…… మనం చెప్పుకున్నదే కదా… తెలుగునాట మీడియా వార్ ఎలా నడుస్తున్నదో… ఏపీలో యెల్లో వర్సెస్ నాన్-యెల్లో మీడియా… తెలంగాణలో పింక్ వర్సెస్ ఆరెంజ్ మీడియా… క్లారిటీ కావాలా..? యెల్లో మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఎట్సెట్రా… నాన్ యెల్లో మీడియా అంటే సాక్షి… జగన్ విసిరే యాడ్స్‌తో రాజీపడి అవసరార్థం భజన చేసే ఆంధ్రప్రభ, ప్రజాశక్తి ఎట్సెట్రా ఎప్పటికప్పుడు రంగులు మార్చే కేటగిరీ… ఈమధ్య పోలవరంపై యెల్లో మీడియా రాతల బట్టలు విప్పిన సాక్షి […]
ఆ చప్పుడేందీ, ఆ స్పీడేందీ … అసలు ఈ బండి ఎక్కడిదిరా బాబోయ్…
ఇది మరీ పాత మోడల్ అంబాసిడర్ బండి లెక్క సాలిడ్‌గా ఉంది… కాదు, కాదు, పాత బుల్లెట్ బండి ఇది, ఆ చప్పుడే డిఫరెంట్ కొడ్తంది…. ఇదెక్కడి బండిరా బాబోయ్, ఊహించని డ్యాష్లిస్తోంది…….. ఓ డివిజన్‌కు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఓ నాయకుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి చేసిన సరదా కామెంట్ ఇది… తన ఇంటి పేరు బండి కదా… నిజంగానే బండి సంజయ్ ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓ డిబేటబుల్ […]
శెభాష్ ఆంధ్రజ్యోతీ…! ఇంకా పాత్రికేయం నీలో బతికే ఉన్నట్టుంది…!
…. ముందుగా ఆంధ్రజ్యోతికి అభినందనలు… ఈ పాలిటిక్సులో పడి పత్రికలు, టీవీలు ఇక వేరే జీవనాన్ని పట్టించుకోవడమే మానేశాయి… నాయకుల పిచ్చి వాగుళ్లను హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి… ఏపీలో కులసమరం, తెలంగాణలో గ్రేటర్ సమరం… ఇక జనం కష్టాలకు మీడియాలో స్పేస్ ఎక్కడిది..? కానీ… కానీ… ఈ హెక్టిక్, పొలిటికల్, కమర్షియల్ యాక్టివిటీలోనూ అన్నదాత అరిగోసను ఫస్ట్ పేజీలో హైలైట్ చేసినందుకు… పాత్రికేయం ఆత్మహత్య చేసుకుంటున్న ఈ గడ్డు రోజుల్లో, ఇంకా సదరు పత్రికలో అది […]
కేబీసీ… ఏడు కోట్ల విలువైన ఆ అత్యంత గొట్టు ప్రశ్న తెలుసా మీకు..?
ప్రస్తుత 12వ సీజన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో వరుసగా… ముగ్గురు మహిళలు వారానికొకరు కోటి రూపాయల చొప్పున గెలుచుకున్న ముచ్చట చెప్పుకున్నాం కదా… నజియా నసీం, మోహితశర్మ… నిన్న అనుప దాస్… ముగ్గురూ ఉద్యోగులే… వారిలో అనుప దాస్ టీచర్… మోహిత శర్మ ఐపీఎస్ అధికారి, నజియా నసీం ప్రైవేటు కంపెనీ కమ్యూనికేషన్స్ ఎంప్లాయీ… వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు నేపథ్యాలు… సరే గానీ… ఈ షోలో మొదట తేలికపాటి ప్రశ్నలుంటయ్… అల్కటి ప్రశ్నలు… తరువాత ప్రైజ్ […]
డీగో మారడోనా… ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడికి మరోవైపు బోలెడన్ని డార్క్ షేడ్స్…
డీగా మారడోనా… అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్… అంతేనా..? కాదు..! ఆ ఆటను ప్రేమించేవాళ్లకు మారడోనా ఓ అద్భుతం… అలాంటి ఆటగాడు మళ్లీ పుట్టడు… అంతే… ఆ కాళ్లలో ఏదో మహత్తు ఉంది… తను ఓ బంతి మంత్రగాడు… అందుకే ఆ పాదాలు పరుగులు తీస్తూనే బంతిని ఆదేశిస్తాయి… బంతి కదలికల్ని నిర్దేశిస్తాయి… ఇలా చెప్పుకుంటారు ఫుట్‌బాల్ ప్రేమికులు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు మారడోనా… ప్రత్యేకించి 1986 ప్రపంచకప్పులో ఇంగ్లండ్ మీద […]
అభిజిత్ Vs బిగ్‌బాస్… ఓ విడ్డూరపు గేమ్‌లో ఇప్పటికైతే విజేత అభిజితే…
బిగ్‌బాస్‌తో అభిజిత్ ఆడుకుంటున్నాడా..? అభిజిత్‌తో బిగ్‌బాస్ ఆడుకుంటున్నాడా..? ఈ ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పగలిగినవారికి వచ్చే బిగ్‌బాస్ సీజన్లో నేరుగా ఎంట్రీ ఇచ్చేయొచ్చు… నవ్వొస్తున్నదా..? నిజంగానే నవ్వులాట యవ్వారంగా మారింది బిగ్‌బాస్ ధోరణి… జనం నవ్వుకునేట్టుగా మారింది… బిగ్‌బాస్ ఏ సీజనైనా, ఏ భాషైనా సరే… కంటెస్టెంట్ల నడుమ పోటీ ఉంటుంది… కానీ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ మాత్రం బిగ్‌బాస్‌కూ అభిజిత్కూ నడుమ పోటీ సాగుతోంది… నిజంగా అభిజిత్ పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు… అందరిలాగా బిగ్‌బాస్ […]
ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో సరిగ్గా తెలిసి, ఎదిగి… చివరకు…
1980-81… ఓ శీతాకాలం సాయంత్రం… పార్లమెంటు సభ్యుల నడుమ ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది… గుజరాత్, భరూచ్ నుంచి వచ్చిన యువ ఎంపీ అహ్మద్ పటేల్ బ్యాటింగులో ఇరగదీసేస్తున్నాడు… సెంచరీకి దగ్గరయ్యాడు… మరోవైపు మాధవరావు సింధియా… అహ్మద్ పటేల్ బ్యాటింగు చేస్తుంటే ఇక వేరే ప్లేయర్లకు ఆడటానికి ఏమీ ఉండదు… సింధియా సరదాగా నవ్వుతూ మొత్తం నువ్వే ఆడితే మరి మేమేం చేయాలి భయ్యా అన్నాడు… ఆ తరువాత బంతికే పటేల్ బౌల్డ్ అయ్యాడు… కావాలనే… […]
ఒరే నాన్నా… అది రెండు వారాల ఇమ్యూనిటీ అసలే కాదురా తండ్రీ…
……… ‘‘అవినాష్ ఇక టాప్ ఫైవ్‌లో చేరినట్టే… నిన్నటి ఎవిక్షన్ ఫ్రీ పాసుతో రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది… ఇంకేముంది..? నేరుగా టాప్ ఫైవ్ జాబితాలోకే…’’ ఇవీ బోలెడు మంది నమ్ముతున్నది, రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది… కానీ నిజం కాదు… అసలు ఆ టాస్కు ఏమిటో, అందులో అవినాష్ గెలుచుకున్నది ఏమిటో, దాని ఉపయోగం ఏమిటో తెలియకుండా మౌసుకొచ్చింది గీకడమే ఇది… అవినాష్ మధ్యలో వచ్చాడు… తను పెద్ద కమెడియన్ అనీ, తనను కావాలని బిగ్‌బాస్ ఎన్నుకున్నాడనీ, […]
బేజా ఫ్రై… ఆలీతో ఇదే సమస్య… ఏదో అనేస్తాడు, ప్రేక్షకుల బుర్ర తినేస్తాడు…
కమెడియన్ ఆలీ ఇంకా సీతాకోకచిలుక సినిమాలో లాగులో ఉచ్చ పోసుకున్న స్టేజ్ నుంచి ఈరోజుకూ ఎదగలేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు… సరదాగానే అంటున్నాం లెండి సార్… నిజంగానే కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే తెలియదేమో… తన తాజా షో చూశాక అదే చిరాకు కలిగింది… నిజమే… చిరాకే… అప్పుడెప్పుడో నలభై ఏళ్ల క్రితం వచ్చిన సప్తపది సినిమా గుర్తుందా..? బహుశా రెండుతరాల వాళ్లకు తెలిసి ఉండదు… విశ్వనాథ్ సినిమా అది… అందులో హీరోయిన్ సబిత… హీరో గిరీశ్… […]
సర్జికల్ స్ట్రయిక్స్… ఈ పదాన్ని కాయిన్ చేసినవాడికి శతకోటి నమోనమః
సర్జికల్ స్ట్రైక్స్ తో భాగ్యనగరంలో శస్త్ర చికిత్స సమ్మె! ———————— తెలుగదేలయన్న దేశంబు తెలుగు. మనం తెలుగువారం. మన తెలుగు తల్లి, తెలంగాణా తల్లి మనకు గొప్ప. రెండ్రోజులుగా భాగ్యనగరం వీధి ఎన్నికల ప్రచారంలో ఒకటే సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. తెలుగు తల్లి, తెలంగాణా తల్లి ఇద్దరూ బాగా హర్ట్ అవుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నందుకు కాదు. ఆ మాటను తెలుగులో కాకుండా ఇంగ్లీషులో వాడుతున్నందుకు. తెలుగంటే చెవులతోపాటు గొంతు కూడా కోసుకునే ఎందరినో ఈమాటకు తెలుగులో […]
ట్రబుల్ షూటర్… నిజంగానే ఈయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు…
…. ఎవరైనా మరణిస్తే… ఆయన మరణం తీరని లోటు అని సంతాప ప్రకటన చేస్తుంటారు కదా… చాలా మరణాల విషయంలో అది మర్యాదపూర్వకమైన సంతాపం కావచ్చు గాక… కానీ ఈరోజు మరణించిన కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ మరణం మాత్రం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే తీరనిలోటు… అసలే అనేక కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం మరింత నష్టదాయకమే… కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆయన కీలకమైన లీడర్… ట్రబుల్ షూటర్… స్ట్రాటజిస్టు… సైలెంట్ ఆపరేటర్… తను […]
హేట్రిక్… వరుసగా మూడో కోటీశ్వరురాలు… అసలు ఎవరీ అనుపదాస్..?
కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్నవాళ్లు గతంలోనూ ఉన్నారు… కాకపోతే ఇప్పుడు నడుస్తున్న కేబీసీ 12 సీజన్లో… జస్ట్, ఈ రెండుమూడు వారాల్లోనే వరుసగా ముగ్గురు కోటి రూపాయల చొప్పున గెలుచుకోవడం విశేషమే… పైగా అందరూ మహిళలే… ఫస్ట్ నజియా నసీం… సెకండ్ మోహిత శర్మ… ఇప్పుడు అనుపదాస్… వరుసగా మహిళలు కోటి చొప్పున కొల్లగొట్టేస్తున్న తీరు ఇంట్రస్టింగే… నజియా నసీం… నేటివ్ జార్ఖండ్, కానీ ఇప్పుడు ఢిల్లీ వాసి… రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంటర్నల్ […]
సర్జికల్ స్ట్రయిక్స్…! దారితప్పలేదు, బండి వెళ్లాలనుకున్నదే ఆ దారి…!!
…… పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి… అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమేస్తాం…. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్య గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా సెగ పెంచింది… అందరికీ తెలుసు, పాతబస్తీ అంటే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏమీ కాదని…! అవేమైనా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండే ఉగ్రవాద శిబిరాలా..? లాంచింగ్ ప్యాడ్లా..? అసలు ఇక్కడ సర్జికల్ స్ట్రయిక్స్ అనే పదమే అర్థం లేనిది… ఐనా సరే, దేశాన్ని పాలించే ఓ అధికార […]
మోనాల్‌ను బిగ్‌బాస్ పదే పదే సేవ్ చేయడానికి కారణం ఇదే…!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు స్థాయిలో… బిగ్‌బాస్ మోనాల్‌ను ప్రతిసారీ ఎందుకు కాపాడుతూ ఉంటాడు అనే ప్రశ్న కూడా…! నిజానికి బిగ్‌బాస్ షోను చాలామంది ద్వేషిస్తారు కానీ మన తెలుగు టీవీ సీరియళ్లు, మన స్టార్ హీరోల ఫార్ములా ఇమేజ్ సినిమాలకన్నా చాలా బెటర్… ఇది రియాలిటీ షో… కానీ ప్రతిదీ స్క్రిప్టెడ్… మీ ఆట మీరు ఆడుకొండి అని వదిలేయడం ఉండదు… ఎవరెలా ఆడాలో కూడా బిగ్‌బాస్ అనే డెస్టినీ డిసైడ్ చేస్తూ ఉంటుంది… ఆడిస్తూ […]
ఇది ఓ పరుసవేది… పఠనాసక్తులకు పఠనీయం… మల్లాదికి అభినందనలు…
ది ఆల్కెమిస్ట్ …. ఈ నవల మొదట పోర్చుగీస్ భాషలో ప్రచురింపబడింది. తరువాత 67 భాషలలోకి అనువదించబడింది. ఇప్పటికీ జీవించి ఉన్న ఓ రచయిత నవల ఇలా అత్యధిక భాషలలోకి అనువదింపబడిన తొలి రచన ఇది… 150 దేశాలలో ఈ పుస్తకం ఆరున్నర కోట్ల కాపీలు అమ్ముడయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలలో ఇది ఒకటి… పాలో ఖెలో అనే రచయిత వ్రాసిన ఒక దృష్టాంత (allegorical) మొట్టమొదట ఈ పుస్తకం 1988లో ముద్రింపబడింది… ఈ నవలలో […]
మేయర్ కుర్చీ కేసీయార్‌దే… కానీ అంతకుమించి ఏదో ఉంది ఈ ఎన్నికల్లో…
ఒక చిన్న ప్రశ్న…. గత గ్రేటర్ ఎన్నికల ముందు విశ్వనగరం చేస్తా, స్వర్గాన్ని నేల మీదకు దింపుతా, అరచేతిలో వైకుంఠం చూపిస్తా వంటి ప్రామిసులు చేసిన కేసీయార్ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటూ అది ఫ్రీ, ఇది ఫ్రీ అని ఏదేదో చెప్పాడు… అయ్యా సారూ, నువ్వు ఏదీ చేయవు గానీ, నీ ఒవైసీ నువ్వూ కలిసి ఉద్దరించేది ఏమీ లేదు గానీ… ఆ ఎల్ఆర్ఎస్ రద్దు చేయగలవా అని అడుగుతున్నారు జనం… ఆ సెగ ప్రచారం […]
బాబుగారి క్యాంపు పనిచేస్తోంది… జగన్‌పై టీడీపీ అమూల్ కార్టూన్ మార్క్ కౌంటర్…
ఒకప్పుడు… అంటే నవ్యాంధ్ర, అనగా పచ్చాంధ్ర… చంద్రాంధ్ర… టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో… వందల మంది సోషల్ మీడియా వారియర్స్ జగన్ మీద క్రియేటివ్ మీమ్స్, పోస్టులు, వీడియోలతో ఎక్కీ దిగేవాళ్లు… జగన్ ఫ్యాన్స్ కూడా ఆర్గనైజ్డుగా గాకపోయినా బాగానే కౌంటర్ చేసేది… కానీ చంద్రబాబు అదృష్టం తిరగబడి, అవమానకరమైన ఓటమి పొందాక… ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది… జగన్ సోషల్ మీడియా ఈరోజుకూ పెద్దగా వ్యవస్థీకృతం కాలేదు… కానీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద […]
… అందులో రాళ్లపల్లి ఓ దొంగల స్కూలు నడిపించేవాడు గుర్తుందా..?
ఇచ్చట సైబర్ నేరాలు నేర్పబడును! ———————- కొత్త కొత్త రంగాలు పుట్టుకొచ్చే కొద్దీ ఆయా రంగాలకు అవసరమయిన వృత్తి నిపుణులు అవరమవుతారు. అందుకు తగినట్లు ప్రత్యేక విద్యలు, శిక్షణలు కూడా అవసరమవుతాయి. ఈగ ఇల్లలుకుతూ తనపేరు తానే మరచిపోయింది. ప్రపంచం 1990 ప్రాంతాలనుండి ఐ టీ నామస్మరణలో అన్నిటినీ మరిచిపోయింది. ఇప్పుడు సాఫ్ట్ వేర్ కొలువులే కొలువులు. మిగతావన్నీ చాలా హార్డ్. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల స్వరూప స్వభావాలు, లక్షణాలు, రాత్రి పగలు పనిగంటలు, వీకెండ్ జల్సాలు… […]
ఇప్పటివరకు వరస్ట్ రాష్ట్రపతి ఎవరు..? ట్విట్టర్లో ఓ ట్రెండింగ్ డిస్కషన్…
డిస్కస్ చేయడానికి సమకాలీన అంశాలేమీ దొరక్కపోతే… ముచ్చట్లు ఆగవు కదా… ఏదో ఒకటి పాతవి తవ్వేసి డిస్కషన్స్ నడిపిస్తుంటారు సోషల్ నెటిజన్లు… ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండింగ్ అంశం ఉండాల్సిందే… ట్రోల్ చేసేవాడు, తిట్టేవాడు, మెచ్చుకునేవాడు, మీమ్స్ నడిపేవాడు… రకరకాలుగా బిజీ అయిపోతుంటారు… నిన్న పెద్ద ఏ అంశమూ లేకపోవడంతో ఒకాయన ఎవరో స్టార్ట్ చేశాడు… అసలు ఇప్పటివరకూ మనకున్న రాష్ట్రపతుల్లో బెస్ట్ ఎవరు..? వరస్ట్ ఎవరు..? ఇదీ డిబేట్… నిజానికి సందర్భం ఏమీ లేదు… […]
హమ్మయ్య… కళ్లు తెరిచి, థియేటర్ల యమర్జెన్సీ గుర్తించిన సర్కారు…
కరోనా పిలుస్తోంది! కదిలి రండి థియేటర్లకు!! ———————— కొన్ని దృశ్యాలు, కొన్ని సంఘటనలు మనలో కొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని కల్గిస్తాయి. జీవితం మీద ఆశను చిగురింపజేస్తాయి. సినిమా పెద్దలు ప్రభుత్వ పెద్దలను కలవడం; ప్రభుత్వ పెద్దలు సినిమా పెద్దల ఇళ్లకు వెళ్లడం, శీతాకాలంలో ముంచుకొస్తున్న కరోనా సెకండ్ వేవ్ వేళ థియేటర్లు తెరవడం మీద వరుస మీటింగులు పెట్టుకోవడం, బతకడానికి అవసరమయిన ప్రాణవాయువుకంటే అధికమయిన థియేటర్లను ఇక తెరుచుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతించడం దానికదిగా జరిగిపోయిన మామూలు విషయం […]