చాలామంది రీసెంటుగా అరుణాచలం వెళ్తున్నారు… గిరిప్రదక్షిణకు లేదా సాధారణ దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది… అయ్యప్ప దీక్ష విరమణకు శబరిమలై వెళ్లే భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో తమిళనాడు గుళ్లు సందర్శించి వస్తున్నారు… అయితే సొంత వాహనాల్లో తమిళ గుళ్లు తిరిగి వద్దామనుకునే వాళ్లకు సరైన గైడెన్స్ ఉండదు… ముందుకు వెళ్లడం, మళ్లీ వెనక్కి రావడం, తద్వారా దూరం పెరగడం, అనవసర ఖర్చు…
ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో మిత్రుడు రాచకొండ శ్రీహరి పోస్టు ఒకటి ఆసక్తికరంగా ఉంది… అటూఇటూ ప్లాన్ లేకుండా తిరిగి ప్రయాసపడకుండా తను చెప్పిన, తను ఆల్రెడీ తిరిగిన రూట్‌లో వెళ్తే బెటర్ అనిపించేలా ఉంది… అది తను తిరిగిన రూట్… ఈ గుళ్లు, ఈ దూరాలపై ఐడియా గనుక ఉంటే మనమే సొంతంగా ఎటెటు తిరిగాలో ప్లాన్ చేసుకోవచ్చు… ఈ పోస్టు ఇలా ఉంది…
కాణిపాకం To శ్రీపురం 55 km
శ్రీపురం To అరుణాచలం 80 km
అరుణాచలం To తిరుక్కోయిళూరు 36 km (ఉలగలంత పెరుమాల్ )
తిరుక్కోయిళూరు To విరుదాచలం 62 km
విరుదాచలం To చిదంబరం 45 km
చిదంబరం To వైదీశ్వరన్ కోయిల్ 30 km
వైదీశ్వరన్ కోయిల్ To కుంభకోణం 48 km
(కుంభకోణం చుట్టూ చాలా గుడులు ఉన్నాయి
వాటిలో important తిరువిడైమరదుర్, స్వామిమలై, నాచియార్ కోయిల్, తిరుచ్చేరై)
Ads
కుంభకోణం To తిరువారుర్ 48 km
తిరువారుర్ To తంజావూరు 60 km
తంజావూరు To శ్రీరంగం 60 km
శ్రీరంగం To జంబూకెశ్వరం 4 km (తిరువనై కోయిల్ )
జంబూకెశ్వరం To సమయపురం 7 km
సమయపురం To మధురై 142 km
మదురై To రామేశ్వరం 173 km
రామేశ్వరం To తిరుచేందూర్ 222 km
తిరుచేందూర్ To కన్యాకుమారి 90 km
కన్యాకుమారి To సుచింద్రం 15 km
సుచింద్రం To టెంకాశి 135 km
టెంకాశీ To శ్రీవిల్లి పుత్తూరు 82 km
శ్రీవిల్లి పుత్తూరు To పళని 180 km
పళని To భవాని 125 km
భవాని To కంచి via వెల్లూరు హైవే 335 km
కంచి To తిరుత్తని 42k m
తిరుత్తని To తిరుపతి 67 km
తమిళనాడు ఫుల్ టూర్ ఇది… వెళ్లిన దారిలో తిరిగి రాకుండా, వెనుకా ముందూ తిరగకుండా… ఇది బెటర్ ప్లాన్… చిన్న చిన్న గుళ్లను అవాయిడ్ చేస్తూ కేవలం పెద్ద, ఇంపార్టెంట్ కేంద్రాలకే ప్లాన్ చేసుకోవడం మరో పద్దతి… ఈసారి పోస్టులో ఈ టూర్ ప్లానే గాకుండా… మధ్యమధ్యలో ఎక్కడ వసతి కోసం ఆగవచ్చో కూడా ఓ ట్రావెలాగ్ రాస్తే బెటర్ మిత్రమా… పదిమందికీ యూజ్‌ఫుల్…
Share this Article