.
కంబం ప్రేరణ… టీవీ సీరియల్ నటి… పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ చదివింది, ఉండేది బెంగుళూరు…
బిగ్‌బాస్ హౌజుకు వచ్చినప్పుడు ఎవరూ అనుకోలేదు, ఆమె ఈ చివరివారం దాకా కొనసాగుతుందని… బట్, వచ్చేసింది… నిన్నటి ఆటలో ఆమెది స్పష్టమైన ఆధిక్యం… ఈవెన్ నిఖిల్ వంటి భీకర పోటీదారుకన్నా…
Ads
టాస్కుల్లో అలవోకగా గెలిచి, ఆడియెన్స్‌కు వోట్ అప్పీల్ చేసుకుంది… అదీ సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా… బాగా యాక్టివే కాకపోతే తను మాట తూలుతుంది… ఎదుటివాళ్లు హర్టవుతారని కూడా చూడదు… దానికితోడు కన్నడ బ్యాచ్ మెంబర్…
నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వి… ఈ బ్యాచ్‌లో యష్మి, పృథ్వి వెళ్లిపోయారు… వీరిలో మిగిలింది ప్రేరణ, నిఖిల్… ఇప్పటివరకూ అన్ని సీజన్లలోనూ మగవిజేతలే… బలమైన పోటీదారు నిఖిల్… సో, ప్రేరణకు విజేతగా నిలిచే చాన్స్ వస్తుందో రాదో తెలియదు గానీ టాప్ ఫైవ్‌లో ఉంటుందేమో బహుశా…
ఎక్కువ వోటింగ్ మగాళ్లదే… మగ పోటీదార్లకే ఎక్కువ వోట్లు రావచ్చు కూడా… హౌజులో ఇప్పుడు మిగిలిన ఆడ కంటెండర్లలో మిగిలింది మరో ఇద్దరు… రోహిణి, విష్ణుప్రియ… రోహిణి పెద్దగా నామినేషన్లలోకి కూడా రాదు… రెండువారాలుగా విజృంభించి ఆడేస్తోంది… ఫైటింగ్ స్పిరిట్ ఉంది… పైగా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడుతుంది… అవినాష్‌తో కలిసి ఎంటర్‌టెయిన్ చేస్తోంది…
టాప్ ఫైవ్ జాబితాలోకి రోహిణి కూడా బలమైన పోటీదారే… విష్ణుప్రియ ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు… అసలు ఈ వారం దాకా తను రావడమే ఆశ్చర్యం… బిగ్‌బాస్ టీమ్‌తో ఈమేరకు ఒప్పందం ఉందేమో, లాక్కొచ్చారు ఇక్కడిదాకా…
ఆమధ్య నబీల్ ఆటతీరు బాగుండేది… తన నిర్ణయాలు, తన ఆట మెప్పించాయి… కానీ మరీ రెండువారాలుగా అదుపు తప్పినట్టు కనిపిస్తున్నాడు… టాస్కుల్లో వీక్… మాటల్లో పీక్… తనంతటతనే చెడగొట్టుకుంటున్నాడు… కాకపోతే గౌతమ్ ఓ మెంటల్ కేసు కాబట్టి తనతో పోలిస్తే నబీల్ బెటర్… సో, టాప్ ఫైవ్‌కి రావచ్చు కూడా…
సో, ఈరోజు సిట్యుయేషన్‌ను బట్టి… అవినాష్, నిఖిల్, నబీల్, ప్రేరణ, రోహిణి… బలమైన పొజిషన్లలో ఉన్నారు… అఫ్‌కోర్స్, ఎలాగూ చివరి వారానికి వచ్చేశారు… వీకెండ్‌లో డబుల్ ఎలిమినేసన్ లేదంటే ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతే… టాప్ ఫైవ్ ఖరారు…
వచ్చేవారం ఇక పోటీలు, టాస్కులు ఏమీ ఉండవు… వాళ్ల జర్నీ ప్రజెంటేషన్లు… నిన్నటి శేఖర్ మాస్టర్ వచ్చి కాసేపు సందడి క్రియేట్ చేసినట్టుగా ఎవరైనా గెస్గుల్ని రప్పించి ఎంటర్‌టెయిన్ చేయడమే తప్ప వేరే థ్రిల్ ఏమీ ఉండదు…!!
Share this Article