ఎవడో మూర్ఖుడు ఏదో అంటాడు… సకల అవలక్షణాలకూ ప్రతీకలు సివిల్ సర్వెంట్లు అని…. నాన్సెన్స్, వాడికి బుద్ధి లేదు… ఏదో ఫాదర్స్ డే కదా, తండ్రివంటి కేసీయార్ కాళ్లు మొక్కాడు, ఏదైనా శుభకార్యం జరుగుతుంటే పెద్దల కాళ్లు మొక్కడం మర్యాద కదా… అందుకే ఓ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కావచ్చు, ఓ కామారెడ్డి కలెక్టర్ శరత్ కావచ్చు… కేసీయార్ కాళ్లు మొక్కారు.. అంతే… అరె, అర్థం చేసుకోకపోతే ఎలా..? పెద్దలు అంటే… వయస్సులో మాత్రమే పెద్ద కావాలని […]
తన పేరే ప్రేమ్..! పేరుకు తగ్గట్టే ఆకాశమంత మానవప్రేమ… హేట్సాఫ్…!
డ్రగ్ మాఫియాలు, వేక్సిన్ మాఫియాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు… వాటికి డప్పు కొట్టే పాలసీలు, బ్యూరోక్రాట్లు… ఆర్టీపీసీఆర్ పరీక్ష దగ్గర్నుంచి చితిపై పేర్చేదాకా… మనుషుల ప్రాణాలతో సాగుతున్న దందా మొత్తం మానవత్వం మీదే విశ్వాసాన్ని చంపేస్తున్న వేళ… ఈ దుర్మార్గపు, దుర్గంధపు వాతావరణంలోనూ… కొందరు నిశ్శబ్దంగా కారుణ్యానికీ, ఔదార్యానికీ కొత్త ఎత్తులు చూపిస్తున్నారు… ఈ కరోనా విపత్తులో తమ హృదయాలు సంపూర్ణంగా తెరిచి ఆకాశమంత ప్రేమను పంచుతున్నారు… వినమ్రంగా ప్రణమిల్లడం తప్ప మనం ఇంకేం చేయగలం..? అది ఒక […]
‘‘జనం చెప్పులతో కొడతారు…’’ ఇంత మాటపడ్డాక కాంగ్రెస్ ఇప్పుడేం చేయాలి..?!
కాంగ్రెస్ పార్టీతో ఏదీ సజావుగా ఉండదు… ఏదైనా పెద్ద పార్టీకి తోకగా ఉంటే… అంటే తమిళనాడు తరహాలో… పెద్ద ప్రాబ్లం ఉండదు, అందరూ అన్నీ మూసుకుని కూర్చుంటారు… కానీ తమ మద్దతు మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంటే మాత్రం, ఎప్పుడూ కెలకడమే పని…! ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అంతే… శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం కదా… కాంగ్రెస్ మద్దతు లేకపోతే ఆ ప్రభుత్వం లేదు… మొన్నీమధ్య సీఎం ఠాక్రే వెళ్లి మోడీని కలిసివచ్చాడు… ఆంతరంగిక భేటీ… […]
నెవ్వర్… ఈ రేంజ్ నీచమైన ఇంటర్వ్యూ ఏ భారతీయ భాషల్లోనూ రాలేదు… పక్కా…!!
ప్రపంచంలో బహుశా ఇంత దరిద్రమైన ఇంటర్వ్యూ ఇప్పటివరకూ లేదేమో… తెలుగు వదిలేయండి, బహుశా విశృంఖలంగా సాగే కొన్ని భాషల ఇంటర్వ్యూలు, ట్రిపుల్ ఎక్స్ బాపతు చిట్‌చాట్‌లకు మించిపోయింది… అదే అరియానా, రాంగోపాలవర్మ ఇంటర్వ్యూ… వర్మ అనేవాడు ఇంకా జారిపోవడానికి ఏ లోతులూ లేవు అనుకునేవాళ్లకు కనువిప్పు… ఇంకా జారిపోవడానికి ఈ ప్రబుద్ధుడు (ఈ మాట కావాలనే రాయబడుతోంది ఇక్కడ… ఇంకా ఏమీ తిట్టలేక…)… కిందకు తవ్వుతూనే ఉన్నాడు… లేకపోతే ఆ ఇంటర్వ్యూ ఏమిటి..? అరియానాతో ‘భళా ఎంటర్టెయిన్మెంట్స్’ […]
ఓహ్… అశోకగజపతిపై జగన్ కక్షకు కారణం అదా..? జైలుపాలు చేసేస్తారా..?!
హమ్మయ్య… అశోకగజపతిరాజుపై జగన్ కక్షకు కారణమేమిటో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొత్తానికి చెప్పేశాడు… ఎందుకు ఆయన అన్న కూతురు సంచయితను తెర మీదకు తీసుకొచ్చి, ఆమెను ముందుపెట్టి కథ నడిపిస్తున్నారో కూడా స్పష్టం చేశాడు… ఏమిటయ్యా అంటే..? అప్పట్లో ఎర్రన్నాయుడు, గజపతిరాజు చేసిన ఫిర్యాదు మేరకు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందట… దర్యాప్తు చేసిన సీబీఐ జగన్‌ను, సాయిరెడ్డిని జైలులో పారేసిందట… అది మనసులో పెట్టుకుని… ‘రాజూ, నిన్నూ జైలుకు పంపిస్తాం’ చూడు అన్నట్టుగా కక్ష ప్రదర్శిస్తున్నారట… త్వరలో […]
జగన్‌కు కేసీయార్ భారీ సర్టిఫికెట్టు..! ఇంతకీ ఏడేళ్లలో తనేం చేసినట్టు మరి..?!
‘‘జగన్ మూర్ఖుడు… తండ్రి రాజశేఖరరెడ్డిని మించిపోయాడు… అక్రమ ప్రాజెక్టుల్ని కట్టి మన నీళ్లు ఎత్తుకుపోతున్నాడు…’’…. నిజానికి కేసీయార్ జగన్‌ను తిట్టినట్టు కాదు… జగన్ నెత్తిన పాలు గుమ్మరించాడు కేసీయార్… జగన్ కోరుకునే ఇమేజీ కూడా అదే… కేసీయార్‌తో సైతం గొడవకు రెడీ, తన సీమ ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు అని కేసీయార్ ఓ సర్టిఫికెట్ ఇచ్చినట్టు..! అంటే జగన్‌ను ఏమీ అనకూడదా..? తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోతుంటే ఊరుకోవాలా..? కాదు..! జగన్ […]
కొన్నింటిలో చైనా వాడు గొప్పోడే… ఈ పది అంతస్థుల్ని ఎంతసేపట్లో కట్టారో తెలుసా..?!
నాసిరకం సరుకు అనగానే చైనా మాల్ అనేస్తుంటాం… నమ్మడానికి వీల్లేని బేమాన్ గుణం అనగానే చైనా గుణం అంటుంటాం… కానీ కొన్ని చైనా వాడే చేయగలడు… అంటే కరోనా వైరస్ వంటివి కాదు… భారీ నిర్మాణాలు, అత్యంత భారీ ప్రాజెక్టులకు క్లిష్టతరమైన ఆధునిక టెక్నాలజీని వాడి అబ్బురపరుస్తారు… పైగా వేగంగా, అడ్డంకుల్లేకుండా సాఫీగా, పర్ఫెక్ట్ ప్లానింగుతో పూర్తిచేసేస్తారు… బోలెడు ఉదాహరణలున్నయ్… ఇది చూడండి… 28 గంటల్లో అంటే దాదాపు జస్ట్, ఒక రోజుల్లో ఏకంగా పది అంతస్థుల […]
ఫాఫం… ఒకప్పుడు ఎంతగా వెలిగిన జెండా… ఇప్పుడు వ్యక్తి సంకీర్తనలకు అడ్డా…
పాపం, సీపీఐ… ఒకప్పుడు తెలంగాణ విముక్తి కోసం, పీడితుల భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన పార్టీ… వాళ్ల అసలు లక్ష్యాలు ఏమిటీ, ఇండియన్ యూనియన్‌లో కలిశాక కూడా పోరాటం ఎందుకు చేశారో, తరువాత ఎందుకు విరమించారో చరిత్ర… వేరే చర్చ.,. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూస్తే నిజంగా జాలేస్తున్నది… తెలంగాణలో కాదు, మొత్తం దేశంలోనే అది ఆరిపోతున్న దీపం… కేరళ, తమిళనాడు గట్రా… ఎవడైనా ఎక్కడైనా రెండుమూడు సీట్లు దయతో ముష్టి విసిరేస్తే, […]
ప్రధాని కుర్చీ ఎక్కనేలేదు, చకచకా పీవీ షాకింగ్ డెసిషన్స్… ఐఎంఎఫ్ పాలన..!!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేయడానికి ఒకరోజు ముందే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..? మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా తీసుకోవడానికి అసలు తెరవెనుక శక్తులు వేరే పనిచేశాయా..? మన జీవితాల్ని, మన దేశ స్థితిగతుల్ని నిజంగా శాసించేది ఎవరు..? 1978 నుంచీ పలు జాతీయ పత్రికల్లో పొలిటికల్ రిపోర్టింగ్ చేసిన వెటరన్ రైటర్ పి.రామన్ దివైర్ సైటులో రాసిన ఓ వ్యాసంలో కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లు ఉన్నయ్… ఆ వ్యాసమంతా కాదు గానీ, కొన్ని సంక్షిప్తంగా, సరళంగా […]
ధనుష్ ఫ్యాన్స్‌కు కూడా ఉక్కపోత గ్యారంటీ… సీన్లన్నీ అరవ బిల్డప్పులే..!
మొన్నమొన్ననే కదా మనం ముచ్చటించుకున్నది… ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమాను ఏకంగా 17 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… అందులో విదేశీ భాషలూ ఉన్నయ్… నువ్వు గొప్పోడివిరా బాబూ అని చప్పట్లు కొట్టి హుషారు పెంచుకున్నమ్ కదా… ఫుల్లు గాలి నింపిన బెలూన్‌కు పిన్నీసుతో పొక్కకొట్టినట్టు… తుస్సుమనిపించాడు… ఇదేం సినిమారా నాయనా అని ఈసడింపుగా చూసేట్టు చేసుకున్నాడు… ఈ సినిమా సంగతి ముందే తెలుసు నిర్మాతకు, దర్శకుడికి, హీరోకు… అందుకే ధనుష్ పేరు చెప్పి, ఈమధ్య ఆయనకు […]
రోజూ బీభత్స భయానక వార్తలు… కానీ గణాంకాలు చూస్తే డిఫరెంట్ పిక్చర్…
థర్డ్ వేవ్ అని భయపెట్టేస్తూనే ఉన్నారు… ఎన్ని వేవ్స్ మీద ప్రచారాలు సాగుతాయో తెలియడం లేదు… ఒకవైపు అందరికీ బూస్టర్ డోసులు కంపల్సరీ అంటున్నారు… మరోవైపు రకరకాల రంగుల ఫంగసులు పుట్టుకొస్తున్నయ్… కరోనా అనంతరం సమస్యలూ దేహాల్ని పీడిస్తున్నయ్… కరోనా చికిత్సల ప్రోటోకాల్ నుంచి కొన్ని మందులు ఎగిరిపోతున్నయ్, కొన్ని కొత్తగా వచ్చి చేరుతున్నయ్… ప్రపంచమే ఓ పేషెంటుగా మారిపోయింది… ఇప్పట్లో ఏ ఆర్థిక వ్యవస్థా చక్కబడే స్థితి కనిపించడం లేదు… చైనా వాడి వైరస్ ప్రపంచాన్ని […]
అయ్యలో అయ్యలు… డ్రామా కంపెనీలో అప్పటికప్పుడు అదరగొట్టేశారు…
ఏమాటకామాట చెప్పుకోవాలి… మన తెలుగు టీవీల్లో కామెడీ మరీ నేలబారు… వికృతం… కానీ అప్పుడప్పుడూ కొన్ని ప్రేక్షకుడిని కనెక్టవుతున్నయ్… భిన్నంగా, ఉద్వేగంగా..! టీవీల్లో కామెడీ షోలను చూసే ప్రేక్షకులే ఎక్కువ… నాన్-ఫిక్షన్ రియాలిటీ కేటగిరీలో ఈ కామెడీ షోలకు వచ్చే రేటింగులే టీవీలకు కాస్త ఊపిరి… ఒక్కసారి తాజా స్థితి పరిశీలిస్తే… నాసిరకం కామెడీ అయినా ఈటీవీ ప్రధానంగా ఈ జానర్‌ను నమ్ముకుంది… ఢీ, క్యాష్, వావ్ వంటి షోలైనా సరే… డాన్సులు అనబడే పిచ్చి గెంతులకు, […]
పెళ్లి ఖర్చుకు కోత..! అతిథుల సంఖ్యకు సీలింగ్..! ఆదా డబ్బు ఏం చేశారంటే..?!
తమిళనాడు… తిరుప్పూర్… పి.అరుళ్ సెల్వం ఓ వ్యాపారి… రకరకాల ప్లాస్టిక్ సామాగ్రి, వాటర్ ట్యాంకులు గట్రా విక్రయిస్తుంటాడు… కొడుకు పేరు అరుల్ ప్రాణేష్… తండ్రి వ్యాపారంలో సాయం చేస్తుంటాడు… జి.అను అనే అమ్మాయితో పెళ్లి ఖాయమైంది… ఓ మ్యారేజీ హాల్ బుక్ చేశారు… మొత్తం 50 లక్షల దాకా పెళ్లి ఖర్చు అంచనా వేసుకున్నారు… పెళ్లి పనులు ప్రారంభించేశారు… పెద్ద కుటుంబం, పెద్ద సర్కిల్… పెళ్లికి వస్తారని అంచనా వేసుకున్న మిత్రులు, బంధుగణానికి భోజనాలు, ఇతర పెళ్లి […]
అడవిలో ఆడపులి..! భేష్, షేర్ని విద్యాబాలన్… గాండ్రించినవ్… వేటాడినవ్..!!
ఈ భూమి అన్ని జీవులదీ…. కాదు అంటాడు మనిషి… ఇది నాదే… అక్కరకొచ్చేవి, నా పంటికిందకు వచ్చే జంతువులు నా చెరువుల్లో, నా ఫారాల్లో, నా దొడ్లలో మాత్రమే పెరగాలి… క్రూర జంతువులు సైతం కూర జంతువులు కావాలి అంటాడు… అడవులు నరికేస్తూ ఉన్నాడు… ఈ మనిషి, ఇతర ప్రాణుల ఘర్షణ చూస్తూనే ఉన్నాం… చివరకు మనిషి తన తోటి ఆడమనిషిని సైతం సహించడు… అది (అవును, అదే) పక్కకొచ్చే పనికి కావాలి, ప్రతి పనికీ కావాలి, […]
మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
ముందుగా వార్త చదవండి… అవి రెండు మామిడి చెట్లు… ఉన్నవే ఏడు కాయలు… కానీ ఆ మామిడి కాయల ఓనర్ వాటి రక్షణకు ఏకంగా ఆరు వేటకుక్కలు, నలుగురు మ్యాంగో గార్డ్స్ పెట్టాడు… కిలోకు రెండున్నర లక్షల రూపాయల ధర పలికే ఈ మామిడి పళ్ల స్పెషాలిటీయే వేరు… అత్యంత అరుదైన రకం… అందుకే వాటి రక్షణకు ఇన్ని తిప్పలు, ఇంత ఖర్చు అంటూ నిన్న చాలామంది రాశారు, ఇంకా రాస్తూనే ఉన్నారు… ఇది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు […]
అయ్యా యోగీ… గంగలో దొరికిన ఆ శిశు శకుంతలకు నిజంగా కణ్వుడివి కాగలవా..?
మహాభారతంలో కుంతి తన అక్రమ (?) సంతానమైన కర్ణుడిని నదీప్రవాహంలో ఓ పెట్టెలో పెట్టి వదిలేసింది… ఆ పెట్టె ఏదో ఓ గట్టుకు చేరుతుందని, ఎవరో చేరదీస్తారని అనుకుంది… అదీ ప్రేమే..! అసలు ఆ శిశువు బతికే ఉండకూడదని అనుకుంటే ఎక్కడో పూడ్చి వేయించేది… ఆ కర్ణుడికి సమయానికి అతిరథ నందుడు అనే సూతుడు, రాధ అనే మంచి తల్లి దొరికింది… కాదు, వాళ్లకే తను దొరికాడు… కథ అలా సాగింది… దేశంలో చెత్త కుండీల్లో పడిన […]
ఆ రాజ్ సీతారామన్ ఏమయ్యాడు చివరకు..? అందరూ కరివేపాకును చేశారా..?!
ముందుగా ఓ పోస్టు చదవండి… తెలుగు ఇండస్ట్రీ వికీపిడియాట్రిస్టు Bharadwaja Rangavajhala రాశాడు… తరువాత ఇంకొన్ని సశేషాలున్నయ్… అవీ చెప్పుకుందాం… వార్ అండ్ పీస్ … ( బాలసుబ్రహ్మణ్యం- కృష్ణ)…….. టాలీవుడ్ వివాదాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్ లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్ కాంట్రోవర్షియల్ గా వెళ్లాలనే తపన […]
మమతను గిచ్చడానికేనా ‘ఉత్తర బెంగాల్’ చిచ్చు..? అసలేమిటీ రచ్చ..!!
కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయ్… లక్షద్వీప్‌లో కేంద్ర పాలన అంటే ఏమిటో రుచిచూపించబడుతోంది… ఇప్పుడు కొత్తగా ఓ డిమాండ్… పశ్చిమ బెంగాల్‌ను రెండుగా చీల్చి, ఉత్తర ప్రాంతాన్ని, అంటే ఉత్తర బెంగాల్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనేది ఆ డిమాండ్… సహజంగానే అది బీజేపీ నుంచి వస్తోంది… ఏయ్, ఎవడ్రా ఆ డిమాండ్ చేసేది, నాలుక కోస్తా, తాటతీస్తా అని మమత అప్పుడు ఫైరయిపోతోంది… అయితే అకస్మాత్తుగా బీజేపీ ఈ పాట ఎందుకు పాడుతోంది..? వివరాల్లోకి […]
రాజస్థానీ శివగామి..! మోడీకి అస్సలు మింగుడుపడని కేరక్టర్… తొవ్వ మారిపోతోంది…
ఆమె రాణి… రాజస్థాన్ అంటే తన రాణిస్థాన్ అనే భావిస్తుంది… మోడీ, నడ్డా, షా… ఎవరైనా సరే, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో వేలుపెట్టడానికి వీల్లేదు… ఆమె ఓ శివగామి… రాష్ట్ర పార్టీలో తను చెప్పిందే శాసనం అయి తీరాలంటుంది… రాజవంశం నుంచి వచ్చింది కదా, 68 ఏళ్ల వయస్సొచ్చినా… కాలం ఎంత మారిపోతున్నా ఆమెలోని రాచరికపు పోకడలు మాత్రం సేమ్… ఎల్కేఅద్వానీ వర్గం కాబట్టి మోడీ, అమిత్ షా ఆమెను పట్టించుకోవడం లేదు, పక్కకు నెట్టేసే ప్రయత్నం […]
రాబోయే రోజుల్లో వీజీగా 50 భాషల్లో రిలీజ్ చేస్తారేమో మన సినిమాల్ని…!!
వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా… అలియాస్ ధనుష్… రజనీకాంత్ బిడ్డ ఐశ్వర్య ప్రేమించి పెళ్లిచేసుకుందని తెలిసి అబ్బురపడ్డారు అందరూ… ఏం చూసి ఈ బక్కోడిని ప్రేమించింది అని నవ్వుకున్నారు… వీడు హీరో ఏమిటీ అని మొహం మీదే వెక్కిరించారు కొందరు… నవ్విన నాపచేనే అన్నట్టుగా ధనుష్ ఎదుగుతూనే ఉన్నాడు… సింగర్, యాక్టర్, రైటర్, నిర్మాత… 2002 నుంచి ఒకెత్తు… ఇక ఈమధ్య తీసిన అసుర, కర్ణన్ సినిమాలతో కోట్ల మందికి కనెక్ట్ అయిపోయాడు… యూట్యూబ్ టాప్ 2 […]
- « Previous Page
- 1
- …
- 367
- 368
- 369
- 370
- 371
- …
- 430
- Next Page »