Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీ9 రవిప్రకాశ్‌పై మళ్లీ ఈడీ కొరడా… జైలులో పెట్టించాలనేదే కోరిక…!!

March 12, 2022 by M S R

raviprakash

కొన్ని వార్తలు అనామకంగా ప్రజల దృష్టికి రాకుండా వెళ్లిపోతుంటయ్… ఈనాడు ఇలాంటి వార్తల్ని ‘‘అచ్చేసీ వేయనట్టు’’ అస్పష్టంగా అచ్చేస్తుంది… మిగతా పత్రికలకు అసలు ఏ సోయీ ఉండదు… అలాంటిదే ఈ వార్త కూడా… ఓ చిన్న సింగిల్ కాలమ్ బిట్… సరిగ్గా చూస్తే స్పేస్ ఫిల్లర్… అనగా ఖాళీని భర్తీ చేసే చిన్న వార్త… సరే, వేశాంలే, చదివితే చదువు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది… విషయం ఏమిటంటే..? రవిప్రకాశ్ తెలుసు కదా… టీవీ9 ఫౌండర్ డైరెక్టర్… […]

ఈ సోకాల్డ్ ప్రాంతీయ శక్తులకు కేజ్రీవాల్ ఎందుకు ‘అస్పృశ్యుడు’ అయ్యాడు..?!

March 12, 2022 by M S R

aap

రాజకీయ సంస్కారం గురించి చాలా గొప్పలు చెబుతారు… నీతులు చెబుతారు… కానీ ఆ సంస్కారం కూడా అవసరాల పరిధిలో మాత్రమే ఉంటుంది… అది రాజకీయ నాయకుడి లక్షణం… అబ్బే, కేసీయార్ ఆరోగ్యంపై ప్రత్యర్థి కార్యకర్తల సోషల్ పోస్టుల వెటకారాల గురించి చెప్పడం లేదు… కేజ్రీవాల్‌కు ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతల నుంచి దక్కని మర్యాద గురించి…! కచ్చితంగా కేజ్రీవాల్ పంజాబ్‌లో సాధించిన విజయానికి ప్రాధాన్యం ఉంది… గోవాలో సీట్లు గెలిచింది పార్టీ… హర్యానాపై దృష్టి పెట్టింది… ఢిల్లీలో […]

ఏదేమైనా సరే… నగరిలో రోజాపై పోటీకి వాణీ విశ్వనాథ్ రెడీ అట… తగ్గేదేలే…

March 12, 2022 by M S R

vani

ప్చ్… ఉక్రెయిన్, యూపీ ఎన్నికల గొడవల్లో మునిగిపోయి… ఓ సీరియస్ సరదా వార్త మిస్సయిపోయారు చాలామంది… వాణివిశ్వనాథ్ తెలుసు కదా… సినిమా నటి… ఆమె పేరు వినగానే అప్పట్లో చిరంజీవితో రెచ్చిపోయి చేసిన ఓ వానపాట గుర్తొస్తుంది… సామ్రాట్ అశోకలో ఎన్టీయార్ భార్యగా కూడా చేసినట్టుంది… ఆమె ఈమధ్య నగరికి వచ్చింది… అదేనండీ జబర్దస్త్ రోజా నియోజకవర్గ కేంద్రం… అందులో ఒకటో వార్డు… శామాలమ్మ గుడికి వెళ్లింది వాణి… మొక్కులు తీర్చుకుంది, కొందరు జనం ఆమెకు మంగళహారతులతో […]

రాజేంద్రప్రసాద్‌కు అప్పుడర్థమైంది రామోజీ మార్క్ మర్యాద ఏమిటో..!!

March 12, 2022 by M S R

vamsy

చాలా ఏళ్ల క్రితం… రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే హీరో అవుతున్నాడు… భానుప్రియ మాంచి జోరు మీదుంది… దర్శకుడు వంశీకి ఒకటీరెండు మంచి హిట్లు పడ్డయ్… రామోజీరావు అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద సినిమాలు నిర్మిస్తున్న రోజులు… వంశీకి ఓ సినిమా అప్పగించాడు… పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… షూటింగు, ఏర్పాట్లు వంటి వ్యవహారాల్ని బాపినీడు చూసుకునేవాడు… రాజేంద్రప్రసాద్ శ్రీదుర్గ లాడ్జిలో ఉన్నాడు… ఓ సాయంత్రం వంశీ ఉన్న వేరే రూమ్‌కొచ్చాడు… వంశీ రూమ్ షెల్ఫుల్లో రకరకాల పచ్చళ్ల సీసాలు […]

నెవ్వర్… కార్తీకదీపం అప్పుడే ఆరిపోలేదు… ఇప్పట్లో పోదు… కొత్తగా వాయిస్తారు…

March 12, 2022 by M S R

karthika deepam

స్ట్రెయిట్ కామెంట్… డిస్‌క్లెయిమర్… ప్రతి టీవీ సీరియల్ ఓ చెత్త… కానీ ఎక్కువ వీక్షణలు దక్కేవి టీవీ సీరియళ్లకే… కారణం :: నాసిరకం సినిమాలు, వేరే వినోదం లేకపోవడం, టీవీ సీరియల్ అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కావడం… వాటి గురించి చెబుతూ పోతే ఒడవదు, తెగదు… కానీ ఒక సీరియల్ గురించి నెట్‌లో ఈ రేంజ్ చర్చ జరగడం తొలిసారి… అదే కార్తీకదీపం సీరియల్ ముగింపు గురించి..! యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లయితే కథనాలు కుమ్మేస్తున్నయ్… […]

ఈటీ బ్లండర్… అసలు సూర్య ఈ సినిమా అంగీకరించకుండా ఉండాల్సింది…

March 11, 2022 by M S R

et

చేజేతులా చెడగొట్టుకోవడం అంటే ఇదే..! నిజానికి హీరో సూర్య ఈ సినిమాను ఒప్పుకోవాల్సింది కాదు… మరి ఎందుకు ఈ కథను ఎంచుకున్నాడో తెలియదు… కెరీర్‌కు బురద పూసుకోవడం అంటారు దీన్నే… సూపర్ పాపులారిటీ ఉంది.., జైభీమ్, ఆకాశం నీ హద్దురా ఓటీటీ సినిమా విజయాలు ఈమధ్యే తన ఖాతాలో పడ్డాయి… అందరిలాంటి హీరో కాదు, తెలివైనవాడు, మంచి కథలు-ప్రయోగాలతో ప్రేక్షకుల అభిమానం పొందుతున్నాడు అనే పేరొచ్చింది… ఏం లాభం..? ఓ పాత చింతకాయ పచ్చడిని వడ్డించాడు మనకు… […]

తెల్లవారిందా..? అరె, అదేమిటి మరి..? నమస్తే కోడి కూయనేలేదుగా..!!

March 11, 2022 by M S R

nt

వెంకటేష్ నటించిన హిట్ సినిమా దృశ్యం గుర్తుందా… ‘‘ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు మనం అసలు ఊళ్లోనే లేము… అసలు ఆ సంఘటన ఏమిటో మనకు తెలియదు… మనకేమీ తెలియదు… అంతే…’’ అని కుటుంబసభ్యులకు నూరిపోస్తాడు… అవసరం అది… పర్ సపోజ్, ఆ దృశ్యాన్ని నమస్తే తెలంగాణ భాషలో చెప్పాలంటే… ‘‘అసలు ఆ అయిదు రాష్ట్రాలకు ఎన్నికలే జరగలేదు… మనకేమీ తెలియదు… అసలు ఆ ఎన్నికలేమిటో మనకు తెలియదు…’’ నమస్తే తెలంగాణ ఎన్నికల కవరేజీ తరీఖ చూస్తే […]

హస్తరేఖలు తిరగబడ్డయ్… విధిరాత వెక్కిరించింది… ఇది ప్రభాస్ సినిమాయా..?!

March 11, 2022 by M S R

radheshyaam

నిజానికి ఓ సినిమాకు అవసరమైనన్ని ముందస్తు హైప్ పాయింట్లకన్నా చాలా ఎక్కువ… రాధేశ్యామ్… బాహుబలి, సాహో తాలూకు ఇమేజీ నుంచి బయటపడటానికి ప్రభాస్ ఓ పిరియాడిక్, డిఫరెంట్ లవ్ స్టోరీ ఎంచుకోవడం… 300 కోట్లు ఖర్చు చేయడం… విజువల్స్ మీద భారీగా ఖర్చుపెట్టడం… పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌గా ఉండటం… ట్రెయిలర్స్ బ్రహ్మాండంగా హిట్ కావడం… ప్రభాస్ లుక్కే కొత్తగా ఉండటం… అలనాటి దిల్ కా దడ్కన్ భాగ్యశ్రీ తల్లిగా నటిస్తుండటం… విధి, ప్రేమ నడుమ […]

తెలుగు టీవీ మోడరేటర్లకు హైబీపీ… అదుపు తప్పి ఆవేశంతో ఊగిపోతున్నారు…

March 11, 2022 by M S R

channels

తెలుగు చానెళ్లు బాగా ఎదిగిపోతున్నయ్… పోతున్నయ్ ఏంటీ, పోయాయ్… ఇప్పుడున్నవన్నీ రంగులు పూసుకున్న చానెళ్లే కదా… అనగా ఏదో ఓ పార్టీకి డప్పు కొట్టేవే కదా… ప్రత్యర్థి పార్టీల మీద టన్నుల కొద్దీ బురదను చల్లేవే కదా… అఫ్‌కోర్స్, కాస్త ఎక్కువ కాస్త తక్కువ, అంతేతప్ప ఏ చానెలూ మినహాయింపు కాదు… వాటి ఓవరాక్షనే ఓవరాతి యాక్షన్ అయిపోతోందిరా దేవుడా అని ప్రేక్షకుడు తలపట్టుకుంటే… ఆ చానెళ్లలో మోడరేటర్లు, ప్రజెంటర్లు ఆ ఓవరాక్షన్‌ డోస్ మరింత పెంచుతున్నారు… […]

ప్రియాంక, మాయావతి కూలిపోయినచోట… ఈమె రెండు సిక్సర్లు కొట్టింది…

March 11, 2022 by M S R

అనుప్రియ

ఈమె గురించి ఓసారి చదవాలి… ఒక మహిళ నేత, యూపీ ఎన్నికల్లో ది గ్రేట్ ప్రియాంక గాంధీ ఎన్ని సీట్లు గెలిచింది..? జస్ట్, రెండు..! 136 సంవత్సరాల పార్టీ, దేశాన్ని ఏళ్లపాటు పాలించిన పార్టీ దురవస్థ అది… సరే, దాన్ని కాసేపు వదిలేయండి… మరో మహిళ… బీఎస్పీ మాయావతి… ఒకప్పుడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి… అవకాశం దొరికితే తనూ ప్రధాని కావాలనేంత ఆశలుండేవి… ఆమె గెలిచిన సీట్లు ఎన్ని..? జస్ట్, ఒకటి..! ఇక్కడే ఇంకో మహిళ గురించి […]

ఒరేయ్ చారీ… నిజానికి ఏపీ పాలిటిక్స్, ఉక్రెయిన్ యుద్ధమూ సేమ్ సేమ్‌రా…

March 11, 2022 by M S R

AP UKRAINE

★ గురువుగారూ.. అసలు ఈ యుద్ధమేంది? ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు దాడులు చేస్తోంది? ఉక్రెయిన్ తో నాట్ ఓకేకి సంబంధం ఏంది? ఈ యుద్ధానికి సంబంధించిన జ్ఞానం ఏందో కాస్త చెప్పండి గురువు గారూ! ◆ హహహ… ఒరేయ్ చారీ.. అది “నాట్ ఓకే” కి కాదురా.. ”నాటో”కి అనాలి. అసలు ఇవన్నీ అర్థం కావాలంటే రష్యా, ఉక్రెయిన్, బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, పోలెండ్, హంగేరీ, చైనా, పాకిస్తాన్, జపాన్ ఈ దేశాలన్నింటికీ […]

కాంగ్రెస్ పార్టీని ఎవడూ చంపలేడు… అది ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప…!!

March 10, 2022 by M S R

tpcc

ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ గురించి…. దేశానికి స్వరాజ్యం తెచ్చి, సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీ ప్రస్తుత దుర్గతి గురించే… ఆర్ణబ్ గోస్వామి భాషలో చెప్పుకోవాలంటే వాద్రాల పరాజయం… అంటే సోనియా కుటుంబం ఘోర పరాజయం… భవిష్యత్తు కనిపించని ఓ పెద్ద జాతీయ పార్టీ… కాంగ్రెస్ ముక్త భారత్ అనే మోడీ లక్ష్యాన్ని రాహుల్ నిజం చేస్తున్నాడా అనే సెటైర్ నిజం అవుతున్న చేదు దృశ్యం… ఇందిర పోలికలున్నంత మాత్రాన… గంగలో నాలుగుసార్లు అవసరార్థం మునకలు […]

రేషన్, ప్రశాసన్… ఉత్తరప్రదేశ్ ఫలితాలపై ఇదే అసలైన విశ్లేషణ…

March 10, 2022 by M S R

yogi

ఆకలితో ఉన్నవాడి కడుపు నింపు… కడుపు గొట్టేవాడి తాట తీసెయ్………. ఇదే యోగిని ఓ చారిత్రిక విజయతీరాలకు చేర్చింది… ఇదే సత్యం… ఈ సోకాల్డ్ జర్నలిస్టుల సుదీర్ఘ, నిరర్థక విశ్లేషణలు, మన్నూమశానం వదిలేయండి… ఫీల్డు‌లో బాగా తిరిగి, జనాభిప్రాయం సరిగ్గా తెలుసుకున్న మన హైదరాబాదీ జర్నలిస్టులు కూడా చెప్పింది ఇదే… ‘‘బాబా ఔర్ మోడీ’’… అంటే యోగి పాలన, మోడీ పట్ల జనాదరణ, ప్రత్యేకించి మహిళల వోట్లు బీజేపీని పైకి లేపాయి, అఖిలేష్‌ను తొక్కేశాయి… దేశ రాజకీయాల్లో […]

వెలుగులోకి బోలెడు గానకోకిలలు… తెలుగు చానెళ్లలో ‘సంగీతపు హోరు’…

March 10, 2022 by M S R

music

సాధారణంగా ఆహా ఓటీటీలో కంటెంట్ నాణ్యత మీద పెద్దగా సదభిప్రాయం లేదు… ఏదో ఒకటి తీసుకొచ్చి డంప్ చేస్తున్నారనేదే జనాభిప్రాయం… ఇండియన్ ఐడల్ తెలుగు పేరిట పాటల పోటీ షో పెడుతున్నారు అనగానే చాలామంది ప్రేక్షకులు నవ్వి, లైట్ తీసుకున్నారు… పైగా కాపీల తమన్, చాలారోజుల నుంచి వినిపించని- తెలుగు రాని సింగర్ కార్తీక్, పార్ట్ టైమ్ గాయని నిత్యా మేనన్ జడ్జిలు అని చదివి, చూసి సవాలక్ష షోలతో ఇదీ ఒకటి అనుకున్నారు అందరూ… మొదట్లో […]

స్వాతి వీక్లీ మీద కేసు..! ‘సరసమైన కంటెంట్’ గతి తప్పిందట… అయితే..?

March 10, 2022 by M S R

swathi

ఈ వార్త చదివి మూడునాలుగు రోజులవుతున్నట్టుంది… సీపీఎం పత్రిక ప్రజాశక్తిలో వచ్చింది… మెయిన్ పేజీలోనే కనిపించింది… నో డౌట్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనగా ఐద్వా అనగా ఆ పార్టీ అనుబంధ సంఘం మహిళల సమస్యలపై పోరాడుతుంది, ఆ స్పిరిట్ కనిపిస్తుంది… అది వోకే… కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ కేసు పెట్టింది… ఎవరి మీద..? స్వాతి వారపత్రిక మీద..!! ఏమని..? మహిళల అసభ్య చిత్రాలను, పంచరంగుల బ్లోఅప్ ఫోటోలను, లైంగిక సంబంధ […]

ఎగ్జిట్ పోల్ రిజల్టే నిజమైతే… అది ఖచ్చితంగా మహిళలు దిద్దిన విజయతిలకమే…

March 9, 2022 by M S R

yogi

‘‘ఉత్తరప్రదేశంలో బీజేపీ గెలవబోతుందనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… ఆరు వారాలుగా నేను యూపీలో తిరుగుతున్నాను, గ్రామీణ వోటర్లతో సంభాషించినప్పుడు నాకు అర్థమైంది కూడా అదే… నిజానికి ఎస్పీ ఈసారి గెలవబోతుందనే హైప్ ఎలా క్రియేటైంది..? 1) కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు బలహీనపడటం  2) అఖిలేష్ సభలకు జనం పోటెత్తడం 3) రైతుల ఆగ్రహ ప్రదర్శనలు 4) యాదవ, ముస్లిం, జాట్ వోటర్లు ఎస్పీకి బలమైన మద్దతుగా నిలవడం 5) ఠాకూర్ యోగి […]

ఉక్రెయిన్ సంక్షోభం వెనుక అసలు శక్తి ఎవరో, కారణాలు ఏమిటో తెలుసా..?

March 9, 2022 by M S R

ukraine

ఉక్రెయిన్ సంక్షోభం ఎవరి తప్పు..? రష్యాదేనా..? నాటో తొత్తుగా మారిన ఉక్రెయిన్ అధ్యక్షుడిదా..? లేక అమెరికా, నాటో దేశాలదా..? అసలు తెరవెనుక శక్తులేవి..? ఉక్రెయిన్ ఎందుకు పావుగా మారింది..? ఆ దేశం మళ్లీ ఇప్పట్లో కోలుకుంటుందా..? ఇవన్నీ వదిలేసి, మీడియా చిల్లర చర్చలు పెడుతోంది… మార్క్సిస్ట్ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు ప్రభాత్ పట్నాయక్ రాసిన ఓ వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది… ఐఎంఎఫ్ ఆడుతున్న అసలు ఆట ఏమిటో చెబుతున్నాడు… మన దృష్టికోణాన్ని ఇంకాస్త లోతుల్లోకి మరలుస్తున్నాడు… అలాగని […]

జగన్ దేకలేదు సరే, ఇదేమని అడిగిన వైశ్య గొంతులేవీ..? ఇంత గడగడ దేనికి..?!

March 9, 2022 by M S R

rosaiah

నిజంగా మరణానంతరం కొణిజేటి రోశయ్యకు జరిగే అవమానాలు చూస్తుంటే జాలేస్తుంది… ఏ ఆర్యవైశ్యులకు ఓ గర్వ ప్రతినిధిగా గుర్తించి, గౌరవించారో ఆ వైశ్యసంఘాలు సైతం కిక్కుమనకపోవడం ఆశ్చర్యంగా కూడా ఉంది… ఓ బలమైన సామాజికవర్గం తన ఉనికిని చాటుకునే సోయిలో లేకపోవడం వింతగానే ఉంది… ఆయనకు ఏ చరిత్ర లేదా..? ఏ గౌరవమూ అక్కర్లేదా..? తను సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు… రాష్ట్రాన్ని ఏమీ అమ్ముకోలేదు… గ్రూపులు పెట్టలేదు… చిల్లర భాషకు దిగలేదు… రాజకీయాల్లో […]

అందరూ అయిపోయారు… ఎక్సట్రా జబర్దస్త్‌గా ఇక ఇంద్రజ మీద పడ్డారు…

March 9, 2022 by M S R

indraja

బూతుల జబర్దస్త్ షోకు శ్రీదేవి డ్రామా కంపెనీ షోను పెద్ద భిన్నంగా చూడలేం… అవే పిచ్చి పంచులు, వెకిలి కామెడీ… కాకపోతే కొన్ని భిన్నమైన కాన్సెప్టులతో కొన్ని ఎపిసోడ్లు రన్ చేస్తున్నారు… అవి బాగుంటున్నయ్… మంచి రేటింగ్స్ వస్తున్నయ్… అవును, ఆ కామెడీ కళ తగ్గిన ఢీ షోకన్నా ..! ఉదాహరణకు నిన్నో మొన్నో వుమెన్స్ డే సెలబ్రేట్ చేస్తూ కమెడియన్ల అక్కాచెల్లెళ్లను, అమ్మలను పిలిచి, వాళ్లతోనూ పర్‌ఫామ్ చేయించారు… ప్రేక్షకుడికి బాగానే కనెక్టయింది… దీనికి యాంకర్ […]

అవును.., ఇప్పుడు రష్యాను బరాబర్ సపోర్ట్ చేస్తాం… ఎందుకో తెలుసా..?

March 9, 2022 by M S R

russia

పార్ధసారధి పోట్లూరి…….   మీరు రష్యా వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ! అది అంత మంచిది కాదేమో ? ఇది కొంతమంది మిత్రుల మరియు శ్రేయోభిలాషుల కామెంట్స్ ! ఎప్పుడూ ఏక ద్రువ ప్రపంచం ఉండడం మంచిది కాదు. భిన్న ధ్రువ ప్రపంచం ఉండడం అందరికీ మేలు చేస్తుంది. ఒక దేశం అపారమయిన సంపదతో పాటు అధునాతన ఆయుధాలు కలిగి ఉంటే ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో హిట్లర్ చెప్పాడు… ఆర్యులు మాత్రమే ఈ ప్రపంచాన్ని శాసించాలి అనే […]

  • « Previous Page
  • 1
  • …
  • 407
  • 408
  • 409
  • 410
  • 411
  • …
  • 415
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఆ జర్నీలో అనుకోని పరిచయం… ఒకరు సీఎం, మరొకరు పీఎం అయ్యారు…’’
  • ‘‘అంతటి లత బాగా పాడలేదనీ, మళ్లీ పాడమని అడగాలా, నెవ్వర్, నావల్లకాదు…’’
  • చేతగాకకాదు.., బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!
  • జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!
  • అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!
  • వావ్… వాట్ ఏ క్రికెట్ మ్యాచ్… మూడు సూపర్ ఓవర్లతో ఫలితం…
  • దిల్ రాజు గారూ… మరి మీకూ బాధ్యత ఉండాలి కదా, మరిచారా..?!
  • మోడీ సైప్రస్ ఫోటో వెనుక… శత్రు తుర్కియేకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్..!!
  • జాగ్రత్త, ప్రభుత్వ సంస్థల పేరిట సైబర్ ఫ్రాడ్… పదిమందికీ షేర్ చేయండి…
  • లతా, ఎందుకు చేశావీ పని..? గాంధీ మునిమనమరాలు- ఓ ఫ్రాడ్ కేసు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions