అసలు బెల్ బాటమ్ ప్యాంటు అంటే మజాకా..? ఎన్టీయార్ డ్రెస్సుల బెల్ బాటమ్ సైజు, అంటే పాదాల దగ్గర వెడల్పు… అదో విశేషం అప్పట్లో… అది రోడ్డును ఊడ్చీ ఊడ్చీ పోగులు బయటపడకుండా… జిప్పులు కింద ఫాల్లాగా కుట్టించేవాళ్లు… నిజం, అప్పట్లో ప్యాంట్లకూ జిప్ పాల్స్… హహహ… ఎయిటీస్‌లో లెండి… న్యారో ప్యాంటు వేసుకుంటే వాడిని అన్నాడీ కింద చూసేవాళ్లు… తెలుగులోకి అనువదింపబడిన ఓ కన్నడ డిటెక్టివ్ సినిమా ‘బెల్ బాటమ్’ పేరు చూడగానే గుర్తొచ్చేది ఆ […]
పాత స్టార్ కంటెస్టెంట్లతో… ఇప్పటి టాప్ ఫైవ్ ఫైనలిస్టుల భేటీ…
గుడ్… మంచి ఆలోచనే… వినోదం కోసం… వినూత్నంగా… పాత మూడు బిగ్‌బాస్ సీజన్లలో స్టార్ కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లను పట్టుకొచ్చి, ఇప్పుడు హౌస్‌లో టాప్ ఫైవ్ ఫైనలిస్టులుగా ఉన్నవాళ్లతో మాట్లాడింపజేయాలనే ఆలోచన గుడ్… దీంతో వచ్చేది లేదు, పోయేది లేదు… కాకపోతే ఈ ఫైనల్ వీక్ పెద్దగా హౌస్‌లో ఊడబొడిచేదేమీ ఉండదు… ఎలాగూ నామినేషన్లు, కెప్టెన్సీ టాస్కులు ఉండవు… ఉన్నదే అయిదుగురు… లొల్లి లొల్లి కూడా తక్కువే… కావాలని బిగ్‌బాస్ కైలాట్కాలు పెడితే తప్ప, పెద్దగా ఇక తగాదాలకూ […]
వెర్రి తలలు వేస్తున్న రాజమౌళి “ఊడూ ఇజం”
మానవ నాగరికత, పరిణామ క్రమంలో జంతుజాలానికి మనుషుల మధ్య జరిగిన సంఘర్షణలో మనిషే విజేత. ఆ విజయం తిరిగి మనుషులు – మనుషుల మధ్య కొనసాగి, అది వివిధ తెగలలో హింసా పూరిత ఘర్షణగా మారి రూపాంతరం చెందుతూ వస్తూ ఉంది. ప్రాచీనకాలంలో అన్ని తెగలలో ప్రబలంగా ఉన్న “ఊడూ ఇజం” గురించి మనం చెప్పుకోవాల్సిన సందర్భం. ఆ ఊడూ ఇజం సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ కొన్ని తెగలలో ముఖ్యంగా ఆ ఆఫ్రికాలోని కొన్ని సమూహాలలో ఊడూ ఇజం సంఘర్షణ, హింస రూపంలో కనిపిస్తూనే ఉంది. తెలుగు సినిమా దర్శక ప్రముఖుడు […]
గండరగండడు కేసీయార్… అందరూ తనను అండర్ ఎస్టిమేట్ చేశారు…
సమకాలీన తెలంగాణ రాజకీయ నాయకుల్లో గండరగండడు కేసీయార్… ఏ అడుగు వేసినా, ఏం ఆలోచించినా అది పరులెవ్వరికీ అంతుపట్టని రాజకీయం… తను ఎవరికీ కొరుకుడు పడడు… చాలామందికి అసలు అర్థమే కాడు… బయట ప్రచారంలో ఉండేది వేరు… తన పయనించే బాట వేరు… తన ఢిల్లీ పర్యటన ఒక్కసారిగా పొలిటికల్ సర్కిళ్లను ఏం విశ్లేషించుకోవాలో అర్థం కాని అయోమయంలోకి నెట్టేసింది… కేసీయార్‌కు కావల్సింది కూడా అదే… జస్ట్, అలా సైలెంటుగా వెళ్లాడు… ప్రధానిని, అమిత్ షాను కలిసిన […]
అటోఇటో జానా…? నై జానా..? ఉంటే ఫాయిదా లేదు.., పోతే పోయేదీ లేదు…
జానారెడ్డి… ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పదే పదే వినిపిస్తున్న పేరు… సాగర్ ఎమ్మెల్యే నర్సింహయ్య మరణంతో… అక్కడి రాజకీయాల్లో మళ్లీ కాస్త కుదుపు… మళ్లీ తెర మీదకు జానారెడ్డి పేరు……. చాలా దూరం వెళ్లిపోయింది చర్చ… తను పార్టీ మారుతున్నాడు, టీఆర్ఎస్, బీజేపీ తనను చేర్చుకోవడానికి రెడీ అయిపోయాయి… బీజేపీ అయితే ఏకంగా తనకు గవర్నర్ పోస్టు ఇవ్వడానికి, తన కొడుకు రఘువీర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి కూడా రెడీ అయిపోయిందని ఒక వార్త… ఎలాగూ […]
ఆమెకు మొత్తం ముందే తెలుసు… గేమ్ స్క్రిప్టు ప్రకారమే నిష్క్రమణ…
మోనాల్ ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించాక… అందరూ ఆమెను హగ్ చేసుకుంటూ, సానుభూతి చూపిస్తుంటే, ఆమె హారికతో ఓ మాట అన్నది… ‘‘నేను నీకు చప్పాను కాదా’ అని… ఎస్, ఆమెకు మొత్తం ముందే తెలుసు… ఎలిమినేషన్ కోసం తను వెల్ ప్రిపేర్డ్… అందుకే ఎలిమినేషన్ ప్రకటించాక పెద్దగా షాక్, ఎమోషన్ గట్రా ఏమీ ఆమె మొహంలో కనిపించలేదు… కనిపించవు… ఎందుకంటే… తనతో బిగ్‌బాస్ టీం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇక్కడిదాకా లాక్కొచ్చారు ఆమెను… ఆమె పాత్ర […]
వావ్… స్టాండప్ కామెడీ అంటే బూతులా..? ఏం చెప్పారు సారూ..?
నాగబాబు సొంత యూట్యూబ్ షో ‘ఖుషీఖుషీగా’ ప్రోగ్రాంలో బూతు ధారాళంగా ప్రవహించడం మీద నెటిజనం విమర్శించింది… బుల్లితెర మీద బూతును ఆయన మరో లెవల్‌కు తీసుకుపోయాడనేది విమర్శ… దానికి నాగబాబు ప్రతిస్పందన నిజంగా ఓ ‘‘స్టాండప్ కామెడీ’యే… హహహ… సేమ్, ఎంఎస్ రాజు తమ్ముడే అన్నట్టుగా… తన టేస్టుకు అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే… తను ఏమంటాడంటే..? ‘‘ప్రోమో చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అనుకున్నదాన్ని మించిన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మాత్రం నెగెటివ్ కామెంట్స్ […]
ఔనా..? మోనాల్ పేరు బయటికి లీక్ చేసి… అరియానాను పంపించేశారా..?
మూవీ క్రిటిక్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి డౌటనుమానం ఏమిటంటే…? ‘‘అసలు బిగ్‌బాస్ నుంచి అరియానాను ఎలిమినేట్ చేసినట్టు సమాచారం ఉంది… మరి అందరూ మోనాల్‌ను బయటికి పంపించేసినట్టు రాస్తున్నారేం..? నాకొచ్చిన సమాచారం తప్పా..? అందరూ రాసేది తప్పా..?’’ నిజంగా కాస్త థింకాల్సిన విషయమే… ఎందుకంటే..? నిన్నటి ఎపిసోడ్ చూస్తున్నంతసేపూ… నాగార్జున సొహెల్‌ను సపోర్ట్ చేస్తూ, అరియానాకు అడ్డగోలుగా క్లాస్ పీకుతున్నప్పుడే చాలామందికి డౌటొచ్చింది అలా… నిజమే, కుక్కపిల్ల బొమ్మ విషయంలో మరీ ఓవర్ చేసింది… […]
ఇది కొత్త పొలిటికల్ గ్రామర్… అంతుపట్టని ఆణిముత్యాలు మరి…
ప్రజాస్వామ్య విభక్తి సూత్రాల్లో ఆణి ముత్యాలు! ———————— “ప్రజాస్వామ్యమంతటి అరాచకమయినది ఇంకొకటి లేదు- ప్రజాస్వామ్యానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేనే లేదు” అని బ్రిటన్ ప్రధానిగా పనిచేయడానికి ముందెప్పుడో విన్స్టన్ చర్చిల్ చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. మన చాటువుల్లా ఒక్కోసారి చెప్పినవారెవరో ప్రధానం కాదు. చెప్పిన విషయమే ముఖ్యం. ప్రజలే ప్రభువులు అన్నది ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతం. దాని ప్రకారం విధి విధానాలు, ఎన్నికలు, ప్రాతినిథ్య ప్రక్రియలు ఏర్పడ్డాయి. ప్రజల కోసం ప్రజల వలన ప్రజల చేత […]
‘‘మంచి ఫ్యామిలీ టైప్ సార్…’’ అపార్థం చేసుకోకండి… ఓ డర్టీ సినిమా గురించే…
‘‘ఫ్యామిలీ టైప్ సార్’’ ‘‘కాలేజీ గర్ల్ సార్’’………… విటులను ఆకర్షించే ప్రయాసలో కామన్‌గా వినిపించే పదాలు ఇవి… తప్పుగా అనుకోకండి ఎం.ఎస్.రాజు భయ్యా… నువ్వు నీ తాజా అద్భుత చిత్రం ‘డర్టీ హరి’ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ‘‘ఫ్యామిలీ చిత్రం’’ ‘‘పాన్ ఇండియా చిత్రం’’ అని చెబుతుంటే అదే గుర్తొస్తోంది… అసలు సినిమా పేరులోనే ఆ డర్టీనెస్ ఉంది… ఆ డర్టీ వాసన ట్రెయిలర్లలోనూ గుప్పుగుప్పుమంటోంది… ప్రచారం నిండా అదే డర్టీనెస్… సరే, నీ టేస్టు నీ […]
జగన్ ఆగడు… ఆ లిఫ్టు కట్టేస్తున్నాడు… శ్రీశైలం నీళ్లు మళ్లించేస్తాడట…
‘‘దటీజ్ జగన్… తను అనుకున్న లక్ష్యం దిశలో సోనియాగాంధీనే ధిక్కరించి, జైలుకు కూడా వెళ్లొచ్చినవాడు… కేసీయార్‌కు భయపడతాడా ఏం..?’’….. ఇలా కొందరికి అనిపించవచ్చుగాక..! ‘‘అబ్బే, ఇదంతా లోపాయికారీ అవగాహన బాసూ… జగన్, కేసీయార్ ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు సహకరించుకుంటున్నారు… కేసీయార్ జగన్ కోసం తెలంగాణ ప్రయోజనాల్ని కూడా వదిలేశాడు, పైగా జనం కళ్లకు గంతలు కడతారు ఇద్దరూ…’’. ఇలా ఇంకొందరు అర్థం చేసుకోవచ్చుగాక…! ‘‘వైఎస్ శ్రీశైలం నీటిని సగం దోచుకుపోతే, జగన్ మొత్తానికే ఎసరు పెడుతున్నాడు […]
కేసుల భయం… BJP తో కాళ్లబేరం… KCR పై ఆంధ్రజ్యోతి ఫైరింగ్…
అల్టిమేట్ ఫోటో… నిజానికి ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు… ఒక దేశప్రధానిని కలిసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాదగా నమస్కారం పెట్టాడు… ప్రధాని కూడా అలాగే పద్దతిగా ప్రతినమస్కారం చేశాడు… బస్, ఇందులో ఇక ఈకలు పీకడానికి ఏముంది అంటారా..? కాదు… ఉంటుంది… రాజకీయాల్లో ప్రతి శాలువాకు, ప్రతి నమస్కారానికీ, ప్రతి పర్యటనకూ, ప్రతి దండకూ, ప్రతి దండానికీ, ప్రతి లేఖకూ కారణం ఉంటుంది… పంచిపెట్టే తిరుపతి ప్రసాదాలతో సహా ప్రతి దానికీ ఓ లెక్క […]
ఇక మోనాల్ అక్కడ అక్కర్లేదు… బయటికి పంపించేయండి బాస్…
చివరికి బిగ్‌బాస్ క్రెడిబులిటీ ఎంత పాతాళానికి చేరిందీ అంటే… మోనాల్‌ను ఎలిమినేట్ చేసేశారు అని రాసినా ఎవరూ నమ్మలేని పరిస్థితి… ఎహెఫో, ప్రతిసారీ అలాగే అంటారు… ప్రతిసారీ ఆమెను బయటికి పంపించేయండ్రోయ్ అని ప్రేక్షకులు కోరుతూనే ఉంటారు… ప్రతిసారీ అందరికన్నా తక్కువ వోట్లు వస్తాయి… ఐనా ప్రతిసారీ ఆమెను బిగ్‌బాస్ సేవ్ చేస్తూనే ఉంటాడు… మేమెందుకు నమ్మాలి అంటారు జనం… నిజమే… ప్రజలు వేసే వోట్లతో సంబంధం లేదు… బిగ్‌బాస్ ఏది అనుకుంటే అదే… ఆమెతో కుదిరిన […]
ఫాఫం, వర్షిణి ఔట్… దీపిక పిల్లి ఇన్… అప్పుడే హైపర్ ఆది పులిహోర…
మీరు సంగీతం… నృత్యం… కామెడీ… ఏ టీవీ షో అయినా తీసుకొండి… గ్లామర్ మసాలా మస్ట్… లవ్ ట్రాకులూ మస్ట్… అవి లేకపోతే టీవీ షోలు రక్తికట్టవు అని మన టీవీ షోల నిర్మాతల అభిప్రాయం… యాంకర్లు, మెంటార్లు, టీం లీడర్లు… పేరు ఏదయితేనేం… బోలెడుమంది రూపగత్తెల్ని తీసుకురావడం… ఏవేవో ట్రాకుల్లో ముంచి కథ నడిపించడం ప్రజెంట్ ట్రెండ్… చివరకు షో ఫ్లాపయితే ఫస్ట్ బకరాలయ్యేది కూడా వాళ్లే పాపం… నాగబాబు ఫ్లాప్ షో అదిరింది తెలుసు […]