అది 2017… తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా… కలెక్టర్ కార్యాలయం… దాని ఎదుట నలుగురు సభ్యులున్న ఓ నిరుపేద దినసరి కూలీ కుటుంబం తామకుతామే నిప్పు పెట్టుకుని సజీవంగా దహనమయ్యారు… ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి, కలవరం- గగుర్పాటు కలుగుతున్నయ్ కదా… కారణమేంటో తెలుసా..? అక్కడ ఓ వడ్డీవ్యాపారి ఉన్నాడు, ఈ కుటుంబం ఆయన దగ్గర అధిక వడ్డీకి డబ్బు తీసుకుంది… కడుపు కాలిందో, రోగమొచ్చిందో, ఏం ఆపద వచ్చిందో… వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణుచక్రవడ్డీ ఎట్సెట్రా కలిపి […]
సతీష్‌రెడ్డికి ఏమైంది..? ఇష్టారాజ్యం నిర్ణయాలకు ఇదేమైనా ఆనందయ్య మందా..?!
అరె.., ఈ డీఆర్డీవో సతీష్‌రెడ్డికి ఏమైంది..? ఏం చేస్తున్నాడు తను..? ఏం మాట్లాడుతున్నాడు తను..? కరోనా మీద మన సర్కారు పాలసీలు, ధోరణులు సమజైత లేవా..? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం అంటున్నాడు… ఎవరు ముందుకొచ్చినా సపోర్ట్ చేస్తాం అంటున్నాడు… సీసీఎంబీ సాయం చేసింది, డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తోంది, దేశవ్యాప్తంగా సప్లయ్ చేస్తాం….. ఏమిటీ ప్రకటనలు..? అసలు కొనసాగించడమా..? పీకేయడమా..? అరె… సీసీఎంబీ సాయం చేస్తేనేం..? డీఆర్డీవో సొంత పరిశోధన అయితేనేం..? మనం ప్రైవేటు వాళ్లకు ధారాదత్తం […]
మోహన్ హార్టిస్టు… అందుకే ఓ యువ ఆర్టిస్టును తన రాతల్లో హత్తుకున్నాడు…
Taadi Prakash is with Laxman Aelay… తెలంగాణా రంగుల కల… ఏలే లక్ష్మణ్ Glory to the art of Telangana —————————————————- లక్ష్మణ్ పెయింటింగులు ఇప్పుడు లక్షల రూపాయల్లో అమ్ముడుపోతున్నాయి. ఆ నాజూకైన రేఖల్లో పలికే తెలంగాణ పేదల జీవన వాస్తవమూ, సౌందర్యము ప్రపంచాన్ని ఆకర్షించాయి. తెలంగాణ పెయింటింగ్ కి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వైకుంఠం, లక్ష్మా గౌడ్ లాంటి లెజెండరీ కళాకారుల పేర్ల సరసన లక్ష్మణ్ పేరు చేరిందిపుడు. తంగేడు, మంకెన పూలలా ఒక ప్రత్యేకమైన […]
ఈటల తరువాత వికెట్ ఎవరు..? టీఆర్ఎస్ అంతర్గత కుతకుతలు నిజమేనా..?!
ఈటల విడిపోయాడు… వెళ్లిపోయాడు… అనే వార్తలు, విశ్లేషణలు వదిలేయండి ఇక… కొన్నిరోజులు మీడియాకు హడావుడి… అంతే… నాలుగు రోజులయ్యాక ఇక ఈటల గురించి మాట్లాడేవాళ్లు ఉండరు… అంతెందుకు..? బీజేపీలోని కేసీయార్ ముఖ్య స్నేహితులే క్రమేపీ ఈటల గురించి ఎవరూ మాట్లాడకుండా చేస్తారు… జనం నుంచి ఎప్పుడో దూరమైపోయిన రమణ చేయగలిగేది కూడా ఏమీలేదు… 119 నియోజకవర్గాల రాజకీయాల్లో హుజూరాబాద్ ఒకటి… కానీ ఇప్పుడు చర్చ అది కాదు… తదుపరి వికెట్ ఎవరు..? ఎందుకు..? కేటీయార్‌ను సీఎం కుర్చీ […]
సోనీ లెక్క వేరు- ప్రేక్షకుల ఎక్కాలు వేరు… షణ్ముఖ ప్రియపై వేలాడే కత్తి…
బిగ్‌బాస్ కావచ్చు, ఇండియన్ ఐడల్ కావచ్చు… ఇంకేదైనా రియాలిటీ షో కావచ్చు… అదొక ఆట… ఎవరైనా గెలవొచ్చు, ఎవరైనా మధ్యలోనే వెళ్లిపోవాల్సి రావచ్చు… ప్రేక్షకులకు వినోదం, అంతే… కాకపోతే ప్రతి ఎలిమినేషన్‌ను కూడా టీవీ వాడు భీకరమైన సంగీత నేపథ్యంతో… కన్నీళ్లు, కౌగిలింతలు, పరామర్శలు, విషణ్ణ వదనాలతో ఇంకాస్త మసాలా వేస్తాడు… ఒకడు వ్యూయర్స్ వోట్స్ అంటాడు, ఇంకొకడు జడ్జిల మార్కులే అల్టిమేట్ అంటాడు… నిజానికి అంతిమ విజేతల విషయానికొచ్చినప్పుడు టీవీ వాడికి తన లెక్కలే ముఖ్యం… […]
ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…
క్లియోపాత్రా… ప్రపంచం మొత్తం ఆమె అందాన్ని కీర్తించింది, గుర్తించింది… అందానికి ఆమె ఓ కొలమానం అని భజించింది… అది సరే, మరి మన భారతీయ మహిళ సౌందర్యం మాటేమిటి..? ప్రపంచం మెచ్చిన అందగత్తెలు అనగానే ఈరోజుకూ ఒక ఐశ్వర్యారాయ్, ఒక సుస్మితాసేన్ మాత్రమేనా..? కాదు.., రీటా ఫారియా, డయానా హైడన్, యుక్తా ముఖి, ప్రియాంకచోప్రా, మానుషి చిల్లర్, లారా దత్తా, మిస్ ఎర్త్ నికోల్ ఫరియా… బోలెడు మంది… వీళ్లు కాదు, మరి ఇండియన్ క్లియోపాత్రా అనిపించుకునే […]
టైం బాసూ టైం… హఠాత్తుగా పాములు మింగేస్తయ్… నిచ్చెనలు పైకి లేపుతయ్…
ఈరోజు నేను మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను, ఇక నాకేముంది అని ఎవరైనా అనుకుంటే, దానంత వెర్రి భ్రమ మరొకటి ఉండదు…. అయ్యో, నేనిలాగే దిక్కుమాలిన పొజిషన్లోనే ఉండిపోవాలా అని ఎవరైనా నిరాశలోనే ఉంటే, దానంత పిచ్చితనం కూడా మరొకటి ఉండదు… డెస్టినీ నిర్ణయిస్తుంది… అనగా ప్రాప్తం..! ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం చాలా వేగంగా మనం చూస్తూనే ఉంటాం… కొందరి జాతకచక్రాలు గిర్రున తిరుగుతూ ఉంటయ్… పరమపదసోపానపటంలో హఠాత్తుగా […]
తొలిసారి మోడీ దిగొచ్చాడు… ప్రజాభిప్రాయానికి తలవంచాడు… గుణాత్మక మార్పు…
ప్రధాని మోడీ… తను అనుకున్నది చేసేస్తాడు… మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, నాగపూర్ హెడ్డాఫీసు ఎవరు చెప్పినా సరే, తను ఒకసారి ఒక నిర్ణయానికి ఫిక్సయిపోతే ఇక మారడు… తన పాలసీ తప్పు అని కూడా అంగీకరించడు, మార్చుకోడు… కానీ తొలిసారిగా మోడీలో ఓ మార్పు… సుప్రీంకోర్టుతోపాటు దేశసగటు మనిషి, ప్రతిపక్షాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు, మేధోసమాజం, మీడియా అందరూ తిట్టిపోశారు తన వేక్సిన్ పాలసీని… దానంత బ్లండర్ పాలసీ బహుశా ఈమధ్యకాలంలో మరొకటి లేదు… చివరకు తనను […]
ఆహా ఓహో అని మెచ్చేసుకున్నాం… రోహిణి సింధూరి కూడా అంతేనా..?!
ఒక వివాదం… ఒక రచ్చ… ఎక్కడో మొదలవుతుంది… అది ఎటెటో తిరుగుతూ, ఎవరెవరినో చుట్టేస్తూ… పొరపాటున రాజకీయాలు ఎంటరైతే మరింత వికృతంగా మారిపోతూ… అసలు మూలకారణం మరుగున పడిపోతుంది… దాన్నెవరూ ఆలోచించరు… దానిపై ఏమీ చర్చించరు… దాదాపుగా ఇదీ అంతే… ఇద్దరు లేడీ ఐఏఎస్ ఆఫీసర్ల గొడవ… కొప్పులుకొప్పులూ పట్టుకుని కొట్టుకున్నట్టు… ఐఏఎస్ అధికారులయితేనేం మనుషులు కారా..? కొన్నిసార్లు వీథి కుళాయిల దగ్గర మహిళల్లాగే..! నిన్న కర్నాటక ప్రభుత్వం ఇద్దరు లేడీ ఐఏఎస్ అధికార్లను వాళ్లు పనిచేస్తున్న […]
అది నిజంగా మళయాళంపై వివక్షేనా..? అసలు కేరళ నర్సుల భాష గొడవేమిటి..?!
ఎప్పుడు ఏది దొరుకుతుందా అని కాచుకుని ఉంటారు రాజకీయ నాయకులు… సోకాల్డ్ మేధావులు… మీడియా… ఒక ఇష్యూ దొరికితే చాలు, ఇక మీద పడిపోతారు… ఎవరి కోణం వాళ్లది… అసలు ఇష్యూ ఎక్కడ స్టార్టయిందో, కారణం ఏమిటో మరిచిపోయి… వికృతంగా తన్నేసుకుంటుంటారు… ఎక్కడెక్కడికో తీసుకుపోతుంటారు… ఇదీ అంతే… ఢిల్లీలో ఓ హాస్పిటల్ కమ్ మెడికల్ ఎడ్యుకేషన్ కమ్ రీసెర్చ్ సెంటర్ ఉంది… జిప్మర్ అంటారు… ఫుల్ ఫాం ఏమిటంటే… Govind Ballabh Pant Institute of Post Graduate […]
చైనా అంటేనే ప్రపంచానికి విలన్… తాజాగా హంగరీ కేపిటల్ ఏం చేసిందో తెలుసా..?
ఇప్పుడు చైనా ప్రపంచానికి ఎంతటి ప్రమాదకారో అర్థమయ్యాక… అందరూ ఏవగించుకుంటున్నారు దాన్ని…! ప్రపంచాధిపత్యం కోసం అది ఎంతకైనా దిగజారగలదు… మన పురాణాల్లోని రాక్షసజాతి అది… మన దేశంలో దాని తోకపార్టీలు కొన్ని ఉంటయ్, ఆహా చైనా ఓహో చైనా అంటుంటారు ఆ ఎర్ర మేధావులు… మోకాళ్లలో ఉన్నాసరే, డొల్లగా ఉన్నా సరే, ఆ బుర్రలు చాలా పెద్దవి కాబట్టి, దాన్ని పక్కన పెడితే… ఓ విషయం చెప్పుకోవాలి… హంగరీ అని ఓ కంట్రీ ఉంది… దాని రాజధాని […]
చెవిరెడ్డికి చప్పట్లు..! ఆనందయ్య మందుపై క్షుద్రరాజకీయాల్ని దాటిన జనకోణం..!
ఒక్కసారి రాజకీయాలు ఎంటరయ్యాక… అది ఏ అంశమైనా సరే, భ్రష్టుపట్టాల్సిందే… ఆనందయ్య మందు ఓ లెక్కా..?! హాయిగా నడుస్తున్న మందు పంపిణీని ఎవరో చెప్పినట్టు కలెక్టర్ ఆపివేయించాడు… ఈరోజుకూ మళ్లీ చక్కబడలేదు… ఈలోపు కొన్ని లక్షల మందికి మందు అందేది కదా… అధికార యంత్రాంగం కాస్త బుర్ర పెట్టి పనిచేయకపోతే జరిగే అనర్థాల్లో ఇదీ ఒకటి… దీనికితోడు పాలిటిక్స్… టీడీపీ నాయకుడు సోమిరెడ్డి ఆనందయ్యకు మద్దతుగా నిలిచాడు, సరే, అందులో మళ్లీ రాజకీయ లబ్ధి చూసుకునే ప్రయత్నాలు, […]
జూలోని గొరిల్లా వీర్యంతో కడుపు పండించుకుందట ఈ పెటా యాక్టివిస్టు…!!
‘‘మాలీ హీథర్… 23 ఏళ్ల ఈ మాజీ బయాలజిస్ట్… శాన్ డీగో జూలో ఉండే ఓ గొరిల్లా వీర్యంతో కడుపు తెచ్చుకుంది… అనగా గర్భవతి అయ్యింది… అదేమిటీ అలా చేసింది అనుకుంటున్నారా..? ఈ గొరిల్లా జాతి అంతరించిపోయే జాబితాలో ఉంది, ఆ జాతిని కాపాడాలి, ఆ సంతానం వృద్ధి చెందాలి… ఈ జీవకారుణ్య భావనతోనే ఈ పనిచేశాను అంటున్నది ఆమె… ఆమె జీవకారుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే పెటా యాక్టివిస్టు.., చాలా ఏళ్లుగా గొరిల్లా వీర్యాన్ని నాలో […]
భలే చెప్పింది హార్లిక్స్..! అది తాగడంకన్నా పాలు, పాలకూర చాలా బెటర్…!!
ఇప్పటికే చాలామంది రాసేశారు… ఆ హార్లిక్స్‌లో ఏమీ లేదుర భయ్, ఓ గ్లాసు హార్లిక్స్కన్నా ఓ చపాతీ బెటర్ అని…! ఐనా మనం వినం కదా… కొంటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం… కాఫీలాగా, టీలాగా… లేదా ఓ చాకోలేట్ ఫ్లేవర్డ్ డ్రింక్‌లాగా..! వాడు ఓ కమర్షియల్ ప్రకటన ఇచ్చాడు… ఎందులో..? నమస్తే తెలంగాణలో…!! అది ఇంకెక్కడా కనిపించలేదు… చూడగానే మనకు ఏమనిపిస్తుందీ అంటే… అరె, హార్లిక్స్‌లో ఏముందిరా..? అందులో ఉన్న కాల్షియం పాలల్లో ఉంది, ఐరన్ పాలకూరలో […]
7 th Sense..! పదేళ్లనాటి ఈ సినిమా ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తోంది..!!
ఆ చైనావాడు ఎంత బుకాయించినా… ఆ చైనా భక్తగణం ఇక్కడ ఎన్ని వక్రబాష్యాలతో చైనాను వెనకేసుకొస్తున్నా… ఆ WHO వాడు కూడా ఏ ప్రలోభంతోనో చైనాకు దాసోహం అంటున్నా… ప్రపంచాన్ని –ంక నాకించేసిన కరోనా వైరస్ చైనా వాడి సృష్టేననీ, వుహాన్ ల్యాబులో తయారు చేసే జీవాయుధం లీకై విశ్వమంతా వ్యాపించిందనీ ఇప్పుడు ప్రతి దేశమూ నమ్ముతోంది… గత ఏడాది జనవరిలోనే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… వుహాన్ మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నయ్… ఈ స్థితిలో […]
‘‘జగన్ మళ్లీ జైలుకు… పార్టీ పగ్గాలు షర్మిలకు…’’ ఆస్ట్రో జర్నలిస్ట్ ఆర్కే విశేషరచన…
‘‘జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయం, అనవసరంగా రఘురామ కృష్ణంరాజుతో గోక్కున్నాడు… రఘు ఊరుకునేరకం కాదు, ఢిల్లీలో కూర్చుని రచ్చ చేసేస్తున్నాడు… ఢిల్లీ కూడా అదును కోసం వేచిచూస్తోంది… రేప్పొద్దున జగన్ బెయిల్ రద్దు అయిపోగానే, తన భార్య భారతిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టే ఆలోచనలో ఉన్నాడు జగన్… కానీ తమిళనాడులో అన్నాడీఎంకేను శశికళ చేతుల్లో నుంచి తప్పించి ఆమెను శంకరగిరి మాన్యాలు పట్టించినట్టుగానే జగన్‌ను కూడా కట్ చేసేస్తారు మోడీ, అమిత్ షా… షర్మిలను […]
కేసీయార్ రైతుబంధును అన్యాపదేశంగా తిట్టిపోసిన నమస్తే తెలంగాణ..!!
ముందు నుంచి అనుకుంటున్నదే ఇది…. అంతా బాగున్నప్పుడు… కేసీయార్‌తో బాగున్నప్పుడు… అందరూ కలిసి కొత్తకొత్తగా తెలంగాణ సమాజాన్ని దంచుకుంటున్నప్పుడు… దండుకుంటున్నప్పుడు… ప్రజలు లేరు, ఆత్మాభిమానం లేదు… ఇప్పుడు కేసీయార్‌కూ, తనకూ పడకపోతే అకస్మాత్తుగా తెలంగాణ ప్రజలు, బానిస భవన్ గట్రా గుర్తురావడం కరెక్టు కాదని….!! ఒకటి మాత్రం ఈటల చెప్పింది నిజమే… ఐదేళ్లుగా కేసీయార్‌తో గ్యాప్ ఉందనేది… కానీ తెలంగాణ ప్రజలు, వాళ్ల సంక్షేమం అనే సోయి నిజంగానే ఉండి ఉంటే, అక్కడ బానిసగా ఎందుకిన్నేళ్లు బతికినట్టు..?! […]
హనుమ జన్మస్థలి రచ్చలోకి బ్రహ్మి..! ఏబీఎన్ చర్చలో మరీ కామెడీ వాదన..!!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ అకశేరుక ప్రపంచం… అంటే వెన్నెముకల్లేని జీవజాతులు కొన్ని వంగుతూ, పాకుతూ నడుస్తుంటాయి… తప్పదు… వెన్నెముక ఉన్నట్టు గానీ, విద్యత్తు ఉన్నట్టు గానీ, జోకుడు జ్ఞానం తప్ప ఇంకేమైనా జ్ఞానమున్నట్టు గానీ పసిగడితే సినిమా పెద్దలు మెడలు విరిచేస్తారు… ఇక స్త్రీలయితే తాము రక్తమాంసాలున్న ప్రాణులమని కూడా మరిచిపోవాల్సిందే… ఈ స్థితికి అలవాటుపడ్డవాడే ఉంటాడు… ఏళ్ల తరబడీ స్టార్ కమెడియన్‌గా వెలిగిన బ్రహ్మానందానికి ఈ విషయం తెలుసు… తను స్వతహాగా కాస్త […]
సమంతాలో అసలు నటి అజ్ఞాతం వీడింది… బయటికొచ్చింది, ఇప్పుడామె ‘టైగర్’…
రెగ్యులర్, రొటీన్ సినిమా రివ్యూ ఫార్మాట్ కాదు… దీన్ని కొత్తగా చూడాలి… కొత్తగా రాసుకోవాలి… అసలు ఇది సినిమా కాదు… రొటీన్ కమర్షియల్ సినిమా లక్షణాలు కూడా లేవు… ఉండకూడదు… ఓటీటీల్లో వచ్చే వెబ్ సీరీసుల్లో మితిమీరిన హింస, వల్గర్ గట్రా ఉండవచ్చుగాక… కానీ ఇన్నాళ్లూ రొటీన్ సినిమాల్లోని అనేక పైత్యాల నుంచి ప్రేక్షకుల్ని అవి దూరం తీసుకుపోతున్నయ్… క్రియేటివిటీకి పదును పెడుతున్నయ్… కొత్త కథల్ని, కొత్త కథనాల్ని, కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నయ్… లేకపోతే మామూలు […]
ఎంత బాపు అయితేనేం… రాజాధిరాజు నిర్మొహమాటంగా ఉల్టా తన్నేసింది…
Bharadwaja Rangavajhala…….. మార్క్సీయ వాక్యం … శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి. అదే వాక్యం కొంచెం కామెడీ గా రాజాధిరాజు సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని … ముళ్లపూడి వెంకట్రమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ … ఆయన తన సినిమాల్లో రాజకీయాలు బానే రాశారు … మన ఊరి పాండవులు చిత్రంలో ఆయన […]
- « Previous Page
- 1
- …
- 407
- 408
- 409
- 410
- 411
- …
- 466
- Next Page »