దిలీప్ కుమార్… 98 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని వీడివెళ్లిపోయాడు… ఒక లెజెండ్… బాలీవుడ్ మరిచిపోలేని నటుడు… ఎవరితో పోలిక లేదు, పోటీ లేదు… దిలీప్ అంటే దిలీప్… అంతే… యూనిక్ స్టార్… దిలీప్ అనగానే గుర్తొచ్చేది పాతతరం ప్రేక్షకులకు మొఘల్ ఏ ఆజమ్… అసలు ఆ సినిమా చరిత్రే వేరు… దాన్ని కూడా వేరే ఏ బాలీవుడ్ సినిమాతో పోల్చడానికి లేదు… అసలు ఆ సినిమా నిర్మాణమే ఓ విశేష చరిత్ర… ఎస్, ఆ సినిమా […]
అర్ధరాత్రి… ఆ రద్దీ బోగీలో ఓ రోగి విలవిల… ఎదుటి బెర్తులో ఓ పెద్దాయన… తర్వాత..?!
నేను చెన్నైలో పనిచేస్తూ ఉండేవాడిని… నా పూర్వీకుల ఇల్లు భోపాల్‌లో… నాన్న అక్కడే ఉండేవాడు… హఠాత్తుగా ఓరోజు పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి నాన్న కాల్ చేసి, వెంటనే ఇంటికిరా అన్నాడు… నాకిక్కడ అర్జెంటు పని ఉంది అని చెప్పేలోపు కట్ చేశాడు… అప్పటికప్పుడు బ్యాగు సర్దుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను… బుకింగ్ లేదు, రిజర్వేషన్ లేదు… వేసవి సెలవులు కదా, ఏ రైలు చూసినా ఫుల్లు రద్దీ… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ మీద రెడీగా […]
పొలం లేదా..? పొద్దు లేదా..? ఆ బాల్యాన్ని అనుభవించనివ్వండి సార్…!!
‘‘నేను రాజకీయాల్లో రాను’’… కేసీయార్ మనమడు, కేటీయార్ కొడుకు హిమాంశు ట్విట్టర్లో కనిపించిన ఈ వాక్యం ఒకింత విచిత్రంగానే ధ్వనించింది… వచ్చే 12వ తేదీకి పదహారో ఏడులోకి అడుగుపెడుతున్నాడు… ఇంకా బాల్యం, స్కూలింగ్ తాలూకు జ్ఞాపకాల్ని, అనుభవాల్ని పదిలంగా పేర్చుకునే వయస్సు… ఇధి మళ్లీ రాదు… కానీ ఏం జరుగుతోంది..? అప్పుడే వందిమాగధులు, ప్రమథగణాలు, స్తోత్రపాఠాలు, భజనలు… ఈ వయస్సులో ఈ విద్యేతర కాలుష్యాన్ని తన మెదడులో నింపడం అవసరమా..? ఒక్కసారి అధికారం తాలూకు కిక్కు అలవాటయితే, […]
తమిళ ఘంటశాల..! గాత్రంతో నటించడం ఓ ఆర్ట్… సౌందర్‌రాజన్ గొప్ప ఆర్టిస్టు…!!
……….. By……. Bharadwaja Rangavajhala……… భావం పలికించడం అంటే ఆయనే, తెలుగువాళ్లు మరచిపోలేని స్వరం అది… ఆయన పాడిన పాటల్ని గురించి ఇప్పటికీ మురిపెంగా చెప్పుకుంటారు. బ్లేబ్యాక్ సింగింగ్ లో ఓ సెన్సేషన్ ఆయన. గాత్రంతో నటించడం తెలిసిన గాయకుడే సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఆ టైమ్ లో తెలుగులో ఘంటసాలకు సాధ్యమైంది. తమిళ్ లో సౌందర్ రాజన్ కు సాధ్యం అయింది. మోస్ట్ ఎమోషనల్ సింగర్ సౌందరరాజన్ స్మృతిలో ఆయన జ్నాపకాలు పంచుకుందాం. దైవమా…దైవమా…కంటినే…కంటినే…తనివి […]
మోడీ భాయ్..! ఆ చైనా జిన్పింగుడికి నాలుగు బుట్టల మామిళ్లు పంపించరాదూ…!!
రిలేషన్… పెంచుకోవడం, కాపాడుకోవడం, పునరుద్దరించుకోవడం, దిద్దుకోవడం… ఒక కళ… అది మనుషుల మధ్యే కాదు, పార్టీల నడుమ, సంస్థల నడుమ, దేశాల నడుమ కూడా…! ఈ ప్రక్రియ కోసం తరచూ మాట్లాడుకోవడమే కాదు, అవసరమైతే కానుకల్ని పంపడం కూడా పరిపాటి… విలువైన కానుకలకన్నా కొన్నిసార్లు పండ్లు, రాఖీలు, స్వీట్లు, బట్టలు గ్రహీత మొహంలో చిరునవ్వును పండిస్తాయి… మనుషుల నడుమ నెగెటివిటీని తగ్గిస్తాయి… ఎంతోకొంత సానుకూలతను, పాజిటివిటీని కలిగిస్తాయి… పలుసార్లు ఎంత ప్రత్యర్థులైనా రాజకీయాలు రాజకీయాలే, మర్యాద మర్యాదే… […]
ప్రణబ్ ముఖర్జీ కొడుకైతేనేం..? లెక్కలు వేసుకున్నాడు, జంపైపోయాడు..!!
నో, నో, నేను టీఎంసీలో చేరడమా..? నెవ్వర్, ఈ ప్రచారం అబద్ధం అని బల్లగుద్ది తీవ్రంగా ఖండించాడు… ఒక నాయకుడు పదే పదే అలా చెబుతున్నాడూ అంటే… అది జంపుతున్న కేసే అని అర్థం చేసుకోవాలి మనం… అనుకున్నట్టుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు… సరే, అలా పార్టీ జంపడానికి ఆయన లెక్కలు ఆయనకు ఉండి ఉండవచ్చగానీ… కానీ పార్టీలో చేరుతున్న ఫోటో చూస్తే మాత్రం జాలి, […]
జస్ట్.., 47 సీట్లలోనే మజ్లిస్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, జనసేన కొట్లాట..!!!
దిశ డిజిటల్ పత్రికలో కనిపించిన ఓ వార్త కాస్త ఇంట్రస్టింగు అనిపించింది, కాస్త నవ్వు కూడా వచ్చింది… ఆ కథనంలో లోటుపాట్ల గురించో, నిజానిజాల గురించో కాదు మనం ఇక్కడ చెప్పుకునేది… చదివాక మనకు వెంటనే ఏమేం లెక్కలు మదిలో మెదులుతాయి అనేది పాయింట్… షర్మిల ఇప్పుడంతా తమిళ సహాయకారులు కదా… తన వ్యూహకర్త ప్రియ, మాజీ పీకే టీం మెంబర్, ఎవరో డీఎంకే తమిళ ఎమ్మెల్యే బిడ్డ… ఇప్పుడు ఓ సర్వే చేయించిందట… ఎన్పీసీ సంస్థ […]
మమత కుర్చీకి ఉత్తరాఖండ్ లొల్లికీ భలే ముడిపెట్టేశారు బాబోయ్…
మోకాలికీ బోడిగుండుకూ ముడిపెట్టడం అనేక వార్తల్లో, విశ్లేషణల్లో, ప్రత్యేక కథనాల్లో, టీవీ డిబేట్లలో చూస్తూనే ఉంటాం… అవి చూసీ, చదివీ, జుత్తు పీక్కుని మన బోడి గుండ్లు కావాలే తప్ప వాళ్లు మారరు… అయితే ఒక స్టోరీ చదవగానే దీన్ని మించిపోయినట్టు అనిపించింది… మొన్న సీఎం పదవి ఊడిన ఉత్తరాఖండ్ తీర్థసింగుడికీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలకూ మూడివేసి, భలే వండారు… చాలా జాతీయ పత్రికల్లో, సైట్లలో సుదీర్ఘకథనాలు రాశారు… అదేమిటి..? ఉత్తరాఖండ్కూ బెంగాల్ పాలిటిక్సుకూ […]
నూకల అత్తెసరు..! ఇప్పటి తరానికి తెలియని ఓ సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
మరీ వెనక్కి అవసరం లేదు… కాస్త వెనక్కి… ఇప్పుడంటే… పండించిన వడ్లు అమ్ముకోవాలి, దుకాణాల్లో బియ్యం కొనుక్కోవాలి కదా ట్రెండు… కానీ గతం… సన్నవో, దొడ్డువో… వడ్లు వడ్లే… (వడ్లు అంటే ఏమిటని అడిగే తరం ఇది…) వడ్లు అంటే ఇంకా ప్రాసెస్ చేయబడని బియ్యం… సరే, రాళ్లూరప్పా, మట్టీబేడా లేకుండా చూసి, తమ వడ్లను తీసుకుని గిర్నికి తీసుకుపోయేవాళ్లు రైతులు… చిన్న చిన్న గిర్నీలు ప్రతి ఊరిలోనూ ఉండేవి… (గిర్నీ అంటే మినీ రైస్ మిల్…)… […]
ట్రోలర్స్‌కు జర్నలిజం పాఠాలు… కాలమిస్టులకూ ‘‘వీక్ఎండ్’’ వివరణల తిప్పలు…
క్షుద్రరాజకీయాల ప్రస్తావన కాసేపు వదిలేద్దాం… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకు లేదా ప్రసారం చేసుకున్న వీకెండ్ కామెంట్… ఫాఫం, మరీ వీక్ అయిపోయింది… ఎంత వీక్ అంటే… తను గతంలో రాశాడు కదా… ‘‘అప్పుడప్పుడూ తాను ఏసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంటాను, నాన్న వైఎస్ ఆత్మతోనూ మాట్లాడతాను అని జగన్‌రెడ్డి ఉన్నతాధికారుల భేటీల్లో చెబుతున్నాడు…’’ అని…! సహజంగానే దానిపై యాంటీ-టీడీపీ సెక్షన్ విరుచుకుపడింది… నిజంగా జగన్ అధికారుల భేటీల్లో అలా చెబుతున్నాడా..? కావాలని యెల్లో బ్యాచ్ జగన్‌ను ఓ […]
కేసీయార్ వేసిన కొత్త ముడులు… ఇప్పుడింకా గట్టిగా బిగుసుకుందిలా…
అసలే బోలెడన్ని చిక్కుముళ్లు… ఇప్పుడు తాజాగా కేసీయార్ మరికొన్ని బిగించాడు గట్టిగా..! తెలంగాణ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో తన జలవైఖరిని దృఢంగా, ఇన్నేళ్ల వివాదాలకు కొత్త ట్విస్టులిస్తూ ప్రకటించింది… అవే తాజా ముడులు…!! పోతిరెడ్డిపాడు అక్రమం, రాయలసీమ లిఫ్టు చట్టవ్యతిరేకం అని చెప్పడం కొత్త కాదు, అది కాదు అసలు విశేషం… ఇంకొన్ని చెప్పుకోదగిన అసలు విశేషాలున్నయ్… అది రెండు రాష్ట్రాల నడుమ నీటినిప్పును ఇంకాస్త రగిలించడం ఖాయం… అయితే..? ముందుగా కేసీయార్‌కు ఐదారు ప్రశ్నలు […]
బాబూ… ఇక్కడ ట్రెండ్ వేరు… లీడర్లే వెళ్లి మీడియాతో ‘‘అభినందించుకోబడతారు’’…
ఎవరికైనా ఓ పదవి దక్కినా, అదృష్టం పట్టినా, అందలం ఎక్కినా, లాటరీ చిక్కినా, శుభసందర్భం ఏదైనా సరే… శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, స్నేహితులు వెళ్తారు… బొకేలు ఇస్తారు, అలుముకుంటారు, నోట్లో స్వీట్లు పెడతారు, అభినందనలు చెబుతారు… ఆనందాన్ని షేర్ చేసుకుంటారు… అది మంచి సంప్రదాయం… కానీ తెలుగునాట కొన్ని డిఫరెంట్… (నాయకుల కాళ్ల మీద పడి మీడియా సంస్థలు పాకుతూ, నాకుతూ బానిసల్లాగా మారాయి అనే ఒక జనరల్ అబ్జర్వేషన్ ఉంది కదా… అది ఇక్కడ పనిచేయదు… […]
నాన్న అంటే..? ఇప్పటికీ లోకంలో ఎవడూ సరిగ్గా నిర్వచించలేని బంధం… అంతే…!!
ముందుగా ఒక పోస్టు చదవండి……….. ‘‘ కాకికి పిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ.. ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది. “పంతులుగారు! ఒకవేళ కాకిముట్టకుంటే ఎలా?” ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు. “ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం” అని ఉంది.ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లలో కూడా వేయొచ్చు జలచరాలకు…చెప్పారు పంతులుగారు. “లేదు కాకి వచ్చిముడుతేనే ఆత్మశాంతి కలిగినట్లు! […]
బంగారు బడి..! ఈ భాగ్యం ఈ ఒక్క బడికే ఎందుకు..? వేల బడుల మాటేమిటి..?!
తెలంగాణ కోసం నేను మొక్కుకున్నా… దేవుళ్లందరికీ మొక్కులు తీర్చుకుంటా… నా మొక్కే తెలంగాణ మొక్కు, నేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే నేను అనుకుంటూ కోట్లకుకోట్లు ఖజానా నుంచి తీసి, తెలంగాణ ఏర్పాటు కోసం దీవించిన ఆంధ్రా దేవుళ్లకు కూడా మస్తు నగలు పెట్టాడు కేసీయార్… ఆయన మొక్కు తెలంగాణ మొక్కు ఎట్లయితదని ఎవరూ అడగలే… యాంటీ-సెంటిమెంట్ అవుతుంది కాబట్టి..! సేమ్, ప్రతి అడుగు అదే… నేను, నేను, నేను… ఒకరకమైన చిత్రమైన మానసిక స్థితి ఇది… నేను […]
ఆ చైనా గన్నుకు తోడుగా ఇండియన్ స్టెతస్కోప్… చదవాల్సిన కథ…
…………. By…….. Taadi Prakash……………. డాక్టర్ కోట్నీస్‌కి అమర్ కహానీ SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA —————————————————————– ఆకులూ పులూ రాలిపోతాయి చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే… 80, 90 సంవత్సరాల మహా ప్రయాణం కదా… కాంతిదారుల్లోనో… కన్నీటి పడవల్లోనో… త్యాగాల చైతన్యదీపాలై వెలిగి మానవత్వపు మైదానాల్లో మెలిగి పరులసేవే దీక్షగా, తపస్సుగా జీవించిన నిరాడంబరులు, […]
ఓ గెరిల్లా డాక్టర్..! ఈ వైద్యసైనికుడిని చైనా కూడా మరవలేదు…!!
…. Author :: Taadi Prakash……………… నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది… GUERILLA DOCTOR NORMAN BETHUNE ————————————————————— పొద్దున్నే ఫేస్బుక్లో జయదేవ్ గారి కార్టూన్ suprise చేసింది. ఒక స్టెతస్కోప్ మధ్య ఉయ్యాల లాంటి మాస్క్ లో భూగోళం! మరొకటి: మాస్క్ వేసుకున్న పెద్ద లేడీ డాక్టర్ బొమ్మ. వెనకాల వందల చుక్కలు. ఎన్లార్జి చేస్తే వాళ్లంతా డాక్టర్లు! కరోనా పేషెంట్ల సేవలో ప్రాణాలు కోల్పోయినవాళ్లు. చివుక్కుమంది. ఆ రోజు జూలై1. మన […]
కంగ్రాట్స్ శిరీషా..! తొలి తెలుగు అంతరిక్ష యాత్రికురాలు..!
అప్పుడెప్పుడో 1984లో… మన భారతీయుడు రాకేష్ శర్మ రష్యా స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చాడు..! ఇంకా..? సునీతా విలియమ్స్ కూడా అంతరిక్ష యాత్రికురాలే… కానీ భారతీయ తండ్రి, స్లొవేనియన్ అమెరికన్ తల్లి… ఈమె పుట్టింది, పెరిగింది అమెరికాలోనే, పెళ్లిచేసుకున్నది కూడా ఓ అమెరికన్నే… హర్యానాలో పుట్టిన కల్పనా చావ్లా మరో వ్యోమగామి… నాసాలో పనిచేస్తూ, అక్కడే ఓ అమెరికన్‌ను పెళ్లిచేసుకుంది… ఆమె స్పేస్‌లోకి వెళ్లిన తొలి భారతీయురాలు… తరువాత 2003లో, ఒక స్పేస్ ప్రమాదంలోనే మరణించడం ఓ […]
ఓహ్..! మోడీని తిట్టిపోయడానికి కొత్తగా ఈ సెన్సార్ ఇష్యూ దొరికిందా..?!
చాలా విషయాల్లో మోడీఫోబియా ఏదో కనిపిస్తోంది… తను పాలనపరంగా అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకోవచ్చుగాక, ఇప్పటికీ సుపరిపాలన చేతగాకపోవచ్చుగాక… కానీ తన ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించాల్సిందే అనే ధోరణి మాత్రం ఓరకంగా పైత్యమే… ప్రతి దాన్నీ మోడీ మెడలో వేసి బదనాం చేయడం పిచ్చితనమే… కొత్తగా కేంద్రం ప్రతిపాదిస్తున్న సినిమా సర్టిఫికేషన్ చట్టంపై కొందరు గగ్గోలు చూస్తే అదే నిజమనిపిస్తోంది… కోలీవుడ్ యాంటీ మోడీ సెక్షన్ దగ్గర నుంచి బాలీవుడ్ దాకా పలువురు స్పందిస్తూ… కొత్త చట్టాన్ని […]
నీటి నిప్పు..! ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు రగిలింది..? అసలు ఏమిటీ లొల్లి..?
జగన్ ప్రధానికి లేఖ రాశాడట… వెంటనే కృష్ణా ప్రాజెక్టుల మీద సీఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాటు చేయాలన్నాడట… తెలంగాణ మీద కస్సుబుస్సు అంటున్నాడట… తెలంగాణలో ఏపీవాళ్లు ఉన్నారని సంశయిస్తున్నాడు గానీ లేకపోతేనా..? పోలీస్ పహారాలు, గరంగరం, ఉద్రిక్తత… ఇలా నీళ్లు-నిప్పులు అంటూ మీడియా, పొలిటిషియన్స్ డిబేట్లలో దంచికొడుతున్నారు… కాస్త వేరే కోణంలోకి వెళ్దాం… అప్పుడెప్పుడో చంద్రబాబుకూ కేసీయార్‌కూ పడలేదు… రాజకీయంగా డిష్యూం డిష్యూం… అప్పట్లో సేమ్ ఇదే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఓసారి… తూకిత్తా అంటే తూకిత్తా అనుకున్నారు… […]
రాజకీయాలంటే అంతే..! అవ్వ లేదు, బిడ్డ లేదు, అల్లుడు లేదు, అత్త లేదు…!!
రాజకీయాల్లో అన్నీ బాగుంటేనే… కొడుకు, బిడ్డ, అల్లుడు, బావమరిది ఎట్సెట్రా కుటుంబగణమంతా సుహృద్భావంతో కలిసిమెలిసి సాగుతూ అన్నీ దండుకుంటారు… ఎక్కడ తేడా వచ్చినా సరే, ఇక తమ్ముడు లేదు, బిడ్డ లేదు, బంధుగణం లేదు… తన్నుకోవడమే… అంతపుర కుట్రలుంటయ్, వెన్నుపోట్లు ఉంటయ్, కూలదోయడాలు, బొందపెట్టడాలూ ఉంటయ్… కులపార్టీలు, కుటుంబపార్టీలు అయితే ఈ జాడ్యాలు మరీ ఎక్కువ… ప్రతి ఒక్కడూ తమ పార్టీల్లో తమ కుటుంబసభ్యుల నీడను చూసి కూడా భయపడాల్సిందే… మన దేశంలో పార్టీల యవ్వారాన్ని అర్థం […]
- « Previous Page
- 1
- …
- 382
- 383
- 384
- 385
- 386
- …
- 448
- Next Page »