. ( Ravi Vanarasi )…. చరిత్రాత్మక రైల్వే మార్గాలపై ఒక కొత్త అధ్యాయం మొదలైంది. భారతదేశ రైల్వే చరిత్రలో గతంలో ఎన్నడూ కనని, వినని ఒక విస్మయకర ఘట్టం ఆవిష్కృతమైంది. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్లోని చందౌలీ పట్టణం నుండి, ‘రుద్రాస్త్ర’ అనే పేరుతో 4.5 కిలోమీటర్ల పొడవున, 354 వ్యాగన్లతో కూడిన ఒక భారీ సరుకు రవాణా రైలు దూసుకుపోయింది. ఆరు బాక్స్ రేక్‌లను కలిపి, వాటిని నడిపించడానికి ఏకంగా ఏడు ఇంజిన్లను […]
తెలుగు సినిమా జనం మారరు… వార్-2 ప్రిరిలీజ్ తీరూ అదే చెప్పింది…
. నిన్న ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… ఎవరో సినిమా నిర్మాత, ఎవరో సినిమా హీరో తన లాభం కోసం, తన వినోద వ్యాపారం కోసం… తన సినిమా హైప్ కోసం ఓ మార్కెటింగ్ టెక్నిక్‌గా ప్రిరిలీజ్ ఫంక్షన్ పెడితే ప్రభుత్వం అంగీకరించాలా..? పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు, జనం అవస్థలు, ఫ్యాన్స్ వీరావేశాలు… తీరా వాళ్లకేమైనా కృతజ్ఞత ఉంటుందా..? జీరో… సొసైటీ పట్ల, ప్రభుత్వం పట్ల..! అదే జరిగింది… వాళ్లలో వాళ్లు పొగుడుకున్నారు… భుజకీర్తులు తొడుక్కున్నారు… చిన్న చిన్న […]
అక్కడెలా నిర్మించగలిగారు… కేదారనాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి…
. ఏదో ఉంది కేదారనాథ్ గుడిలో… ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో… మనకు అర్థం కాని మిస్టరీ… ఎస్, భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ల నిర్మాణంలో ఉంది… వందలేళ్లు అలా చెక్కుచెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నో… ఎన్నెన్నో… ప్రత్యేకించి కేదారనాథ్… ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు… 8వ శతాబ్దం అంటుంటారు… అంటే ఈ గుడి వయస్సు 1200 ఏళ్లు దాటి… చెక్కుచెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జికి శిఖరమెత్తు ప్రతీక… అసలు ఆ […]
ఈ తరానికి తెలియకపోవచ్చు… ఈమె కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు అప్పట్లో…
. మొన్న జ్యోతిలక్ష్మి వర్ధంతి… ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు… కానీ ఫిఫ్టీస్ నుంచి సెవన్టీస్ నడుమ ఉన్నవాళ్లందరికీ ఆమె ఓ ఐటమ్ బాంబ్… ఏవేవో సెర్చ్ చేస్తుంటే… మిత్రుడు Mani Bhushan అప్పుడెప్పుడో రాసిన ఓ పాత పోస్టు కనిపించింది… శృంగార కావ్యాలలొ రాసిన స్త్రీ సౌందర్యానికి, శరీర లావణ్యానికి సరైన కొలబద్దలా ఉండేది జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి ఆట, ఎల్లారీశ్వరి పాట, రాజబాబు కామెడీ ఒక జమానాలో తెలుగు సినిమాని ఊపేశాయి. అప్పట్లో హండ్రెడ్ డేస్ ఆడిన ప్రతి […]
భేష్ నూకరాజు- వర్ష… ఆ స్కిట్‌తో కంటతడి పెట్టించారు…
. గతం వేరు… ఈటీవీ తక్కువ ఖర్చుతోనే పలు రియాలిటీ షోలను నడిపించేది, మంచి రేటింగ్స్ కూడా వచ్చేవి… తరువాత క్రమేపీ భ్రష్టుపట్టిపోయాయి… ఉదాహరణకు సుమ అడ్డా… కేవలం సినిమాలు, సీరియళ్ల ప్రమోషన్లకు పరిమితమై… మొనాటనస్ సుమ టాకింగు, యాక్టింగుతో రేటింగుల్లో రోజురోజుకూ పాతాళం బాట… బూతులకు ప్రసిద్ధి చెందిన అశ్లీల జబర్దస్త్ సరేసరి… ఏవేవో మార్పులు అన్నారు గానీ… పెద్దగా ఉద్దరించబడిందేమీ లేదు… చివరకు పాడుతా తీయగా కూడా నానాటికీ తీసికట్టులా మారిపోయింది రేటింగుల్లో… కాకపోతే […]
ఎవరి సినిమాల్ని వాళ్లే చూసుకుంటున్నారు… ఒకటీఅరా మినహా…
. కింగ్డమ్ సినిమా వసూళ్లు ఇప్పటికి తెలుగులో 45.9 కోట్లు (10 రోజులు) … తమిళంలో కేవలం 3.7 కోట్లు సూ ఫ్రమ్ సో సినిమా వసూళ్లు కన్నడంలో 53.53 కోట్లు (16 రోజులు)… మలయాళంలో 2.55 కోట్లు (8 రోజులు), తెలుగులో మరీ 15 లక్షలు (ఒకరోజు) తలైవాన్ తలైవి సినిమా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 74.3 కోట్లు (16 రోజులు)… కానీ తెలుగు వెర్షన్ సార్ మేడమ్ వసూళ్లు 1.97 కోట్లు మాత్రమే… హరిహర వీరమల్లు […]
రాఖీ- రక్తబంధం పట్ల తిరస్కృతి…! కేటీయార్, కేసీయార్‌కు బాగా మైనస్..!!
. రాఖీ పౌర్ణిమ పండుగ వచ్చి… కవితకు రాఖీ కట్టే అవకాశం ఉద్దేశపూర్వకంగానే అవాయిడ్ చేసిన కేటీయార్ తన మీద తనే నెగెటివ్ సంకేతాల్ని జనంలోకి పంపుకున్నాడు… హార్ష్‌గా ఉన్నా ఇదే నిజం, రియాలిటీ… నాయకుడికి భావోద్వేగాల మీద అదుపు ఉండాలి… అది నాయకత్వ లక్షణం కూడా… ప్రజలు కీన్గా గమనిస్తుంటారు… నాయకులైతేనేం, తమలాంటి మామూలు మనుషులే కదా, కోపాలు సహజం కదాని తీసుకోరు… ఎండ్ ఆఫ్ ది డే సొంత చెల్లెలు కదా… సేమ్, నెత్తురు […]
ఒరేయ్ మణీ… పెన్నులో శాయి ఐపాయె, నాలుగు చుక్కలు పోయరా…
. అప్పట్లో… ఇంక్ పెన్నులే కదా… మన భాషలో పత్తి పెన్నులు… ఫౌంటేన్ పెన్నులు… వాటితో రాత ఓ ప్రయాస, పట్టు కుదిరితే మాత్రం అక్షరాలు చెక్కినట్టుగా ముత్యాలసరాలే… చదువంతా ఓ ఎత్తు, పత్తి పెన్ను మెయింటెనెన్స్ మరో ఎత్తు… అందులో ఇంధనం సిరా… అప్పట్లో మేం శాయి అనేవాళ్లం… అందరి ఇళ్లల్లోనూ సిరా సీసా ఉండేది… లేదంటే మల్లయ్య సేటు దుకాణానికి పోతే 5 పైసలు తీసుకుని, నింపి ఇచ్చేవాడు… అసలు పత్తి పెన్నులో సిరా […]
మాస్ మసాలా దట్టించి వదిలారు… దెబ్బకు బాలయ్య సూపర్ బ్లాక్ బస్టర్…
. Subramanyam Dogiparthi ……. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ గోపాలరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ ముద్దుల క్రిష్ణయ్య . మ అనే అక్షరం వీళ్ళకు బాగా కలిసొచ్చింది . 28 సెంటర్లలో వంద రోజులు , మూడు సెంటర్లలో సంవత్సరం పాటు ఆడి డబ్బుల వర్షం కురిసింది . ఏముందంట ఈ సినిమాలో ? సగటు ప్రేక్షకుడి వినోదానికి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి . గ్రామాలలో ఇప్పటికీ ఎంతో […]
ఏదో ప్రైవేటు సినిమా దందాకు… ప్రజలకెందుకు అవస్థలు నాయకా..?!
. సినిమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎవరో గానీ తప్పుదోవలో తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది… తన ధోరణి నుంచి యూటర్న్ తీసుకోవడం వెనుక ఎవరి ప్రభావం ఉందో గానీ… మామూలు జనానికి మాత్రం నచ్చని పంథాకు మళ్లింది ప్రభుత్వ విధానం… ఇక్కడ బతుకుతూ, ఇక్కడి నుంచే ప్రేక్షకులను దోచుకుంటూ… ఇక్కడి సీఎం పేరు తెలియనట్టు బహిరంగంగా, ఆఫ్టరాల్ తెలియాల్సిన అవసరమే లేదన్నట్టు నటించిన ఓ బన్నీని అరెస్టు చేయడం గానీ… సుద్దపూసలా నటిస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా […]
చంద్రబాబు పీ-4 అబ్రకదబ్ర పథకం బట్టలిప్పేసిన ఆంధ్రజ్యోతి…!!
. నిజం… సాక్షికి చేతకాలేదు… రాయడం తెలియలేదు… ఓ పథకాన్ని నిశితంగా విశ్లేషించి, తప్పొప్పులను జనం ముందు పెట్టలేక చేతులెత్తేస్తోంది… చంద్రబాబుకు అత్యంత సన్నిహితమే అయినా పీ-4 పథకం బట్టలిప్పింది ఆంధ్రజ్యోతి… సాక్షి చేయాల్సిన పనిని ఆంధ్రజ్యోతి చేసింది… సరే, ఈనాడు ‘అన్నీ వదిలేసి’ చాన్నాళ్లయింది కాబట్టి, దాన్ని అలా వదిలేస్తే… నిజంగా రాధాకృష్ణ పీ-4 పథకం ఆలోచన, అమలు తీరుపై రాసిన వ్యాసం బాగుంది… అఫ్కోర్స్, ఆ పథకం తన చంద్రబాబుకే నష్టం కలిగించకుండా, మెత్తమెత్తగానే […]
మాతృ భాషపై తమిళుల తాదాత్మ్యం ముందు మనం నిలువలేము
. మన పద్యం గంట కొట్టదా? “అనగ అనగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ!” పాడగా, పాడగా రాగం శ్రుతిలో పడి వీనులవిందు అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే పట్టుదలతో చేపట్టిన పని చేస్తూపోతే తప్పకుండా విజయం లభిస్తుంది. మాతృ భాషకు సంబంధించి తమిళుల తాదాత్మ్యం ముందు మనం నిలువలేము. మన రక్తంలో మాతృభాష పరిరక్షణ కణాలు ఏనాడో మాయమయ్యాయి. […]
ఛేంజ్… ఛేంజ్… ప్రపంచం మారిపోతోంది… పట్టలేనంత వేగంగా…
. Chakradhar Rao …… కళ్ళముందు స్కూటర్లన్నీ కార్లు అయ్యాయి. బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్ టీవీ అయ్యి ఆపై ఫ్లాట్ టీవీ.. హోమ్ థియేటర్స్ అయిపోయింది. ఒక మూలకు ట్రింగ్ మనే ఫోను ప్రతి వాళ్ల చేతుల్లోకి వచ్చేసింది. క్యాలిక్యులేటర్లు… రేడియోలు, టేప్ రికార్డర్లు, వాక్మన్లు, కెమెరాలు, దుకాణాలు, హోటల్స్, గుళ్లలో ఆర్జిత సేవలు అన్నీ మొబైల్ ఫోన్లో ఇమిడిపోయాయి. వేళ్లతోనే ప్రపంచాన్ని చూడగలగటం … వెళ్లాలనుకుంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలగటం, ప్రపంచంలో ఏమూలలో […]
మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు… చివరకు..!!
. ఐనా ఎవరికి గుర్తుంటాడులే… తన జయంతిని ఎందరు స్మరించుకుంటారులే… ఒక ఏఎన్నార్ అవుతాడు, ఒక ఎన్టీయార్ అవుతాడు అనిపించుకున్న ఓ అందాల నటుడి పుట్టినరోజు ఈరోజు… పేరు హరనాథ్… అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు… నిజంగానే ఓ దశలో చాలా పాపులర్ హీరో తను… రూపం, నటనతో మెప్పించాడు… ఎన్టీయార్‌కే సొంతం అనుకునే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లోనూ ఒప్పించాడు… అంతెందుకు..? ఎన్టీయార్ దర్శకత్వంలోనే వచ్చిన సీతారామకల్యాణం సినిమాలో రాముడు హరనాథే… తరువాత ఎన్టీయార్ […]
షిరిడిలో మానవత్వం పరిమళించిన శుభవేళ… Cab drivers Humanity…
. Mohammed Rafee ……… షిరిడిలో మానవత్వం పరిమళించిన శుభవేళ… “మాయమై పోతున్నడమ్మ మడిసన్న వాడు” అనే పాట ఎంత వాస్తవమో, అయినా ఇంకా అక్కడక్కడ మానవీయ చుక్కలు మెరుస్తూనే ఉన్నాయనేది వాస్తవమే! హైదరాబాద్ కు చెందిన రాజు కుటుంబం సాయిబాబా పై భక్తితో షిరిడి వచ్చారు! షిరిడి రావాలంటే రైలు ప్రయాణీకులు నగర్ సోల్ లో దిగి అక్కడ నుంచి క్యాబ్స్ లేదా సాయిబాబా భక్తి నివాసంకు చెందిన ఉచిత బస్సుల్లో షిరిడి చేరుకుంటారు! అక్కడ […]
కలాం 1200 స్టాటిక్ టెస్ట్ సక్సెస్… స్పేస్‌లోకి మన ప్రైవేటు రాకెట్లు..!!
. Ravi Vanarasi…. భారత అంతరిక్ష రంగంలో ఒక చరిత్రాత్మక విజయం… విక్రమ్-1 కోసం “కలాం-1200” స్టాటిక్ టెస్ట్! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC SHAR)లో, 2025 ఆగస్టు 8న ఉదయం 9:05 గంటలకు ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, తన విక్రమ్-1 లాంచ్ వెహికల్ మొదటి దశ అయిన కలాం 1200 […]
ఫాఫం హరగోపాల్… మరీ పింక్ ప్రకాశ్‌రాజ్ స్థాయికి జారిపోవడం..!!
. కొన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా విశ్లేషించుకోలేం… రాజకీయాలకు లంకె పెట్టకుండా ఉండలేం… అంతేకాదు, కొందరు ఏవేవో ముసుగులతో మేధావులుగా ఫేక్ మాస్కులతో చెలామణీ అవుతుంటే నిశ్చేష్టులమై ఉండిపోతాం కూడా… ముందుగా ఓ పోస్టర్ చూడండి… గతి తప్పిన బీఆర్ఎస్ మేధావివర్గం సంకల్పించిన ఓ మేధో సమావేశం (??) బాపతు పోస్టర్… పెద్దగా జాలి కలగడం లేదు గానీ… మరీ పింక్ ఇంటలెక్చువల్స్ మరీ ఇలా దిగజారాలా అనే బాధ… ఈరోజు ది గ్రేట్ ప్రకాశ్ రాజ్ […]
ఓ కోణంలో ట్రంపు సుంకదాడి ఇండియాకే మేలు… అదెలాగంటే..?!
. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు… జియో పాలిటిక్సులో కూడా..! అంటే, ప్రపంచ రాజకీయాల్లో కూడా..! పైకి చూడబోతే… తీయగా మాట్లాడుతున్నట్టు నటిస్తూనే… ఇండియాకు వ్యతిరేకంగా ట్రంపు తీసుకుంటున్న సుంకాల దాడి నిర్ణయాలు కేవలం తమ దేశపు వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాలో డంప్ చేసేందుకు వీలుగా… ట్రేడ్ డీల్ దిశలో ఇండియాపై ఒత్తిడి క్రియేట్ చేసి, లొంగదీసుకోవడం కోసమే అనిపిస్తుంది… కానీ..? దాని వెనుక బ్రిక్స్‌ను అడ్డుకోవడం, రష్యాను ఏకాకిని చేయడం వంటి చాలా […]
లాయర్ గారూ… నేను ఓ హత్య చేస్తాను… ఆ కేసు నుంచి మీరే కాపాడాలి…
. Subramanyam Dogiparthi …… ఆర్తుల పాలిట బ్రహ్మాస్త్రం ఈ సినిమాలో లాయర్ సాగర్ . బలహీనుల కోసం బలవంతులతో ఢీ కొట్టే పాత్ర కృష్ణది ఈ సినిమాలో . ఆ క్రమంలోనే ఒక బలవంతుడి అహాన్ని దెబ్బతీస్తాడు హీరో కృష్ణ . దెబ్బతిన్న పులి లాగా వేచి చూసి హీరో గారి బావని ఓ మర్డర్ కేసులో ఇరికించేస్తాడు ఆ విలనుడు . ఆ బావే తన పిచ్చి చెల్లెలిని చంపాడనే కచ్చతో రావు గోపాలరావు […]
రేవంత్‌రెడ్డి అంటించాడు… బండి సంజయ్ పెట్రోల్ పోస్తున్నాడు…
. కాగల కార్యం సంజయుడు తీర్చెన్… అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ కథ రక్తికడుతోంది… ఇప్పటిదాకా కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్నే బండి సంజయ్ తానూ చేశాడు… కాకపోతే తనదైన భాషలో ఘాటుగా… దాంతో కేటీయార్‌కు మండుకొచ్చింది… ఎహె, ఏమిటిదంతా..? నీకసలు నిఘా సిస్టం ఎలా పనిచేస్తదో తెల్వద్, నీకు లీగల్ నోటీస్ పంపిస్తా, ఏమనుకుంటున్నావో, 48 గంటల్లో సారీ చెప్పు, లేకపోతే బజారుకు లాగుతా అని అగ్గిమండిపోయాడు… ఈ విషయం తెలిసి సంజయుడు ఓ నవ్వు నవ్వుకుని లైట్ […]
- « Previous Page
- 1
- …
- 44
- 45
- 46
- 47
- 48
- …
- 389
- Next Page »



















