1994-95… ఈనాడు కరీంనగర్ యూనిట్ ఆఫీస్… రామోజీరావు ప్రతి 3 నెలలకోసారి ఒక్కో యూనిట్ వెళ్లి, జిల్లాల వారీగా మీటింగులు పెట్టేవాడు… సర్క్యులేషన్, యాడ్స్, ఇతర పాలనసంబంధ ఇష్యూలే గాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్స్ జరిగేవి… పత్రిక గురించే గాకుండా జిల్లాల్లో స్థితిగతుల మీద ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడు… ఓ మీటింగులో మేడారం జాతర ప్రస్తావన వచ్చింది… లక్షల మంది రెండేళ్లకోసారి తరలివస్తారు, ప్రధానంగా గిరిజనం ఆరాధించే దేవతలు అని డెస్క్ సభ్యులు చెప్పారాయనకు… కేవలం రెండు […]
రాధాకృష్ణకు తెలిసినన్ని నిజాలు… ఫాఫం, జగన్‌రెడ్డికి కూడా తెలియవేమో…
సమస్యలు ఏమున్నాయో తెలియదు గానీ… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికను పట్టించుకోవడం మానేసినట్టున్నాడు..! ఏదో వారానికి ఒకటి, వీలయితేనే ‘కొత్త పలుకు’ అని ఓ వ్యాసరత్నాన్ని జనం మీదకు వదిలేసి, పత్రికలో ఏ వార్త ఎలా వస్తుందో కూడా చేస్తున్నట్టుగా లేదు ఈమధ్య..! తన పొలిటికల్ లైన్ తెలిసిన సిబ్బందినే పెట్టుకున్నాను కదా, ఏదో ఒకటి రాసిపారేస్తారులే అనుకుంటే ఎలా మాస్టారూ… ఇదుగో ఈ వార్త చూడండి… ఫస్ట్ పేజీ వార్త… గౌతమ్ సావంగ్‌ను డీజీపీ పోస్టు నుంచి […]
ఈటీవీలో అంతటి బాపుకే తప్పలేదు అవమానాలు… నిషేధాలు..!!
అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం… మరి అంత పెద్ద ఫిలిమ్ […]
చేతగాకకాదు.., అసలు బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!
బప్పీలహిరి దేహం పంచభూతాల్లో విలీనం అయిపోయింది… తన పాటలతో ఉర్రూతలూగించిన ఆయనకు జీవితకాలంలో ఒక్క పద్మశ్రీ కూడా దక్కలేదు సరికదా తన మరణానంతరం మీడియా స్మరణ కూడా తక్కువే అనిపించింది… మరీ తెలుగు మీడియా అయితే మరీ మొక్కుబడిగా స్పందించింది… అవున్లెండి, చక్రవర్తి బాపతు మీడియా టేస్టుకు బప్పీలహిరి ఏం రుచిగా ఉంటాడు..?! సాక్షిలో ఆర్టికల్ మాత్రం బాగుంది… కానీ ఇంకాస్త డెస్త్ ఉంటే మరీ బాగుండు అనిపించింది… మీడియా జస్ట్, అలా తీర్పులు చెప్పేస్తుంది, వ్యక్తుల […]
రెండో పెళ్లి మగాడికీ ఓ మథనం… వెనుకంజ… సుమంతే కాదు, సంపతూ చెప్పాడు…
మళ్లీ మొదలైంది… అక్కినేని సుమంత్ నటించిన ఈ సినిమా సైలెంటుగా ఓటీటీలోకి వచ్చింది… అది జీ5 యాప్… పెద్దగా ఎవరూ చూడరు… ఐనాసరే, మస్తు చూస్తున్నరు, ఆహో ఓహో, ఈ సినిమా పెట్టాక 2 లక్షల మంది కొత్తగా చేరారు, కోట్ల నిమిషాలపాటు చూశారు అని ఏదో చెప్పుకుంది… సాంతంగా చెప్పుకోవడం, నిజమో కాదో చెప్పే యంత్రాంగం ఏదీ లేదు… సో, దాన్ని వదిలేద్దాం… నిజానికి అశ్లీలం, అడ్డగోలు ఫార్ములా వాసనలు లేకుండా సినిమా నీటుగా ఉంది… […]
ఆలీకి రాజ్యసభ సీటిస్తేనే ఆశ్చర్యం… ఆ లెక్కలు చాలా కాంప్లికేటెడ్…!!
జరుగుతున్న ప్రచారం నిజమై… నిజంగానే సినిమా నటుడు ఆలీకి జగన్ గనుక రాజ్యసభ సభ్యత్వం అవకాశమిస్తే అది గొప్ప విశేషమే అని చెప్పుకోవాలి..! మొన్నొకసారి ఆలీ భుజం మీద తట్టి జగన్ త్వరలో శుభవార్త అన్నాడు… తరువాత ఆలీ జగన్ ఇంటికి వెళ్లొచ్చాడు… ఇంకేం..? ఆలీకి రాజ్యసభ సీటు అని ఊహాగానాల్ని మీడియా స్టార్ట్ చేసింది… అది వైసీపీ హెడ్డాఫీసు నుంచి లీకైందా..? లేక మీడియా సొంత సృష్టా తెలియదు… కానీ అదే నిజమైతే మాత్రం ఆసక్తికరమే… […]
దీప్ సిద్ధూ..! ఈ ఎర్రకోట ముద్దాయిని ఖతం చేశారా, తనే ఖతమయ్యాడా..!?
పార్ధసారధి పోట్లూరి…………… కత్తిని నమ్ముకున్నవాడు చివరికి ఆ కత్తికే బలి అవుతాడు అన్నట్లు ట్రాక్టర్ ని నమ్ముకున్న వాడు చివరికి ఆ ట్రాక్టర్ కే బలి అవుతాడని కొత్తగా చెప్పుకోవాల్సి వస్తున్నది! ఇక్కడ నమ్ముకోవడం అంటే హింస అని అర్ధం చేసుకోవాలి! పంజాబీ సినిమా నటుడు, సామాజిక కార్యకర్తగా చెప్పబడిన దీప్ సిద్ధూ గత సంవత్సరం రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట కోట మీదకి పోలీస్ బారికేడ్లని చేధించుకుంటూ ట్రాక్టర్ మీద చేరుకొని, ఖలిస్తానీ జెండా ఎగురవేసిన […]
వ్యూహం ప్రకారమే వ్యూహకర్తల ఎంపిక… పార్టీల ఫిలాసఫీల్లేవ్, మేధోమథనాల్లేవ్…
అదుగదుగో ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదిరింది… ఇంకేముంది, గెలుపు గ్యారంటీ అని ఓ పార్టీవాదుల్లో సంతోషం….. అబ్బే, రాబిన్ శర్మ సరిగ్గా పనిచేయడం లేదబ్బా, బాసు ఆయన్ని తప్పించేసి సునీల్ అని కొత్తాయన్ని పెట్టేస్తున్నాడు, ఇక పార్టీ గాడిలో పడినట్టే అని మరో పార్టీవాదుల్లో ఉపశమనపు ఛాయలు… ప్రశాంత్ కిషోర్ టీంలోనే పనిచేసిన ఒకాయనతో మన పెద్దలు మాట్లాడుతున్నారు, మన పార్టీకి కూడా ఇక జోష్ ఖాయం అని ఇంకో పార్టీవాదుల్లో ఆనందం… దేశంలో పార్టీలు, వాటి […]
బాబోఫోబియా..! ఆకు కదిలినా సరే… బాబు చేత, బాబు కోసం, బాబే బాధ్యుడు..!!
బీజేపీ మీద మీరు ఏ విమర్శ ఐనా చేయండి, వాళ్ల తప్పొప్పుల్ని, వైఫల్యాన్ని ఎండగట్టండి… వాళ్లు సింపుల్‌గా అన్నింటికీ నెహ్రూయే కారణమని తేల్చేస్తారు… ఆయన పాలన వైఫల్యాలు, విధానాల అసమర్థత కారణంగానే ఇప్పుడు దేశం సర్వకష్టాలూ పడుతోందని సూత్రీకరించేస్తారు… సపోజ్, మీరు కేసీయార్ మీద విమర్శలు చేశారనుకొండి… అన్నింటికీ ఉమ్మడి పాలనే కారణమని అలవోకగా చెప్పేస్తాడు… ఇప్పుడైతే బీజేపీ మీదకు తోసేస్తాడు… అచ్చం, వైసీపీ..! మీరు ఏదైనా ఆరోపించండి… చంద్రబాబే బాధ్యుడు అనేస్తారు… అవాంఛనీయమైంది ఏది జరిగినా […]
ముందస్తు వైపు జగన్..? ‘ఎలక్షన్ టీం’ కసరత్తు.. ఐదారు నెలల యాక్షన్ ప్లాన్..!!
జగన్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నాడా..? గతంలో కేసీయార్ చూపిన బాటలోనే తనూ అడుగులు వేయబోతున్నాడా..? ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలు ఒక ‘ఎలక్షన్ టీం’ అనే దిశలో సాగే ప్రయాణంలో భాగమేనా..? వచ్చే మూడు నాలుగు నెలల్లో జగన్ ఓ సీరియస్ కార్యాచరణ అమలు చేయబోతున్నాడా..? మూడు రాజధానులు అనే కాన్సెప్టుకు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? ఈ నాలుగైదు నెలల కీలక కసరత్తులన్నీ ముగిశాక మళ్లీ జనంలోకి వెళ్లిపోనున్నాడా…? వినవచ్చే సమాచారం మాత్రం అవుననే అంటోంది… జగన్ […]
బంగారు బప్పీ…! సినీసంగీతంలో ‘గ్యాంగ్‌లీడర్’… ఆ ట్యూన్లంటే ఓ వెర్రి…!!
అలోకేశ్ లహిరి అలియాస్ బప్పీలహిరి…! తన పాటల్లాగే ఒక జోష్… మొహంలో చింత, విచారం వంటివేమీ ఉండవ్… ప్రత్యేకించి తన ఆహార్యంలో కూడా విపరీతమైన బంగారు ఆభరణాలు కనిపించేవి… ఆయనకు అదొక ప్యాషన్ కమ్ ఫ్యాషన్… చేతులకు, మణికట్టుకు, మెడలో కడియాలు, హారాలు, ఉంగరాలు… బంగారమే కాదు, వెండి, డైమండ్స్… తను నడిచొస్తుంటే ఓ బంగారం షాప్ కదిలొస్తున్నట్టే… ఎప్పుడూ తన బంగారం పిచ్చిని దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు… కాలర్ ఎగరేసి, ప్రదర్శించుకునేవాడు… పదుగురిలో తనకు […]
నల్లబ్రాహ్మణుడు..! పంజాబ్, హర్యానా రాజకీయాల్లో ఇదోతరహా ‘‘వర్ణవివక్ష’’…
Nancharaiah Merugumala………… నరేంద్రమోదీ మంత్రివర్గంలో ముస్లిం మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఒక్కరే గాని, జాతీయ టీవీ న్యూజ్ చానల్స్ ప్రైమ్ టైమ్ చర్చల్లో బీజేపీ తరఫున పాల్గొంటున్న ముగ్గురు ముస్లింలు షాజియా ఇల్మీ, షెహజాద్ పూనావాలా, సయ్యద్ జాఫర్ ఇస్లాం చాలా వరకు పద్ధతిగా మాట్లాడతున్నారు. వారి పార్టీ సహచరులు గౌరవ్ భాటియా, సంబిత్ పాత్రా, నళిన్ కోహ్లీ వంటి ప్రవక్తలతో పోల్చితే ఈ ముగ్గురు ప్రతినిధులు ‘హిందుత్వ అతి’ లేకుండా కాస్త పాలిష్డ్గా నెట్టుకొస్తున్నారు. […]
ఇది స్టాలిన్ మరో మొహమా..? నిర్బంధ మతమార్పిళ్ల పట్ల సానుకూలతేనా..?
లావణ్య… అరియలూర్ జిల్లాలో, మైకేల్పత్తిలో Sacred Heart of Jesus Higher Secondary School అని ఓ క్రిస్టియన్ స్కూల్… దానికి అనుబంధంగా St. Michael’s Hostel… అందులో ఈ లావణ్య చదువుకునేది… మతం మారాల్సిందిగా ఆమెకు వేధింపులు… చివరకు భరించలేక ఈ పన్నెండో తరగతి అమ్మాయి సూసైడ్ చేసుకుంది… ఎవరు ఎలా వేధించారో ఓ వీడియోలో చెప్పుకుంది… హిందూ అమ్మాయి కదా, ఎవరూ పట్టించుకోలేదు మొదట… తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ అయిపోయి, […]
యోగి లేడు, హిమాలయ సిద్ధపురుష్ లేడు… ఈ చిత్ర వెనుక ఏదో రహస్య గ్యాంగ్…!!
ఆహా… ఓహో… పార్చూన్ జాబితాలో పేరు… ఫోర్బ్ జాబితాలో పేరు… వ్యాపార కూడలి మహారాణి అనే పేరు… ఒక దశలో స్టాక్ ఎక్స్ఛేంజీల ఫెడరేషన్ చైర్పర్సన్… నిజంగానే లక్షల కోట్ల వ్యాపారాల రహస్యాలన్నీ తెలిసే అడ్డా అది… కానీ ఏమైంది..? అసలు స్వరూపం బట్టబయలైంది… పాపం పండేరోజుకు… చందా కొచ్చర్ వంటి వాళ్లే చివరకు తమ నిజస్వరూపాల్ని దాచుకోలేకపోయారు… ఓ టైం వస్తే అన్నీ బహిరంగమే… ఎస్, చిత్రా రామకృష్ణ కథ కూడా అంతే… ఎవరీమె అనడక్కండి… […]
వావ్… మాస్ట్‌హెడ్ పక్కనే అంబేడ్కర్ స్ఫూర్తిగానం… కానీ ఒక్కరోజుకే…!!
మాస్ట్‌హెడ్… అంటే పత్రికల లోగో, పబ్లిషింగ్ సెంటర్ల వివరాలుండే ఫస్ట్ పేజీ టాప్ స్పేస్… తేదీ, సంచిక సంఖ్య, తమ పత్రిక ఫిలాసఫీ, లైన్ చెప్పేలా ఓ నినాదం వంటివి కూడా ఉంటయ్… ఉదాహరణకు సాక్షి మాస్ట్‌హెడ్ చూడండి, వైఎస్ బొమ్మ ఉంటుంది… సత్యమేవ జయతే అనే ఓ స్లగ్… ఈనాడు అయితే ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డెయిలీ అని రాసుకుంటుంది… గూగుల్ డూడుల్ లాగా కొన్ని పత్రికలు సందర్భాన్ని బట్టి మాస్ట్‌హెడ్ మారుస్తుంటయ్ కూడా… […]
ఓహ్… మీడియా వార్ ఇలా కూడా ఉంటుందా..? సాక్షి వర్సెస్ జ్యోతి…!!
ఇదీ సోషల్ మీడియా సంవాదాల నడుమ దొరికిందే… నవ్వాలా, జాలిపడాలా, విరక్తితో వదిలేయాలో అర్థం కాదు… విషయం ఏమిటంటే…? ఒక వార్త వచ్చింది… ఓ సర్కారీ టీచర్ పీఆర్సీ వల్ల జీతం తగ్గిందని, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం కూలీగా మారాడు అనేది ఆ వార్త సారాంశం… అయ్యో, అయ్యో, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ కూలీగా మారాడు దేవుడోయ్, హేమిటింత అన్యాయం బాబోయ్ అన్నట్టుగా ఆ వార్త కనిపించింది… ఇదీ ఆ వార్త… (ఆంధ్రజ్యోతి […]
‘‘ఆ రాత్రి జర్నీలో అనుకోని పరిచయం… ఒకరు సీఎం, మరొకరు పీఎం అయ్యారు…’’
‘‘1990 వేసవి… నేనూ, నా స్నేహితురాలు ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనర్లం… లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణించాం రైలులో… మేం ఉన్న బోగీలోనే ఇద్దరు ఎంపీలు ఉన్నారు… వాళ్లతోపాటు ఉన్న దాదాపు డజను మంది కార్యకర్తలు, అనుచరుల ప్రవర్తన నీచస్థాయిలో ఉంది… వాళ్లెవరికీ రిజర్వేషన్లు లేవు… మా రిజర్వ్డ్ సీట్ల నుంచి మమ్మల్ని దింపి, మా లగేజీ మీద కూర్చోబెట్టారు… వాళ్ల చూపులు, మాటల తీరు ఏవగింపు కలిగించేలా ఉంది… బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం… ఇతర ప్రయాణికులు, […]
మిస్టర్ అమిత్ షా… ఏం చేద్దాం మరి..? మళ్లీ కలిపేద్దామంటావా ఏంటి..?!
ఒక వీడియో చూసి ఆశ్చర్యమేసింది… మంచి మెజారిటీతో ఈ దేశాన్ని రెండు టరమ్స్గా పాలిస్తున్న పార్టీయేనా ఇది అనే ఆశ్చర్యం… ఒక ప్రాంత మనోభావాల్ని నిర్దయగా దెబ్బతీస్తున్న ఆశ్చర్యం… ఆ పార్టీ వ్యూహరాహిత్యం మీద ఆశ్చర్యం… అసలు తెలంగాణలో పార్టీ ఎదగకపోవడానికి కారకులు ఈ ప్రాంత నాయకులు కాదనీ, బాధ్యులు ఢిల్లీ పెద్దలేననే ఆశ్చర్యం… ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే..? ఇదీ… ఇది టీఆర్ఎస్ సోషల్ వింగ్ సర్క్యులేషన్లో ఉన్నదే… కానీ హోం మంత్రి, పార్టీని తన […]
థమన్ టేస్ట్ తెలిసిందే గానీ… ఫాఫం, అనంత శ్రీరాముడికి ఏమైంది..?
పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి… దాంతో నీ పనైపోయింది అధోగతి…… ఎక్కడో విన్నట్టు ఉంది కదూ… అవును, చూడాలని ఉంది… అనబడే చిరంజీవి సినిమాలో… ఆయనకూ, సౌందర్యకూ నడుమ సాగే ఫేమస్ సంభాషణ… ఎప్పుడు విన్నా, చూసినా నవ్వాపుకోలేం… చిన్నప్పుడు రేడియోలో బాలానందం సినిమాలో పిల్లల కవిత్వాలు వచ్చేవి కొన్ని… తరువాత ఇప్పుడు ఫేస్బుక్ కవిత్వాలు కూడా అదే టైపు… అఫ్ కోర్స్, తెలుగు సినిమా […]
‘‘ఎందుకింత ఎక్కువ ఆయుష్షునిచ్చావ్ దేవుడా…? ఏడవడానికా..!’’
ముందుగా సీనియర్ జర్నలిస్ట్ Nancharaiah Merugumala.. రాసిన ఓ పోస్టు చదవండి… ‘‘ప్రసిద్ధ రచయిత దివంగత కొడవటిగంటి కుటుంబరావు భార్య వరూధిని గారు 97 సంవత్సరాల వయసులో మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె భర్త కుటుంబరావు గారు 1980లో 71 ఏళ్లు నిండే సమయానికి మరణించారు. ఆమె కొడుకు, ప్రముఖ రచయిత రోహిణీ ప్రసాద్ 2012లో, కూతురు, రచయిత్రి శాంతసుందరి 2020 నవంబర్‌లో చనిపోయారు. కొడుకూకూతుళ్లు ఇద్దరూ 70 ఏళ్లు నిండాకే కన్నుమూశారు. మొన్న ‘ఈనాడు’లో […]
- « Previous Page
- 1
- …
- 370
- 371
- 372
- 373
- 374
- …
- 483
- Next Page »