న్యూస్ సైట్లలో గానీ, మీడియాలో గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు… ఒక్క ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకెక్కడా ఈ వార్తే కనిపించలేదు… రాధాకృష్ణ కూడా ‘ఫాఫం పోనీలే’ అన్నట్టుగా ఎక్కడో ఓచోట కనీకనిపించకుండా ఓ నిలువు సింగిల్ కాలమ్‌లో మమ అనిపించాడు… ఈనాడు కూడా రాసే ఉంటుంది, కానీ కనిపించదు, రెండు భూతద్దాలు అవసరం… టీవీలయితే, ఇదీ వార్తేనా అని వదిలేశాయ్… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీకి చెందిన ఏడుగురు కాంగ్రెస్ […]
హైపర్ ఆది, ఏందీ ఇది..? చివరకు సంపూను కూడా బురదలోకి లాగావా..?!
దాంట్లో ఏం జోక్ ఉందో… రోజమ్మ తెగ నవ్వేస్తూ ఉంటుంది… అనసూయ దాదాపు దొర్లుతున్నట్టుగా పడీ పడీ నవ్వుతుంది… పాపం, మనో… నవ్వకపోతే బాగుండదు, మళ్లీ ఎపిసోడ్‌కు పిలవరు, డబ్బు రాదు అన్నట్టుగా మొహమాటానికి ఏదో నవ్వినట్టు నటిస్తుంటాడు… దాదాపుగా జబర్దస్త్‌లో ఎక్కువసార్లు కనిపించే సీన్లు ఇవే… వారం వారం స్కిట్ల నాణ్యత మరీ ఘోరంగా పడిపోతోంది… అఫ్ కోర్స్, ఆ ప్రోగ్రాం టేస్టు, క్వాలిటీ, ప్రజెంటేషన్ అన్నీ ‘‘పడిపోయిన రేంజే’’… కానీ మరీ హైపర్ ఆది […]
హమ్మయ్య.., ఇండియాకు నిజమైన స్వాతంత్య్రం వచ్చేసిందోచ్…
‘‘ఏ ఆజాదీ ఝూట్ హై’… దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అప్పటి కమ్యూనిస్టు పార్టీ స్పందన ఇది… ఈ విముక్తి అబద్ధం, ఇది అసలు స్వాతంత్య్రమే కాదు అని 75 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు కమ్యూనిస్టులు… విడిపోయినా, సీపీఎం ఆ ధోరణికే కట్టుబడి ఉంది… అందుకే జాతీయ జెండా కూడా ఎగురవేయదు పార్టీ… పంద్రాగస్టు రోజున కూడా జాతీయ జెండాను పట్టించుకోదు… దేశమంతా ఒక విధిగా ఆరోజున జాతీయ పతాకాన్ని ఎగరేయడమో, సెల్యూట్ చేయడమో చూస్తుంటాం కదా… ఆ […]
పర్ సపోజ్… మన బాలయ్యే బోయపాటితో నీరజ్ చోప్రా బయోపిక్ తీస్తే…!
ఒలింపిక్ స్వర్ణుడు నీరజ్ చోప్రా పేరు దేశమంతా మారుమోగిపోతోంది కదా… సోషల్ మీడియా అయితే పండుగ చేసుకుంటోంది… ‘సంఘీ’ అని హఠాత్తుగా తిట్టిపోసే కేరక్టర్లు ఎలాగూ ఉంటాయి కదా, వాళ్లను వదిలేస్తే సరదాగా తన మీద మీమ్స్, జోక్స్ వేస్తున్నవాళ్లు బోలెడు మంది… @Maurya Mondal అని ఒకాయన ఏకంగా నీరజ్ చోప్రా బయోపిక్‌ను అక్షయ్ కుమార్ హీరోగా తీస్తే ఎలా ఉంటుందో ఓ కథ రాసేశాడు… ఇప్పుడు నడుస్తున్నది బయోపిక్కుల ట్రెండే కదా… భలే ఉంది… […]
కామెడీలోనూ ఓ సపరేట్ స్టయిల్… కానీ ఓ కల నెరవేరకుండానే కన్నుమూత…
………… By…….. Abdul Rajahussain………………….. (ఆగస్టు 9…. రంగస్థల, బుల్లితెర, వెండితెర నటుడు, దర్శకుడు, వ్యాఖ్యాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు )……. * గిలిగింతలు పెట్టే హాస్యానికి వరం..” ధర్మవరపు సుబ్రహ్మణ్యం. “! పరిచయం అక్కర్లేని పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. హాస్యానికి ఆయన కేరాఫ్. ప్రకాశం జిల్లాలోని ‘కొమ్మునేని’ వారి పల్లెలో జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల మీద మోజుండేది. రేడియోలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆతర్వాత ప్రజానాట్యమండలి తరపున ఎన్నో నాటకాల్లో నటించారు. […]
జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాలేదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
నిజానికి ఇది రాయడానికి విశేష సందర్భం ఏమీలేదు, పనికట్టుకుని రాసిందీ కాదు… ఒకప్పటి నిర్మాత కాట్రగడ్డ మురారి రాసుకున్న బయోగ్రఫీ ‘నవ్విపోదురుగాక’ పుస్తకం మరోసారి తిరగేస్తుంటే… ఈ ఎపిసోడ్ దగ్గర చాలాసేపు మనం ఆగిపోతాం… మథనంలో పడిపోతాం… మనం చదువుకున్న చరిత్ర మీద మనమే సందేహంలో ఇరుక్కుపోతాం… ఇది గాంధీ కొడుకు కథ… గాంధీ కథతో పోలిస్తే నిజానికి తన కొడుకుది కథే కాదు… పైగా భ్రష్ట జీవితం… అయితే అలా మారడానికి తండ్రే కారణమా..? జాతికే […]
‘‘నా మొగుడిని వదిలేయండి.., నేను పిల్లల్ని కనాలి… అది నా హక్కు…’’
నిన్ననే కదా, కేరళ హైకోర్టుకు వచ్చిన ఓ కేసు గురించి మాట్లాడుకున్నాం… అంగప్రవేశం జరిగితేనే అత్యాచారం కిందకు లెక్క అంటాడు నిందితుడు… తొడలకు నా పురుషాంగం తాకితే అది రేప్ కాదు అంటాడు… ఛట్, మూసుకో, అనుచిత లైంగిక వాంఛతో చేసే ప్రతి పనీ లైంగిక దాడే అంటూ హైకోర్టు తేల్చేసింది… అలాగే ‘చర్మ స్పర్శ’ జరగకపోతే అది లైంగిక దాడే కాదు అని ఓ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏకంగా సుప్రీం విచారణ జరుపుతోంది… […]
ఔనా..? మోడీతో జగన్‌కు నిజంగానే బెడిసిందా..? ఐతే ఎక్కడబ్బా..?!
ఒకే ఒక చిన్న ప్రశ్న… కాదు, పెద్ద ప్రశ్నే…. వైసీపీ మంత్రులు బీజేపీ మీద తొలిసారిగా విరుచుకుపడుతున్నారు కదా… ఇన్నాళ్లూ మోడీ అడుగులకు మడుగులొత్తిన జగన్ అకస్మాత్తుగా తిరగబడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నాడెందుకు అనే చర్చల నేపథ్యంలో… జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు ప్లస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల ఆరోపిస్తున్నారు కదా… అందుకే ఈ ప్రశ్న… ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశాలున్నాయా..? కూల్చేస్తే బీజేపీకి ఫాయిదా ఏమిటి.,.? ఫాయిదా లేనప్పుడు, బీజేపీ ఆ […]
కొండంత ప్రతిభ మాత్రమే సరిపోదు… పిసరంత అదృష్టమూ తోడవ్వాలి….
ఒక్క స్ట్రోక్… ఒకే ఒక్కటి… సరిగ్గా వర్కవుట్ అయి ఉంటే… బెంగుళూరు అదితి అశోక్ కనీసం కాంస్యం గెలిచి ఉండేది… వర్షం పడి ఉంటే రజతమే గెలిచేదేమో… ఆ పిల్ల చిన్నప్పటి నుంచీ ఎన్నో ఆశల్లో, ఎన్నో కలల్లో పెరిగింది… కానీ కుదర్లేదు…! ఒక్క గోల్… ఒకే ఒక్క గోల్… మన వందన కటారియా లేదా మన రాణి రాంపాల్ గనుక కొట్టి ఉంటే వుమెన్ హాకీ ఈవెంటులో కనీసం కాంస్యం కొట్టేవాళ్లు… కానీ అదృష్టం కరుణించలేదు… […]
‘‘అంగప్రవేశం’’ జరిగితేనే అత్యాచారమా..? కేరళ హైకోర్టులో ఇంట్రస్టింగ్ కేసు…!
ఇన్ సెన్సిటివ్ అయిపోతున్నామా..? నిజంగా చర్చించాల్సినవి, ఆందోళన పడాల్సినవి వదిలేసి… పక్క దోవల్లో పడి, కీలకాంశాల నుంచి తప్పించుకుని చాటుచాటుగా వెళ్లిపోతున్నామా..? మొన్నటి ఓ వార్త చదివితే అలాగే అనిపించింది… సొసైటీకి పెద్ద జాడ్యం- పిల్లలపై అత్యాచారాలు… మన దిక్కుమాలిన సినిమాల పుణ్యమాని… స్కూల్ ఏజ్ నుంచే కామాన్ని ఎక్కిస్తున్నామ్… ‘ఆ పని’ కోసం దేనికైనా తెగించాలనే ‘కుతి’ని దట్టిస్తున్నామ్… అది ఆడపిల్లల పాలిట నరకం అవుతోంది… కానీ దోషులను మనం శిక్షించగలుగుతున్నామా..? ఉన్న చట్టాలకే కొత్త […]
నీరజ్ చోప్రా…! ఈ ‘బంగారు బల్లెం’పై బోలెడు ఇంట్రస్టింగ్ సంగతులు..!!
నీరజ్ చోప్రా… ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతున్నది కదా… మరి ఒక్క ఒలింపిక్ స్వర్ణపతకం కోసం ఎంతో కరువులో ఉన్నాం కదా ఏళ్లుగా..?! ఆ ఆకలి తీర్చాడు… అవునూ, ఆకలి అంటే గుర్తొచ్చింది… నీరజ్ మొదట్లో వెజిటేరియనే… జావెలిన్ ప్రాక్టీస్ చేస్తున్న తొలిరోజుల్లో కూడా చపాతీలు, కాయగూరలు… అంతే… కానీ స్టామినా కావాలంటే నాన్ వెజ్ తప్పదు, యూరప్ వంటి దేశాలు వెళ్తే మరీ తప్పదు అని ఎవరో చెబితే చికెన్ తినడం స్టార్ట్ చేశాడు… […]
‘‘ఓవరాక్షన్ చేస్తున్నాడు… అసలు ఈ సబ్ కలెక్టర్ కులమేంటో ముందు కనుక్కొండిరా..’’
ముందుగా ఓ వార్త చదవండి… మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు ఎక్కడో పది భూతద్దాలు వేసుకుని వెతికితే కనిపించవచ్చు… ‘‘కైకలూరు… ఓ సాధారణ రైతు వేషం వేశాడు సబ్ కలెక్టర్… ఎరువుల షాపులకు వెళ్లాడు… ముందుగా ఒక ఓ దుకాణంలోకి వెళ్లాడు… సేటూ, ఫలానా ఎరువులు కావాలి… అక్కడ స్టాక్ ఉంది, కానీ సదరు వ్యాపారి, ఆ ఎరువులు లేవు అన్నాడు… అక్కడి నుంచి మరో షాపుకి వెళ్లాడు… అడిగిన ఎరువులు అన్నీ ఇచ్చాడు… కానీ గరిష్ట […]
మొన్నటిదాకా కరోనా గుప్పిట్లో… ఇప్పుడు తొలి ఒలింపిక్ పతకం ముంగిట్లో…
కొన్ని విశేషాలు చదువుతుంటే ఆశ్చర్యమేస్తుంది… అదితి అశోక్… ఒలింపిక్స్‌లో మరో భారతీయ యువకెరటం… గోల్ఫ్‌లో మొట్టమొదటి ఒలింపిక్స్ పతకాన్ని సాధించే భారతీయ మహిళ కాబోతున్నదనే ఆశ నెలకొంది ఇప్పుడు… నిజానికి ఆమె వరల్డ్ ర్యాంకింగ్ ఎంతో తెలుసా..? 200 స్థానం… ఒలింపిక్స్ ర్యాకింగ్ చూసుకున్నా తక్కువే… 45… అంతేకాదు, డబుల్ వీసా కోసం ఆమె పాస్‌పోర్టు చాలారోజులు కాన్సులేట్‌లో ఇరుక్కుపోయింది… మే నుంచి జూన్ నడుమ కరోనాతో బాధపడింది… కీలకమైన ప్రాక్టీస్ లోపించింది… అసలు ఈసారి ఒలింపిక్స్‌కు […]
భేష్ మీరాబాయ్ చాను..! ఇప్పుడు నచ్చేశావ్ మరింతగా…!
ఎంతైనా ఎదుగు, అంతే ఒదుగు అంటారు పెద్దలు… అలాగే మూలాలు మరిచిపోకపోవడం, సాయపడిన వారిని మరిచిపోకపోవడం కూడా పెద్దలు చెప్పే చద్దన్నం వంటి నీతిమాట… ఈ విషయంలో మన మణిపురి రజతం మీరాబాయ్ చాను నిజంగా మణిపూస… ఈ వార్త చదువుతూ ఉంటేనే ఆనందమేసింది.., విషయం ఏమిటంటే..? ఈమె సొంతూరు Nongpok Kakching… ఇది ఇంఫాల్‌కు 20-25 కిలోమీటర్లు ఉంటుంది… స్పోర్ట్స్ అకాడమీలో చానుకు ట్రెయినింగ్, అది ఉన్నదేమో ఇంఫాల్‌లో… ఈమె ఉండేది సొంతూళ్లో… రోజూ పొద్దున్నే […]
‘దిగు దిగు దిగు నాగా’ అన్నాడు కదా…. బాగా లోతుగా దింపేస్తున్నారు పాఠకులు…
సిగ్గూశరం లేని అనంత శ్రీరామ్ రాసిన ఆ వెకిలి, లేకి, వెగటు, బూతు, దరిద్రపు పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయో అని యూట్యూబ్ చూస్తే 34 లక్షల దాకా దాటిపోయింది… హబ్బో… మనవాళ్ల టేస్టుకు తిరుగులేదు, ఇదే కదా మన సినిమా మూర్ఖులకు అసలు బలం అనుకున్నాను… సర్లే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆది నుంచీ ఇదే టైపు కదా… ఆమధ్య సిరివెన్నెల అనే మరో ఘన చరితార్థ దరిద్రుడు ‘‘ఓ పూజా హెగ్డే, నీ కాళ్లు […]
మిమి..! మన కొత్త ‘దర్శకుల’కు ఎందుకు చేతకావడం లేదు ఈ కథలు..?
కెరీర్ పరుగు, అస్థిరమైన కొలువులు, ఒత్తిళ్లు, కాలుష్యంతో దిగజారుతున్న ఆరోగ్యాలు, స్టామినా… 30 ఏళ్లు దాటినా జరగని పెళ్లిళ్లు… 30 దాటితే నిలవని గర్భాలు… ఎన్నో సమస్యలు… సంతానహీనత ఎప్పుడూ ఉన్నదే కానీ గతంలో మహిళలు గంపెడు మందిని కనేవాళ్లు, పెంచేవాళ్లు… ఇప్పుడు అంత వీజీ కాదు… అమ్మో ఒకరు చాలు అనేలా… అసలు లేకపోతేనేం అనేవాళ్లు కూడా… చేదునిజం ఏమిటంటే..? ఈ పిండాన్ని మోయడం ఏమిటి..? సర్జరీ చేయించుకుని కనడం ఏమిటి..? పాలివ్వడం ఏమిటి..? జెనెటిక్ […]
ఈసారికి సారీ నాన్నా.., వచ్చేసారి నీ ఫోటో దగ్గర బంగారు పతకం పెడతాను చూడు..!!
‘‘నాన్నే నాకు స్పూర్తి… తను ఎంత కష్టజీవో నాకు బాగా తెలుసు… ఓ చిన్న రైతు… తన భూమే తన సర్వస్వం…. ఎప్పుడు చూసినా పొలంలో ఏదో పనిచేస్తుండేవాడు… నాకు మంచి చదువు చెప్పించాలనేది నాన్న కోరిక… ‘ఒరే నాన్నా, మన భూమి, మన శ్రమే మన గుర్తింపు… డబ్బు అంత త్వరగా ఏమీ రాదు, మనలాంటోళ్లకు కాయకష్టం, పంటపొలం లేకపోతే డబ్బేది..?’ ఇలాంటి ముచ్చట్లే చెప్పేవాడు… ఊళ్లోకి ఏ కొత్త కారు వచ్చినా ఆసక్తిగా చూస్తుండేవాడు… […]
ఇది పంచుడు పథకం కాదు… అనాథలకు ఒక తల్లిగా… ఒక తండ్రిగా అండ…
రాజధర్మం అంటే…? కులానికి, ప్రాంతానికీ, వర్గానికీ అతీతంగా ప్రజల్ని ఆదుకోవడం… ఆదరించడం…! కానీ మనం ఎలా తయారయ్యాం..? వోటు బ్యాంకు కోసం రాజధర్మం కాదు, రాజకీయధర్మం మాత్రమే పాటిస్తున్నాం… రాజకీయం కోణంలో మాత్రమే సంక్షేమ పథకాలు, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పరిపాలన నిర్ణయాలు, స్వలాభం కోసమే అడుగులు… పైగా దాన్ని ఘనతగా వందిమాగధులతో కీర్తింపజేసుకుంటాం… పాలకుడికి మానవీయ కోణం ఉండాలి, అది కూడా మరిచిపోతున్న తీరు మరీ దారుణం… కరోనా కారణంగా వేల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి… […]
నాడు మనవాడు చెవి కొరికేశాడు… నేడు మనవాడి భుజంపై పళ్లు దింపేశాడు…
ఒలింపిక్స్ అనగానే… అదొక అంతర్జాతీయ వేడుక, అంతా నాగరికంగానే జరుగుతుంది అనుకుంటే అది మన భ్రమ… ప్రతి ఆటా మరీ మడత నలగని ఫైట్లేమీ కాదు… ఒళ్లు హూనమయ్యేవీ బోలెడు… కానీ ఇది మరో టైపు… అనాగరికం అనే పదం సరిపోదు, ఇంకేదో వెతకాలి… పేరుకు మనం క్రీడాస్పూర్తి, తొక్కాతోలూ అని మాట్లాడుతూ ఉంటాం… ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది కొందరు క్రీడాకారులు ఎంత కచ్చగా వ్యవహరిస్తారో… ఇది చూస్తే ప్రతి క్రీడాభిమాని మనసు […]
లవ్లీనా కాదు… లవ్లీ గాళ్..! సొంతూరికి పతకం, గర్వం ప్లస్ ఓ పక్కా రోడ్డు కూడా…!!
ప్రభుత్వ ఉన్నతాధికారులు అంటేనే మెదళ్లు ఎక్కడ ఉంటాయో తెలిసిందే కదా… అస్సాం అయినా సరే, అండమాన్ అయినా సరే… ఈ కేరక్టర్లు మాత్రం ఏమాత్రం తేడా లేకుండా ఇలాగే ఉంటయ్… అధికశాతం… ఈ ఉదాహరణ చదివితే మన నమ్మకం మరింత రూఢీ అయిపోతుంది… నిన్న మన బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కాంస్య పతాకాన్ని సాధించింది… చదివారు కదా… అసలే అరంగేట్రం, ఐనా సరే ఆత్మవిశ్వాసంతో… ఒలింపిక్స్ పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర రాసుకుంది… అంతర్జాతీయ బాక్సింగులో […]
- « Previous Page
- 1
- …
- 395
- 396
- 397
- 398
- 399
- …
- 467
- Next Page »