హౌజులో బ్రెయిన్ లెస్ ఎవరు, ఎయిమ్ లెస్ ఎవరు, యూజ్ లెస్ ఎవరు అని ఓ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్ ఈరోజు… సరే, ఏ కంటెస్టెంట్ ఎవరిని బ్రెయిన్‌లెస్ అన్నాడు, ఎవరిని ఎయిమ్‌లెస్ అన్నాడనేది పక్కన పెడితే… నిజంగా బ్రెయిన్‌లెస్ బిగ్‌బాసే… ఎందుకిలా అనిపించిందీ అంటే..?
ఎలిమినేట్ అయిన ముగ్గురు ఆడ లేడీ కంటెస్టెంట్లను మళ్లీ హౌజులోకి తీసుకొచ్చాడు… ఇందులో ఒకరిని మళ్లీ హౌజులోకి పంపిస్తాం, ఎవరిని పంపించాలో మీరే వోట్ల ద్వారా తెలియజెప్పండి అని హౌజులో ఉన్నవాళ్లకే బాధ్యతను అప్పగించాడు… అలా వచ్చిన ముగ్గురు రతిక, దామిని, శుభశ్రీ…
బిగ్‌బాస్ ఎందుకు బ్రెయిన్‌లెస్ అంటే..? ఆల్‌రెడీ ప్రజలు తక్కువ వోట్లు వేసినవారిని బయటికి పంపించేస్తున్నట్టు చెబుతున్నాడు కదా బిగ్‌బాస్… మరి అందులో ఒకరిని తిరిగి హౌజులోకి పంపించడం అంటే, ప్రజల నిర్ణయాన్ని కించపరచడమే కదా… అందుకే బ్రెయిన్‌లెస్ అన్నది… పైగా దీన్నే ఉల్టాపుల్టా అంటారని ఏదో పుల్కా సమర్థన…
Ads
అంతేకాదు… ఆరువారాలుగా ప్రతివారం ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్‌ను బయటికి పంపిస్తున్నారు… అదేమంటే ప్రజలు అలాగే వోట్లేస్తున్నారు అని సమర్థించుకుంటారు గానీ ఎవరికి ఎన్ని వోట్లు, ఎన్ని మిస్డ్ కాల్స్ అనే వివరాలు మాత్రం చెప్పరు… అంటే అంతా తమ ఇష్టానుసారమే… ఎవరిని ఎన్ని వారాలు ఆడించాలో ముందే ఫిక్సయిపోతుంది… వాటిని బట్టే రెమ్యునరేషన్లు…
సో, ఎంత చెత్తాగా ఆడినా సరే, ముందస్తుగా ఎక్కువ వారాలకు ఒప్పందాలు కుదిరితే అన్ని వారాలూ సేవ్ చేస్తూనే ఉంటాడు బిగ్‌బాస్… ఆ అవసరం కోసం ప్రజల అభిప్రాయం, వోట్లను పక్కన పడేస్తాడు… అదేమిటి..? గతంలో కూడా బయటికి వెళ్లిన వాళ్లను మళ్లీ హౌజులోకి తీసుకువచ్చారు కదా అంటారా..?
ఔను, అదీ తప్పే… ఒకసారి సరిగ్గా ఆడటం చేతకాదని బయటికి పంపిస్తే ఇక ఫినిష్… కావాలనుకుంటే కొత్తవాళ్లను తీసుకురావాలి, ఆటలో కొత్త ప్లేయర్లు వస్తే అదోరకం మజా… పాతవాళ్లకు, కొత్తవాళ్లకు నడుమ ఓ పోటీ ఉంటుంది… అందులో పెద్ద తప్పు అనిపించదు… కానీ హోప్‌లెస్ అని బయటికి పంపించాక ఇక తిరిగి ఎంటర్‌టెయిన్ చేయొద్దు…
సరే, దామిని, రతిక, శుభశ్రీలలో ఎవరో ఒకరిని తిరిగి హౌజులోకి తీసుకొస్తారు సరే… బిగ్‌బాస్ నుంచి అన్నీ లీకవుతుంటాయి, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది కూడా… కానీ చాలా సైట్లు ఈ పుల్టా వ్యవహారాన్ని పట్టుకున్నట్టు అనిపించలేదు… అదేకాదు, బయట వోటింగ్ సైట్ల వివరాల్ని బట్టి ఈసారి శోభాశెట్టి గానీ నయన పావని గానీ ఎలిమినేట్ అవుతారని ఊహిస్తున్నారు… కన్‌ఫరమ్‌గా ఎవరూ రాసినట్టు కనిపించలేదు…
శోభాశెట్టి యాక్టివ్ తను ఆటలో ఉండాల్సిన కేరక్టర్… పావని కొత్తగా వచ్చింది, అప్పుడే జడ్జిమెంట్ ఇచ్చి పంపించడమూ కరెక్టు కాదు… పైగా ఆరు వారాలుగా వరుసగా లేడీస్‌నే బయటికి పంపిస్తున్నారు… మళ్లీ ఆడ కంటెస్టెంటేనా..? ఇదెక్కడి పోకడ..? (శోభకు ఎక్కువ వారాల కంట్రాక్టు ఉంది కాబట్టి ఆమెను సేవ్ చేస్తారని కొందరు రాశారు… కొందరేమో ఆమె వెళ్లకతప్పదని తేల్చిపారేశారు…) సరే, ఒక లేడీ బయటికి పోతే మరో లేడీ కొత్తగా వస్తోంది కాబట్టి పర్లేదు అంటారా..?
నిజానికి యావర్, శివాజీల్లో ఎవరో ఒకరు బయటికి వెళ్లడం కరెక్టు… యావర్ యాటిట్యూడ్ చిత్రంగా ఉంది… ఆట సందీప్‌తో మాట్లాడుతున్నప్పుడు తను అరె అని ఏదో చెప్పబోతే నన్ను అరేయ్ అంటావా అని విరుచుకుపడ్డాడు… రారా పోరా అన్నట్టు మాట్లాడాడు… నిజానికి అరె అనేది ఆశ్చర్యాన్ని వ్యక్తీకరించడం, అరేయ్ అనే సంబోధన కాదు… ఆ తేడా యావర్‌కు తెలియదు… పైగా యావరే సందీప్‌ను అవమానించినట్టు రా రా అని మాట్లాడాడు… (యావర్‌కు తెలుగు రాదు, తెలుగులో ఏమీ వ్యక్తీకరించలేడు… నాగార్జున కూడా ఈసారి పుల్టా యవ్వారంలో ఉన్నాడు కదా, యావర్‌ను వెనకేసుకొచ్చి, సందీప్‌ను తప్పుపట్టాడు…)
శివాజీ ఎందుకు వెళ్లిపోవడం కరెక్టు అంటే… తను టాస్కుల్లో, ఆటల్లో పూర్, ఎంటర్‌టెయిన్ చేయలేడు… పైగా పొలం గట్టు మీద కుర్చీ వేసుకుని, కూలీల్ని ఆజమాయిషీ చేసే కామందు తరహాలో ఉంటుంది తన పెత్తనపు పోకడ… ఆ యూత్ గ్రూపులో తను ఇమడలేడు… ఎక్కువ వారాలకు అగ్రిమెంట్ ఉన్నట్టుంది… పైగా నాగార్జున సపోర్ట్ కూడా… భోలే హోప్‌లెస్… కానీ తను వచ్చింది ఇప్పుడే కాబట్టి పంపించడం కరెక్టు కాదు… రైతుబిడ్డ, కామనర్ అంటున్న కంటెస్టెంట్ కూడా హోప్‌లెస్ అయిపోయాడు… ఇలాంటివాళ్లను వదిలి మళ్లీ ఆడ కంటెస్టెంటునే బయటికి పంపించడం బిగ్‌బాస్ బ్రెయిన్‌లెస్ యవ్వారమే…
Share this Article