.
సాధారణంగా టీడీపీ అనుసరించే స్ట్రాటజీ అది… రకరకాల న్యూట్రల్ కవర్ సంఘాల్ని పెట్టించి, వాటికి టీడీపీతో ఏమాత్రం సంబంధం లేదనే వాతావరణాన్ని వాటి చుట్టూ క్రియేట్ చేసి… తీరా అవసరమొచ్చినప్పుడు అదే చంద్రబాబు, అదే టీడీపీ, అదే సామాజికవర్గానికి అనుకూలంగా నెరేటివ్స్ ప్రచారంలోకి తీసుకురావడం, తద్వారా సమాజం, మేధో సమాజం మొత్తం మద్దతు ఉందనే కలరింగు…
టీడీపీలో పెరిగిన బాపతే కదా కేసీయార్… చంద్రబాబు శిష్యుడే కదా… అచ్చంగా దాన్నే పాటిస్తాడు… రాజకీయ వ్యూహరచనలో ‘నెరేటివ్ మేనేజ్‌మెంట్’ (Narrative Management) ఎలా పనిచేస్తుందో తనకు బాగా తెలుసు… జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు, ఇంజినీర్లు, రచయితల పేర్లతో రకరకాల దుకాణాలు మొదలవుతాయి… హఠాత్తుగా తెలంగాణ అస్థిత్వానికి ప్రమాదం అని గగ్గోలు స్టార్ట్ చేస్తుంటాయి ఇవన్నీ… మొదట్లో న్యూట్రాలిటీయే… కలరింగు, కవరింగు… రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం కూడా దాదాపు ఇలాంటిదే… ఒకాయన ఉంటాడు… శ్యాంప్రసాద్ రెడ్డి… సేమ్…
Ads
ఎప్పుడూ తనే మాట్లాడతాడు… మొదట్లో ఈయనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజు నిర్మాణ స్థలాన్ని మార్చాలని వీళ్లే రిపోర్టులు ఇస్తారు, రిక్వెస్టులు పెడతారు, హమ్మయ్య, కేసీయార్‌ను కష్టమ్మీద ఒప్పించాం అనీ అంటారు… ఇదంతా తుమ్మడిహెట్టిని బొందపెట్టి, ఓ కేసీయార్ ఆలోచించిన మూడు కమీషన్ల బరాజులకు ఓ ఇంజినీరింగ్, ఓ ఇంటలెక్చువల్ కలరింగు కోసం… కేసీయార్ నిర్ణయానికి ఓ కృత్రిమ హేతుబద్ధత కోసం!!
కృత్రిమ హేతుబద్ధత (Artificial Rationalization)… ఒక రాజకీయ నాయకుడు తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి ‘టెక్నికల్ వాలిడిటీ’ని జోడించడం కోసం ఇలాంటి సంస్థలను వాడుకోవడం పరిపాటి… ఈ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం చుట్టూ కప్పుకున్న ముసుగుల్ని రేవంత్ రెడ్డి తొలగించడంతో ఈ ‘కవర్ సంఘాలు’ తట్టుకుపోతున్నాయి…
హరీష్ రావు చెబుతుంటాడు, కన్నెపల్లి పంప్ హౌజు నుంచి నీళ్లను ఎత్తిపోయాలి అని! అందరికీ తెలుసు, మేడిగడ్డ దురవస్థ… నీళ్లు నిల్వ చేయలేరు, చేసినా అన్నారం, సుందిళ్లకు తీసుకుపోలేరు, మినిమం డ్రా లెవల్స్ అంగీకరించవు, ఆ లెవల్స్ కోసం నిల్వ చేస్తే ఆ బరాజులు ఏమవుతాయో భగవంతుడికే తెలియాలి…
జరగరానిది జరిగితే రేవంత్ రెడ్డి మీద బండలు పడేయడం కోసం ఓ ట్రాప్!… విచిత్రంగా ఏ బీఆర్ఎస్ అత్యంత అవమానకరంగా తనను బజారున పడేసిందో, అదే ఈటల రాజేందర్ కూడా అదే హరీష్ భాషను అంది పుచ్చుకోవడం… తెర వెనుక బీజేపీ- బీఆర్ఎస్ కలిసి పనిచేయడం… సరే, ఈ రిటైర్డ్ ఇంజినీర్లు కూడా మేడిగడ్డ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఎందుకు వాదన ఎత్తుకున్నారు..?
అదే హరీష్ రావు పన్నుతున్న స్ట్రాటజీలో భాగం… బీఆర్ఎస్ క్యాంపు ఏది చెబితే అది… పైగా నిష్టగా పనిచేశాం, నిజాయితీగా పనిచేశాం అని మీడియా ఎదుట డొల్ల వ్యాఖ్యలు… కాళేశ్వరం బాపతు ఏ ఇరిగేషన్ ఇంజినీర్‌ను తన్నినా కోట్లకుకోట్లు రాలుతున్నాయని గత ఏసీబీ కేసులే నిరూపించాయి… ఇవన్నీ తెలుసు కాబట్టే రేవంత్ రెడ్డి ఒక్క ముక్కలో తేల్చేశాడు, ఈ ‘పరోక్ష బీఆర్ఎస్ అనుబంధ విభాగాల’ ధోరణిని…
‘చర్లపల్లి జైలులో పడేయలేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు’ అని..! వెంటనే ఓ స్ట్రాటజీ… పింక్ మైకులు ఇదే శ్యాంప్రసాద్ రెడ్డి ఎదుట వాలతాయి… సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నాం అని గంభీరమైన వ్యాఖ్యానాలు… మైకుల ముందే కన్నీళ్లు… ఎంచక్కా పింక్ చొక్కాలే తొడుక్కోవచ్చు కదా… పైగా మేం వ్యతిరేక రిపోర్టులు ఇచ్చినా సరే కేసీయార్ మమ్మల్ని ఎప్పుడూ తిట్టలేదు అని ఎదురుదాడి ఏడుస్తూ… మాకు పొలిటికల్ ఎజెండా ఏదీ లేదని చెబుతూ… ప్యూర్ ‘సినిమాటిక్ నెరేటివ్’..!!
అవునూ, బీజేపీ పాలిస్తున్న కేంద్రం, ఆ కేంద్ర కీలక సంస్థ NDSA… అదే చెప్పింది ఈ దిక్కుమాలిన బరాజులను నమ్మి నీళ్లను నిల్వ చేయొద్దు అని… చేస్తే మునుగుతారు అని… ఐనా సరే, బీజేపీ నేతలు అదే డిమాండ్‌ను ఎత్తిపోయడం వెనుక మర్మమేంటి..? వీళ్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు… ఏమో, చివరకు అమిత్ షా చెప్పినా సరే, మేం హరీష్ రావు చెప్పిన బాటలోనే, కేసీయార్ కోసమే నడుస్తాం అన్నట్టుంది కథ!!
Share this Article