Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంతవారు గానీ వేదాంతులైన గానీ ఆ గొంతు వినగానే తేలిపోదురోయ్…

February 25, 2024 by M S R

Subramanyam Dogiparthi …..   ప్రఖ్యాత హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ NTR కు పాటలు పాడిన మొదటి సినిమా 1969 లో వచ్చిన ఈ భలే తమ్ముడు సినిమా . అన్ని పాటలూ ఆయనే పాడారు . ఘంటసాల వారి మెలోడియస్ వాయిస్ కు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు రఫీ తెలుగు ఉఛ్ఛారణ డిఫరెంటుగా నచ్చింది . పాటలన్నీ హిట్టయ్యాయి .


NTR ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమా వంద రోజులు బాగా ఆడింది . ప్రేక్షకులకు బాగా నచ్చింది . ముఖ్యంగా అన్న పాత్రలో NTR దురుసు నటన ఇంకా బాగా నచ్చింది . హిందీలో శక్తి సామంత దర్శకత్వం వహించిన చైనా టౌన్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . NTR – K R విజయ ఒక జంటగా , మరో జంటలో కొత్త నటి విజయ గిరిజ నటించారు . ఈమెకు ఇదే తొలి సినిమా . మిగిలిన పాత్రల్లో రేలంగి , శ్రీరంజని , ప్రభాకరరెడ్డి , రాజనాల , రామదాసు ప్రభృతులు నటించారు .

ఎంత వారు గానీ వేదాంతులైన గానీ , గోపాల బాలా నిన్నే కోరి , ఇద్దరి మనసులు ఒకటై , గుమ్మా గుమ్మా ముద్దుల గుమ్మా పాటలతో పాటు ఖవాలీ పాటా బాగా హిట్టయ్యాయి . టి. వి. రాజు సంగీత దర్శకులు . బి. ఏ. సుబ్బారావు దర్శకులు . NTR బంధువు పుండరీకాక్షయ్య నిర్మాత . ఇదే టైటిల్ తో బాలకృష్ణ సినిమా ఒకటి వచ్చింది .

Ads

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఆడింది . రెండు మూడు సార్లు చూసి ఉంటా . టివిలో కూడా . యూట్యూబులో ఉంది . కాలక్షేపం , వినోదం . అన్న NTR సీరియస్ , తమ్ముడు NTR హిలేరియస్ పాత్రల్లో చలాకీగా నటించారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐనావాళ్లు ఉన్నా… అనాథ ప్రేతాలే !! ముసలితనమే ఓ ‘ఒంటరిశాపం’…!!
  • విస్మయ ! సూపర్ స్టార్ కూతురు ! హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంట్రీ !!
  • కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…
  • అరుపులు – కేకలు – నెత్తురు – బీజీఎం మోత – బీభత్సమైన హింస !!
  • రుక్మిణి వసంత్ ! ఆమెకు ఓ ఐడెంటిటీ లేదా ? ఇతర హీరోయిన్లకు కూడా !!
  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions