.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి కొత్త చాలెంజ్ విసురుతున్నాడు… దాని పేరు గోదావరి టు బనకచర్ల లింక్… జీబీ లింక్… అనగా గోదావరి నుంచి పెన్నా బేసిన్‌కు జలాల తరలింపు…
ఎస్, ఏపీ ప్రయోజనాల రీత్యా అది మంచి ప్రాజెక్టే కావచ్చుగాక… అది చేపట్టాలంటే అది మరో కాలేశ్వరం ప్రాజెక్టు… సరే, అత్యంత భారీ ప్రాజెక్టులు ఎందుకు చేపడతారు అంటే దాని వెనుక పాలకుల చాలా ఆర్థిక మర్మాలు ఉంటాయి… ప్రజాప్రయోజనాలను మించి… అదేమిటో కాలేశ్వరం ప్రాజెక్టే చెప్పింది కదా…
Ads
చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ఈ జీబీ ప్రాజెక్టు పట్టిసీమ లిఫ్టు నుంచి ప్రారంభమై బనకచర్ల రెగ్యులేటర్ కలుపుతుంది… వయా ప్రకాశం బ్యారేజీ,.. ఈ ప్రాజెక్టు ఎక్కువ వివరాల్లోకి వెళ్లడం లేదు గానీ నిజంగానే కాలేశ్వరం ఖర్చుతో సమానం ఇది కూడా…
అసలే ఏపీ ఖజానా దాదాపు దివాలా స్టేజ్… పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే సీన్ లేదు… పైగా దాన్ని ఓ బరాజ్ స్థాయికి దిగజార్చేశారు… ఇక ఇప్పుడు ఈ జలాల ఇంటర్ బేసిన్ మళ్లింపు చేపడతారట… ఎలాగూ కేంద్రం చంద్రబాబు దయమీద ఆధారపడి బతుకుతున్నది కాబట్టి… బెదిరించో, బుజ్జగించో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేస్తాడనే అనుకుందాం కాసేపు…
నేనే ఈ పనులు చేయిస్తానని ఒప్పిస్తాడనీ అనుకుందాం… మరి తన ప్రయోజనాలు తనకుంటాయి కదా… కానీ ఒక పోలవరం ఏమైంది..? ఇదేమవుతుంది..? సరే, ఈ చర్చలు పక్కనపెడితే… అది తెలంగాణ జల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం… మరి దీన్ని రేవంత్‌రెడ్డి అడ్డుకోగలడా..? గురువు చంద్రబాబును ఢీకొంటాడా… ఆ స్థిరసంకల్పం, ఫైట్ స్పిరిట్ చూపిస్తాడా..?
ఎలాగూ చంద్రబాబు ఎప్పుడూ ఆంధ్ర బాబే… అందుకే రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టును నిలువరించడం ఓ పరీక్ష… తెలంగాణ సమాజం ఆసక్తిగా చూడబోతోంది… ఆల్రెడీ బీఆర్ఎస్ కాచుక్కూర్చుంది… ఇందులో రేవంత్ రెడ్డి విఫలమైతే మళ్లీ చంద్రబాబును, అడ్డుకోలేని రేవంత్‌ను తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసి, సెంటిమెంట్ రగల్చడానికి భలే చాన్స్ దొరుకుతుంది…
ఆల్రెడీ నమస్తే తెలంగాణ పత్రికలో దీన్ని మరో పోతిరెడ్డిపాడుగా… గోదావరిని ఆంధ్రబాబు చెరపడుతున్నట్టుగా… వరదమాటున నీటిదోపిడీగా వర్ణిస్తూ బ్యానర్లు స్టార్ట్ చేసింది… తెలంగాణ కోణంలో అది సరైన స్పందనే…
బీజేపీని కాసేపు పక్కన పెట్టేయండి, అది అటూ కాదు, ఇటూ కాదు… చివరకు ఎటూ కాదు… అవునూ, జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్కను వెడల్పు చేయడానికి, శ్రీశైలం నీళ్లు ఇంకా యథేచ్చగా దోచుకుని పోవడానికి రాయలసీమ లిఫ్ట్ కడుతున్నప్పుడు గానీ… సోకాల్డ్, తెలంగాణ అరివీర భీకర ఉద్యమనేత కేసీఆర్ ఏం చేయగలిగాడు.,.? జగన్‌తో దోస్తీ అడ్డుపడిందా..? అనే ప్రశ్నలు వేయకండి… ఆయన అసలే కేసీఆర్..!
కేసీయార్ వాటిని అడ్డుకోలేనప్పుడు కాంగ్రెస్ గట్టిగా ప్రతిఘటించలేకపోయింది… ఆ స్పిరిట్ కనిపించలేదు… అలాగని ఇప్పుడు రేవంత్‌రెడ్డి కాడి కింద పారేస్తే బీఆర్ఎస్ ఊరుకోదు… అంది వచ్చిన ఓ అవకాశంగా స్వీకరిస్తుంది… కేసీయార్ ఫామ్ హౌజు నుంచి నిద్రలేచి బయటకు రాకపోవచ్చుగాక… కానీ హరీష్, కవిత ఉండనే ఉన్నారు… ఒకవేళ కేటీయార్ జైలుకు వెళ్లినా సరే… ఈ పరీక్ష ఎలా రాస్తాడో చూడాలి రేవంత్ రెడ్డి..
ఆల్రెడీ కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖలు రాయాలి అని చెబుతున్నాడు, ఉత్తమకుమార్ రెడ్డి స్థూలంగా కృష్ణా వాటాల గురించి మాట్లాతున్నాడు కానీ… తెలంగాణ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం అలియాస్ చంద్రబాబుకు అధికారికంగా తెలియజెప్పాలి కదా… మేం అడ్డుకుంటామనే హెచ్చరిక ఒకటి జారీ కావాలి కదా…!!
Share this Article