లెఫ్ట్, రైట్ పార్టీలు కాస్త నిబద్ధత పంథాలో ఉండేవి గతంలో… పూర్తి రైట్ అంటే బీజేపీ… ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం వంటి అనుబంధ సంస్థల్లో పనిచేసి మెల్లిగా ఎలివేట్ అయ్యేవాళ్లు నాయకులు… వేరే పార్టీల నాయకుల్ని అంత త్వరగా నమ్మదు బీజేపీ… కానీ ఇప్పుడలా కాదు… మోడీషా శకం కదా… పక్కా కాంగ్రెస్ తరహా… ఏ పార్టీయో, కేసులున్నాయో లేదో, ఎలాంటి గత చరిత్ర అనేది ఏమీ చూడటం లేదు… డబ్బోదస్కమో, ఇతర ప్రలోభమో, వచ్చావా, పార్టీలో […]
కరీనాను తప్పించి… కంగనాను ఒప్పించి…! మార్పు వెనుక అసలు కథేమిటి..?!
నిజానికి బాలీవుడ్‌కే కాదు… ఇది ఇండియన్ సినిమాకు సంబంధించి కాస్త ఇంట్రస్టింగ్ వార్తే..! కరీనాకపూర్‌ను తప్పించి, ఓ భారీ సినిమాలో సీత పాత్రకు కంగనా రనౌత్‌ను ఎంపిక చేయడం..! ఆ సినిమా పేరు… సీత- The Incarnation… పాపులర్ రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథ… అదీ సీత కోణంలో కొత్తగా కథను చెప్పడం… అంతేకాదు, హిందీతోపాటు తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు… నిజానికి చాలారోజులుగా సాగుతున్నది ప్రిప్రొడక్షన్ […]
హబ్బ… మన జీహెచ్ఎంసీ బాసుల బుర్రల్ని చూస్తే కళ్లు చెమరుస్తున్నయ్…!!
కేసీయార్ కాలర్ ఎగరేయాలి, జీహెచ్ఎంసీకి అద్భుతమైన బుర్రలున్న అధికారులను నియమించినందుకు…! కాబోయే ముఖ్యమంత్రి, ప్రస్తుత నగరాధిపతి కేటీయార్ కూడా కాలర్ ఎగరేయాలి, జీహెచ్ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నందుకు..! ఓ మెగా హీరో స్పోర్ట్స్ బైక్ జారిపడటానికి కారణం ఎవరు..? ఇసుక…! అది అక్కడెందుకు ఉంది..? సదరు కంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం..! ఎంతటి నేరం..? ఎంతటి పాపం..? ఆ నిర్లక్ష్యానికి, ఆ తప్పుకి ఆ కంపెనీ ఓనర్‌ను ఉరితీసినా తప్పులేదు… కాకపోతే మన జీహెచ్ఎంసీ అధికారుల హృదయాలు విశాలం కదా… […]
పాపం మామూలు దేవుళ్లు కదా… ఈ సినిమా పెద్ద దేవుళ్లను ఏమీచేయలేరు…
మాజీ గవర్నర్ నరసింహన్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా కావచ్చుగాక….. ఒక విషయంలో మాత్రం తనను చూసినప్పుడల్లా ఓరకమైన చీదర..! ప్రతి గుడికీ వెళ్లడం, ప్రొటోకాల్ పేరిట మర్యాదలు, ప్రాధాన్యతలు, సామాన్య భక్తులకు అవస్థలు… గంటలకొద్దీ… ఒక్కొక్క భక్తుడూ క్యూలో నిలబడి బూతులు తిట్టుకున్నాడు… దేవుడి దర్శనంతో ఆయన ఏం పుణ్యం సంపాదించుకున్నాడో గానీ భక్తుల తిట్లు శాపనార్థాలతో అదనపు పాపాన్ని మూటగట్టుకున్నాడు… తన ఇంటికి దగ్గరలోని ఆంజనేయుడి గుడి దగ్గర నుంచి తిరుమల వరకూ అదే పైత్యం […]
బై బై టాలీవుడ్…! జై జై బాలీవుడ్…! సమంత అడ్డా ఇకపై ముంబై..!!
నిజానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు… కాకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి నాగచైతన్య-సమంతల విడాకుల వ్యవహారం జనం నోళ్లలో నానుతోంది… అసలు సినిమా, టీవీ, మోడలింగ్ తదితర ప్రలోభాల, విలాసాల రంగుల రంగాల్లోనే కాదు… విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి… కాకపోతే సెలబ్రిటీల విడాకుల మీద కాస్త ఎక్కువ చర్చ సాగుతూ ఉంటుంది… ఆమెతో చైతన్య బంధం తెగిపోయినట్టే… మ్యుచువల్ కాన్సెంట్‌తో డైవోర్స్‌కు అప్లయ్ చేసుకుని, ఓ దఫా కౌన్సిలింగ్ కూడా జరిగిందట… నాగార్జున కాస్త చక్కబెట్టే ప్రయత్నం […]
అమెరికా డబుల్ గేమ్..! గల్ఫ్ రీజియన్ నుంచీ బలగాలు వాపస్..?!
………… By…. పార్ధసారధి పోట్లూరి …. అంతు పట్టని అమెరికా ఆలోచనలు ! అమెరికా – సౌదీ ఆరేబియాల మధ్య విడదీయలేని దౌత్య, ఆర్ధిక, రక్షణ పరమయిన బంధం ఉంది చిరకాలంగా ! అసలు గల్ఫ్ ప్రాంతంలోని ఆయిల్ కొనుగోలు డాలర్ రూపంలో జరుగుతుంది. అలాగే గల్ఫ్ రీజియన్ రక్షణ బాధ్యత అమెరికా తీసుకుంది. చాలా కాలంగా అది కొనసాగుతూనే ఉంది. అయితే …. రెండు వారాలక్రితం అమెరికా తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని సౌదీ […]
చెక్ ఢాం..! ఎంగిలి వార్త అయినా సరే.., ఈనాడు ధైర్యంగానే రాసిందండోయ్…
ఈనాడు ఇంట్రస్టింగ్, ఇన్వెస్టిగేటివ్ వార్తలు రాయడం మానేసి చాలారోజులైంది కదా… ఏదో కరోనా మీద నలుగురి బైలైన్ ఇంటర్వ్యూలు రాస్తూ పొద్దుపుచ్చుతోంది… మోడీ, జగన్, కేసీయార్… ఏ ప్రభుత్వం జోలికీ వెళ్లేది లేదు… కళ్ల ముందు ఏం జరుగుతున్నా ఉలికేది లేదు, కదిలేది లేదు… కానీ అకస్మాత్తుగా ఈరోజు ఓ బ్యానర్ కనిపించింది… శీర్షిక చెక్ ఢాం… ఆ ఫోటో చూడగానే, ఆ హెడ్డింగ్ చదవగానే ఇదేందబ్బా, ఎక్కడో చదివాం కదా అనిపించింది… అబ్బే, ఈనాడు బ్యానర్ […]
హీరో మహేశ్‌బాబుకు ఆ పెంటడబ్బు అవసరమా..? ఇదేం హీరోయిజం..?
ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వాణిజ్యప్రకటనలో నటించడానికి ఓ కంపెనీ 2 కోట్లు ఆఫర్ చేస్తే, సాయిపల్లవి ఎడమకాలితో పక్కకు తోసేసింది… బేసిక్‌గా నల్లతోలును తెల్లతోలు చేయడమనేదే అశాస్త్రీయం, అబద్ధం, మోసం, అదొక అనైతిక దందా… మన చట్టాలు, గడ్డి తినే మన వ్యవస్థలు వాటిని ఏమీ చేయలేకపోవచ్చు… కానీ ఆమె నిజాయితీగా, ఒక మనిషిగా వ్యవహరించింది… దాన్ని ప్రమోట్ చేయడమంటే ప్రజల్ని మోసగించడమే అనే నైతికతకు కట్టుబడింది… ఆమె హీరో… రియల్ హీరో… డబ్బు కోసం ఏదైనా […]
ట్రూఅప్ ఛార్జీలు..! జగన్‌కు కొత్త ఇరకాటం..! బాబును తిట్టేశాం సరే, మరిప్పుడు..?!
మన రాజకీయ పార్టీలు, నాయకులు, వాటి అనుబంధ మీడియా, సోషల్ మీడియాకు ఒకటే పని… ఎదుటోడి మీదకు నెట్టేయడం…!! చివరకు ఏపీలో రోడ్లు బాగాలేవురా బాబూ అన్నా సరే, చంద్రబాబు దుర్మార్గపాలనే కారణం అంటాయి వైసీపీ శ్రేణులు… చంద్రబాబు దుర్మార్గం వద్దనుకునే కదా, నిన్ను కుర్చీ ఎక్కించింది, మరి ప్రతిదానికీ వాడినెవడినో తిట్టడం దేనికి..? మనమేం చేశామో చెప్పవయ్యా బాబూ అంటే వినిపించుకునేవాళ్లు ఉండరు… ఉదాహరణకు… 3,669 కోట్ల మేరకు జనంపై ‘‘ట్రూఅప్ ఛార్జీలు’’ బాదుతున్నారు ఇప్పుడు… […]
మోడీ దుర్మార్గుడు సరే… మరి మన పాలసీలు ఏం ఉద్దరించినయ్ సర్కార్..!?
వరి వేస్తే ఉరే… ఇక రైతుల నుంచి ఎక్కువ కొనేది లేదు… వరి మాన్పించి, రైతులను ప్రత్యామ్నాయం వైపు మళ్లించాలి… అంతా కేంద్ర సర్కారు నిర్వాకమే… ఓ ముందుచూపు లేదు, అంతర్జాతీయ ఎగుమతుల్లేవు, దొడ్డు బియ్యం, బాయిల్డ్ బియ్యం ఒక్క బస్తా కూడా కొనబోమని చెబుతున్నది…… దాదాపు ప్రతి పత్రిక పతాక శీర్షిక ఇదే… తమకు పొలిటికల్ నష్టం ఏమీ లేకుండా, బీజేపీని ఇరుకునపెట్టడానికి ఇలా నెపాన్ని కేంద్రంపైకి నెట్టేస్తున్నది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి మొదటి నుంచీ […]
‘‘అపరిచితుడు’’గా సేతుపతి..! కానీ సినిమాయే మరీ ‘‘తుగ్లక్ దర్బార్’’ ఐపోయింది..!!
నో డౌట్… విజయ్ సేతుపతి మంచి నటుడు… కానీ ఎప్పుడు..? తనలోని నటుడిని ఆవిష్కరించే మంచి పాత్ర దొరికినప్పుడు..! తనలోని నటుడికి చాలెంజ్ విసిరే పాత్ర దొరికినప్పుడు..! మరి మిగతా సందర్భాల్లో..? జస్ట్, ఓ నటుడు, ఓ హీరో… అంతే… తుగ్లక్ దర్బార్ సినిమా చూస్తుంటే పాపం సేతుపతి అనిపిస్తే అది మన తప్పేమీ కాదు… తన తప్పే..! మొన్న ఏదో లాభం అని ఓ పిచ్చి సినిమా చూసినప్పుడూ సేతుపతి మీద జాలేసింది… ఎందుకిలాంటి పాత్రలు […]
చక్షుర్మతి..! ఈ పేరెప్పుడూ వినలేదా..? జనం మెదళ్లపైకి సరికొత్త విద్య..!!
మంచిని, పాజిటివిటీని, కొత్త సమాజం వైపు చైతన్యాన్ని, శాస్త్రీయతను బోధించడం అనేది మన టీవీ న్యూస్ మీడియా వల్ల కాదు… దానికెప్పుడూ సెన్సేషన్, రేటింగ్ బేస్డ్ వేషాలు కావాలి… ఇక వినోదచానెళ్లు మరీ ఘోరం… వాటి సీరియళ్లు సమాజానికి ఓ పెద్ద దరిద్రం, రకరకాల మానసిక వైకల్యాలకు కారకాలు… రేటింగ్స్, యాడ్స్ ఇవే కదా టీవీ దందాకు ఆధారం… సమాజం, జనం, మన్నూమశానం వాటికి అక్కర్లేదు… సరికదా, మనం ముందుకుపోతున్నకొద్దీ వెనక్కి లాగుతున్నయ్… ఆధునిక ప్రపంచం శాస్త్రీయత […]
డల్లుడల్లుగా నాగ్..! అచ్చు షో నడుస్తున్న తీరులోనే..! క్యా హువా బిగ్‌బాస్..?!
ఎందుకో బిగ్‌బాస్5 వీకెండ్ షోకు వచ్చిన నాగార్జున మరీ డల్‌గా కనిపించాడు… జోష్ లేదు ఏమాత్రం… ఏదో వచ్చానా, షో చేశానా, వెళ్లానా అన్నట్టుగా కనిపించింది తన వైఖరి… అంతేలెండి, ఆ షో చూస్తున్న ప్రేక్షకుల్లాగే తను కూడా…! ఎందుకో ఈసారి ఆ షో మీద ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి కనిపించడం లేదు… అసలు మూడు, నాలుగో సీజన్ల నుంచే ఈ షో మీద ఇంట్రస్టు పోతూవచ్చింది జనానికి..! సరే, ఇంకా మొదటి వారమే కదా, రాను […]
టీవీ9 పై దుమ్మెత్తిన సోషల్ మీడియా… శ్రీదేవి బాత్‌టబ్బు తర్వాత మళ్లీ ఇప్పుడే..!!
ఒక టీవీ చానెల్ అయిదారొందల కోట్లతో కొనడం కాదు… కోట్లకుకోట్ల కాయలు కోసుకోవడం కాదు… పాత్రికేయంలో ఓ టేస్ట్ ఉండాలి, ఆ టీవీ నడుస్తున్న తీరుపై ఓ నిఘా ఉండాలి… అత్యంత భారీ ప్యాకేజీలతో పనిచేస్తున్న ముఖ్యుల పనితీరు మీద విశ్లేషణలుండాలి… వార్తల నాణ్యతపై సొంత పరిశీలన ఉండాలి… పెద్ద తలకాయలతో మహిళా ఉద్యోగినులకు ఏమైనా సమస్యలొస్తున్నాయా చూసుకోవాలి… ఎవరికైనా అమ్ముడుబోతున్నారా చెక్ చేసుకోవాలి… అన్నింటికీ మించి చానెల్ కవరేజీ తీరుపై ప్రజలు, ప్రేక్షకుల స్పందన ఏమిటో […]
ఒక్క తెలుగులోనే కాదు… ఈ రిపోర్టింగ్ పైత్యం ప్రపంచమంతా ఉన్నదే బాసూ…
ఫేక్ రిపోర్టింగ్.. ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు… అసలు జరుగుతుందో, లేదో తెలియనిదాన్ని ఊహాజనితంగా చిత్రించి ప్రెజెంట్ చేయడం.. ఇదేదో తెలుగు మీడియాకే పరిమితమైందేం కాదు.. జాతీయ, అంతర్జాతీయస్థాయిలోనూ పొరపాటుగా మారిన అలవాటే! అందుకే ఏ ప్రాంతంవారు చూసినా… అరె, ఇది అచ్చూ మన మీడియాకు సరిగ్గా అతికినట్టు సరిపోతుందే అన్నట్టుగా జనం ఒకింత హాశ్చర్యంతో నవ్వుకుంటూ చూసే సెటైరికల్ మూవీ.. special correspondents!! ఎప్పుడో 2016లోనే విడుదలైనా.. ఏదో యాదృచ్ఛికమన్నట్టు ఒకటో, అరో కాకుండా… ఇప్పటికీ […]
ఈమెది వైకల్యమా..? వైరాగ్యమా..? ఓ”అసహజ బతుకు చిత్రం”…
ఇదొకరకం మానసిక వైకల్యం అనాలా..? వైరాగ్యం అనాలా..? ఇరా బాసు ప్రస్తుత గతి చూస్తే అందరికీ ఆమెనెలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి… ఆమె బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ భట్టాచార్య సొంత మరదలు… కానీ ఫుట్‌పాత్‌పై జీవిస్తోంది… మంత్రి, ఎమ్మెల్యే అంటేనే బంధుగణమంతా విపరీతంగా అక్రమ ఆస్తులు పోగేసి, అట్టహాసంగా, ఆడంబరంగా బతుకుతూ ఉంటారనేది కదా మనకు తెలిసిన సత్యం… మరి పదేళ్లు పాలించిన ఓ మాజీ సీఎం మరదలికి ఈ బతుకేమిటి..? (సొంత మరదల్నే […]
రష్మి- సుధీర్..! తెలుగు టీవీ తెర మీద ఒక నిత్యనూతన ప్రేమప్రయాణం..!
ఎప్పటిలాగే వినాయకచతుర్థికి రెండు టీవీలు స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేశాయి… జెమిని వాడికి టేస్ట్ లేదు, ఎప్పటిలాగే వదిలేశాడు… ఈటీవీకి జబర్దస్త్ ప్లస్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం ఉంది కదా… ఎప్పటిలాగే అలవోకగా ఓ స్పెషల్ షో చేసి ప్రసారం చేసేసింది… దాని పేరు ఊరిలో వినాయకుడు… కామెడీ స్టార్స్ టీం మాటీవీ వాడికి ఉంది కదా… సీరియళ్లలోని కొందరు నటుల్ని తీసుకుని, బిగ్‌బాస్ పాత మొహాల్ని కూడా తీసుకుని ‘పండగే పండగ’ అని ఓ […]
నేను గానీ ఒక వీల గానీ వేశానంటే… ఏమీలేదు, రీసౌండ్ కాదు, అసలు సౌండే లేదు…
కొందరి అదృష్టానికి నిజంగా అభినందించొచ్చు… తొట్టెంపూడి గోపీచంద్ అలియాస్ గోపీచంద్ కూడా అదృష్టవంతుడే ఒకరకంగా… టి.కృష్ణ కొడుకుగా పుట్టడం తన అల్టిమేట్ అదృష్టం… రష్యాలో ఇంజనీరింగ్… (సీపీఐ బ్యాక్ గ్రౌండ్..?).. తరువాత తండ్రి వారసత్వం కొనసాగించడానికి సినీ రంగప్రవేశం… అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం హీరోగా తొలిసినిమా… తరువాత నెగెటివ్ పాత్రలు కొన్ని… ఆ తరువాత కమర్షియల్ హీరో… గోపీచంద్ టి.కృష్ణ కాడు ఇప్పుడు, ఎప్పుడూ… జస్ట్, మనకున్న చాలామంది హీరోల్లో ఒకడు… అంతే… అసలు ఎన్నేళ్లయింది […]
అమెరికా కక్కలేక, మింగలేక..! సాయపడిన వేలాది అప్ఘన్లు గజగజ…!!
……….. By…. పార్ధసారధి పోట్లూరి ……… చాలా పెద్ద మొత్తంలో బయో మెట్రిక్ డాటా తాలిబాన్ల చేతిలోకి చిక్కింది ! ఇది చాలా పెద్ద దెబ్బ అటు CIA కి కానీ ఇటు RAW కి కానీ! ఏమిటీ ఈ బయోమెట్రిక్ డాటా ? Afghan Automated Biometric Identification System (AABIS). వెల్..! 2001 లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి తాలిబన్లని తరిమేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని స్థానిక […]
అచ్చం ఓ పాత తెలుగు కుటుంబ గౌరవం సినిమా కథ… నాని మాత్రం ఇరగేశాడు…
నాని అంటే..? నటన..! అంతకుమించిన నిర్వచనమేమీ ఉండదు… అతిశయోక్తి కాదు, మనకున్న హీరోల్లో అన్నిరకాల ఉద్వేగాల్ని బలంగా ప్రదర్శించగల సత్తా ఉన్నవాడు… నేను నిజంగా మొండివాడినా, అలా కనిపిస్తున్నానా, ఏ బంధాలూ తెలియనివాడిలా ఉంటానా అంటూ హీరోయిన్ ఎదుట హీరో మథనపడే ఓ బరువైన సన్నివేశం ఒక్కటి చాలు, నాని ఏమిటో చెప్పడానికి… అలాంటివి చాలా ఉన్నయ్ టక్ జగదీష్ సినిమాలో… సరైన పాత్ర పడాలే గానీ నాని అంటే నానీ అంతే… చెలరేగిపోతాడు… ఈ సినిమాకు […]
- « Previous Page
- 1
- …
- 403
- 404
- 405
- 406
- 407
- …
- 481
- Next Page »