Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సన్నజాజుల రాగేశ్వరి..! శృంగార గాయని అనొచ్చా..? ఐటమ్ సాంగ్స్‌కే ప్రసిద్ధి..!!

December 10, 2022 by M S R

lreswari

ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో శృంగార నర్తకి (నటి అంటే సరిపోయేదేమో..) జయమాలిని తనకు నచ్చిన పాట సింహబలుడు సినిమాలో ఎన్టీయార్‌తో చేసిన ‘సన్నజాజులోయ్’ అని చెప్పింది… ఎందుకు నచ్చింది అంత బాగా అని ఇంటర్వ్యూయర్ అడిగినట్టు, ఆమె ఏదో చెప్పినట్టు గుర్తులేదు… కానీ నిజానికి ఆమె చేసిన వందల ఐటం సాంగ్స్‌లో దీనికి మరీ అంతగా గుర్తుంచుకునేంత సీన్ ఉందా అనేది ప్రశ్న… ఉంది… కానీ ఆ పాటలో ఏవో సాహిత్య విలువలున్నాయని కాదు, అవేమీ లేవు […]

విశిష్ట అద్వైతుడు రామానుజాచార్యుడి బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ..!

December 10, 2022 by M S R

balayya

సోషల్ మీడియాలో కొన్ని ఠక్కున ఆకర్షిస్తయ్, ఒకింత ఆలోచనలో లేదా ఆందోళనలో పడేస్తయ్… అనుమానించేలా చేస్తయ్… చివరకు అదేమీ లేదులే అని తేల్చుకున్నాక కుదుటపడుతుంది… ఇదీ అలాంటిదే… బాలయ్య హీరోగా రామానుజాచార్యుల బయోపిక్ తీయబోతున్నారు, బాలయ్య 109వ సినిమా ఇదే, చినజియ్యర్ స్వామి సూచనలతో కథ ఉంటుందనేది ఆ పోస్టు సారాంశం… ఓ ఫోటో కూడా పెట్టారు… ఆరా తీస్తే, కొన్ని పరిస్థితులు, ప్రజెంట్ ట్రెండ్స్ పరిశీలిస్తే ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చునని తేలిపోతుంది… రామానుజాచార్యుల కథ విశిష్టం… […]

ఆట ముగింపుకొచ్చింది… అవే బిచ్చపు రేటింగ్స్… మాటీవీ ఇజ్జత్ పోయింది…

December 9, 2022 by M S R

biggboss

మా టీవీకి మస్తు రీచుంది… బార్క్ రేటింగ్స్‌ను లేపగలం, దింపగలం, తొక్కగలం అనే బలుపు భావనలు స్టార్ మాటీవీకి ఏమైనా ఉంటే… అవన్నింటినీ బద్దలు కొడుతోంది బిగ్‌బాస్ సీజన్… చివరకు వచ్చింది కదా, రేపోమాపో ఆదిరెడ్డిని, కీర్తిని లేదా ఇనయను, కీర్తిని లేదా ఇనయను ఆదిరెడ్డిని బయటికి పంపించేసి, టాప్ ఫైవ్ ఎవరో తేల్చేసే సమయం కూడా వచ్చేసింది కదా అనుకుంటుంటే… రేటింగ్స్ ఏమైనా పిసరంత పెరిగాయా అని చూస్తే మరింత షాక్… నిజం, మాటీవీ రేటింగ్స్ […]

జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పనికొస్తాడా..? హిమాచల్ బీజేపీకి ఏ పాఠం నేర్పింది..?!

December 9, 2022 by M S R

modi nadda

పార్ధసారధి పోట్లూరి …….  బిజేపి కి ప్రమాద సూచికలు ఇటీవలి ఎన్నికలు ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు మరియు ఢిల్లీ లోకల్ బాడీ ఎన్నికలు రాబోయే లోక్ సభ ఎన్నికలకి ఒక హెచ్చరికని జారీ చేశాయని చెప్పవచ్చు. గెలిచే చోట గెలిచి, గెలవదు అన్నచోట గెలిస్తే అది విజయం అవుతుంది, అంతే కానీ గెలిచేచోట ఓడిపోయి, ఓడిపోయేచోట గెలిస్తే అది పాక్షిక విజయం ! కేవలం మోడీకి ఉన్న ఛరిష్మాతో గెలవాలి అనే […]

BRS తరఫున ఉండవల్లి ఆంధ్రాలో పోటీచేస్తే కథ ఎలా ఉంటుంది..?!

December 9, 2022 by M S R

undavalli

Nancharaiah Merugumala………   ఉండవల్లి మాటలు కృష్ణా జిల్లా కమ్మలనే కాదు కడప రెడ్లను సైతం కంగారు పెడుతున్నాయా? రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు […]

ఆర్కే లక్ష్మణుడు… జస్ట్, కామన్ మ్యాన్ కాదు… అంతకన్నా తక్కువే సుమీ…

December 9, 2022 by M S R

kamala

Bharadwaja Rangavajhala…..   ఎవిఎమ్ వారు ఎన్టీఆర్ ను రావణుడుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ తీసిన భూకైలాస్ చిత్రంలో మున్నీట పవళించు నాగశయనా అంటూ ఓ నర్తన గీతం ఉంటుంది. దాన్ని షణ్ముఖ ప్రియలో స్వరపరచారు సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం గోవర్ధనంలు. ఆ పాటకు నర్తించిన నర్తన తార పేరు కమలా లక్ష్మణ్. ఆ లక్ష్మణ్ ఎవరో కాదు… కామన్ మ్యాన్ కార్టూనుతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఆర్కే లక్ష్మణే. కమల లక్ష్మణ్ పెళ్లైతే చేసుకున్నారు […]

సల్మాన్‌ఖాన్ తాజా బకరీ పూజా..! కన్నడ మార్కెట్ రష్మిక నోరుమూసింది..!

December 9, 2022 by M S R

pooja

మూడు వార్తలు… వేర్వేరు నటీమణులు… మణులో మాణిక్యాలో గానీ… రెండూ మంగుళూరు బేస్డ్ తారలే… ఇద్దరూ భీకరంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు… మీరిద్దరూ అసలు కన్నడ తారలే కాదు, మిమ్మల్ని సహించాల్సిన పనిలేదు… మీకు కన్నడ ఇండస్ట్రీ అన్నా, కర్నాటక అన్నా, కన్నడతనం అన్నా లెక్కలేదు… మీ దుంపతెగ… మిమ్మల్ని మావాళ్లు అని చెప్పుకోవడమే మాకు సిగ్గుచేటు అని తిట్టిపోస్తున్నారు… వీరిలో ఫస్ట్ రష్మిక… కన్నడ జనం ఆమెకు తెలుగు బలుపు, తమిళ బలుపు, హిందీ బలుపు అని […]

మరీ అలా నేరుగా అడిగితే ఏం చెబుతాం… గుర్తుండేలా లేదోయ్ శీతాకాలం…

December 9, 2022 by M S R

seetaakaalam

ఈ సినిమా మీద కాస్త ఆసక్తి ఎందుకు అంటే… 1) సత్యదేవ్… ఒరిజినల్‌గా మెరిట్ ఉన్న నటుడు… వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి… వర్ధమాన హీరోల్లో కాస్త ఫ్యూచర్ కనిపిస్తున్న హీరో… 2) తమన్నా… ఎక్కడో ఉండాల్సిన పాపులర్ నటి… ఫాఫం, అవకాశాలు సరిగ్గా లేక కిందామీదా పడుతోంది… 3) కన్నడం నుంచి మనకు రీమేక్స్ తక్కువ… రెండేళ్లుగా నిర్మాణం సా-గు-తు-న్న సినిమా… 4) నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ తరహా స్టోరీ… సినిమా మొత్తం పూర్తయ్యాక, […]

పంచతంత్రం… వెబ్ సీరీస్‌గా పనికొచ్చే అంథాలజీ… థియేటర్‌ సరుకు కాదు…

December 9, 2022 by M S R

పంచతంత్రం

అంథాలజీ… సినిమా కథలకు సంబంధించి ఇదొక వెబ్ ట్రెండ్… నిజమే, అది థియేటర్ ట్రెండ్ కాదు… భిన్నమైన కథలను ఓ దారంతో కుచ్చి, హారంగా చేయడం… మంచి అభిరుచి, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే..! అదీ సరిగ్గా కుదరాలి, ఓ పువ్వు చిన్నగా, వర్ణరహితంగా ఉంటే హారం సరిగ్గా కుదరదు… పైగా వేర్వేరు కథలను ఒకేచోట కలిపి కుట్టేయడం అంత వీజీ కూడా కాదు… అది అమరాలి… పైగా కమర్షియల్ వాల్యూస్ లేకుండా… ఓ వర్తమాన సినిమా లక్షణాలు […]

గెలిస్తే మోడీ గ్రేటా..? ఓడితే నడ్డా వేస్టా..? దిక్కుమాలిన అపాత్రికేయం..!!

December 9, 2022 by M S R

aj

కరపత్రికలు, మిగతా పత్రికలతో పోలిస్తే… సరే, భజనపత్రికలతో పోలిస్తే ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ ప్రయారిటీస్, ప్రజెంటేషన్ బాగుంటాయి… ఈనాడు చప్పిడి, సాక్షి ఉప్మా రుచులతో పోలిస్తే ఆంధ్రజ్యోతి కొంత నయమే… కాస్త చాట్ మసాలా కూడా కలుపుతున్నారు ఈమధ్య…  మొన్నామధ్య మునుగోడు ఫలితం మీద ‘గెలవడమే పదివేలు’ అని సూపర్ హెడింగ్ పెట్టిన అదే ఆంధ్రజ్యోతి ఓ నాసిరకం శీర్షిక పెట్టింది… ‘‘గుజరాత్‌లో కమాల్, హిమాచల్ ఢమాల్’’… మునుగోడు కమాల్, రెండు రాష్ట్రాల ఢమాల్… ఇది చెప్పుకోవాలా..? […]

కొత్త జాతీయ పార్టీ ఆప్… బీఆర్ఎస్ కాదు… అప్పుడే అంత సీన్ లేదు…

December 9, 2022 by M S R

brs

మళ్లీ మళ్లీ అదే పిచ్చిమోత… పార్టీ పేరు మారితే జాతీయ పార్టీ అయిపోయినట్టు బబ్రాజమానం భజగోవిందం తరహా పిచ్చి ప్రచారం… టీఆర్ఎస్ పార్టీ విధేయ మీడియాలోనూ అదే ధోరణి… పాత్రికేయాన్ని పాతరేసి, కరపాత్రికేయాన్ని మోస్తున్న వైఖరి… ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుంది… దాని ఓనర్‌కు ప్రధాని కుర్చీ కావాలట… అదెలాగూ ఆయన సొంత పార్టీ… తన ఇష్టం… తను చెప్పిందే వేదం… తను చేసిందే శాసనం… మేల్ శివగామి స్టయిల్… మళ్లీ నాలుగు రోజులకు నో, […]

రైలు స్టేషన్ చేరింది… బెర్తు మీద ఆయన చనిపోయి ఉన్నారు…

December 9, 2022 by M S R

allam

A WORLD CLASS WRITER OF OUR TIME…. డి సెంబర్ 9 అల్లం శేషగిరిరావు పుట్టినరోజు… విశాఖ అంటే సముద్రమూ, ఆంధ్రా యూనివర్సిటీ, యారాడకొండ మదిలో మెదిలినట్టే , తెలుగులో వేట కథలు అంటే పూసపాటి కృష్ణంరాజు, అల్లం శేషగిరిరావు, కే ఎన్ వై పతంజలి గుర్తొస్తారు. శేషగిరిరావు, ఆయన కథలు నాకు బాగా తెలుసు. ఆయనకి నేను కొద్దిగా తెలుసు. ఆయన తక్కువ మాట్లాడతారు. ‘రావోయి చాయ్ తాగుదాం’ అని కబుర్లు కొట్టే రకం కాదు. […]

మోటూ భాయ్… హిమాచల్‌కు ఛోడ్ దేవ్… Accept your FAILURE…

December 9, 2022 by M S R

himachal

గట్టిగా ఓ పట్టుపడితే… బీజేపీ కాంగ్రెస్ నిట్టనిలువునా చీల్చి, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం పెద్ద కథేమీ కాదు… కానీ అలా చేస్తే అంతకుమించిన నీచరాజకీయం మరొకటి ఉండదు… బీజేపీ ఫ్యాన్స్ 17 స్థానాల్లో కేవలం 1000 లోపు మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిందనీ, నిజానికి బీజేపీదే బలుపనీ చెప్పుకోవచ్చుగాక… కానీ గెలుపు గెలుపే… రెండుమూడు వోట్లతో గెలిచినా గెలుపే… ఈ దిక్కుమాలిన సమర్థనల్ని కట్టిబెట్టడం మేలు… హిమాచల్ ఓటరు ‘ఒరేయ్, నీకు పాలన చేతకాదురా…’ అని ఈడ్చి […]

సజ్జల సార్… విడిపోయిన తమిళనాడు, ఆంధ్రాలను తిరిగి కలిపేస్తే పోలా..?

December 8, 2022 by M S R

telugu states

అసలు ఆంధ్రాను తమిళనాడు నుంచి విడదీయడమే తప్ప… విడదీసిన తీరూ తప్పే… అందుకే ఎప్పటికైనా తమిళనాడులో ఆంధ్రా కలిసి ఉండటమే కరెక్టు అని ఎవరైనా గతి-మతి తప్పిన ‘‘తమిళ ఉండవల్లి’’ సుప్రీంకోర్టులో కేసు వేస్తే..? కాదు, ఈ శతృత్వాలు దేనికి..? ఈ యుద్ధాలు దేనికి..? అసలు పాకిస్థాన్, ఇండియా విడిపోవడం తప్పు, విభజించిన తీరు తప్పు, ఎప్పటికైనా రెండు దేశాలు మళ్లీ కలవడమే కరెక్టు అని ఎవరైనా ‘‘పాకిస్థానీ ఉండవల్లి’’ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తే..? ఎహె, […]

ఆలూ లేదు, చూలూ లేదు… సీత పాత్రలో సాయిపల్లవి… ఆలియా పడనిస్తుందా..?!

December 8, 2022 by M S R

saipallavi

సాయిపల్లవి… మంచి నటి… నటనలో మెరిట్‌కన్నా తన ప్రవర్తనలో మెచ్చదగిన నటి… ఆ చర్చలోకి ఇక్కడ వెళ్లాల్సిన పనిలేదు గానీ… అది ఒడవని ముచ్చట గానీ… చాన్నాళ్లుగా వార్తల్లో లేదు… అయిపోయింది, గార్గి, విరాటపర్వం ఫెయిల్యూర్ల దెబ్బకు ఇక ఆమెకు చాన్సులు లేవు, ఎక్స్‌పోజ్ చేయదు, ఎదవ్వేషాలు వేయదు, అందులో ఏ నిర్మాతా పిలవడం లేదు, చేతిలో పనిలేదు, దాంతో ఇక తన డాక్టరీ పనితో ఓ పెద్ద హాస్పిటల్ కట్టాలని ప్లాన్ చేస్తుంది అనే వార్తలు […]

సారొస్తారొస్తారు..! ఏది పడితే అది తినడట… నిప్పు… మెనూ ఉత్తర్వులు జారీ..!!

December 7, 2022 by M S R

menu

పెద్ద సారు జిల్లా పర్యటనకు వస్తున్నాడంటే… ఆ జిల్లా, ఆ శాఖ సిబ్బందిలో ఒకటే టెన్షన్… ఏదో వృత్తిపరమైన, శాఖాపరమైన, ప్రభుత్వపరమైన, ప్రజాసంబంధమైన టెన్షన్ కాదు… సార్ వెంట ఎవరెవరొస్తారు..? ఏం తింటారు..? రాత్రి బస చేయాల్సి వస్తే, సారుకు ‘ఏమేం ప్రత్యేక ఏర్పాట్లు’ చేయాలి..? తగ్గితే తమ సిబ్బందికి తనపట్ల మర్యాద లేదని కోపం పెంచుకుంటారు… మర్యాద మరీ ఎక్కువైతే, ఏ యూట్యూబ్ గొట్టానికే దొరికిపోతే అదొక తల్నొప్పి… ఇదీ టెన్షన్… సాధారణంగా మన అధికార […]

వివాహేతర శృంగారం బ్యాన్… సహజీవనానికి నో… అధ్యక్షుణ్ని వ్యతిరేకిస్తే యాక్షన్…

December 7, 2022 by M S R

indonesia

మొన్నటి అయిదో తారీఖున ఇండొనేషియా కొన్ని కీలక చట్టాల్ని చేసింది… పెళ్లిళ్లు గాకుండా శృంగారం, అనగా వివాహేతర శృంగారం నిషేదం… సహజీవనాలపై సంపూర్ణ నిషేధం… దేశ అధ్యక్షుడిని ఏ రీతిలో ఎవరు అవమానించే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు… రాజ్యానికి వ్యతిరేకంగా అభిప్రాయాల వ్యక్తీకరణ నిషేధం… ఈ కొత్త చట్టాల్ని తీసుకొచ్చేసింది… వివాహేతర శృంగార సంబంధాలు, సహజీవనాలకు సంబంధించి నిందితుల తరఫు వ్యక్తులే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది… అంటే భార్యలు లేదా భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు… ఇది […]

వేరే వ్యక్తితో పెళ్లి, ఓ బిడ్డ… ఐనాసరే కమల్‌తో బంధంపై అవే రాతలు, కూతలు…

December 6, 2022 by M S R

పూజా కుమార్ అనే నటి తెలుసా మీకు..? అమెరికాలో పుట్టింది, ఇండియన్ రూట్స్… అక్కడ చిన్న చిన్న సినిమాలు చేసి చెన్నై వచ్చిపడింది… కాదు, కమల‌హాసన్ కళ్లల్లో పడింది… పడిపోయింది… ఉత్తమ విలన్, విశ్వరూపం, విశ్వరూపం-2… అన్నింట్లోనూ ఆమే… లిప్ లాకులు, మస్త్ కెమిస్ట్రీ… తనకు అలవాటైన రీతిలోనే గౌతమిని కూడా వదిలించుకున్నాక కమల‌హాసన్‌కు పూజ దొరికింది… కొన్నేళ్లు సహజీవనం చేశారనే వార్తలు బోలెడు వచ్చాయి తమిళ మీడియాలో… కానీ తను 2020లో విశాల్ జోషిని పెళ్లి […]

ఎన్టీయార్ రూమ్మేట్… తన విజయాల్లో భాగస్వామి… రెండేళ్లు మాటలు బంద్…

December 6, 2022 by M S R

tv raju

Bharadwaja Rangavajhala………   జయకృష్ణా ముకుందా మురారీ… సినీ సంగీతంలో అనేక ప్రయోగాలు చేసిన సంగీత దర్శకుడుగా టి.వి.రాజు మోస్ట్ పాపులర్. జానపద సినిమాల్లో పాశ్చాత్య సంగీతం వినిపించడం … జానపదగీతాల్లో వెస్ట్రన్ బీట్స్ జోడించడం, హిందూస్థానీ సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వడం… ఇలా ఒకటేమిటి… అనేక ప్రయోగాలు. ఇన్ని చేసిన సంగీత దర్శకుడు తోటకూర వెంకటరాజు. టి.వి.రాజు అధికంగా ఎన్టీఆర్ చిత్రాలకే సంగీతం కూర్చారు. ఇద్దరూ ఒకే సమయంలో చెన్నైలో కాలు పెట్టడంతో పాటు ఇద్దరూ కల్సి ఒకే […]

పదాలన్నీ పచ్చల పిడిబాకులే… పదప్రయోగంలో సినారె రసికుడైన వగకాడు…

December 6, 2022 by M S R

changure

ఈటీవీ స్వరాభిషేకంలో మాళవిక పాడుతోంది… ఛాంగురే బంగారురాజా… ఏ పదానికి ఏ అర్థవంతమైన భావాన్ని పలికించాలో, ఎలా ఉచ్చరించాలో బాగా తెలిసిన శ్రావ్యమైన గొంతు… మధురం… కైపున్న మత్స్యకంటి చూపు పదాల దగ్గర స్పష్టంగా భావాన్ని పలికించింది… చాలామంది మచ్చకంటి చూపు అని పాడేయడం విన్నాను… లిరిక్స్ సైట్లు కూడా అలాగే రాసుకున్నాయి… ఈ మచ్చ ఉన్న కన్ను ఏమిటి..? అంతటి సినారె అలా రాశాడేమిటో అనుకునేట్టు..! కానీ అది మత్స్యకంటి చూపే… అంటే చేపకళ్ల పిల్ల […]

  • « Previous Page
  • 1
  • …
  • 368
  • 369
  • 370
  • 371
  • 372
  • …
  • 379
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions