తను పార్టిసిపేట్ చేసిన బిగ్‌బాస్ సీజన్‌లో ఓ హరికథ చెప్పిన హరితేజ దాంతోనే ఫేమస్ అయిపోయింది ఆనాడు… నిజానికి అది హరికథ కాదు… అలా ఏదో చెప్పడానికి ట్రై చేసింది… దాన్నే హరికథ అని చెబితే హరికథను అవమానించినట్టు…
ఇక హరితేజ అంటే హరికథ మాత్రమే అన్నట్టుగా మారింది… ఈ సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది కదా… అదేదో టాస్కులో హరికథ చెప్పి మణికంఠ నుంచి చార్జింగ్ పాయింట్ తీసుకుంది… మళ్లీ నిన్న హరికథ చెప్పింది సరదాగా…
మామూలు సంభాషణనే మధ్య మధ్యలో విరగ్గొట్టి రాగాలు తీస్తే అది ర్యాపింగ్… అలాగే హరితేజ హరికథ కూడా అంతే… వ్యాసాన్ని వాక్యాలుగా, పేరాలుగా విడగొట్టి ఇదే వచన కవిత్వం అంటారు కదా కొందరు… ఇదీ అలాగే… మామూలు సంభాషణను రాగాలు తీస్తూ నాసామిరంగా అని ట్యూన్ కలిపితే అది హరితేజ మార్క్ హరికథ… హరితేజకథ… ఏమాత్రం రక్తికట్టలేదు…
Ads
(అవినాష్, రోహిణి మాత్రమే ఫన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ ఇవ్వగలుగుతున్నారు… అంతేతప్ప ఇంకెవరూ వినోదాన్ని ఇవ్వలేకపోతున్నారు…)
అటూఇటూ పుల్లలు పెట్టడం, గేమ్స్‌లో పూర్ పర్‌ఫామెన్స్ తప్ప హరితేజ పెద్దగా ఈసారి సీజన్‌లో రాణించలేదు… అందుకే వోట్లలో అందరికన్నా దిగువకు పడిపోయింది… బహుశా ఆమే ఈసారి ఎలిమినేట్ అవుతుందేమో… గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేషన్ లేకపోతే..!!
మళ్లీ అదే గొడవ… పృథ్వి తెగ చిరాకెత్తిస్తున్నాడు… ఆ అరుపులు, ఆ కేకలు, మీదిమీదికి దూసుకురావడం, కోపం… పక్కా మెంటల్ కేసు అనేది ఇందుకే… మళ్లీ నిన్న నబీల్‌తో కూడా ఇదే తరహా రచ్చ, పంచాయితీ… సరే, ఓసారి బిగ్‌బాస్ రేటింగుల్ని చూద్దాం… ఏమైనా మెరుగుపడ్డాయా…?
లేదు… స్టిల్, ఈ వారం కూడా సో సో… ఆల్ చానెల్స్ టాప్ 30 ప్రోగ్రామ్స్ జాబితాలోనే కాదు, కనీసం స్టార్ మాటీవీ టాప్ 30 లిస్టులో కూడా లేదు… నాగార్జున హోస్ట్ చేసే సండే వీకెండ్ షో రేటింగ్స్ జస్ట్, 5.45 మాత్రమే… క్లాసులు పీకే శనివారం షోకు 4.66 టీఆర్పీలు… ఇక వీక్ డేస్ గురించి చెప్పడానికేముంది..?
ఇక చేయడానికి కూడా ఏమీ లేదు… అంటే దిద్దడానికి కూడా ఏమీ లేదు… ఆల్రెడీ పది వారాలు అయిపోయాయి… ఓజీలు ఫ్లాప్… రాయల్స్ కూడా ఫ్లాప్… నిన్న పాము గుడ్ల బాపతు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎపిసోడ్ కూడా ఇంకోతరహా నామినేషన్లలాగా నడిచి బోర్ కొట్టించింది… ఇందులో టేస్టీ తేజ నిర్ణయం ఫూలిష్… తప్పు చేసినట్టు కూడా అంగీకరించాడు… నబీల్ ఎవిక్షన్ పాస్ గెలుచుకుని చివరకు మరోవారం హౌజులో తన ప్రయాణాన్ని సుస్థిరం చేసుకున్నాడు…
Share this Article