో పెరిగినందుకు కావచ్చు… ప్రజెంట్ ట్రెండ్స్ జీర్ణం కాకపోవడం వల్ల కావచ్చు… ఇంకేమైనా కావచ్చు… ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ ఇద్దరూ అన్నాచెల్లెళ్లు… వాళ్లిద్దరి నడుమ మంచి అనురాగం ఉంది… తోడబుట్టిన చెల్లె పట్ల ఆయనకు అపారమైన సోదరప్రేమ ఉండేది… అయినా […]
- « Previous Page
- 1
- …
- 362
- 363
- 364
- 365
- 366
- …
- 483
- Next Page »