చిరంజీవి ఇప్పుడేమీ కాకపోవచ్చు… కానీ తను నటుడిగా బాగా బతికిన రోజులనాటి ఒక్క విషయం చెప్పుకోవాలి… 1984 కాలం కావచ్చు… మహానగరంలో మాయగాడు అనే ఓ సినిమా వచ్చింది… తనే హీరో… ఓ ఎపిసోడ్లో ధనం, ధాన్యం, సంతానం, వీరం వంటి అష్టలక్ష్ములున్నా సరే, ధైర్యలక్ష్మి లేకపోతే అందరూ వేస్ట్ అనే ఓ నీతివాక్యం బోధిస్తుంది అది… నిజం… భయం లేకపోవడం, ధైర్యంగా ఉండటం, పోరాడటమే జీవితాన్ని గెలిపిస్తుంది… కరోనా కాలం నేర్పిస్తున్నదీ అదే… నేర్చుకోవాల్సింది కూడా […]
Ad Infinitum..! తెలుగు సినిమాయే… ఓ సైన్స్, క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్… కానీ…!?
ఆశ్చర్యం వేసింది… అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది..? మామూలు సోది, సొల్లు చిత్రాలకే బోలెడంత ప్రమోషన్ యాక్టివిటీ ఉంటుంది కదా… ఈ సినిమాను చడీచప్పుడు లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు..? సినిమా బాగుంటే జనం చూస్తారు కదా అనే ధీమాయా..? కానీ కనీస స్థాయి పబ్లిసిటీ అయినా అవసరం కదా… నిజమే, ఈమధ్య మీడియా మీట్లు, స్పెషల్ ఇంటర్వ్యూల ‘‘ఖర్చు’’ విపరీతంగా పెరిగింది సరే.., పోనీ, సోషల్ మీడియాను వాడుకోవచ్చు కదా… థియేటర్ల నుంచి ఎప్పుడు […]
కెవ్వు గావుకేకారుపు..! ‘అతి’కే అతితనం నేర్పే నాటి తెలుగు మూవీ సీన్లు…
…. By……. Gottimukkala Kamalakar………… అదో పూరిగుడిసె..! ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవర్లే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి. గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు […]
Destiny..! ఆరోజు తరుముకొస్తే అంతటి శ్రీకృష్ణుడికే తప్పలేదు… మనమెంత..?!
కరోనాకు దూరంగా ఉండి, అంతా బాగానే ఉందిలే అని మనం అనుకుంటున్నాం… కానీ లేదు… హోం ఐసొలేషన్, హోటల్ ఐసొలేషన్, క్వాంరటైన్, హాస్పిటల్ బెడ్, ఐసీయూ… ఎక్కడో ఓచోట కరోనా నుంచి బయటపడటానికి ఆరాటపడుతున్న రోగులు, వాళ్లు బంధువులు, ఆవిరైపోతున్న ఆస్తులు, అడ్డగోలు అప్పులు… వాళ్లకు ఏమీ బాగాలేదు… ఇది సొసైటీలో నెగెటివిటీని నింపే ప్రయత్నం కాదు… నిజం… నిష్ఠురంగా ఉన్నాసరే నిజం… సర్కార్లు ఎప్పుడూ ఇంతే… సమాజమూ ఇంతే… ఒక సమయం వస్తుంది… ఆ టైం […]
కోవాగ్జిన్‌తో పోయేదానికి రెమ్‌డెసివర్ అవసరమా..? అర్థం కాలేదా..? చదవండి…!!
వేక్సిన్ వేసుకున్నా సరే, మా పక్కింటామెకు కరోనా వచ్చింది… వేక్సిన్ వేసుకుంటేనే మా చుట్టాలమ్మాయికి కరోనా వచ్చింది… కరోనా రాదనే గ్యారంటీ లేనప్పుడు వేక్సిన్ దేనికి మరి..?… ఇలా ఇప్పటికీ చాలామందిలో అపోహలు… చివరకు ప్రజలకు నిజాలు చెప్పాల్సిన వైద్య ఆరోగ్య సిబ్బందిలోనే బోలెడుమంది వేక్సిన్‌కు దూరంగా ఉన్నారు… అదుగో అక్కడ అలా, ఇదుగో ఇక్కడ ఇలా అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఈ అపోహల్ని మరింత ప్రచారం చేస్తున్నారు… కొందరైతే మందు మానేయాలట […]
పేరుకే ఫ్రంట్ లైన్ వారియర్స్..! కరోనా క్షతగాత్రుల్లో ఫస్ట్ లైన్ జర్నలిస్టులదే…
సెకెండ్ వేవ్ లో… కొడిగడుతున్న జర్నలిస్టు దీపాలు ——————– శ్రీకారం రామ్మోహన్ మొదట జర్నలిస్టు. తరువాత ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ ఉద్యోగంలోకి వెళ్లారు. మంచి రచయిత. రాసినవి చాలా తక్కువే అయినా- రాసినవన్నీ మంచి రచనలే. 1996 ప్రాంతంలో “శుభం” అని ఒక కథ రాశారు. ఆ కథ ప్రారంభంలో జర్నలిస్టుల జీవితానికి అద్దం పట్టే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు. “లోకం నిద్రపోయేవేళ- లోకాన్ని నిద్రలేపడానికి వారు మేల్కొని ఉంటారు. లోకం మేల్కొన్నవేళ వారు నిద్రపోతారు” ఆయన […]
టీకా ధరల దందా..! అలుసు దొరికిందిగా… అడ్డంగా కుమ్మేయండి బ్రదర్…
ఎస్… ఖచ్చితంగా ఒక టీకా తయారీ ఖర్చు చాలా చాలా తక్కువ… అందుకే భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ తనే స్వయంగా ఒక మాటన్నాడు… కేటీయార్ సమక్షంలోనే… ఇది మన హైదరాబాదీ కంపెనీ… ఒక మంచినీళ్ల సీసాకన్నా తక్కువ ధరకు నాణ్యమైన వేక్సిన్ అందిస్తాను అన్నాడు ఆయన… వేక్సిన్ల తయారీలో ఏళ్ల అనుభవం ఉంది, కరోనాకు ఓ స్వదేశీ వేక్సిన్ వస్తుంది కదాని అందరూ ఆనందపడ్డారు… తీరా ఏమైంది..? వాటర్ బాటిల్ ధర కాదు, ఫుల్ […]
శంకర్ ఓ అపరిచితుడు..! హిట్లు తలకెక్కి… కోర్టులకెక్కి… పేరు బజారుకెక్కి…!!
ఎందుకో గానీ కొన్నిసార్లు కంగనా రనౌత్ ధోరణే కరెక్టు అనిపిస్తుంది… కాకపోతే ఆమెలాగా ఆర్గనైజ్ చేయాలి…. చేయగలగాలి… మణికర్ణిక షూటింగు సమయంలో అనేక వివాదాలు… ఆమె తన చేతుల్లోకి తీసుకుంది, నిర్మాతలు ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు… నిజజీవితంలో హీరో కావచ్చుగాక, ఓ ఆర్టిస్టుగా అడమెంటుగా ఉన్న సోనూసూద్‌ను తరిమేసింది… పేరున్న దర్శకుడు, వితండవాదిగా మారిన క్రిష్‌ను మళ్లీ సెట్లోకి రానివ్వలేదు… మంచో చెడో మనమే ప్రాజెక్టు కంప్లీట్ చేద్దాం అని చెప్పింది… ‘స్టార్ట్ కెమెరా, యాక్షన్’ […]
మా మంచి మారాజు… ఆకలేస్తే అడుక్కోనిచ్చాడు… ఎవరికి వర్తిస్తే వారికి ఇది…
ఇచ్చె ఇచ్చె రాజు… ఏమిచ్చినాడన.. ముష్టెత్తుకోనిచ్చినాడు! ——————– అపజయం అనాథ. విజయం సనాథ- విజయం బహునాథ. విన్నర్ టేక్స్ ఆల్. గెలుపును ఓన్ చేసుకోవడానికి లెక్కలేనంతమంది పోటీలు పడతారు. అపజయాన్ని ఓన్ చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే అందరూ ఉన్నా అపజయం అనాథగా ఉండిపోతుంది. గెలిచినవాడు అన్నిటినీ ఊడ్చుకుని పోతాడు. పనికిరాని పరిగెలు కూడా పరాజితుడికి మిగలవు. అనాదిగా ఇది ఆట ధర్మం. అడవిలో ఆటవిక క్రీడ అయినా, జనారణ్యంలో ప్రజాస్వామ్య క్రీడ అయినా ఇదే ధర్మం […]
రామోజీరావు గారూ ఏమిటీ వైపరీత్యం..? న్యాయదేవత ధర్మత్రాసునే అప్పగిస్తోందా..?
సార్… మీ కార్టూన్ ఏమాత్రం బోధపడటం లేదు… ఇలాంటి కార్టూన్లు గీసినప్పుడు, పాఠకుడు జుత్తు పీక్కునే అవసరం లేకుండా… ఆ కార్టూన్ అర్థ వివరణ, పరమార్థ వివరణ కూడా పనిలోపనిగా ప్రచురిస్తే మేలేమో ఆలోచించగలరు… ఎస్, గర్విద్దాం… అర్ధశతాబ్దం తరువాత ఓ తెలుగువాడు మన దేశ అపెక్స్ కోర్టుకు చీఫ్ అవుతున్నందుకు అందరమూ ఆనందిద్దాం… కానీ అభినందన మరీ విపరీత వ్యక్తి పూజ స్థాయికి అవసరమా యువరానర్..? సగటు తెలుగు హీరో అభిమాని స్థాయిలో మన పాత్రికేయం […]
ధైర్యమే అసలు వేక్సిన్..! మన వరల్డ్ ఫేమస్ వైరాలజిస్ట్ ఇంకా ఏమంటాడంటే..?
ఆర్నెల్ల క్రితం వరకూ వణికించీ… హమ్మయ్య ఇగైపోయిందనుకున్న సమయంలో… దూసుకొచ్చిన కరోనా సెకండ్ వేవ్.. ఒకవైపు పెరుగుతున్న కేసుల సంఖ్య.. అంతకుమించి కలవరపెడుతున్న మరణాలు.. శవాల దిబ్బలుగా మారుతున్న దహనవాటికలు.. శ్మశాన వాటికల్లో నిరీక్షణలు.. అంతలోనే మూడో మ్యూటెంటంటూ వార్తలు.. ఇంకోవైపు, జనసామాన్యమంతా తినితొంగునే సమయాన ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ.. పట్టపగలేమో హోటళ్లు, స్టాల్స్, మాల్స్ తో హా కరోనా మనల్నేం చేస్తుంది లే అన్నట్లుగా.. ప్రభుత్వ ఆదాయం కోసమో, ప్రజల అవసరాల కోసమో తెలియందికాదుగానీ.. […]
ఎవరి కన్నూపడని సంస్థ… ఎంత నొక్కేస్తేనేం అనుకున్నట్టున్నారు…
కరప్షన్ అనగానే ఏ రెవెన్యూనో, పోలీస్ డిపార్ట్మెంటో ఫ్రంట్ రోలో కనిపిస్తుంది. లేకపోతే జనంతో ప్రత్యక్ష లావాదేవీలుండే ప్రభుత్వ శాఖలు బోనులో నిలబడుతుంటాయి. అయితే జనంతో సంబంధం లేకుండా పెద్దోళ్ల వ్యవహారాలు చక్కబెట్టేచోట అడిగేవారు లేరని సైలెంట్‌గా నొక్కేస్తుంటారు. తెల్ల ఏనుగులుండే ఓ డిపార్ట్మెంట్లో కోటిరూపాయలకు పైనే ఫ్రాడ్ గేటు దాటకుండా చూద్దామనుకున్నా.. చివరికి పోలీస్‌స్టేషన్‌లో కేసు దాకా వెళ్లింది. పెద్దోళ్లు చేసిన నిర్వాకానికి చిరుద్యోగులను చీటర్లుగా చూపే ప్రయత్నం జరుగుతోంది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి […]
ఇంకెలా చప్పట్లు కొట్టగలం నీకు సోనూ… ఇంకా ఎత్తుకు ఎదిగిపోయావ్…
సోనూ సూద్… నిజంగా తను చేపడుతున్న సేవా కార్యక్రమాలు వార్తలు చదివేకొద్దీ…. అవన్నీ నిజమేనా అన్నంతగా ఆశ్చర్యపరుస్తయ్ మనల్ని… ఏడాది కాలంగా ఎన్ని వేల మందికి దేవుడయ్యాడో చూశాం… చివరకు ఇప్పుడు తనే కరోనా బారిన పడి, హోం ఐసొలేషన్‌లో ఉన్నా సరే, తన యాక్టివిటీ ఏమాత్రం ఆగడం లేదు సరికదా… నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాడు… క్షుద్రమైన ఫ్యాన్స్, తాము దేవుడి పుత్రులం అనే మూర్ఖభావనల్లో పడి కొట్టుకుంటూ… ఏతులు తప్ప చేతలకు కొరగాని, కోట్లకుకోట్లు మూలుగుతున్నా […]
భేష్ జగన్..! ఏతుల మనిషి కాదు- చేతల మనిషి… అందరికీ ఫ్రీ వేక్సిన్…
మోడీ దుర్మార్గుడు… మోడీ దుష్టుడు అని తిడుతూ కూర్చోవడం కాదు….. మీడియా ముందు కోతలు కోసి, తరువాత నిజంగా అవసరమున్నప్పుడు మొహాలు చాటేయడం కాదు…. తక్షణం తామేం చేయాలో నిర్ణయం తీసుకోవాలి, తమ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై నిజమైన సమీక్షలు జరపాలి… జనానికి భరోసాగా నిలవాలి… విపత్తు వేళ పాలకుడు ఎలా ఉండాలో నిరూపించుకోవాలి… ఇప్పుడు కాకపోతే ఇక ప్రభుత్వాలు దేనికట..? తిట్టొచ్చు, మోడీని తిట్టడమే రాజకీయం అనుకుంటే తిట్టడానికి చాలా రీజన్స్ దొరుకుతయ్, బోలెడు టైముంది… […]
అండ సమస్య..! ఆ కోళ్లన్నీ హఠాత్తుగా గుడ్లు పెట్టడం మానేశాయి… వై..?!
పూణెలో ఓ కోళ్ల రైతు… అకస్మాత్తుగా ఓ కష్టమొచ్చి పడింది… తన ఫామ్‌లో ఉన్న కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి… ఇదేందయ్యో, నేనెప్పుడూ చూళ్లే… జోరున వానలు పడుతున్నా, ఎండలు దంచికొడుతున్నా, చలి వణికించేస్తున్నా కోళ్లు గుడ్లయితే పెడతాయి కదా… కాకపోతే కొన్ని నాగా పెడతాయి, అంతే తప్ప గుడ్లు పెట్టడమే మానేస్తే ఎలా..? అదీ అన్నీ కూడబలుక్కున్నట్టు ఒకేసారి గుడ్లు పెట్టకపోతే ఎలా..? పైగా కరోనా కాలం… ఇమ్యూనిటీ పేరుతో చాలామంది ఎగబడి తింటున్నారు ఈమధ్య… […]
బిడ్డ అత్తింటికి దారేది..? ఓ కొత్త కథ… కాదులే, రేషన్ బియ్యానికి పాలిష్ చేశాం…
Gottimukkala Kamalakar…………………….. బిడ్డింటికి బాటేది…? బొమ్మన్ ఇరానీ వాచిపోయిన కాళ్లతో కుంటుతూ కుంటుతూ వెళ్లి రావు రమేష్ ఇంటి తలుపు తట్టాడు.పెళ్లి కాని ప్రదీప్ వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా చూస్తూ ” ఎవరూ…?” అని అడిగాడు. “ఇది కోర్టుకెప్పుడూ వెళ్లని లాయర్ రావు రమేష్ గారి ఇల్లే కదండీ..? ఆయనకో హోటల్ ఉంది, అది తాకట్టులో ఉందీ..!” అంటూ మెల్లగా కళ్లద్దాలు తీస్తూ కళ్లు చికిలిస్తూ ఏదో చెప్పబోయాడు బొమ్మన్. “య్యా…! కమిన్” అంటూ షాన్ […]
వైరల్ కావల్సింది ఈ వార్తలే… పాజిటివిటీ, ఆప్టిమిజం పెంచేలా…
నూటికో కోటికో ఒక్కరు- ఇలా ప్రాణాలకు తెగించి ప్రాణాలను నిలబెడతారు ——————– “కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వా రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే? శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై ఈరే కోర్కెలు? వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా!” పోతన భాగవతంలో వామనావతార ఘట్టంలో పద్యమిది. వచ్చినవాడు పిల్లవాడు కాదు- సాక్షాత్తు విష్ణువు- జాగ్రత్త అని రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. అప్పుడు బలి అన్న మాట ఇది. […]
కైలాసం అయితేనేం… కరోనాకు భయమా ఏం…? గేట్లు మూసేయబడినవి…
కైలాసంలో కరోనా జాగ్రత్తలు! ——————– నిత్యానంద అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు అని సాధారణ నిఘంటు అర్థం. అయితే ఒకదేశాన్నే పుట్టించి, ఆ దేశాన్ని కైలాసంగా మార్చి, దానికి ఆయనే అధ్యక్ష, ప్రధాని, మంత్రి, కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కారణజన్ముడు నిత్యానంద విషయంలో సాధారణ నిఘంటువులకు విలువ ఉండదు. పీఠాధిపతులను ఆయన అనకూడదు అని మీకు అభ్యంతరమయితే వారు/శ్రీవారు/శ్రీచరణులు/స్వామివారు అని మార్చుకుని చదువుకుంటే నాకెలాంటి అభ్యంతరం ఉండబోదు. నిత్యం ఆనందమే తానయినవాడు, నిత్యం ఆనందాన్ని పంచేవాడు, నిత్యం ఆనందం […]
Air Bombing..! తిరుగుబాట్లపై కేంద్రబలగాల వైమానికదాడి కొత్తేమీ కాదు..!!
ఔనా..? నిజంగానే మన ప్రభుత్వం నక్సలైట్ల నిర్మూలనకు డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తోందా..? ఆదివాసీ ప్రాంతాలపై కార్పెట్ బాంబింగు చేయాలనే ప్రణాళికల్లో ఉందా..? అసలు ఇది నైతికమేనా..? ఏ రాజ్యమైనా తన సొంత ప్రజలపై వైమానిక దాడులు చేస్తుందా..? చట్టం అంగీకరిస్తుందా..? ప్రజలు సహిస్తారా..? అమాయకుల ప్రాణాలకు రక్షణ ఏది మరి..? ఒక వార్త చదివాక అందరిలో తలెత్తే ప్రశ్నలు, సందేహాలు, ఆందోళనలు ఇవి… ఇప్పటికే సాయుధ బలగాలు, మావోయిస్టుల నడుమ ఆదివాసీల బతుకు బర్బాద్ అయిపోతోంది… […]
బాబ్బాబు… కిలో ఆక్సిజెన్ ప్లీజ్… అర్జెంట్… రేటెంతైనా పర్లేదు…
ప్రాణవాయువు అందడం లేదు —————— నిజమే. ప్రాణాలు పోతున్నాయి. ప్రాణవాయువు అందక ఊపిరులు పోతున్నాయి. వీధి కొళాయి ముందు క్యూలో బిందెలు పట్టుకున్నట్లు మానవ నాగరికతలో ఇదివరకు ఎప్పుడయినా, ఎక్కడయినా ఆక్సిజెన్ సిలిండర్లు నింపుకోవడానికి రోగుల బంధువులు క్యూలో నిలుచున్నారా? ఆక్సిజెన్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయో ఇదివరకు ప్రభుత్వాలు ఎప్పుడయినా లెక్కలు చుశాయా? ఆంజనేయుడు తిరుమల అంజనాద్రి కొండ జపాలిలో పుట్టాడని నిన్ననే టి టి డి ప్రకటించింది. ఆంజనేయుడు పుట్టీ పుట్టగానే ఉయ్యాల్లో ఏడుస్తుంటే- ఆకలిగా […]
- « Previous Page
- 1
- …
- 398
- 399
- 400
- 401
- 402
- …
- 448
- Next Page »